1, జనవరి 2017, ఆదివారం

సమస్య - 2240 (నూతన వత్సర మనుచు...)

కవిమిత్రులారా!
నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు!
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...

"నూతన వత్సర మనుచు వినోదము లేలా"
లేదా...
"నూతన వత్సరమ్మని వినోద విహారము లేల మిత్రమా"

73 కామెంట్‌లు:

  1. సోదర సోదరీ మణు లందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు .
    ----------------------------------
    జాతకములు మారకనే
    నూతన వత్సర మనుచు వినోదము లేలా
    నేతలు మారుచు నుందురు
    చేతలు సూన్యము నందు చెడుగుడు లాడన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అక్కయ్యా,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      చివరిపాదంలో గణదోషం. 'చేతలు శూన్యముగ నుండు...' అనండి.

      తొలగించండి
  2. గోతుల మార్గముల్ మరియు కోతల విద్యుతు, చెత్త కుప్పలున్,
    రైతుల కష్టముల్ , నుదుటి రాతలు, నేతలు చేయు వంచనల్,
    హేతువులేని నమ్మకములెంతయు మారవు వెర్రివానిలా
    నూతన వత్సరమ్మని వినోద విహారము లేల మిత్రమా

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  3. చేతన పొంది జీవుడిల జీవన యాత్రను చేయుచుంపరం
    జ్యోతిని కాంచలేక తన శోకము నిత్యము హెచ్చుచుండ ధ
    ర్మేతర మైన కార్యముల మృత్యుముఖంబునకేగుచుండగా
    నూతన వత్సరమ్మని వినోద విహారము లేల మిత్రమా

    గురువుగారూ మరియు కవి మిత్రులందరికీ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు.

    రిప్లయితొలగించండి
  4. పాతవి పచ్చళ్ళు రుచివి,
    పాతవి సినిమాలు ముద్దు; పాతవి స్మృతులున్,
    లేతవి మనసులె మృదువుర,-
    నూతన వత్సర మనుచు వినోదము లేలా!

    రిప్లయితొలగించండి
  5. డా.పిట్టా
    ప్రాతది మంచము మోదీ!
    చేతల నల్లులను నలుపు చేష్టలివా? నీ
    మోతల బెట్లుల విరిగెన్!
    నూతన వత్సర మనుచువినోదములేలా?!😢
    నేతయె కోతగాడుగద!నెమ్మిని మాని ధనమ్ము దాచె నీ
    చేతయె భావి భారత సచేష్ట యటంచును నమ్మిరందరున్
    వాతలు ప్రాత వత్సరమె వాయగ బెట్టె నికెంత ఘోరమో?!
    నూతన వత్సరమ్మని వినోద విహారములేల మిత్రమా!
    Wisdom lies in the council.You are afraid of oligarchy only to perpetuate dictatorship?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. పిట్టా సత్యనారాయణ గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
  6. డా.పిట్టా
    సమస్య
    ధృతరాష్ట్రుడు బూజ జేసె ధీరోద్ధతుకై
    ధృతరాష్ట్రుండెనలేక పూజల గనెన్ ధీరోద్ధతున్ గావగన్

    రిప్లయితొలగించండి

  7. అందరికీ ఆంగ్లనామ యుగాది శుభాకాంక్షలతో :)


    లోతైన విషయమిది సుమ
    తీ, తిరిగెడు కాలము జత తిరుగుచు జీవ
    మ్మూ తరిగెడు లీల గదా,
    నూతన వత్సర మనుచు వినోదము లేలా!

    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'జీవమ్మూ' అనడం వ్యావహారికం. 'జీవమ్మే' అనండి.

      తొలగించండి
  8. పాతవి మారుటన్ నిజము పాటక లోకము బాధ లందునన్
    యాతన బొందుచున్ తుదకు ప్రాణము బోవగ భీతి జెందకన్
    చేతికి రానిరొక్క మునచీకటి కోణము రేపవల్ గనన్
    నూతన వత్సరమ్మని వినోద విహారము లేల మిత్రమా

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రాజేశ్వరి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
    2. గురువులకు నమస్కారములు
      మారింది సంవత్సరం కదా ? " పిలుపులో ఏమిటి ఈమార్పు. ?" నెనెప్పుడు అక్కయ్యనే .
      ఇలాగే చేయూతనిచ్చి నాతో పూరణలు రాయించాలని కోరుతూ ఆశీర్వదించి " నూతన సంవత్సర శుభాకాంక్షలు " .అక్క.

      తొలగించండి
  9. శంకరాభరణం బ్లాగ్ నిర్వాహకులు, పూజ్యులు శ్రీ కంది శంకరయ్య గారికి, ఇందులో పాల్గొనుచున్న కవివరేణ్యులకు 2017 ఆంగ్ల వత్సరాది శుభాకాంక్షలు. నమస్సులు.

    రిప్లయితొలగించండి
  10. చేతము లుల్లసిల్లునటు చేయగబూనుము సంఘసేవ నీ
    వీతరుణంబునన్ గురుతరేచ్ఛను జూపుచు నందుకోసమై
    యాతత శక్తిగోరుమిల నాభగవానుని దేవదేవునిన్
    నూతన వత్సరమ్మని వినోద విహారములేల మిత్రమా!

    చేతంబున శుభకామన
    లాతత సౌహార్దభావ మందించంగా
    సీతాపతి నర్థించక
    నూతన వత్సరమనుచు వినోదములేలా?

    హ.వేం.స.నా.మూర్తి.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
  11. [1/1, 9:06 AM] sreeramaraochepuri: చేతనకు గతమె వేదిక
    నూతన వత్సరమనుచు వినోదము లేలా
    భూతమునాలంబనగా
    కేతనమెగరేయ భవిత కేరింతలగున్
    [1/1, 9:09 AM] sreeramaraochepuri: పాతను పాతర వేయక
    చేతన పొందుచు నిరతము ఛేదించవలెన్
    ప్రీతిగ బాధల నెల్లను,
    నూతన వత్సరమనుచు వినోదము లేలా?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చేపూరి శ్రీరామ్ గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
  12. 'సహస్ర కవిరత్న' రిటైర్డు జాయింట్ రిజిస్ట్రార్ - క్రొవ్విడి వెంకట రాజారావు:

    పూజ్యులు గౌరవ గురువర్యులు మహారాజశ్రీ కంది శంకరయ్య గారికీ, వారి సాహితీ సామ్రాజ్యంలోని "శంకరాభరణం సమస్యా పూరణ పద్య బ్లాగు" ను పరిపుష్ఠం చేస్తూ, వారి కవితా మనోవీధిని దశాదిశాంతాలకు వ్యాపరింపజేస్తూ వారి మానసికోల్లాసాన్ని ద్విగుణీకృతం చేస్తున్న ఆచార్యోత్తములకు, కవిముఖ్య కవనాదురంధరులకు- ఈ 2017 నూతన ఆంగ్ల సంవత్సరము ఆయురారోగ్య ఐశ్వర్య విభవాలనన్నీ ప్రసాదిస్తూ అందరి కవితా ధిషణాతిశయాలనతిశయింప జేయాలని ఆ పరంధాముని ప్రార్థిస్తున్నాను.

    రిప్లయితొలగించండి
  13. భాతిం గొనగను సరగున
    నూతన వత్సర మనుచు వినోదము,లేలా
    చేతన నొందవు, నీలో
    నాతత చైతన్య మొంద నడుగిడు మికపై!

    రిప్లయితొలగించండి
  14. వచ్చియున్నదికొత్తగావత్సరమ్ము
    రెండువేలపదియునేడు,రండుమీరు
    గౌరవంబునమరియునుకౌతుకమున
    స్వాగతంబునుబలుకుగ సాలునిలకు

    రిప్లయితొలగించండి
  15. పాతవి మూలను బడెగా?
    నూతన నోట్లను సమృద్ధి నొసగక ప్రజలన్
    యాతనకున్ గురి చేయుచు
    నూతన వత్సర మనుచు వినోదము లేలా!

    (నేటి తో నా సమస్యా పూరణముల సంఖ్య 1000 పూర్తియైనది.)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. భాగవతుల కృష్ణారావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      సహస్ర సమస్యాపూరణలు చేసిన మీకు హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు!

      తొలగించండి
  16. ఆంగ్ల వత్సరమున 'కందమైన ' శుభాకాంక్షలు.
    అందరికీ 2017వ నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు.
    కందము:
    గ్రీటింగ్స్ టూ ఆల్ ఆఫ్ యూ
    ఛీటింగ్స్ మేనాట్బి రీచ్ యు సేవ్స్ దీ లార్డ్ గాడ్
    స్వీటెక్స్పీర్యన్స్ అండ్ విష్
    లైటిందా ఫ్యూచరింది లౌలీ న్యూయ్యర్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
      ఆంగ్లంలో కందం విందు చేసింది. సంతోషం. ధన్యవాదాలు!

      తొలగించండి
  17. పూజ్యులు శంకరయ్య గారికి శంకరాభరణ విద్వన్మండలికి నూతన సంవత్సర శుభాకాంక్షలతో

    చేతోభ వానుకంపన
    జాత సుకర్మానురక్త చైతన్యమునన్
    వీతద్వేషులయి చనక
    నూతన వత్సర మనుచు వినోదము లేలా


    ఆతత నీత ధర్మ నిరతాతిశ యాత్మ విరాజమానుడై
    వీత మదాగ్రహావకర భీషణ కర్మ నికాయ దీప్తి వి
    ద్యోత జనానురంజక సుయోగ్య తరాంచిత కార్య హర్షికిన్
    నూతన వత్సరమ్మని వినోద విహారము లేల మిత్రమా"

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పోచిరాజు కామేశ్వర రావు గారూ,
      మీ పద్యాలను ఎంత ప్రశంసించినా తక్కువే. అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
    2. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు.

      తొలగించండి
  18. క్రొవ్విడి వెంకట రాజారావు:

    నీతిని సంధించుటలో
    జాతికి నిలువడి కుదిరిక సమకూరుటకై
    భూతేశుని భూషించక
    నూతన వత్సర మనుచు వినోదము లేలా?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. క్రొవ్విడి వెంకట రాజారావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      గురజాడ ఫౌండేషన్, అమెరికా వారి జాతీయ పురస్కారాన్ని అందుకోబోతున్న మీకు శుభాభినందనలు.

      తొలగించండి
    2. గురువు గారూ! నమస్కారములు. మీరూ అందుకోబోతున్నారుగదా! మీకున్నూ నా ఆత్మీయ అభినందనలండీ.

      తొలగించండి
  19. పాతదిరోతగదలచుచు
    నూతనమునుగోరుకొనుచునూగుచునుండ
    న్నీతరహాగాన్యాయమె
    నూతనవత్సరమనుచువినోదములేలా

    రిప్లయితొలగించండి
  20. నూతన వత్సరమునకును
    నూతన పద్ధతులవివిధ న్యూనత మార్గ ము
    రోతకలుగు నటుల జనులు
    నూతన వత్సర మనుచు వినోదము లేలా

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. వడ్డూరి రామకృష్ణ గారూ,
      బహుకాల దర్శనం... సంతోషం!
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      కందం ద్వితీయపాదాంతంలో తప్పక గురువుండాలి కదా! మీరు 'మార్గము' అన్నారు. "నూతన పథముల్। రోత...' అనండి.

      తొలగించండి
  21. నీతులు నేడిటు పల్కిన
    నేతలు నిన్నటి వరకు న నీతిపరులనన్
    పాతకు రంగులు పులిమిన
    నూతన వత్సరమనుచు వినోదము లేలా

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'నిన్నటి వర కవినీతిపరు లనన్' అనండి.

      తొలగించండి
  22. కవి మిత్రమండలికి ఆంగ్ల నూతన వత్సర శుభాకాంక్షలు.

    నూతనమైనతేజమున నుజ్జ్వలభావి వికాసమందగం
    జేతమునందు పట్టుదల చేతలలో ఘన పావనత్వము
    న్నూతముగా సదా నిలిపియుంచుటదొక్కటె లక్ష్యసిద్ధియౌ
    నూతన వత్సరమ్మని వినోదవిహారములేల మిత్రమా.

    నూతనతేజమునందగ
    నూతన వత్సరమనుచు వినోదములేలా
    చేతము నిర్మలతలముగ
    గీతను పఠియింపుమయ్య గేహమునందున్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పొన్నెకంటి సూర్యనారాయణ గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
  23. ఘాతకులై మన దేశపు
    ఖ్యాతిని నాశనము చేయ కడు స్వార్థముతో
    నా తెల్లవారి పండుగ
    నూతన వత్సర మనుచు వినోదములేలా

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  24. నేతలు స్వప్రయోజనమునే సతతమ్మును కోరివర్తిలన్
    రైతులు గిట్టుబాటగు ధరన్ గొన నిత్యము తల్లడిల్లగన్
    జాతిపురోభివృద్ధి కడుసన్నము కాగ స్వదేశమందునన్
    నూతన వత్సరమ్మని వినోద విహారములేల మిత్రమా

    రిప్లయితొలగించండి
  25. కవిపండితులకు,శంకరాభరణప్రభావితులకు,నిర్వహణాధికారులకు,ప్రోత్సాహికులకునూతన సంవత్సరశుభాకాంక్షలు.
    1.దాతగ,నేతగ,నీతిని
    జాతికి సమకూర్చుటందు జాగృతినింపే
    దూతగమెలిగిన చాలట
    నూతన వత్సర మనుచు వినోదము లేలా?
    2.జాతి పురోభి వృద్ధి మనజాలగ మానవతత్వవేత్తవై
    నీతిని నిల్పబూని నవి నీతినిమాన్పగ ధర్మ దీక్షతో
    దూతగ మంచి కార్యముల దోహదమెంచుము “ సంబరాలతో
    నూతన వత్సరమ్మని వినోద,విహారము లేలమిత్రమా”?


    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కె. ఈశ్వరప్ప గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      'నింపే' అని వ్యావహారికాన్ని ప్రయోగించారు. "జాతిని సమకూర్చుట యను సత్కార్యమునన్" అంటే ఎలా ఉంటుంది? 'నిల్పబూని యవినీతిని...' అనండి.

      తొలగించండి
  26. ఆంగ్ల మానపు సంవత్సరాది వచ్చె
    పూర్వ వత్సర వేదన లుర్విఁ దలగు
    రెండు వేల పయి పదియే డుండు నిపుడు
    నూత్న వర్షమ్ము కడిగిన రత్న మనగ


    మొదట సమమ్మునకు నెలలు
    పదియే మార్చి యొకటి యయె వర్షాది యటన్
    పిదప పెరిగె రెండు నెలలు
    తదుపరి జనవరి యొకటియ తథ్యంబయ్యెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కామేశ్వర రావు గారూ,
      కాలక్రమంలో ఆంగ్లమాన సంవత్సరం పొందిన మార్పులను చేర్పులను గూర్చి చక్కగా వివరించారు. అభినందనలు, ధన్యవాదాలు.

      తొలగించండి
  27. గురుదేవులకు మరియు కవిమిత్రులందరకూ ఆంగ్లనామ నూతన సంవత్సర శుభాకాంక్షలు.
    పాతవగు పెద్ద నోట్లను
    పాతేయగ, చేతనున్న పైసలు ఖర్చై
    యాతన పడ మరి పెుందగ
    నూతన వత్సరమనుచు వినోదములేలా?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  28. నూతనవత్సరమ్మనివినోదవిహారములేలమిత్రమా
    పాతదిరోతయైయికనుపారెనునామనసేలకోమరిన్
    నూతనమార్గమున్దరికినోములపంటగజేరెనత్తరిన్
    నూతనవత్సరమ్మునవినోదవిహారములేయికన్గదా

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పోచిరాజు సుబ్బారావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మీరు 'మరిన్' శబ్దాన్ని ఎక్కువగా (పాదపూరణం) కోసం వాడుతున్నారు. సాధ్యమైనంతవరకు తగ్గించండి.

      తొలగించండి
  29. భూతలమదరగ కేకలు
    చేతులలోమందు తోడ చెంగున గంతుల్
    భూతములు తిరుగు వేళల
    నూతన వత్సర మనుచు వినోదము లేలా?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  30. నీతల వ్రాతను మార్చదు
    నేతల గుణముల మార్చ నేరదు గదరా
    జాతికి సేసిన దేమని
    నూతన వత్సర మనుచు వినోదము లేలా

    ధాతలిఖించినట్టి విధి దాటెడు వీలును గల్గజేయునా
    నేతలు దుర్గుణోత్తములు నీచులు హీనులు వారు పెట్టెడిన్
    యాతన లైన దీర్చగ సహాయము జేయగ లేనిదైన యా
    నూతన వత్సరమ్మని వినోద విహారము లేల మిత్రమా

    రిప్లయితొలగించండి
  31. జాతకమంత మారినది చక్కగ సాచి పెడీలుమంటు తా
    భీతిలునట్లు కొట్టె నిరు పేదల, నోట్లను రద్దు జేసియున్
    యాతన జెందినాము కద యాబది రోజులు బ్యాంకు చెంత నీ
    నూతన వత్సరమ్మని వినోద విహారము లేల మిత్రమా!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గండూరి లక్ష్మినారాయణ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  32. గురువుగారికి, కవిమిత్ర బృందానికి ఆంగ్ల నూతన వత్సరాది శుభాకాంక్షలు.

    రిప్లయితొలగించండి
  33. నూతన వత్సరమునకును
    నూతన పద్ధతులవివిధ నూతన పధముల్
    రోతకలుగు నటుల జనులు
    నూతన వత్సర మనుచు వినోదము లేలా
    గురుదేవులు శ్రీ శంకరయ్య గారికి మరియు శంకరాభరణం బ్లాగులో పాల్గొను కవిమిత్రులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు (మీ సవరణకు ధన్యవాదములు )

    రిప్లయితొలగించండి
  34. జాతికి ద్రోహము సేసియు
    మాతకు భారతికి దాస్య మబ్బఁగ నిడియున్
    గోతులు ద్రవ్విన హూణుల

    నూతన వత్సర మనుచు వినోదములేలా?

    రిప్లయితొలగించండి
  35. వేతన జీవులన్ వెతలఁ బెట్టిన మోడినిఁ దిట్టుకొంచు, నీ
    జాతి సమస్త మెప్పుడునుఁ జక్కఁగ బ్యాంకుల ముందు శ్రేణులై
    నీతిగ నిల్చొనంగఁ గన నెప్పుడు నుండక, యిట్టు లీ విధిన్

    నూతన వత్సరమ్మని వినోద విహారము లేల మిత్రమా?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గుండు మధుసూదన్ గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి