28, జనవరి 2025, మంగళవారం

సమస్య - 5017

29-1-2015 (బుధవారం)
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“లచ్చి మగఁ డెద్దుపై నెక్కి లంకఁ జేరె”
(లేదా...)
“లక్ష్మీనాథుఁడు నందివాహనముపై లంకాపురిం జేరెఁ బో”

20 కామెంట్‌లు:

  1. కనగలక్ష్మిని యమెరికా కాపురమున
    ట్రంపుతరిమెను వానిని రంగుఁజూచి
    గతినిగానక వలసనుఖంగుదినుచు
    లచ్చిమగడెద్దుపైనేగిలంకఁజేరె

    రిప్లయితొలగించండి
  2. తేటగీతి
    రావణాసురుఁడన తమ రాజుగాన
    రంజిలంగ రక్కసి మూక రంగమందు
    వికటముగ గూర్చి యాడెడు వేడ్కలందు
    లచ్చి మగఁ డెద్దుపై నెక్కి లంకఁ జేరె!

    శార్దూలవిక్రీడితము
    సూక్ష్మమ్మేమన వైరినెంచి నగెడున్ చోద్యాలు సృష్టించుటే
    యీ క్ష్మాపై సహజమ్ముగన్ జరుగెడున్ హేలాదులంచెంచఁగన్
    పక్షమ్మున్ వికటాన రావణునకున్ బంచంగ నా వేడ్కలో
    లక్ష్మీనాథుఁడు నందివాహనముపై లంకాపురిం జేరెఁ బో!

    రిప్లయితొలగించండి
  3. తేటగీతి
    రావణాసురుఁడన తమ రాజుగాన
    రంజిలంగ రక్కసి మూక రంగమందు
    వికటముగ గూర్చి యాడెడు వేడ్కలందు
    లచ్చి మగఁ డెద్దుపై నెక్కి లంకఁ జేరె!

    శార్దూలవిక్రీడితము
    సూక్ష్మమ్మేమన వైరినెంచి నగెడున్ చోద్యాలు సృష్టించుటే
    యీ క్ష్మాపై సహజమ్ముగన్ జరుగెడున్ హేలాదులంచెంచఁగన్
    పక్షమ్మున్ వికటాన రావణునకున్ బంచంగ నా వేడ్కలో
    లక్ష్మీనాథుఁడు నందివాహనముపై లంకాపురిం జేరెఁ బో!

    రిప్లయితొలగించండి

  4. పద్మనాభు డెవరి పతి? ఫాల నేత్రు
    డెట్లు తిరుగు? నంజని సుతుడెటకుజేరె
    కడలి లంఘించి తెలిపినన్ ఘనుడవనిన
    లచ్చి మగఁ , డెద్దుపై నెక్కి , లంకఁ జేరె.


    సూక్ష్మగ్రాహివటంచు నడ్గితిని విశ్వుండెవ్వడో తెల్పుమా
    హే క్ష్మాపాలక రాజశేఖరుడు తానేరీతి నల్లాడు? నౌ
    రా! క్ష్మాపుత్రిక కోసమై హనుమ యేప్రాంతమ్ము తానేగెనో
    లక్ష్మీనాథుఁడు , నందివాహనముపై , లంకాపురిం జేరెఁ బో.

    రిప్లయితొలగించండి
  5. రిప్లయిలు
    1. లక్ష్మిన్ బిల్చెను గౌరి నోమునకు పేరంటంబు సేయంగ తాన్
      సూక్ష్మంబున్ తెలియంగఁ బల్కెఁ గనగన్ శూలాయుధుండెక్కడే?
      పక్ష్మంబైనను రాలనిచ్చునె కృపన్ భర్గుండు భక్తాళికిన్
      లక్ష్మీ!నాథుఁడు నందివాహనముపై లంకాపురిం జేరెఁ బో!!

      తొలగించండి
  6. లచ్చిమగని నామంబు శ్రీరమణమూర్తి
    చక్కనైన యెద్దునుకొని సాకుచుండె
    లచ్చి మగని స్వగ్రామము లంకపల్లె
    లచ్చి మగఁ డెద్దుపై నెక్కి లంకఁ జేరె

    లక్ష్మీదేవి వరించినంతట విశాలాక్షుండనేమందురో?
    సూక్ష్మాత్మాయని వేడ శూలి తరలున్ జోద్యంబుగాదేనిపై?
    ఆక్ష్మాభృత్తెటుపోయెనో తెలియునా యాకాశమార్గంబులో?
    లక్ష్మీనాథుఁడు; నందివాహనముపై; లంకాపురిం జేరెఁ బో!

    రిప్లయితొలగించండి
  7. లచ్చి మగఁ డెద్దుపై నెక్కి లంకఁ జేరె
    పోవు గాలము వచ్చెను పో దశముఖు
    నికి; కరుణని విభీషణునికి చదురు! వి
    భుని శరణము కోరంగ ప్రభుతయు దక్కె



    రిప్లయితొలగించండి
  8. రచ్చబండ చేరువనకు వచ్చినట్టి
    బిచ్చవానిని ప్రీతిగ బిలిచి యొక్క
    పచ్చి యనృతము నడుగగ బలికెనిటుల
    లచ్చి మగఁ డెద్దుపై నెక్కి లంకఁ జేరె

    రిప్లయితొలగించండి
  9. పొద్దు పొడిచె ను జేరె ను పొలము కడకు
    లచ్చి మగ డెద్దు పై నెక్కి :: లంక జేరె
    దొంగ వేషాన వఛ్చియు దుష్టు డ గుచు
    రమణి సీతను గొనిపోవ రావణుండు

    రిప్లయితొలగించండి
  10. -
    సూక్ష్మంబారయ ద్వారపాలకుల సంశోధింపగా మానవుం
    డై క్ష్మాజానిగ రూపమెత్తి వనవాసార్థమ్ము, కైకేయి యీ
    షా, క్ష్మాభారము దీర్చగా కదలి సంస్ఫాలమ్ము తోనాందిగా
    లక్ష్మీనాథుఁడు నందివాహనముపై లంకాపురిం జేరెఁ బో



    నంది - సంతోషము నందివాహనము పై- సంతోషమనెడు వాహనముపై


    రిప్లయితొలగించండి
  11. ఆ' క్ష్మా' భారము మట్టుచేయుటకునై యర్థించు నే దైవమున్
    సూక్ష్మంబౌ విధిఁదెల్పు మే శకటిపై శూలాయుధుండేగునో
    లక్ష్మీదేవ్యవతారమౌ కుజనెటన్ లంకేశుఁడే జేర్చెనో
    లక్ష్మీనాథుఁడు, నందివాహనముపై, లంకాపురిం జేరెఁ బో!”

    రిప్లయితొలగించండి
  12. తే.గీ:పల్లె ముచ్చటలే గుర్తు వచ్చు నాకు
    దున్న పై కృష్ణ లంకకు నన్న వచ్చె
    చక్కగా గేదె వీపు నే నెక్కి పోతి
    లచ్చి మగఁ డెద్దుపై నెక్కి లంకఁ జేరె”
    (పల్లెటూళ్లలో పశువుల కాపరులు,రైతులు సరదాగా గేదెల మీద,దున్నల మీద,ఎడ్ల మీద కూర్చొని సవారి చెయ్యటం సహజమే.వీళ్లతో పాటు లచ్చి అనే అమ్మాయి మగడు ఎద్దు మీద కృష్ణ లంక దాకా వచ్చాడు.)

    రిప్లయితొలగించండి
  13. బ్రహ్మ విష్ణు మహేశ్వరుల్ వసుధనందు
    కలి పురుషుని గూర్చిపలుక కలసి రంత
    గౌరిపతి సత్యపురమేగె గరుడినెక్కి
    వెండికొండకు ధాతయు వెళ్లె నడచి
    లచ్చి మగఁ డెద్దుపై నెక్కి లంకఁ జేరె
    కలియుగమునందు చిత్రముల్ గాంచవచ్చు

    రిప్లయితొలగించండి
  14. శా:లక్ష్మీనాథుడు మానవాకృతిని దా లంకావినాశార్థమై
    యే క్ష్మాస్వామ్యము లేక యశ్వము రథమ్మే లేని వాడౌనొకో
    లక్ష్మీనాథుఁడు నంది వాహనముపై లంకాపురిం జేరెఁ బో”
    లక్ష్మిన్ బొందెడు పోరుకై రథము లీలన్ బంప దేవేంద్రుడే.
    (రాముడు లక్ష్మీనాథుడే.ఆయన వాహనం లేని వా డౌతాడా? ఇంద్రుడే రథం పంపాడు.లక్ష్మీనాథుడున్+అంది=శ్రీమహావిష్ణువు కూడా వాహనాన్ని అందుకొని.)

    రిప్లయితొలగించండి
  15. విష్ణువెవ్వరు దెలుపుము వివరముగను
    యీశుఁడేమెక్కి జేరె కైలాసగిరికి
    హనుమ సీతను వెదకుచు నరిగెనెటకు
    లచ్చి మగఁ డెద్దుపై నెక్కి లంకఁ జేరె

    రిప్లయితొలగించండి
  16. సత్యయుగమున శ్రీహరి సమరపూరి
    అన్ని యవతార, యుగముల యంశ యైన
    రావణాసుర జంపంగ రామచంద్ర
    లచ్చి మగఁ డెద్దుపై నెక్కి లంకఁ జేరె

    రిప్లయితొలగించండి
  17. గరుడ వాహనుడనగ జగతి నెవరన
    తిరుగు నెవ్విధి తిగకంటి తీరు గాను
    వనధి దాటి యెచటి కేగె పవనసుతుడు
    *“లచ్చి మగఁ డెద్దుపై నెక్కి లంకఁ జేరె”*



    సూక్ష్ముండెవ్వడనంగనీజగతిలో,స్థూలుండెవండన్ననా
    సూక్ష్మేక్షన్ నరుదెంచె శక్తి తపమున్ చూడంగనీశుండు తా
    సూక్ష్మంబైనసురూపుతోడ నిశిలో జొచ్చెన్ సమీరుండునా
    *“లక్ష్మీనాథుఁడు నందివాహనముపై లంకాపురిం జేరెఁ బో”*



    రిప్లయితొలగించండి
  18. అంగదుఁడు మోయ సౌమిత్రు నడరి యంత
    మారుతాత్మజుం డయ్యెను గారవమున
    వాహన వరంబు నా రామ భద్రునకును
    లచ్చి మగఁ డెద్దుపై నెక్కి లంకఁ జేరె


    సూక్ష్మీ భూత శరీర భాసితుఁడు నై చోద్యంబుగా నంత ద్వై
    పక్ష్మోజస్వదధీశ్వరాత్మ సఖుఁడై పశ్యద్కృశీభూత తం
    కక్ష్మాభృత్పరమాధినాయకుఁడు తత్కైలాస ఫేనప్రభా
    లక్ష్మీ నాథుఁడు నందివాహనముపై లంకాపురిం జేరెఁ బో

    రిప్లయితొలగించండి