20, డిసెంబర్ 2010, సోమవారం

సమస్యా పూరణం - 174

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ......
పువ్వులు రాళ్ళగును, రాళ్ళు పూలుగ మారున్.

30 కామెంట్‌లు:

  1. చివ్వున పార్టీ మాఱిన
    నవ్వరె పగవారు హితులు నర్మము గూడన్
    అవ్వల యివ్వల నవగా
    పువ్వులు రాళ్ళగును రాళ్ళు పూలుగ మారున్ !

    రిప్లయితొలగించండి
  2. మూర్తి గారూ మీ పద్యం చాల బాగుంది.
    నా పూరణ :
    నువ్వే దిక్కవు దత్తా!
    కవ్వించెడి చుట్టుముట్టి కష్టము లన్నన్,
    నవ్వును, యాతని మహిమన్
    పువ్వులు రాళ్ళగును, రాళ్ళు పూలుగ మారున్.

    (ఈరోజు శ్రీ దత్త జయంతి)

    రిప్లయితొలగించండి
  3. మరో పూరణండీ :


    పువ్వులు కోయుట కేగగ
    గువ్వై తా గూయుచుండె కోమలి యొకతెన్
    రువ్వును రాళ్ళను పూలకు,
    పువ్వులు రాళ్ళగును రాళ్ళు పూలుగ మారున్ !

    ఈ ప్రేమ ఫలించే టట్లు లేదు. రవి గారు చెప్పాలి !!

    రిప్లయితొలగించండి
  4. మిస్సన్నగారూ, నా హృదయములో మాట చెప్తాను. ఏ సమస్యను యిచ్చినా అందులో భక్తి రసము,కవితా రసము చిలికిస్తారు. మీరంటే మాకందఱికీ యెనలేని గౌరవము ! ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  5. ఎవ్వని సంకల్పమ్మున
    ఇవ్వసుధ జనించి , పెరిగి , యీల్గునొ తుదకున్ ,
    అవ్వాడు యిచ్చగించిన
    పువ్వులు రాళ్ళగును, రాళ్ళు పూలుగ మారున్ !!!

    రిప్లయితొలగించండి
  6. ఎవ్వాడెవ్వనిదూరునొ
    ఎవ్వానిభజించునెవడొ ఎరుగగ వశమే?
    హవ్వవ్వ!రాచవీడున
    పువ్వులు రాళ్ళగును, రాళ్ళు పూలుగ మారున్ !

    రిప్లయితొలగించండి
  7. హవ్వా యనగను సిబియై
    చివ్వున బోఫార్సు కేసు చీపుగ మార్చెన్
    ఇవ్విధమగు శోధనమున
    పువ్వులు రాళ్ళగును, రాళ్ళు పూలుగ మారున్

    రిప్లయితొలగించండి
  8. నరసింహమూర్తి గారూ! చాలా పెద్ద మాటలు వాడేశారు.
    మీరనేటంతటి రసాలేవీ నా దగ్గర లేవు. ఒక్కొక్క సారి
    ఏ రసం దొరక్క పద్యం అల్ల లేక నీరసం వచ్చేస్తూంటుంది.
    నిజం చెప్పాలంటే మాకు మీరంటే యెంతో ఇష్టం. ఎందుకంటే
    ఇక్కడ మేము తెలుగులో ఓనమాలు మరచిపోతూంటే మీరు
    ఖండాంతరాలలో ఉంటూ మన భాష పట్ల, మన సంస్కృతి
    పట్ల అమిత గౌరవ ప్రపత్తులు కలిగి ఉంటున్నారు. ఒకసారి
    సామవేదం షణ్ముఖ శర్మ గారు అన్నారు "కొన్నాళ్ళు పోయాక
    అమెరికా నుంచి మన తెలుగు,సంస్కృత, వేద పండితులను
    రప్పించి ఇక్కడి వాళ్లకు మనం నేర్పించాలేమో" అని. ఆ రోజు
    యెంతో దూరం లేదేమో. మీకు నాపట్ల ఉన్న అభిమానానికి
    {గౌరవం వద్దు} ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  9. నందన్ గారి పద్యం చదువుతూంటే విష్ణువుకు మొరబెట్టు కొన్న గజరాజు గుర్తుకు వస్తున్నాడు.
    హరిగారి,ఊకదంపుడు గారి పద్యాలు నేటి రాజకీయాలకు అద్దం పడుతున్నాయి. బావున్నాయి.

    రిప్లయితొలగించండి
  10. గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
    మీ రెండు పూరణలు నిర్దోషంగా బాగున్నాయి. అభినందనలు.

    మిస్సన్న గారూ,
    మంచి భావంతో పద్యం చెప్పారు. బాగుంది. అభినందనలు.
    కాని కొద్దిపాటి సవరణ అవసర మనిపించింది. నా సవరణతో మీ పద్యం ....
    నువ్వే దిక్కువు, దత్తా!
    కవ్వించెను చుట్టు ముట్టి కష్టము లన్నన్
    నవ్వెడి నీ మహిమలతో
    పువ్వులు రాళ్ళగును, రాళ్ళు పూలుగ మారున్.

    డా. విష్ణు నందన్ గారూ,
    మధురమైన పూరణ. అద్భుతంగా ఉంది. ధన్యవాదాలు.

    ఊకదంపుడు గారూ,
    మంచి పూరణ నందించారు. ధన్యవాదాలు.

    హరి గారూ,
    చక్కని పూరణ. అభినందనలు.

    మిస్సన్న గారూ,
    మీ వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్నాను. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  11. మంత్రిప్రగడ వేంకట బాలసుబ్రహ్మణ్యం గారి పూరణ ....

    పువ్వులు పొగడ్త లనుకొని
    రువ్వెడి రాయిగ విమర్శ రోసి చరించెన్
    అవ్వాడు మనిషిగ నెదగ
    పువ్వులు రాళ్ళగును, రాళ్ళు పూలుగ మారున్.

    రిప్లయితొలగించండి
  12. మంత్రిప్రగడ వేంకట బాలసుబ్రహ్మణ్యంసోమవారం, డిసెంబర్ 20, 2010 3:59:00 PM

    ధన్యవాదాలు, గురువు గారూ.
    - మంత్రిప్రగడ వేంకట బాలసుబ్రహ్మణ్యం

    రిప్లయితొలగించండి
  13. పూరించుటలో ప్రఙ్ఞులందరూ!
    ప్రఙ్ఞులనెపుడూ పూజింపవలె!
    పూజ్యులందరికీ శుభాభినందనలు.
    ------------------------------
    01)
    నవ్వుల పాలగు గొల్లని
    నవ్వగదా! కవిగ మార్చె - నబ్బురముగ, నా
    పువ్వారుబోడి తలంచిన
    పువ్వులు రాళ్ళగును, రాళ్ళు పూలుగ మారున్.
    ------------------------------
    [గొల్లడు = కాళిదాసు]

    రిప్లయితొలగించండి
  14. నవ్వెను చిలిపిగ చిన్నది
    చివ్వున మది ఝల్లుమనగ చిరుచిరు ప్రేమల్ !
    రివ్వున దరిజేరె నాశగ
    పువ్వులు రాళ్ళగును రాళ్ళు పూలుగ మారున్ !

    రిప్లయితొలగించండి
  15. గురువుగారూ అందమైన సవరణ చేసి నా పద్యానికి వన్నె లద్దారు. కృతజ్ఞతలు.

    రిప్లయితొలగించండి
  16. వసంత్ కిశోర్ గారూ,
    పూరణకు మంచి విషయాన్ని ఎత్తుకున్నారు. అభినందనలు.
    మూడవ పాదంలో "తలంచిన"కు బదులు "తలఁచిన" అంటే గణదోషం తొలగిపోతుంది.

    రాజేశ్వరి నేదునూరి గారూ,
    పద్యం బాగుంది. అభినందనలు.
    మూడవ పాదంలో "రివ్వున దరి జేరె నాశగ" కు బదులు "రివ్వున దరి జేరగ నా" అంటే గణదోషం తొలగిపోతుంది.

    రిప్లయితొలగించండి
  17. గువ్వలు ఎగురగ ,తారా
    జువ్వల రవ్వల మెరుపులు జూడగ మనముల్ ,
    నవ్వక పోయిన ,నవ్విన,
    పువ్వులు రాళ్లగును,రాళ్ళు పూలుగ మారున్!

    రిప్లయితొలగించండి
  18. రివ్వున ఎగిసిన బాబే
    సవ్వడి లేకుండ నేడు చతికిల బడెనే
    నివ్వెర పోవంగ తెలిసె
    పువ్వులు రాళ్ళగును, రాళ్ళు పూలుగ మారున్!!
    (బాబు -> చంద్రబాబు)

    రిప్లయితొలగించండి
  19. 02)
    నవ్వకుడీ! జనులారా!
    నొవ్విన బడుగులను, జూచి - న్యూనత నొందన్
    పువ్వులు పూలగ నుండవు
    పువ్వులు రాళ్ళగును రాళ్ళు - పూలుగ మారున్

    రిప్లయితొలగించండి
  20. 03)
    నవ్విన బహు , ఆరోగ్యము
    నవ్వని వారల కరోగ - నాశము మహిలో
    నవ్వుచు నుండిన సతతము
    పువ్వులు రాళ్ళగును రాళ్ళు - పూలుగ మారున్

    రిప్లయితొలగించండి
  21. 04)
    నవ్వేగద ! నీకు నాకు
    నెవ్వరి కైనన్! జిగీష - నిచ్చును !ఇలలో
    నవ్వుట మానకు నెన్నడు
    పువ్వులు రాళ్ళగును రాళ్ళు - పూలుగ మారున్

    రిప్లయితొలగించండి
  22. 05)

    జవ్వని కోసెను , పువ్వులు
    పువ్వులతో నమ్మవారి - పూజల కొరకై
    పువ్వుల పూజను జేసిన
    పువ్వులు రాళ్ళగును రాళ్ళు - పూలుగ మారున్

    రిప్లయితొలగించండి
  23. 06)

    అవ్వల కయ్యము నెవ్వడు
    చివ్వున చేరిన గృహమును - చిరాకు తోడన్
    మవ్వపు పిల్లల గనుగొన
    పువ్వులు రాళ్ళగును రాళ్ళు - పూలుగ మారున్

    రిప్లయితొలగించండి
  24. 07)

    నొవ్విన కష్టము పోవును
    దవ్వున దేవాలయమును - దర్శించినచో
    నివ్వాళి నొసంగ సాయికి
    పువ్వులు రాళ్ళగును రాళ్ళు - పూలుగ మారున్

    రిప్లయితొలగించండి
  25. మంద పీతాంబర్ గారూ,
    పద్యం బాగుంది. అభినందనలు.

    నచికేత్ గారూ,
    పూరణ చాలా బాగుంది. అభినందనలు.

    వసంత్ కిశోర్ గారూ,
    అబ్బో! మీ పద్యాల వర్షంలో తడిసి ముద్దయ్యాను. సంతోషం.
    4వ పద్యం మొదటి పాదంలో "నవ్వే నీకును నాకును" అంటే గణదోషం తొలగిపోతుంది.
    6వ పద్యం 2వ పాదంలో "చిరాకు" అని జగణం వేసారు. అక్కడ జగణం రాకూడదు కదా. "చీదర" అంటే ఎలా ఉంటుంది?
    ఇక మిగిలిన పూరణలు సలక్షణంగా, చక్కగా ఉన్నాయి. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  26. మొన్నటి రోజున ఊరికి పోవుట వలన సమస్యను చూడడం కుదర లేదు .నిన్న వచ్చిన తర్వాత పూరించాను గమనించ గలరు.

    నిన్నటి సమస్యకు మరి రెండు పూరణలు

    రివ్వున ఎగిరిన వైయ్యెస్
    నెవ్వడు గూల్చెను వనమున, నెఱుగగ తరమా!
    అవ్వాని మహిమ వలనను,
    పువ్వులు రాళ్లగును,రాళ్ళు పూలుగ మారున్!

    ( వైయ్యెస్= Y S రాజశేఖరరెడ్డి గారు)


    నవ్వల పూవులు పూచెను,
    సవ్వడి సర్కారు చేయ,సభలో మాయల్
    గవ్వలు గువ్వలు కాగా ,
    పువ్వులు రాళ్లగును,రాళ్ళు పూలుగ మారున్!

    ( సర్కారు = P C సర్కార్ ,ప్రసిద్ద ఇంద్రజాలికుడు )

    రిప్లయితొలగించండి
  27. పువ్వుల కాశ్మీరు ప్రజలు,
    కవ్వించగ పొరుగు వారు కబళించుటకై,
    రువ్వగ రాళ్ళు హితులపై,
    పువ్వులు రాళ్ళగును, రాళ్ళు పూలుగ మారున్

    ...భారత సైన్యముపై రువ్విన రాళ్ళు పాకిస్తాను సైన్యమునకు పూవులుగ మారునని...

    రిప్లయితొలగించండి
  28. నవ్వులలో బోర్లబడుచు
    సవ్వడి లేనట్టి ముసలి శషభిషలందున్
    కవ్వించు సరసములలో
    పువ్వులు రాళ్ళగును, రాళ్ళు పూలుగ మారున్

    రిప్లయితొలగించండి