పీతంబార్ గారి పద్యంబాగున్నది కాని భావం కొంచెం క్లిష్టంగా ఉన్నట్లున్నది. మురళీమోహన్ గారి పద్యం, నరసింహ మూర్తిగారి రెండవ పద్యం చాల బాగున్నాయి. గురువుగారి సూచన మేరకు ఈ నా వ్యాఖ్య. తోటి మిత్రులు నా పద్యం గురించి కూడా వ్యాఖ్యానిమ్చరూ?
గన్నవరపు నరసింహ మూర్తి గారి మూడు పూరణలు, కోడీహళ్ళి మురళీ మోహన్, మంద పీతాంబర్, మిస్సన్న, చంద్రశేఖర్ గారల పూరణలు చూసాను. అందరికీ అభినందనలు. జనగామలో పెళ్ళికి వెళ్ళే తొందరలో మీ పద్యాలను విశ్లేషించలేకున్నాను. మన్నించండి.
మాష్టారు గారు, నా సూచన మన్నించి అద్భుతమైన పూరణ అందించినందుకు కృతజ్ఞతలు. మీ పూరణ నన్ను భాషా, సాహిత్య పరంగా చాలా ఆనందింపజేసింది. ఇదే రకంగా కొనసాగించగలరని భావిస్తున్నాను.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఅమ్మ సోనియ యొసగదు యాదరమ్ము
రిప్లయితొలగించండిఅకట! రోసయ్య కిచ్చిరె యాసనమ్ము
క్రింద దింపగ దానెక్క కిరణు డెవడు ?
కొంప కొల్లేరుఁ జేసెడి కొడుకె మేలు !
మరో పూరణండీ :
రిప్లయితొలగించండిమత్సరమ్మున జెలరేగు మదిని నెటులొ
పంజరమ్మున బిగియింప పక్షి వోలె
వెతల గాసిలు విదురుడ వేయు నేల
కొంప కొల్లేరుఁ జేసెడి కొడుకె మేలు
సుతుడు లేని యెడల లేవు గతులు యనెడి
రిప్లయితొలగించండిమాట నేడు పొసగదు ముమ్మాటికి నిల
కందెఱ వలె గాచెడు సుత కంటె ఎటుల
కొంప కొల్లేరుఁ జేసెడి కొడుకు మేలు?
బ్రతుకు నల్లేరుపైసాగు బండికాదు,
రిప్లయితొలగించండివేదనమిగిల్చి,బాధించి,వెతలపాలు
జేసి,కంటకులై కంపు జేయు వారి
కొంప,కొల్లేరుజేసెడి,కొడుకు మేలు!
సుతుల నూర్వుర బడసిన సుఖమ దేమి
రిప్లయితొలగించండికపటులై పర్వు మాయుచు కన్న వారి
కొంప కొల్లేరుఁ జేసెడి! కొడుకె మేలు
ధర్మజుని రీతి యొక్కడు తనువు గడుప !
పీతంబార్ గారి పద్యంబాగున్నది కాని భావం కొంచెం క్లిష్టంగా ఉన్నట్లున్నది.
రిప్లయితొలగించండిమురళీమోహన్ గారి పద్యం, నరసింహ మూర్తిగారి రెండవ పద్యం చాల బాగున్నాయి. గురువుగారి సూచన మేరకు ఈ నా వ్యాఖ్య. తోటి మిత్రులు నా పద్యం గురించి కూడా వ్యాఖ్యానిమ్చరూ?
ఎన్నగాను మేల్గీడులవెట్లు తెలియు
రిప్లయితొలగించండిపోల్చి చూడ వలయు గదా తేల్చి చెప్ప
తల్లిదండ్రుల త్రెక్కొను తనయు కంటె
కొంప కొల్లేరుఁ జేసెడి కొడుకె మేలు.
మనవి: గ్రుడ్డి కంటె మెల్ల మేలు అన్నట్లు.
మరొక పూరణండీ :
రిప్లయితొలగించండిఒరుల దొరతన మోర్వక నుద్యమించి
ఉప్పు జేయగ గాంధీజి, యుర్వి ననిరి
"కొంప కొల్లేరుఁ జేసెడి కొడుకె మేలు
పరుల నింటను బోషించు బ్రతుకు గంటె "
గన్నవరపు నరసింహ మూర్తి గారి మూడు పూరణలు, కోడీహళ్ళి మురళీ మోహన్, మంద పీతాంబర్, మిస్సన్న, చంద్రశేఖర్ గారల పూరణలు చూసాను. అందరికీ అభినందనలు. జనగామలో పెళ్ళికి వెళ్ళే తొందరలో మీ పద్యాలను విశ్లేషించలేకున్నాను. మన్నించండి.
రిప్లయితొలగించండినా పూరణ .....
రిప్లయితొలగించండికన్నవారికి సత్కీర్తి గలుగునట్లు
సర్వ సద్గుణోపేతుఁడై సకల జనుల
మెప్పు పొందు సుతుని గాక చెప్పు నెవఁడు
కొంప కొల్లేరుఁ జేసెడి సుతుఁడె మేలు.
మాష్టారు గారు,
రిప్లయితొలగించండినా సూచన మన్నించి అద్భుతమైన పూరణ అందించినందుకు కృతజ్ఞతలు. మీ పూరణ నన్ను భాషా, సాహిత్య పరంగా చాలా ఆనందింపజేసింది. ఇదే రకంగా కొనసాగించగలరని భావిస్తున్నాను.