17, జనవరి 2025, శుక్రవారం

సమస్య - 5006

18-1-2025 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కుమతులు మాత్రమె వసింత్రు గుంటూరు పురిన్”
(లేదా...)
“కుమతుల్ మాత్రమె వాసముందురు గదా గుంటూరులో నెప్పుడున్”
(ఈరోజు గుంటూరులో పూసపాటి వారి 'పద్య పాఠశాల' వార్షికోత్సవము)

11 కామెంట్‌లు:

  1. కందం
    గుమగుమలాడు రుచులొసం
    గు మిరప పేరొంద సాగుఁ గోరెడు రైతుల్
    సుమతుల్ సమకొను నని యె
    క్కుమతులు, మాత్రమె వసింత్రు గుంటూరు పురిన్!

    గమగుమ్మన్ రుచినిచ్చు వంటలకు నా గుంటూరు కారమ్మదే
    ప్రముఖమ్మై మనరాష్ట్రమందు మిరపన్ పండించి పేరొందగన్
    శ్రమతో రైతులు రాబడుల్ సమకొనన్, సాగించ గన్ జూచి యె
    క్కుమతుల్, మాత్రమె వాసముందురు గదా గుంటూరులో నెప్పుడున్!

    రిప్లయితొలగించండి

  2. సుమతులు విజ్ఞానులు శా
    స్త్రముల నెఱుగు వారలుండు స్థానంబిదియే
    ప్రమదా గాంచగ నిట పె
    క్కు, మతులు మాత్రమె వసింత్రు గుంటూరు పురిన్.


    ప్రమదా యెచ్చటి నుండి వచ్చితివి మాప్రాంతమ్ము నే గాంచగన్
    రమణీయంబగు పట్టణమ్మిదియె మా రాష్ట్రానికే గర్వమౌ
    సుమతుల్ భూరివసించు చోటనగనే చోద్యంబుగా నుండె నీ
    కు , మతుల్ మాత్రమె వాసముందురు గదా గుంటూరులో నెప్పుడున్.

    రిప్లయితొలగించండి
  3. సమ భావము గల్గి సతము
    ప్రమదము జేకూర్చు వారు పండిత వరులై
    క్రమ జీవన బుద్ధు లు పె
    క్కు మతులు మాత్రమె వ సింత్రు గుంటూరు పురి న్

    రిప్లయితొలగించండి
  4. అమరెడు విషయము నంతను
    సముచితముగ దెలియజేయు సమయము నందున్
    క్రమమునొడబడని యాకర
    కుమతులు మాత్రమె వసింత్రు గుంటూరు పురిన్

    రిప్లయితొలగించండి
  5. "కుమతుల్ మాత్రమె వాసముందురు గదా గుంటూరులో నెప్పు" డం
    చు మహాపండితవర్యుఁడున్ బలికి నే చోద్యంబుగా చూడఁ "గా
    చుము ధీహీన! కుశాగ్రమౌ 'కు' యన" నంచున్ బల్కెఁ దాన్ "నేర్చితో?
    కుమతుల్ మాత్రమె వాసముందురు గదా గుంటూరులో నెప్పుడున్!"

    కుశాగ్రబుద్ధి అంటారు, కుశ అనే పదానికి అగ్రము "కు" అవుతుంది
    కాబట్టి కుశాగ్రబుద్ధి/కుశాగ్రమతి అనటానికి కుమతి అన్నాడు

    రిప్లయితొలగించండి
  6. "కుమతుల్ మాత్రమె వాసముందురు గదా గుంటూరులో నెప్పు" డం
    చు మహాపండితవర్యుఁడున్ బలికి నే చోద్యంబుగా చూడఁ "గాం
    చుము ధీహీన! కుశాగ్రమౌ 'కు' యన" నంచున్ బల్కెఁ దాన్ "నేర్చితో?
    కుమతుల్ మాత్రమె వాసముందురు గదా గుంటూరులో నెప్పుడున్!"

    కుశాగ్రబుద్ధి అంటారు, కుశ అనే పదానికి అగ్రము "కు" అవుతుంది
    కాబట్టి కుశాగ్రబుద్ధి/కుశాగ్రమతి అనటానికి కుమతి అన్నాడు

    రిప్లయితొలగించండి
  7. విమలగుణవిరాజితులున్
    సుమనస్కుల్, కీర్తి గొన్న సుకవుల్ వణిజుల్
    మమతల్ పంచెడి, బహు చురు
    కు, మతులు మాత్రమె వసింత్రు గుంటూరు పురిన్

    రిప్లయితొలగించండి
  8. సమమౌనెవ్వరి వర్తనంబెదుట పశ్చాద్భాగమందెప్పుడున్
    సమమౌనెవ్వరి భావముల్ మెలుకువన్ స్వప్నాంతరంబౌ తరిన్
    సమమై యెవ్వరు నిత్యముందురొకటై సంప్రీతి గర్మంబు వా
    క్కుమతుల్ మాత్రమె వాసముందురు గదా గుంటూరులో నెప్పుడున్!!

    రిప్లయితొలగించండి
  9. విమలాత్ములు ధీమంతులు
    రమణీయంబగు రచనల రంజిల్లు కవుల్
    తమ సౌభాగ్యముతో చొ
    క్కు మతులు మాత్రమె వసింత్రు గుంటూరు పురిన్

    విమలాత్ముల్ సరసుల్ మహామహులుగా వెల్గొందు తంత్రజ్ఞులున్
    రమణీయంబగు కావ్య సృష్టి సలుపన్ రంజిల్లు విద్వాంసులున్
    గమనీయంబగు కార్యదక్షులు వణిగ్వ్యాపార సంపత్తి చొ
    క్కు మతుల్ మాత్రమె వాసముందురు గదా గుంటూరులో నెప్పుడున్

    రిప్లయితొలగించండి