28, డిసెంబర్ 2010, మంగళవారం

సమస్యా పూరణం - 183 (కారము లేనట్టి కూర)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ......
కారము లేనట్టి కూరఁ గాంతుఁడు మెచ్చెన్.

36 కామెంట్‌లు:

  1. అందరికీ వందనములు.
    ______________________________________

    01)
    మారాము జేయ కుండగ
    కూరిమితో వండె నామె - కాకర గూరన్!
    కూరను భుజించి , మిక్కిలి
    కారము లేనట్టి కూర - గాంతుడు మెచ్చెన్.
    _______________________________________

    రిప్లయితొలగించండి
  2. వసంత్ కిశోర్ గారూ,
    మీ మొదటి వాయిదా పద్యం చేరింది. బాగుంది. అభినందనలు.
    అందరు భర్తలు కారం ఎక్కువ కాకుండ వండిన కూరను మెచ్చుకుంటారు. కాని నాకు "లో-బీపీ". నేను మాత్రం ఉప్పు, కారం, మసాలాలు ఎక్కువగా ఉండే కూరనే మెచ్చుతాను :-)

    రిప్లయితొలగించండి
  3. తీరైన రోగములచే
    పోరాడెను సాహసించి, ప్రొద్దున మాపున్,
    ఆరోగ్యమునకు ఉప్పున్
    కారము లేనట్టి కూర గాంతుడు మెచ్చన్!

    రిప్లయితొలగించండి
  4. వేరింటి కాపురమ్మున
    తీరంగను గోడలత్త తెగవను తగవుల్
    మారుండు మధువు లొలికినొ
    కారము లేనట్టి కూరఁ గాంతుఁడు మెచ్చెన్ !!!

    రిప్లయితొలగించండి
  5. గురువుగారి లాగే నాకు కూడా కారం, ఉప్పు పడాలి. కారము లేని కూరపై పద్యము వ్రాయడానికి మన్మధుడు అవసర మయ్యాడు.అది తినడానికి ఇంకెవరో సాయము చెయ్యలి. అదృష్టముగా నా బిపి కూడా తక్కువే .

    రిప్లయితొలగించండి
  6. మరిమాసాంతంబగుటన్
    సరితూగెడునూనెనింటసతితాగనదో
    త్వరయో,తైలాధికసం
    స్కారములేనట్టి కూరఁ గాంతుఁడు మెచ్చెన్ !!!

    [సతితాగనదో తా గనదో అని విరుపు; తాగనదో కాదు :) ]

    రిప్లయితొలగించండి
  7. వేరొకరొండిన యుప్పూ
    కారము లేనట్టి కూరఁ గాంతుఁడు మెచ్చెన్
    పోరుకుఁ దలపడి సతితో;
    సారమునెఱుఁగడరసికుఁడు సంగతిఁ గనఁడే!.

    రిప్లయితొలగించండి
  8. మార శర జాత కీలల ,
    కూరిమి చెలి పయ్యెద జత కుంపటి సెగలన్
    తీరుగ వండిన సురత వి
    కారము లేనట్టి కూర గాంతుడు మెచ్చెన్ .

    - వెంకట రాజా రావు . లక్కాకుల .
    బ్లాగు :సుజన-సృజన

    రిప్లయితొలగించండి
  9. భారము నాయెను పధ్యము
    కారణమడుగగ-నలుగురు గాకుల రీతిన్
    బోరగ; చివరకు కినుకన్,
    కారము లేనట్టి కూర గాంతుడు మెచ్చెన్!

    రిప్లయితొలగించండి
  10. కోరిన పడతుల చేతలు
    నేరము లైనను సరసపు నీతిగ దోచున్
    కోరిక మెయి దహియింపగ
    కారము లేనట్టి కూర గాంతుడు మెచ్చెన్

    రిప్లయితొలగించండి
  11. చాలా బాగున్నయ్యండి:)
    కాంపుల్లో ఈ కాటరింగ్ భోజనాల్లో, హోటల్లలొ వందల కొద్ది పిండి వంటలు వెరైటీల పేరుతో చెత్త తిని, ఊరికే పోపులో వేసిన వికారము లేని కూర కాంతుడు మెచ్చెన్ అని అర్ధంలో రాయాలని ఊహ వచ్చింది కానీ చందస్సు, మాటలు కరువు. కొంచెం గురువుగారో శిష్యులో సహాయంచెయ్యరూ..

    రిప్లయితొలగించండి
  12. (contd...)
    అంటే అంతకు ముందు వెరైటీ గా వంట చెయ్యలేవని విసుక్కొనే మోడరన్ భర్త అన్నమాట:)

    రిప్లయితొలగించండి
  13. మైత్రేయి గారు,

    మీ భావానికి ఇది సరిపోయిందేమో చూడండి.

    వారము రొజులు క్యాంపున
    ఘోరమగు వెతలు పడగను కూడుకు కరువై
    వారము చివరన ఇంట వి
    కారము లేనట్టి కూర గాంతుడు మెచ్చెన్

    రిప్లయితొలగించండి
  14. మైత్రేయి గార్కి! మరో శిష్యుని పూరణ కూడా చూడండి.

    జోరగు వెరైటి వంటలు,
    భారమగు మెనూల చెత్త బాపురె క్యాంపుల్!
    తీరెను తిక్కలు! కమ్మగ
    కారము లేనట్టి కూరఁ గాంతుఁడు మెచ్చెన్.

    రిప్లయితొలగించండి
  15. శ్రీ " రామ " ల దయ చేతను
    నారూఢిగ " పతి జనమ్ము " లౌరా ! యనగా
    నోరూరగ ,చవులు పుట్టి
    కారము లేనట్టి కూర గాంతుడు మెచ్చెన్
    - వెంకట రాజా రావు .లక్కాకుల
    బ్లాగు :సుజన-సృజన

    రిప్లయితొలగించండి
  16. వేరుగ కాపుర ముండగ
    చారయినను చేయరాని సతివండన్ తా
    కూరిమి మీరిన వాడై
    కారము లేనట్టి కూర కాంతుడు మెచ్చెన్

    రిప్లయితొలగించండి
  17. బారుల తిరెగెడి భర్తకు
    చారెయని కాచి యిచ్చె సతి క్రోదమునన్ !
    బీరనుకుని త్రాగె భర్త
    కారము లేనట్టి కూరఁ గాంతుఁడు మెచ్చెన్ !

    రిప్లయితొలగించండి
  18. మంద పీతాంబర్ గారూ,
    రోగ పీడితులు ఉప్పూ కారం లేని కూరనే ఇష్టపడతారని చక్కగా పూరించారు. బాగుంది. అభినందనలు.
    "తీరైన" రోగాలా? "తీరని రోగమ్ములతో" అంటే ఎలా ఉంటుంది?
    "ప్రొద్దున మాపున్" ను "ప్రొద్దును మాపున్" అనాలనుకుంటాను.

    గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
    కంతుడు మధువు లొలికిస్తుంటే కొత్తగా వేరింటి కాపురం పెట్టిన భార్య ఎలా వండినా కాంతుడు మెచ్చక చస్తాడా? బాగుంది పూరణ. అభినందనలు.
    "అదృష్టముగా నా బిపి కూడా తక్కువే" అన్నారు. నేనూ అలాగే భావించి హై బీ పీ తో ఉప్పూ కారాలు తక్కువగా తినే బంధు మిత్రులను చూసి జాలి పడుతూ ఉంటాను. అయితే కొందరు హై బి పి కంటే లో బి పి "డేంజరస్" అంటారు. నిజమేదో డాక్టరుగా మీరే చెప్పాలి.

    ఊకదంపుడు గారూ,
    తక్కువ నూనెతో వండిన కూరతో మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
    "సతి తాఁ గనదో" అని అరసున్నా చేరిస్తే అపార్థం తొలగిపోతుంది.

    రవి గారూ,
    పొరుగింటి పుల్లకూర సామెతతో చక్కని పూరణ నిచ్చారు. బాగుంది. అభినందనలు.

    లక్కాకుల వెంకట రాజారావు గారూ,
    సురత వికారము లేని "ఆ" కూరను ఏ పతి మెచ్చడు? కారాన్ని రతి మమకారంగా మార్చారు. అభినందనలు.
    ప్రశస్తమైన పద్యానికి మీ పేరడీ చాలా బాగుంది. సంతోషం. అభినందనలు.

    టేకుమళ్ళ వెంకటప్పయ్య గారూ,
    పథ్య పీడితును అవస్థను వివరిస్తూ చక్కగా పూరించారు. అభినందనలు.

    హరి గారూ,
    మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
    కూరిమి గల దినములలో
    నేరము లెన్నడును గలుగ నేరవు నిజమే
    కోరిన సతి వండినచో
    కారము లేకున్న గాని "కతికెదము" హరీ!

    మైత్రేయి గారూ,
    ధన్యవాదాలు.
    మీ భావానికి హరి గారు, మిస్సన్న గారు చక్కని పద్య రూపాలనిచ్చారు. చూడండి.

    హరి గారూ,
    మిస్సన్న గారూ,
    మైత్రేయి గారి భావానికి చక్కని పద్య రూపాన్నిచ్చి నాకు శ్రమ తగ్గించారు. ధన్యవాదాలు.

    డి. నిరంజన్ కుమార్ గారూ,
    కొత్తగా వేరు కాపురం పెట్టినప్పుడు భార్య ఎలా వండినా బాగానే ఉంటుంది. చక్కని పూరణ నందించారు. అభినందనలు.

    రాజేశ్వరి నేదునూరి గారూ,
    పద్యం నిర్దోషంగా ఉంది. పూరణలో చమత్కారమూ ఉంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  19. _______________________________________
    02)
    మంచితనము హెచ్చు ! - మమకారములు పెచ్చు !
    మగని తలపు నెరిగి - మగుడు నామె !
    కరుణ మమత తప్ప - గర్వము లేనట్టి
    నాతి యామె ! చుప్ప - నాతి గాదు !
    సొగసు , సోయగములు - ఇంపు సొంపామెకు
    ఇతర మెరుగ దామె - పతిని దప్ప
    సుగుణ , వినయములను - సమకూర నందము
    కమల నయన మెచ్చె - కాంతు డంత.
    ____________________________________

    రిప్లయితొలగించండి
  20. గురువు గారూ ధన్యవాదములు. రక్తస్రావము వలన కాని, శరీరంలో ద్రవ నష్టమువలన కాని లేక సూక్ష్మాంగ జీవుల వల వచ్చే వ్యాధుల వలన, హృద్రోగము వల కాని బిపి తగ్గిపోతే ప్రమాదము కాని అనారోగ్యము లేకుండామామూలుగా ఉన్నప్పుడు లోబిపి వలన నష్టము ఏమీ లేదండీ.పై సందర్భాలలో రక్తము, ద్రవాలు ( సెలైను ) మందులు యిచ్చి బిపిని మామూలు పరిమితికి తీసుకు రావాలి.

    కూరలో కారము తక్కువయితే నాకు నీరసము వచ్చి బిపి యింకా పడిపోతుంది.

    రిప్లయితొలగించండి
  21. గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
    హమ్మయ్య! ధైర్యం వచ్చింది. వివరాలు తెలిపినందుకు ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  22. వసంత్ కిశోర్ గారూ,
    పద్యాలు బాగున్నాయి. కాకపోతే కొన్ని లోపాలున్నాయి. నా సవరణలు ......
    మొదటి పద్యం రెండవ పాదం "మగని తలఁపు నెఱిఁగి మసలు నామె" అంటే బాగుంటుంది.
    రెండవ పద్యం 1వ, 3వ పాదాలలో యతి తప్పింది.
    సొగసు సోయగములు సొంపారు కులుకుల
    నితర మెఱుఁగ దామె పతిని దప్ప
    సుగుణ వినయములను చొక్కమై యుండెడి
    కమల నయన మెచ్చె కాంతుఁ డంత.

    రిప్లయితొలగించండి
  23. రాజేశ్వరి నేదునూరి గారూ,
    "బీరనుకుని త్రాగె భర్త"
    అన్నప్పుడు బేసి గణం జగణమౌతుందండీ - త్రాగెపతియె అంటే బావుంటుంది.
    నమస్కారములతో
    ఊకదంపుడు

    రిప్లయితొలగించండి
  24. హరి గారు, మిస్సన్న గారు, నా విన్నపం మన్నించినందుకు ధన్యవాదాలు.
    చిన్నగా మొదలు పెట్టాలని పిస్తోంది. ముందుగా చదవటం, నేర్చుకోవటం తో మొదలు పెడతాను.

    రిప్లయితొలగించండి
  25. శంకరార్యా!

    మీ
    సవరణలకు
    సలహాలకూ
    కడుంగడు ధన్యవాదములు.
    నా పద్యములు మీ సవరణతో
    అందమును సంతరించు కొన్నవి

    కాని నేను పై సమస్యను ముక్కలు చేసి
    దత్తపది వలె పూరించుటకు
    ప్రథమ ప్రయత్నము జేసితిని.

    2 వ పద్యము 3 వ పాదములో "కూర " నిరికించవలె.
    కావున ఇలా చేస్తే ఎలా ఉంటుంది?

    " సరస , వినయములను - సమకూర నందము "

    రిప్లయితొలగించండి
  26. శంకరార్యా!నా విన్నపము(స.పూ-183)
    నొకపరి
    గమనించ గలరు.

    రిప్లయితొలగించండి
  27. వసంత్ కిశోర్ గారూ,
    మీరేదో భావ కవిత వ్రాసారనుకున్నా. అది దత్తపది అని చిన్న సూచన ఇస్తే నా సమీక్ష మరో రకంగా ఉండి మీ పూరణను ప్రశంసించే వాణ్ణి. బాగుంది. ఇలా కూడా సమస్యను పూరంచవచ్చని ఒక కొత్త దారి చూపారు. సెహబాస్!
    ఇక మీరు సూచించన సవరణ బాగుంది.

    రిప్లయితొలగించండి
  28. చేరగనత్తా మామలు
    వారికి వలసిన విధముగ వంటలు చేసెన్
    వేరుగ తీసెను మామకు
    కారము లేనట్టి కూరఁ; గాంతుఁడు మెచ్చెన్ !

    రిప్లయితొలగించండి
  29. శాస్త్రీజీ ! మామకు కారము లేనట్టి కూర ! బావుంది !

    రిప్లయితొలగించండి
  30. కిశోర్ జీ ! నా కారము లేని కూర మీకు నచ్చినందులకు ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  31. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    బాగుంది మీ పూరణ. అత్తామామల పట్ల అంతటి శ్రద్ధ చూపించే కాంతను కాంతుడు తప్పక మెచ్చుకుంటాడు. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  32. భారముగ మిరపల ధరలు
    నోరూరగ తగ్గినవని నూరుచు హద్దుల్
    మీరుచు వేయక హాహా
    కారము లేనట్టి కూరఁ గాంతుఁడు మెచ్చెన్

    రిప్లయితొలగించండి


  33. ఓరయ్యో నామగడా
    నీ రతిని జిలేబిని యివి నీకై యనగా
    సారము లేనట్టి రసము
    కారము లేనట్టి కూరఁ గాంతుఁడు మెచ్చెన్.

    జిలేబి

    రిప్లయితొలగించండి
  34. మీరిన కన్నీళ్ళు కురిసి
    ఘోరముగా నోటి పుండ్లు గుండును బాదన్
    కోరిక తీరగ మిరపల్
    కారము లేనట్టి కూరఁ గాంతుఁడు మెచ్చెన్

    రిప్లయితొలగించండి