31, డిసెంబర్ 2016, శనివారం

సమస్య - 2239 (మూఢాచార మొసంగులే...)

కవిమిత్రులారా!
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...

"మూఢాచారము ముదితకు మురిపెము నొసగున్" 
లేదా...
"మూఢాచార మొసంగులే మురిపెమున్ బూఁబోఁడికిన్ వేడుకన్"
ఈ సమస్యను పంపిన పోచిరాజు కామేశ్వర రావు గారికి ధన్యవాదాలు!

62 కామెంట్‌లు:

 1. గూఢముగ సతికి తెలియును
  గాఢము నీ ప్రేమ యనుచు కనకమ్మిడినన్
  రూఢి కద యక్షయతృతియ
  మూఢాచారము ముదితకు మురిపెము నొసగున్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'తృతీయ'ను 'తృతియ' అన్నారు. 'రూఢిగ నక్షయపు తదియ' అనండి.

   తొలగించండి
 2. మూఢముగ జేసి వ్రతములు
  ప్రౌఢుల నెదిరించి రబ్రి ప్రజ్ఞను జూపెన్
  గాఢముగ లాలును గొలువ
  మూఢాచారము ముదితకు మురిపెము నొసగున్! 

  రిప్లయితొలగించండి

 3. మాడావీధిని నాల్గుమార్లు రమణీ మాన్యంబు గాచుట్టి రా
  వే రేయింబవలున్ జిలేబి ఘనమై వెల్గంగ జీవమ్ము లౌ
  మూ ఢాచార మొసంగులే మురిపెమున్ బూఁబోఁడికిన్, వేడుకన్,
  గూడారంబుల నిన్నుబెట్టి గొలువం గూడంగ వీలౌను బో !

  జిలేబి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. జిలేబీ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'రా।వే డాయం బవలున్...' అనండి. ప్రాసదోషం తొలగుతుంది.
   *****
   ప్రభాకర శాస్త్రి గారూ,
   ధన్యవాదాలు! మీరు చెప్పకుంటే నేను ప్రాసదోషాన్ని గమనించకపోదును.

   తొలగించండి
 4. డా.పిట్టా
  ప్రౌఢిమయౌ బరిదెగుటల్
  గాఢంబగు ప్రేమ సుఖము ఘన యార్భాటాల్
  రూఢింజెల్ల విదేశపు
  మూఢాచారము ముదితకు మురిపెము నొసగున్
  రూఢంబాయె ప్రతివ్రతా గరిమయే రొక్కంపు దౌష్ట్యంబనన్
  గాఢంబయ్యె సమానతల్ నరులతో గార్హస్థ్యమే పీడయౌ
  మూఢాలందలి ప్రేమపెళ్ళియు భళా మూహూర్తముల్ యేలకో
  మూఢాచార మొసంగులే మురిపెమున్ బూబోడికిన్ వేడుకన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పిట్టా సత్యనారాయణ గారూ,
   డా. పిట్టా సత్యనారాయణ గారూ,
   మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
   'మూహూర్తముల్+ఏలకో' అన్నపుడు యడాగమం రాదు. 'మూహూర్త మింకేలకో' అనండి.

   తొలగించండి

 5. కూడుకు గుడ్డకు మిక్కిలి
  గోడున్నను లెక్క గొనక గొప్పగ యొరులున్
  వీడక నమ్మియు చేసెడి
  మూఢాచారము ముదితకు మురిపెము నొసగెన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. గండూరి లక్ష్మినారాయణ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'గొప్పగ నొరులున్' అనండి.

   తొలగించండి
 6. ప్రౌఢిమ గలిగిన భార్యలు
  గాఢాలింగనము నందు గాదిలి తోడన్
  గాఢపు కోరిక తెలుపుట
  మూఢాచారము ముదితకు మురిపెము నొసగున్

  రిప్లయితొలగించండి
 7. గాఢాంధకారము బ్రతుకు
  ప్రౌఢకు తనమగడు లేక! 'పంతులు'వలనన్
  వీడగ వితంతువగు నా
  మూఢాచారము, ముదితకు మురిపెము నెుసగెన్

  పంతులు = శ్రీ కందుకూరి వీరేశలింగం పంతులు

  రిప్లయితొలగించండి
 8. గాఢంబైన తమంబు నిండె బ్రతుకే కష్టాల పాలై వయో
  ప్రౌఢత్వమ్మున భర్త స్వర్గగతుఁడై వైధవ్యమే వచ్చె నా
  రూఢిన్ వీడఁ బునర్వివాహములనే రోధించు బ్రాచీనమౌ
  మూఢాచార మొసంగులే మురిపెమున్ బూఁబోఁడికిన్ వేడుకన్.
  (గుండా సహదేవుడు గారికి ధన్యవాదాలతో...)

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. సాంఘిక దురాచార ప్రస్తావన తో మనోహరమైన పూరణ చేశారు. ఇతివృత్త స్ఫురణకు దోహదపడిన సహదేవుడు గారు ప్రశంసనీయులే.

   తొలగించండి
  2. గురుదేవులకు మరియు కామేశ్వరరావు గారికి ధన్యవాదములు.

   తొలగించండి


 9. గోడకు చుక్కలు పెట్ట గ
  వేడిన వరదుడు జిలేబి వేగము గానన్
  రేడును పతిసేయుననెడి
  మూఢాచారము ముదితకు మురిపెము నొసగున్

  జిలేబి

  రిప్లయితొలగించండి
 10. కం.గూఢము మరియును పతిపై
  గాఢము సతుల వలపు; సహ గమనమునిలలో
  మూఢులు మెచ్చుచు నందురు
  "మూఢాచారము ముదితకు మురిపెము నొసగున్"

  రిప్లయితొలగించండి
 11. మూఢాచారములనునవి
  గాఢముగాహత్తుకొనెనుకామినులకిలన్
  రూఢిగనుసంతుగలుగుత
  మూఢాచారముముదితకుమురిపెమునొసగెన్

  రిప్లయితొలగించండి
 12. వేడుకగానోములనే
  గాఢముగామదిని నమ్మి గావింతురుగా
  యాడంగులు పతి కొరకను
  మూఢాచారము ముదితకు మురిపెము నొసగున్

  రిప్లయితొలగించండి
 13. గూఢశ్రుతుల నుడువు ను
  ద్గాఢ శుభప్రద సుకర సదాచారమనన్
  గాఢాను రక్తిఁ దలచిన
  మూఢాచారము ముదితకు మురిపెము నొసగున్

  వ్యతిరేకార్థమున పూరణాంతరము:

  గూఢశ్రుతుల నుడువు ను
  ద్గాఢ శుభప్రద సుకర సదాచారమునన్
  గాఢానురక్తి వీడిన
  మూఢాచారము ముదితకు మురిపెము నొసగున్


  తా ఢీకొన్న ధరాధరమ్ము త్రుటిఁ బాతంబన్న చందంబునన్
  బాఢార్థప్రదముల్ దురాత్మ కృత దుర్వాక్యమ్ము లేయన్న నా
  గూఢంబైన ధనంపు లాభములు కోకొల్లల్ సుమీ యన్న నీ
  మూఢాచార మొసంగులే మురిపెమున్ బూఁబోఁడికిన్ వేడుకన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పోచిరాజు కామేశ్వర రావు గారూ,
   మీ పూరణలన్నీ మనోహరంగా ఉన్నవి. అభినందనలు.

   తొలగించండి
  2. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు.

   తొలగించండి
 14. గాఢంపుంబ్రియభావనాళి మొలిచెంగందర్ప సౌందర్యుడౌ
  ప్రౌఢుండౌ తన మాతృసోదరునితో పంతంబు దీపింపగా
  గూడంగూడదు వారిబంధమనినంగోపాన నుద్విగ్నతన్
  మూఢాచారమొసంగులే మురిపెమున్ బూబోడికిన్ వేడుకన్.

  గూఢార్థంబులదెల్పుచు
  మూఢత్వము వీడుడనుచు ముందుకు వచ్చెన్
  రూఢిగ పంతులు తొలగిన
  మూఢాచారము ముదితకు,మురిపెము గూర్చెన్.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పొన్నెకంటి సూర్యనారాయణ గారూ,
   మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

   తొలగించండి
 15. వేడెద పతిపాదమ్ముల
  వీడక సేవించుచుందు పెనిమిటి సేవే
  తోడగు నది ముక్తికనుచు
  మూఢాచారము ముదితకు మురిపెము నొసగున్

  రిప్లయితొలగించండి
 16. ………………………...
  గు రు మూ ర్తి ఆ చా రి
  ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

  { ము౦దున్న తే.గీ. పద్య౦ సమస్యపూరణా భావమును support చేస్తు౦ది }
  ……………………………………………………ి
  ి
  1. లేవగనె ప్రభాతమున తాళిని కనులకు

  నమిత మగు భక్తి మీరగ హత్తుకొనెడు

  2 . దినము తులసిమొక్కకు ప్రదక్షిణము సేయు

  3 . పాదయుగమున కెప్పుడు పసుపు నలదు

  4 . ప్రా౦గణమున చక్కని ర౦గవల్లి వేయు

  పడతులకు మూఢ మన నది పాడి యగునె ?

  ! ! ! ! !

  ప్రౌఢిమతో వ్రతములను ప్ర

  గాఢపు భక్తి సలుపు గద కా౦తయె | కానన్

  మూఢునివై గేలికొనకు

  మూఢా ! చారము ముదితకు మురిపెము

  . . . . . నొసగున్ ! !

  { మూఢము = మూఢత్వము ;

  గేలికొనకు = గేలి సేయకు ;

  చారము = అచారము }

  రిప్లయితొలగించండి
 17. ప్రౌఢలుబుగ్గలు పుణుకుచు
  గూఢముగా బోధసేసి గోక్షీరము తో
  నూఢను పతి దరి కనుపెడి
  మూఢాచారము ముదితకు మురిపెము నొసగున్

  రిప్లయితొలగించండి
 18. 2016 వ యాంగ్ల సంవత్సరాంతపు దివసమున నాచార సంపన్నుడు సేవా తత్పరుడు గ్రహచారాపన్నుని గనుండు సజ్జను లారా!!!


  అచిరగ్రహచార విచా
  ర చర చిర విచార గోచరగ్రహచారున్
  ఖచర రత వచో రుచుఁ గను
  రుచి రాచా రోపచార రోచిత చరితున్

  రిప్లయితొలగించండి
 19. గురుదేవులకు, కవి శ్రేష్టులకు, బ్లాగు మిత్రులకు..
  ఆంగ్ల నూత్న సంవత్సరాది శుభాకంక్షలు!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. వర ప్రసాద్ గారు ధన్యవాదములు. మీకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు!

   తొలగించండి
  2. వరప్రసాద్ గారూ,
   ధన్యవాదాలు!
   మీ పేరు బ్లాగులో చూచి ఎంతకాలమయింది?!

   తొలగించండి
 20. క్రొవ్విడి వెంకట రాజారావు:

  గాఢమనుచు తర్కించక
  గూఢముగా ధవుని బాగు కోరుకొనుచు దా
  ప్రౌఢిమతో నెఱపెడిదౌ
  మూఢాచారము ముదితకు మురిపెము నొసగున్.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. క్రొవ్విడి వేంకట రాజారావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 21. .మూఢంబందున పెళ్లిజేయుటన నామోదంబుగాకున్న?తా
  గాఢంగా,తగునమ్మకాన ప్రియ సంకల్పాన ,సమ్మోహమే
  తోడై ప్రేమగ మార?యేడుకొండల పయిన్ పెళ్లాడ సంతోషపున్
  మూఢాచార మొసంగులే మురిపమున్ బూబోడికిన్ వేడుకన్|
  2గాఢాంధ కారమందు ని
  గూఢముగా యూరి వారు కొందరు జేసే
  ఆఢంబర దేవరగన?
  మూఢాచారము ముదితకు మురిపమునొసగున్|


  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కె. ఈశ్వరప్ప గారూ,
   మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
   మొదటి పూరణలో 'గాఢంగా' అని వ్యావహారికాన్ని ప్రయోగించారు. '...యేడుకొండల' అన్నచోట గణదోషం. 'తోడై ప్రేమగ నేడుకొండల పయిన్' అంటే సరి!
   రెండవ పూరణలో 'గూఢముగా నూరివారు' అనండి. '...జేసే' అని వ్యావహారికం. 'ఆడంబర దేవర' దుష్టసమాసం.

   తొలగించండి
 22. ప్రౌఢలు పతి భక్తి గదుర
  రూఢిగ యెందున పతి దిన, రోయక నందే
  గాఢపు ప్రేమను తినిరట !
  మూఢాచారము ముదితకు మురిపెము నొసగున్

  రిప్లయితొలగించండి
 23. కవి మిత్రులకు గురువర్యులకు 2017 సంవత్సరము ఆయురారోగ్యములు
  ప్రసాదించ వలెనని కోరుచూ మీ తిమ్మాజీ రావు

  రిప్లయితొలగించండి
 24. గురుదేవులకు ప్రణామములు. నిన్నటి పూరణ పరిశీలించమనవి:
  సాధకులౌ నటులట నట
  నాధిక్యత పెంచుకొనఁగ నందరుఁ గూడన్
  నా ధనువేలఁ గొనితివని
  రాధేయుఁడు వెంబడింప రాముఁడు బాఱెన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సహదేవుడు గారూ,
   మీ (నిన్నటి సమస్యకు) పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 25. మూఢాచారమ్మున నా
  షాఢమ్మున నత్త విడచి చనె యాత్రలకున్
  మూఢత్వమె కానీయుడు
  మూఢత్వమ్మే ముదితకు మోద మ్మిడెడిన్

  రిప్లయితొలగించండి
 26. వీడన్ జాలరు కాంతలే తమపతిన్ పీడించు వాడైన తా
  వీడన్ గోరరు ధర్మమంచు గడు సం ప్రీతిన్ పతిన్ గొల్తురే
  పాడెన్ జేరెడు వేళవచ్చు వరకా భర్తేగదా దైవమౌ
  "మూఢాచార మొసంగులే మురిపెమున్ బూఁబోఁడికిన్ వేడుకన్

  రిప్లయితొలగించండి
 27. వీడన్ జాలరు కాంతలే తమపతిన్ పీడించు వాడైన తా
  వీడన్ గోరరు ధర్మమంచు గడు సం ప్రీతిన్ పతిన్ గొల్తురే
  పాడెన్ జేరెడు వేళవచ్చు వరకా భర్తేగదా దైవమౌ
  "మూఢాచార మొసంగులే మురిపెమున్ బూఁబోఁడికిన్ వేడుకన్

  రిప్లయితొలగించండి
 28. తోడుగ నున్న నిజవిభుడు
  వేడ గ పెద్దల నుడువులు వీడకు మనుచున్
  గాఢపు ననుసరణముతో
  మూఢాచారము ముదితకు మురిపెము నొసగున్

  రిప్లయితొలగించండి
 29. కవి మిత్రులందఱకు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు.🌺🌺🌺2017 కి స్వాగతం🌺🌺🌺

  రిప్లయితొలగించండి
 30. గాఢంబయ్యెడి లాలు ప్రేమను సతీ కార్తీక చైత్రమ్ము నా
  షాఢ శ్రావణ జ్యేష్ఠ మాసములనున్ ఛట్పూజ దీవాలినిన్
  సోఢాల్ త్రాగుచు తిండి మాని పదవుల్ షోగ్గాడిలా పొందెనే...
  మూఢాచార మొసంగులే మురిపెమున్ బూఁబోఁడికిన్ వేడుకన్!

  రిప్లయితొలగించండి