శా:అర్ధం బెంతొ వ్యయమ్మొనర్చితివి కావ్యార్థమ్ము, నీ కావ్యమే యర్థ మ్మీయక,దృక్పథమ్ము నిడకే , వ్యాపారసాహిత్యమై వర్ధిల్లంగను లేనిదై,బుధుల తో వాదమ్ములన్ దెచ్చె నో అర్ధాంగీ ! కృతి వ్యర్థమై చనియె లక్ష్యంబయ్యొ దుర్లభ్యమౌ” (నీ కావ్యం కోసం డబ్బు వెచ్చించావు కానీ ఆ కావ్యానికి సరైన అర్థం లేదు. పాఠకులకి ఒక దృక్పథాన్ని ఇవ్వదు.ప్రయోజన వంత మైన సాహిత్యం కాకుంటే మానె.కనీసం వ్యాపారదృష్టి తో చూసినా నిరుపయోగమే.పండితులతో విమర్శలు వచ్చాయి.కావ్యానికి సరైన లక్ష్యమే లేదు అని . ఇక్కడ కృతిని కావ్యం అనే,అర్థం లో తీసుకొన్నాను.)
రిప్లయితొలగించండిఅర్థం బొసగును రాజని
స్వార్థముతో కావ్యమొకటి శాస్తకు నిడుచున్
ప్రార్థించిన వినడయ్యెనె
అర్ధాంగీ, కృతి గనుఁగొన వ్యర్థంబయ్యెన్.
వార్థక్యంబది చేరవచ్చెననుచున్ భాగ్యంబు నేగోరి నా
కర్థంబిచ్చును చక్రవర్తులని నేనాశించి సత్కావ్యమున్
స్వార్థంబందున వ్రాయనేమి యది సూచ్యాస్యమ్ములే చింపెనే
అర్ధాంగీ , కృతి వ్యర్థమై చనియె లక్ష్యంబయ్యొ దుర్లభ్యమౌ.
మీ పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండిస్పర్ధించందగదేరితో నెపుఁడు సంసర్గమ్ము ఛిన్నంబగున్
రిప్లయితొలగించండిస్పర్ధల్ కార్యనిరోధకంబులగు సంప్రాప్తించు నష్టంబు నీ
యర్ధాంగిన్ నిను వేడుకొందు వినుమాయంచున్ నివేదించనా
యర్ధాంగీ కృతి వ్యర్థమై చనియె లక్ష్యంబయ్యొ దుర్లభ్యమౌ
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిస్పర్ధగ రచించిన కృతిని
రిప్లయితొలగించండినిర్ధారణముగ నెళవగు నెలవున దాచన్,
వార్ధక్యమున గతించగ
నర్ధాంగీ ! కృతి గనుఁగొన వ్యర్థంబయ్యెన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండివార్ధక్యమ్మున వ్రాసితి
రిప్లయితొలగించండినిర్ధారించిన విధముగ నిర్ద్వంద్వముగా
వ్యర్థునకంకితమిచ్చితి
నర్ధాంగీ! కృతి గనుఁగొన వ్యర్థంబయ్యెన్
వార్ధక్యమ్మున వ్రాసెనాతడు మహాపాండిత్యమున్ జూపుచున్
నిర్ధారించిన వానికంకితముకై నిర్భంధమేతెంచగా
నర్ధాంగీకృతి తోనిడెన్ వెనుక తానావేదనన్ తెల్పెగా
'అర్ధాంగీ! కృతి వ్యర్థమై చనియె లక్ష్యంబయ్యొ దుర్లభ్యమౌ'
మీ పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండిధన్యవాదాలు గురూజీ 🙏
తొలగించండివార్ధక్యమ్మున కానరాదు సతికిన్! వంటింట క్షీరాన్నమున్
రిప్లయితొలగించండినిర్ధౌతమ్మగు పాత్రఁ బెట్టి సలుపన్, నీరంబునన్ బియ్యమున్,
నిర్ధారింపక వేసె నుప్పును వడిన్ నిక్కంపు క్షీరంబులో!
అర్ధాంగీ కృతి వ్యర్థమై చనియె లక్ష్యంబయ్యొ దుర్లభ్యమౌ!!
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండి-
రిప్లయితొలగించండివ్యర్థంబాయెను యత్నం
బర్ధాంగీ! కృతి గనుఁగొన ; వ్యర్థంబయ్యెన్
వర్ధిల్లెడు నా కవనము
స్పూర్థియు వీగె జవరాల పూర్తిగ మదిలోన్.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిస్పర్థ గ వ్రాసితి కానీ
రిప్లయితొలగించండియర్ధాంగీ! కృతి కనుగొన వ్యర్థ o బ య్యె న్
వార్థక్యంబు న దాని ని
సార్థ క మొ నరింప నైతి చక్కని ఫణ తిన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఅందరికీ వందనములు !
రిప్లయితొలగించండిఅందరి పూరణలూ అలరించు చున్నవి !
సమస్య - 5016
28-1-2025 (మంగళవారం)
భక్తతుకారాం[@2-05-00] చిత్ర స్ఫూర్తితో :
01)
_________________________________________
అర్ధాంగీ ! కృతి వ్యర్థమై చనియె ల - క్ష్యంబయ్యొ దుర్లభ్యమౌ
స్పర్థావేశము నన్నెకాండ్లు ఠవళిన్ - పానీయమున్ గల్పగా
వ్యర్థంబయ్యెను నాదు జన్మమని తా - వర్జించి యాహారమున్
ప్రార్దింపన్, విని, గంగ యిచ్చె, జనులే - వర్ణించ నాకావ్యమున్
_________________________________________
వర్ణించు = స్తుతించు
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిశా:అర్ధం బెంతొ వ్యయమ్మొనర్చితివి కావ్యార్థమ్ము, నీ కావ్యమే
రిప్లయితొలగించండియర్థ మ్మీయక,దృక్పథమ్ము నిడకే , వ్యాపారసాహిత్యమై
వర్ధిల్లంగను లేనిదై,బుధుల తో వాదమ్ములన్ దెచ్చె నో
అర్ధాంగీ ! కృతి వ్యర్థమై చనియె లక్ష్యంబయ్యొ దుర్లభ్యమౌ”
(నీ కావ్యం కోసం డబ్బు వెచ్చించావు కానీ ఆ కావ్యానికి సరైన అర్థం లేదు. పాఠకులకి ఒక దృక్పథాన్ని ఇవ్వదు.ప్రయోజన వంత మైన సాహిత్యం కాకుంటే మానె.కనీసం వ్యాపారదృష్టి తో చూసినా నిరుపయోగమే.పండితులతో విమర్శలు వచ్చాయి.కావ్యానికి సరైన లక్ష్యమే లేదు అని . ఇక్కడ కృతిని కావ్యం అనే,అర్థం లో తీసుకొన్నాను.)
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండికం॥ వర్ధిలద బ్రదుకని తలఁచి
రిప్లయితొలగించండివార్ధక్యమున రచనలను బహుమోదముతో
స్పర్ధను గని వ్రాయనహో
అర్ధాంగీ కృతి గనుఁగొన వ్యర్థంబయ్యెన్
శా॥ వర్ధిల్లంగను మోదమెంది బ్రదుకే ప్రార్థించి సర్వేశ్వరున్
వార్ధక్యమ్మున సిద్ధిఁ బొందఁగను సంభావించి వ్యాసంగమున్
స్పర్ధన్ బూని రచించితిన్ గవితలన్ బద్యమ్ములన్ గాంచఁగా
నర్ధాంగీ కృతి వ్యర్థమై చనియె లక్ష్యంబయ్యొ దుర్లభ్యమౌ
మీ పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండిపార్ధుని పద్యపు కావ్యము
రిప్లయితొలగించండిస్పర్ధన నిలబడ లిఖించి పంపితి సభకున్
సార్ధక మొనరింపక యో
అర్ధాంగీ! కృతి గనుఁగొన వ్యర్థంబయ్యెన్
స్పర్ధ =పోటి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిధర్మరాజు ద్రౌపదితో...
రిప్లయితొలగించండికందం
నిర్ధారణన గెలుతని
స్వార్థపు రారాజు శకుని వంచన నోడన్
మూర్ధము వంచక తప్పునె
అర్ధాంగీ! కృతి గనుఁగొన వ్యర్థంబయ్యెన్
శార్దూలవిక్రీడితము
నిర్ధారమ్మున గెల్చు నైపుణిని సంధింపంగ వంచించుచున్
స్వార్థంబెంచియు రాజరాజు శకునుల్ సాగంగ నేనోడితిన్
మూర్ధమ్మున్ వ్యసనాన వంచితిని మిమ్మున్ వేదనన్ దోసితిన్
అర్ధాంగీ! కృతి వ్యర్థమై చనియె లక్ష్యంబయ్యొ దుర్లభ్యమౌ
మీ పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండి🙏ధన్యోస్మి గురుదేవా!🙏
తొలగించండిసవరించిన కందము:
ధర్మరాజు ద్రౌపదితో...
కందం
నిర్ధారణన గెలుతునని
స్వార్థపు రారాజు శకుని వంచన నోడన్
మూర్ధము వంచక తప్పునె
అర్ధాంగీ! కృతి గనుఁగొన వ్యర్థంబయ్యెన్
మీ ప్రయత్నం వ్యర్థం కాదని నమ్మకం.
రిప్లయితొలగించండిపూరణ కొరకు మాత్రమే సుమా !
వర్ధిల్లంగను శంకరాభరణమే వాగ్దేవి హారమ్ముగా
స్పూర్థించేర్చెడు రీతి కైపదములన్ పొత్తమ్ముగా జేర్చ నీ
వార్ధక్యమ్మున చేయగా యతనమున్ పైకమ్ము దాకొల్పుటం
దర్ధాంగీ! కృతి వ్యర్థమై చనియె లక్ష్యంబయ్యొ దుర్లభ్యమౌ
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిఈ విషయాన్ని కేవలం వాట్సప్ సమూహంలో మాత్రమే ప్రకటించాను. బ్లాగులో ప్రకటించలేదు. మీకెలా తెలిసింది?
ఇందుగలదందు లేదని ... :)
తొలగించండిశర్మాజీ ఉవాచ
అర్ధానర్ధము లెఱుఁగక
రిప్లయితొలగించండిస్వార్ధముమదినింపకుండ సరసపు రీతిన్
స్పర్ధలు లేకను వ్రాయఁగ
అర్ధాంగీ !కృతి గనుఁగొన వ్యర్థంబయ్యెన్
అర్ధాంగీకృతి యెన్నఁగ
రిప్లయితొలగించండినర్ధానంగీకృతి యగు వ్యవహారములన్
గర్ధింప నేమి ఫల మగు
నర్ధాంగీ కృతి గనుఁగొన వ్యర్థంబయ్యెన్
నిర్ధారించుట పెండ్లి యత్తఱిని సందేహంబ నిక్కంబుగన్
స్వర్ధాత్రీ తల మందుఁ దద్వర వధూ సాంగత్య మేపార దం
తర్ధానం బగు వారిలో నొకరు భేదస్వాంతులై నిల్వఁగా
నర్ధాంగీ కృతి వ్యర్థమై చనియె లక్ష్యం బయ్యొ దుర్లభ్యమౌ
వ్యర్థాలాపములు వలదు
రిప్లయితొలగించండిస్పర్ధలకవి యిరవులనుచు పతికిన్దెలుపన్
నిర్ధారణ జరిగె తుదకు
నర్ధాంగీ కృతి గనుఁగొన వ్యర్థంబయ్యెన్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిశ్రీ గురుభ్యోనమః 🙏
రిప్లయితొలగించండిసమస్య - 5015
*యర్ధాంగీ కృతి గనుగొన వ్యర్థంబయ్యెన్*
సమస్యా పూరణ నా ప్రయత్నం..
కం.
ఆర్థిక విషయము లందున
స్వార్థము వదలక సతంబు జగడమ్ములతో
నర్థరహితముగ మసలెడి
*యర్ధాంగీ కృతి గనుగొన వ్యర్థంబయ్యెన్*
[ అర్థరహితముగ = కారణము లేకుండా, అన్యాయముగ ]
✍️ తిరివీధి శ్రీమన్నారాయణ
స్వార్ధము తోకొందరు ద్వం
రిప్లయితొలగించండిదార్థముతోమాటలాడి తదుపరివానిన్
వ్యర్థపు మాటలటంచును
నర్ధాంగీ కృతి గనుగొను వ్యర్థం భయ్యెన్