కం:సేవా భావము నేర్పగ నావంతయు నేర్వకుంట నా భక్తులు సం సేవించు విధమునన్ దిగి శ్రీవనితను బూజ సేసె శితికంఠుండే” (రామ కృషణ మఠం లో స్వామీజీ పేరు స్వామీ శితికంఠానంద.సేవ గొప్పది అంటే అది నేర్వకండా జనం పూజలు చేస్తుంటే స్వామీజీ యే వాళ్ల సంతోషానికి పూజ చేసారు.)
ఉ:శ్రీవనితానురక్తుఁడయి చేసెను బూజల ఫాలనేత్రుఁడే భావము నందు కేశవుని పత్నిగ దల్చి సమస్వభావి యై ఓ విషమా!గళమ్ముననె యుంచె నినున్ ,నిను గూడ "పేరునన్ శ్రీ" వని తాను సేవనము జేసెనొ మ్రింగి ప్రసాదభావనన్ (లక్ష్మి నైతే శంకరుడు సమభావం తో విష్ణువు భార్య కదా అని పూజించాడు.ఓ హాలాహలమా! నిన్ను కూడా కంఠం లో దేనికి పెట్టుకున్నాడు? నువ్వు కూడా శ్రీ అనే పేరు కల దానివి కనుక నేమో! విషానికి కూడా శ్రీ అనే నామాంతరం ఉంది.)
రిప్లయితొలగించండిభావను డెదలో నిల్పిన
దేవి యెవతె, యేమి చేయు దేవద్ర్యక్కుల్
కోవెలలో భవుడెవ్వడు
శ్రీవనితను, బూజ సేసె ,శితికంఠుండే.
కోవెలగా హృదిన్ మలచి గోమిని నిల్పెను విష్ణువెందుకో?
కావుమటంచు రావణుడు కల్మషకంఠుని కేమి సల్పె హై
మావతి భర్తయైన మహిమాన్వితు డెవ్వడు చెప్పమంటినే
శ్రీవనితానురక్తుఁడయి, చేసెను బూజల, ఫాలనేత్రుఁడే.
కందం
రిప్లయితొలగించండికావించి త్రిమూర్తులనే
పావని యనసూయ మహిమ బాలకులుగనే
తావడ్డించ తిని యశ
శ్రీ వనితను బూజ సేసె శితికంఠుండే!
ఉత్పలమాల
పావనికిన్ పరీక్షయన వచ్చి త్రిమూర్తులు, నగ్నమూర్తిగన్
సేవగ వడ్డనన్ సలుపఁ జీరఁగ నా యనసూయ వారలన్
దీవెన జేసి బాలకుల తీరుగ మార్చ, పతివ్రతన్, యశ
శ్రీ వనితానురక్తుఁడయి చేసెను బూజల ఫాలనేత్రుఁడే
(భస్మాసుర కథా సందర్భం)
రిప్లయితొలగించండిఆ వేల్పుదాయ కోరగ
తీవరముగ వరమునొసగి తెక్కలినొందన్
కావలి నామె మగడిడగ
శ్రీవనితను బూజ సేసె శితికంఠుండే
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిజీవము నిండు సమస్యలు
రిప్లయితొలగించండిభావన జేయు చతురుడవు పండితవర్యా!
ఏవిధిఁ బూరించెదవో
'శ్రీవనితను బూజ సేసె శితికంఠుండే'
పావననామధేయుడవు పండితులందు ఘనుండవేకదా
చేవను జూపుచుంటివిట జీవము నింపి సమస్యలందునన్
గావున నాసమస్యనిక కమ్మని రీతిఁ బరిష్కరింపుమా
'శ్రీవనితానురక్తుఁడయి చేసెను బూజల ఫాలనేత్రుఁడే'
మీ పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండిధన్యవాదాలు గురూజీ 🙏
తొలగించండిఏ వలపున్ వెలార్చడు మహేశుడు జీవుల దేనిపైనిఁ, దా
రిప్లయితొలగించండినే విషయానుకాంక్ష మది నేర్పడ నీయడు, నిర్వికారుడై
పావన శీతశైలమునఁ బాయని దీక్ష సతంబు చిచ్ఛమ
శ్రీవనితానురక్తుఁడయి చేసెను బూజల ఫాలనేత్రుఁడే
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిదేవ గణంబులు శివునికి
రిప్లయితొలగించండిపావన జిత్తంబు తోడ ప్రణ మిల్లి మహా
దేవు డని పొగడనెప్పుడు
శ్రీ వనిత ను బూజ సే సె శితి కంఠు o డే?
కం:సేవా భావము నేర్పగ
రిప్లయితొలగించండినావంతయు నేర్వకుంట నా భక్తులు సం
సేవించు విధమునన్ దిగి
శ్రీవనితను బూజ సేసె శితికంఠుండే”
(రామ కృషణ మఠం లో స్వామీజీ పేరు స్వామీ శితికంఠానంద.సేవ గొప్పది అంటే అది నేర్వకండా జనం పూజలు చేస్తుంటే స్వామీజీ యే వాళ్ల సంతోషానికి పూజ చేసారు.)
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండికం॥ భవమున బాధలఁ దీర్చును
రిప్లయితొలగించండినవనీత హృదినిఁ బరఁగును నవరాత్రులలో
భువినిఁగొలువఁ బడెడి మహా
శ్రీవనితను బూజసేసె శశికంఠుండే
ఉ॥ ఏవనితా ముదంబు సతు లెల్లరి కుంకుమ శోభఁ దాల్చునో
యే వనితా మణిన్ గనుచు నెల్లరు మాతగ నాదరింతురో
యేవనితన్ శుభంబులకు నీధర వేల్పనిఁ గొల్తురా మహా
శ్రీ వనితానురక్తుఁడయి చేసెను బూజల ఫాలనేత్రుఁడే
మహాశ్రీః వనితః రెండు సంస్కృత పదాలు కావున మహాశ్రీ వనిత గాతీసుకున్నానండి.
పావని లక్ష్మీ దేవిని
రిప్లయితొలగించండిశ్రీ వనితను బెండ్లి యాడ శితి దేహుండే
పావని నుమ నేకాంతము
శ్రీ వనితను బూజ సేసె శితికంఠుండే
[శ్రీ వనిత = శ్రీదేవి చే సేవంపఁ బడినది]
గ్రీవమునన్ హలాహలము కీడొనరింపక నుంటకై సుసం
భావన సేసి సంతతము వారక నిత్యము దల్చు చుండి వి
శ్వావన దక్షఁ బ్రాణి నిచయాంబను నాదిమ శక్తి మంగళ
శ్రీవని తానురక్తుఁ డయి చేసెను బూజల ఫాలనేత్రుఁడే
రిప్లయితొలగించండిఉ:శ్రీవనితానురక్తుఁడయి చేసెను బూజల ఫాలనేత్రుఁడే
భావము నందు కేశవుని పత్నిగ దల్చి సమస్వభావి యై
ఓ విషమా!గళమ్ముననె యుంచె నినున్ ,నిను గూడ "పేరునన్
శ్రీ" వని తాను సేవనము జేసెనొ మ్రింగి ప్రసాదభావనన్
(లక్ష్మి నైతే శంకరుడు సమభావం తో విష్ణువు భార్య కదా అని పూజించాడు.ఓ హాలాహలమా! నిన్ను కూడా కంఠం లో దేనికి పెట్టుకున్నాడు? నువ్వు కూడా శ్రీ అనే పేరు కల దానివి కనుక నేమో! విషానికి కూడా శ్రీ అనే నామాంతరం ఉంది.)