20, జనవరి 2025, సోమవారం

సమస్య - 5009

21-1-2025 (మంగళవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“మోదము నందున నొగులు సమున్నతము గదా”
(లేదా...)
“మోద మహానుభోగమున ముఖ్యమునైనది దుఃఖమే కదా”
(శిష్ట్లా లక్ష్మీ వేంకట నరసింహ శర్మ గారికి ధన్యవాదాలతో...)

8 కామెంట్‌లు:

  1. కందం
    ఖేదమునొందిన లోకము
    మోదమునొందెను నరకుని బొడమాయింపన్
    వేదనతొలగించునదను
    మోదము నందున నొగులు సమున్నతము గదా!

    ఉత్పలమాల
    ఖేదము వాసెనే నరకు గీటడగింపఁగ కృష్ణమూర్తియే
    మోదమునందుచున్ జనులు ముచ్చటఁ బర్వదినమ్ము సేసిరే
    వేదన స్థాయియే ప్రజల వేడ్కల తీరును నిర్ణయింపఁగన్
    మోద మహానుభోగమున ముఖ్యమునైనది దుఃఖమే కదా!

    రిప్లయితొలగించండి
  2. సోదెమగు రోగమొందగ
    చోద పడెడి చెలిమికాని జూడగ నడలన్
    వేదన లేకుండ మడియ
    మోదము నందున నొగులు సమున్నతము గదా

    రిప్లయితొలగించండి
  3. ఆదర మొ ప్ప గ నీశుని
    పాదము లను మదిని నిలిపి భక్తి జపించ న్
    తా దా త్త్మ్యo బున గలిగె డు
    మో దము నందున నొగులు సము న్న తము గదా

    రిప్లయితొలగించండి
  4. కం॥ సాదర భావము నొసఁగఁగ
    మోదము నందున నొగులు సమున్నతము గదా!
    కాదటులను గానేరదు
    సాదర భావము నొసగును సంతసమె సుమా!

    ఉ॥ సాదర భావమొప్పఁగను సఖ్యత హెచ్చఁగ నూఁత మొందుచున్
    సోదర తత్వ సంపదల శోభలఁ బొందఁగ దక్కు తృప్తియే
    మోద మహానుభోగమున ముఖ్యమైనది, దుఃఖమే కదా
    వేదనఁ బాపు మిత్రులును బ్రీతినిఁ గాంచెడి వారు లేకయే!

    రిప్లయితొలగించండి

  5. రాదని తలచిన విజయము
    జాదుకొనినవేళ నయన జలమది రాలున్
    గాదె కనినంత నరునకు
    మోదము నందున నొగులు సమున్నతము గదా!


    రాదు జయమ్మటంచును పరాభవమే గతి యన్న వేళలో
    మోదము గూర్చెడిన్ గెలుపు ముంగిట నిల్చిన దానికోసమై
    సాదక భాదకమ్ములవి సంస్మృతి తో కను నీరు రాలవే
    మోద మహానుభోగమున ముఖ్యమునైనది దుఃఖమే కదా!

    రిప్లయితొలగించండి
  6. హ్లాదనమున జేసి మనువు
    వేదన జెందుచు మగనితొ వెంటన సుతనున్
    సాదరముగాను బంపుట
    మోదము నందున నొగులు సమున్నతము గదా

    రిప్లయితొలగించండి
  7. ద్వాదశ ఘస్రమందు పెను బాధను గూర్చెడి కర్మ కాండలో
    వేదన లేక వచ్చెనొక వింతగు బంధువు, తిండి కోసమై
    వాదనఁ జేసి మెక్కి కడు వక్కలనాకులఁ జూడ మేసెనో
    మోద మహానుభోగమున! ముఖ్యమునైనది దుఃఖమే కదా!!

    మోద = తములపాకుల కట్ట

    రిప్లయితొలగించండి