16, డిసెంబర్ 2010, గురువారం

సమస్యా పూరణం - 170

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ......
సతి సతిఁ గవయంగఁ బుత్రసంతతి గలిగెన్.

22 కామెంట్‌లు:

  1. శరణం పండిత మానసాపహరణం శశ్వద్యశః కారణం
    నటదంగీకృత వాగ్విలాస చరణం నానార్థ సంపూరణం
    చరదత్యద్భుత సత్కవీశ్వర గణం సాలంబనం ' శంకరా
    భరణం ' నిత్యమహం స్మరామి కలవాణీ దివ్య సింహాసనం!!!

    అందరికీ శరణు వేడదగిందీ, సకల పండితుల మనస్సులనూ తన సౌందర్యం చేత హరింపగలిగినదీ , పాల్గొన్న మాత్రాన శాశ్వతమైన కీర్తి ప్రతిష్టలను కలిగించేదీ , బాగుగా ఒప్పిన నర్తన తో విలాసమైన సరస్వతీ చరణాలు కలిగినదీ , వివిధములైన అర్థాలను తీర్చేదీ ( కవిత్వం కావాలనుకొన్న వారికి కవిత్వం, పాండిత్యం కావాలనుకొన్న వారికి పాండిత్యం, పద సంపద కావాలనుకొన్న వారికి పద సంపద, ఛందస్సు నేర్వగోరిన వారికి ఛందస్సు, ప్రహేళిక లిష్టమైన వారికి ప్రహేళికలూ ), అటూ ఇటూ వచ్చీ పోయే సత్కవీశ్వర గణములను కలిగినదీ, ఒకానొక ఆలంబనగా నిలచినదీ , కలవాణి యొక్క దివ్య సింహాసనంతో సమానమైనటువంటి ఈ ' శంకరభరణాన్ని ' అనునిత్యమూ స్మరిస్తాను!!!!!

    (భావ గాంభీర్యత కోసం దేవ భాషనాశ్రయించవలసి వచ్చినది.....!!!)

    కంది శంకరయ్య గారికి ప్రణామ పూర్వక కృతజ్ఞతాంజలులతో....


    అతనుని తూపుల బారికి
    జితుడై తమకమ్ముతోడ చెలిజేరిన ఆ
    పతి యేకాంతపు మేలు వ
    సతి , సతిఁ గవయంగఁ బుత్రసంతతి గలిగెన్

    రిప్లయితొలగించండి
  2. పతి సతులకు సంతానపు
    గతి లేదని వగయ వలదు,కాలము మారెన్,
    రతుల తతిలేక పతితో,
    సతి సతి గవయగ బుత్ర సంతతి గలిగెన్!!

    (నేడు వైద్య విజ్ఞానం పెరిగి పురుష వీర్యాన్నిసతిగాని మరో స్త్రీ ద్వారా ,సతి గర్భంలో ప్రవేశ పెట్టి సంతానంపొందుతున్న సందర్భాలు మనకు తెలుస్తున్నాయి గదా.యీ విషయమే తీసుకొని పూరించాను.)

    రిప్లయితొలగించండి
  3. విష్ణునందన్ గారూ,
    ఇందరు కవిమిత్రుల రచనలను ఆస్వాదించటమే నా భాగ్యమని అనుకొంటుండగా,
    మీరు మీ రచనలతో ఆ అదృష్టాన్ని ద్విగుణీకృతం చేశారు.
    ధన్యురాలిని.

    రిప్లయితొలగించండి
  4. విడ్డురమో విపరీతమో కానీయండీ, వైదికకర్మలు ఏవీ కూడ ఇళ్లలో జరగటం లేదు ఈ రోజులలో.

    అతిసిగ్గరియొకడువివా
    హితుడై పెద్దలనొదిలియె ఇంటను,జని,సం
    తత నక్షత్రత్రయపువ
    సతి సతిఁ గవయంగఁ బుత్రసంతతి గలిగెన్.

    రిప్లయితొలగించండి
  5. డా||విష్ణునందన్ గారూ

    అచ్చరవలెనాతులనడి,
    మచ్చిక బాతులకొలనిని మాటల యంచై
    వచ్చితివయ్యా సుకవీ
    అచ్చెరువునజూడలోకమంతయు ముదమున్

    రిప్లయితొలగించండి
  6. ఈ సమస్యను పోలిన సమస్యకు అష్టావధాని డా.ఆశావాది ప్రకాశరావు గారి మరియు మరికొంతమంది పూరణలు ఇక్కడ చూడండి.
    http://turupumukka.blogspot.com/2009/06/blog-post_2474.html

    రిప్లయితొలగించండి
  7. గురువుగారూ డా.విష్ణు నందన్ గారి గురించిన మీ వాక్కులు అక్షర సత్యాలు. నిజంగా ఆయన సరస్వతీ సమానులు.
    ఇక శంకరాభరణం అల్పమైన బ్లాగు అన్నమాటతో నేనేకీభవించ లేకున్నాను. నేనే కాదు మన మిత్రులెవరూ ఏకీభవిన్చరని నా నమ్మకం. ఎందుకంటే మీలాటి పండితులు, భాషాభిమానులూ, సరస్వతీ సేవకులూ నిర్వహించే బ్లాగు అల్పమైన బ్లాగు కాదు. అల్పత్వమేమైనా ఆపాదిన్చబడుతుందంటే అది నాబోటి యతిప్రాసల కోసం ప్రాకులాడే అల్పుల వల్లే. ఇక్కడ విశేషమేమంటే నాలాటి చిన్నవారిని మీరు వెన్ను తట్టి ప్రోత్సహించడం. నేను కూడా పద్యం వ్రాయగలను అనే తృప్తిని మాలో కలిగించడం. మీ బ్లాగులో మేమంతా అన్ని రకాల వచ్చీ రాని కవిత్వాలు పెట్టేస్తున్నాము. అవన్నీ మీరు సహిస్తున్నారు, ఓపికగా విశ్లేషిస్తున్నారు. మీబోటి సద్గురువులు లభించడం మాబోంట్ల అదృష్టం. డా. విష్ణునందన్ గారు శంకరాభరణానికి సమకూడిన క్రొంగ్రొత్త వన్నె, ధగధగ!

    రిప్లయితొలగించండి
  8. మిస్సన్న గారితో పూర్తిగా ఏకీభవిస్తూన్నాను......నిజానికి వారలా అల్పమైనదని అన్నందుకే ...కాదు....అనల్పమైన కల్పవృక్షము వంటిదని అనిపించి పై శ్లోకము వ్రాయవలసివచ్చింది.
    కాకపోతే నేనూ ఒక సామాన్య పద్యకవినే....దయచేసి విశేషణాలేవీ వాడదగదు...అంత అర్హత నాకింకా రాలేదు.....ఇలాంటి విశేషణాల వల్ల నన్ను దూరము చేయరని ప్రార్థన!!!
    నిజంగా ఇచ్చట జరుగుతోన్న సారస్వత సేవ వేనోళ్ల కొనియాడదగినదే!!!! ఇది రమణీయం....సదా స్మరణీయం!!!!

    రిప్లయితొలగించండి
  9. సతతము సంతతి ధరణిని

    పతి గలసిన సతికి గాక - తరుణుల తరమే ?

    మతి లేని కోత లేలే !!!

    "సతి సతి గవయంగ పుత్ర సంతతి గలిగెన్"

    రిప్లయితొలగించండి
  10. మిస్సన్న గారన్నది అక్షరాలా నిజం.మిస్సన్న గారి గురించి వారూ చెప్పుకొన్న విషయం నిజం కాదు గాని,నేను మాత్రం కంద పద్య లక్షణాలు తెలియకుండా కేవలం ఉత్సాహంతో మొదటి సారి సమస్యను పూరించాను,గురువు గారు ఎంతో ఓపికతో,ఒద్దికతో ,తప్పొప్పులను సరిదిద్ది,వెన్నుతట్టి ప్రోత్సహించారు ,ఈ నాలుగు పద్యాలు వ్రాయ గలిగి ,
    ఎన్నదగిన కవుల మద్య నా పేరు చుసుకొంటున్నానంటే . ఈ బ్లాగే కారణం .నాకు గర్వంగా కూడా ఉంది. మరో మహ కవి పరిచయం ఈ బ్లాగు ద్వారా కలిగినందుకు మహదానందంగా ఉంది.

    రిప్లయితొలగించండి
  11. suta heenudu DaSaradhuDunu yativaryulu protsahimpa yaagamu salipen. hitamayye phalamu panchucu sati sati gavayanga putra santati galigen

    రిప్లయితొలగించండి
  12. గతి నీవె చంప తారకు
    నతులు శివా యనగ సురలు, నవ్వుచు ననె నా
    సుతుడది చేయును! చేరెను
    సతి, సతిఁ గవయంగఁ బుత్రసంతతి గలిగెన్.

    రిప్లయితొలగించండి
  13. sir shubhodayam meeru sahityamlo savyasahi anipictunnadi. Maa korika okati adi meeru mee rachanalanu kastha Telangana Sadhana disa ga mallisthe baguntundi. andesri,goreti,gaddar,suddala,gudeti,desapathi,annavaram la rachanallo pathika vanthu TELANGANAsadhana py rayamani naa korika. balu-balaji-wgl.

    రిప్లయితొలగించండి
  14. డా. విష్ణు నందన్ గారూ,
    మీ ప్రశంసకు పాత్రమై నా బ్లాగు ధన్యతను చేకూర్చుకున్నది. ధన్యవాదాలు. మీరు నా బ్లాగుకు ఒక అమూలమైన ఆభరణాన్ని శ్లోక రూపంలో కానుకగా ఇచ్చారు. అది నిజంగా తలమానికమే. అందువల్ల దానిని ప్రయోగాత్మకంగా నా బ్లాగు శీర్షికలో చేర్చాను. ముందు మీ అనుమతి తీసికొనడం మర్యాద. మీ శ్లోకాన్ని నా బ్లాగు శీర్షికలో చేర్చుకొనడనికి అనుమతించ వలసిందిగా సవినయంగా కోరుతున్నాను. మీరు అనుమతిస్తే దానిని కొనసాగిస్తాను.
    ఇక ఈనాటి సమస్యకు మీ పూరణ అద్భుతంగా ఉంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  15. మంద పీతాంబర్ గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.

    మందాకిని గారూ,
    చాలా కాలానికి నా బ్లాగులో వ్యాఖ్య పెట్టారు. ధన్యవాదాలు.

    ఊకదంపుడు గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.
    డా. విష్ణు నందన్ గారిని ప్రశంసిస్తూ రాసిన పద్యానికి ధన్యవాదాలు. అయితే మొదటి పాదం అర్థం కాలేదు. చివరి పాదంలో "లోక మంతయు ముదమున్" అనడం కంటే "లోక మంత ముదమునన్" అంటే బాగుంటుందేమో?

    కోడీహళ్ళి మురళీ మోహన్ గారూ,
    నిజమే. అది నేను సృష్టించిన సమస్య కాదు. అందరికీ తెలిసిన ప్రశస్తమైన సమస్యే. దానిని "పద్యం డాట్ నెట్" నుండి గ్రగించాను. వివరాలు తెలిపినందుకు ధన్యవాదాలు.

    మిస్సన్న గారూ,
    మీ అభిమానానికి ధన్యవాదాలు.
    మీ పూరణ చక్కగా ఉంది. అభినందనలు.

    వసంత్ కిశోర్ గారూ,
    మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.

    బాలాజీ గారూ,
    ధన్యవాదాలు. మీరు చెప్పిన విషయం ఆలోచింపతగిందే. త్వరలోనే నా స్పందన తెలియజేస్తాను.

    గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు. కాని ఈసారి ఆంగ్ల లిపిలో పంపారేం?
    సుత హీనుడు దశరథుడును
    యతివర్యులు ప్రొత్సహింప యాగము సలిపెన్.
    హితమయ్యె ఫలము పంచుచు
    సతి సతి గవయంగ పుత్ర సంతతి గలిగెన్

    రిప్లయితొలగించండి
  16. అతిశయమౌ హరిహరులకు
    మతి తప్పి తమకమందున మణికంఠుడయెన్ !
    మితి మీరిన కలియుగమిది
    సతి సతిఁ గవయంగఁ బుత్ర సంతతిగలిగెన్ !
    [ ఇది ఎందుకో తప్పని పిస్తోంది ఐన రాసాను మరి ]

    రిప్లయితొలగించండి
  17. శ్రీయుత కంది శంకరయ్యగారికి ..... ప్రణామాలు!!!
    ఆ శ్లోకం నిస్సందేహంగా మీకు సమర్పించిన కానుకే....కనుక నిరభ్యంతరముగా మీరు దానిని వాడుకొనవచ్చును. దాని సర్వ సంపూర్ణాధికారమూ మీదే....కాకపోతే ఒక సలహా ఇవ్వగలను....శ్లోకం తరువాత నా పేరు అనవసరమని తోస్తూన్నది....పేరు లేకుండా వట్టి శ్లోకం ఐతేనే మరింత అందగిస్తుందని నా అభిప్రాయం. కనుక అదేదో నా ఒక్కడే శంకరాభరణాన్ని ' స్మరిస్తూన్నాను ' అని అర్థం వచ్చేలా కాకుండా సార్వజనీనంగా , ఎవరు చదివితే వాళ్లకి ' నేను స్మరిస్తూన్నాను ' అనే అర్థం వచ్చేలా నా పేరు తీసేసినా నాకేమీ అభ్యంతరం లేదు ...అధే ఆమోదయోగ్యం కూడానూ !!!!

    రిప్లయితొలగించండి
  18. డా. విష్ణు నందన్ గారూ,
    ధన్యవాదాలు. మీ సూచన మేరకు మీ పేరును తొలగిస్తున్నాను.

    రిప్లయితొలగించండి
  19. అయ్యా!గురువర్యా!శంకరార్యా! నమోనమః:
    డా.విష్ణునందన్ గారి చరవాణి నెం.తమకు అభ్యంతరం లేకుంటే అందింప వేడుకోలు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. క్షమించాలి. వారి నెం. నావద్ద లేదు. వారి తండ్రిగారు శేషఫణి శర్మ గారిని అడగాలి.

      తొలగించండి
  20. మతి పోయి మమత మాయా
    వతిఁ గూడగ కల్గె స్వప్న భ్రాంతిగ సుతుడే
    కుతి మీరగ "ఘట బంధన":
    "సతి సతిఁ గవయంగఁ బుత్రసంతతి గలిగెన్"

    రిప్లయితొలగించండి