30, డిసెంబర్ 2010, గురువారం

సమస్యా పూరణం - 185 (కష్టములు దీర)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ......
కష్టములు దీరఁ గన్నీరుఁ గార్చినారు.
ఈ సమస్యము సూచించిన `చంద్రశేఖర్` గారికి ధన్యవాదాలు..

18 కామెంట్‌లు:

  1. శంకరార్యా!
    బేసి గణము
    "జ" గణ మై నటులున్నది.

    రిప్లయితొలగించండి
  2. వసంత్ కిశోర్ గారూ,
    అది తేటగీతి పాదం. జగణం లేదు.
    కష్ట - ములుదీర - గన్నీరు - గార్చి - నారు
    హ - సల - త - హ - హ
    ఒక సూర్య గణం - రెండు ఇంద్ర గణాలు - రెండు సూర్య గణాలు.

    రిప్లయితొలగించండి
  3. పేద యింటిలో పుట్టిన బీద వాడు
    దృష్టి పెట్టెను పుష్టిపై నిష్ఠ తోడ,
    ముష్టి ఘాతపు పోటిలో ఫస్టు రాగ
    కష్ట ములు దీర గన్నీరు గార్చి నారు!

    రిప్లయితొలగించండి
  4. విజయ లక్ష్మి తము వరింప వినయ వృత్తి
    పాండునందన లెంతయొ నిండు మదిని
    సంతసము నొంది, పరితాప చింతు లైరి
    కష్టములు దీరఁ గన్నీరుఁ గార్చి నారు!

    రిప్లయితొలగించండి
  5. నవ్వినా యేడ్చినా నయనాల వెంట
    కారు కన్నీరు కనలేము కారణములు
    శ్రమకు ఫలితంబు చేకూర రైతులెల్ల
    కష్టములు దీరఁ గన్నీరుఁ గార్చినారు

    రిప్లయితొలగించండి
  6. 1)
    రెండు రూపాయలకునిన్ని తండులములు
    చౌకగా నేతబట్టలు, కోకలొసగ
    తెలుగు ఆడపడుచులకుఁ దిక్కయి,తమ
    కష్టములు దీరఁ గన్నీరుఁ గార్చినారు.

    2)
    లోహవిహగముఁముష్కరలెగొనిపోయి
    నందునున్నవారలబట్టి హడలగొట్ట
    ప్రభుత యెటులొజేసి విడిపింపగను తుదకు;
    కష్టములు దీరఁ గన్నీరుఁ గార్చినారు.

    3)
    "చిలి"న బంగారు గనులందు చిక్కినారు
    రెండు నెలలపైనగడిపి ఎండినారు
    అప్రమత్తమైన ప్రభుత ఆదుకొనగ
    కష్టములు దీరఁ గన్నీరుఁ గార్చినారు.

    రిప్లయితొలగించండి
  7. శంకరుని శీర్ష మందున్న చంద్ర వంక !
    ఏల నవ్వేవు ? గణపన్న కేలి చలువ
    జనుల సంతోష భాష్పాలు గనుము వారి
    కష్టములు దీరి కన్నీరు గార్చినారు

    -వెంకట రాజా రావు.లక్కాకుల
    బ్లాగు టైటిల్:సుజన-సృజన

    రిప్లయితొలగించండి
  8. హితు లారా !జిత జీవన
    గతు లారా !సతి సుత శుభ కర కృతు లారా !
    స్తుతి మతు లారా !కవితా
    మృత పాన సతత విహార మిత్రము లారా !

    శుభ కరుడు నవ వసంతుం
    డభయ ప్రదాత యగుగాత !నాద్యంతము వ
    ల్లభులకు సతులకు సుతులకు
    విభవమ్ములు గూర్చిమిగుల వెలుగులు గలుగన్

    రిప్లయితొలగించండి
  9. భరత ఖండంబు చక్కని పాడియావు
    తెల్లవారు పాలఁ బితికి గుల్ల జేయ
    వగచి, స్వాతంత్రమును పొంది ప్రజలు తుదకు
    కష్టములు దీరఁ గన్నీరుఁ గార్చినారు.

    రిప్లయితొలగించండి
  10. పచ్చగున్న పరులఁ జూచి మెచ్చ లేక
    పీత బుద్ది తో కుజనులు పీకులాడు,
    దైవ ఘటన చేత పరులు ధనమునొంది
    కష్టములు దీరఁ గన్నీరుఁ గార్చినారు.

    రిప్లయితొలగించండి
  11. శంకరార్యా ! మన్నింపుడు.
    ఉదయము నుండీ ఊరిలోలేను.
    ఇప్పుడే వచ్చి నే జేసిన దప్పిదము తెలుసుకొంటిని.

    ఉదయమున ఊరి కెళ్ళే తొందర
    చోదకు డొచ్చియుండె ఇంటి ముందర
    మీ సవరణలో మాయమైన "కూర"
    దానినెట్లు తిరిగి "సమకూర"
    పరచవలె ననెడు మెర మెర
    కళ్ళ ముందు "కష్టములుదీర"(185)
    బుర్రలో " కారము లేనట్టి కూర "(183)
    పరిశ్రమ,జేసితి "స-పూర"
    దత్తపదిగ మార్చి కూరి(చి)
    గురువు మెచ్చలేదని విరవిర
    వెరసి జరిగెను దబ్బర?!!!

    చూచితి నెన్నొ మార్లు
    ఒకటికి పది సార్లు
    అయిననూ దొర్లె!
    నను క్షమించగల్రు(గలరు)

    విఙ్ఞులందరూ నా
    అఙ్ఞతను క్షమింపుడని
    విఙ్ఞప్తి.

    రిప్లయితొలగించండి
  12. శంకరార్యా!
    ఈ క్రింది లక్షణ పద్యమును
    మరువలేదని చెప్పుట కొరకై
    వొప్ప జెప్పు చుంటిని.

    ఇనగణ త్రయంబు - నింద్ర ద్వయంబును
    హంస పంచకంబు - నాట వెలది
    సూర్యుడొక్కరుండు - సురరాజు లిద్దరు
    దినకర ద్వయంబు - దేట గీతి

    ఇంపోజిషను వ్రాయ మందురా!

    అయినను ఉదయమేదో భ్రమ,
    చిత్త భ్రమ కలిగినది
    మరొక మారు
    మన్నింప వేడు కొందు.

    రిప్లయితొలగించండి
  13. సదస్యులందరికీ
    శుభాభినందన
    వందనములు.
    అందరి పూరణలూ
    అబ్బుర పరచు చున్నవి.

    ఎల్లరకూ నూతన
    వసంతా గమన
    సమయమున
    శుభాకాంక్షలు.

    రిప్లయితొలగించండి
  14. శంకరార్యా!
    01)
    ప్రాసయతి కి
    ప్రాస నియమములు వర్తించునా ? లేక
    యతి నియమములు వర్తించునా ?
    02)
    యతి స్థానమందు గాని ,యతి మైత్రీ స్థానమందుగాని
    ఒండొకచో రెండింటి యందు గాని సంధి జరిగినపుడు
    యతి గూర్పు,టెటుల?
    వీలు వెంబడి వివరించ గలరు.

    రిప్లయితొలగించండి
  15. ఇష్ట దేవుని పూజించె నిష్ట గాను
    దుష్ట దురితము లెటులైన దూరమవగ
    భక్తి మెచ్చిన పరమేశు శక్తి నిచ్చె
    కష్టములు దీరఁ గన్నీరుఁ గార్చి నారు !

    రిప్లయితొలగించండి
  16. మంద పీతాంబర్ గారూ,
    బాగుంది మీ పద్యం. అభినందనలు.
    కాని సమస్య పాదం బహువచనాంతమై ఉంది. మీరేమో పూరణ ఏకవచనాంతంగా చేసారు.

    గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
    మంచి విషయాన్నే ఎన్నుకున్నారు. అభినందనలు.
    "నందన లందరు" బదులు "నందను లందరు" ఉండాలనుకుంటా.
    "చింతులు" ప్రయోగం తప్పేమో? "పరితాప వంతులైరి" అంటే ఇలా ఉంటుంది?

    కోడీహళ్ళి మురళీ మోహన్ గారూ,
    పూరణ చాలా బాగుంది. అభినందనలు.

    ఊకదంపుడు గారూ,
    మీ మూడు పూరణలూ మూడు విభిన్నాంశాలతో చాలా బాగున్నాయి. అభినందనలు.
    రెండవ పూరణ మొదటి పాదం యతి తప్పింది.
    "లోహ విహగము ముష్కరుల్ లోగొనంగ/లొంగదీయ" ?

    లక్కాకుల వెంకట రాజారావు గారూ,
    పూరణ బాగుంది. అభినందనలు.
    కవి మిత్రులకు మీరు శుభాకాంక్షలు తెలిపిన పద్యాలు ఆణిముత్యాలే. ధన్యవాదాలు.
    "అభయప్రదాత" అన్నప్పుడు "య" గురువు అవుతుంది. "అభయప్రదు డగును గాత" అంటే సరిపోతుంది.

    జిగురు సత్యనారాయణ గారూ,
    ప్రశస్తమైన పద్యాన్ని గుర్తుకు తెస్తున్న మీ పూరణ బాగుంది. అభినందనలు.

    వసంత్ కిశోర్ గారూ,
    "ప్రమాదో ధీమతామపి"!

    రాజేశ్వరి నేదునూరి గారూ,
    మంచి విషయంతో పూరణ చెప్పారు. బాగుంది. అభినందనలు.
    అది "నిష్ట" కాదు, "నిష్ఠ" ప్రాసయతి తప్పుతుంది.
    "ఇష్ట దేవుని పూజింప నెంతొ భక్తి" అంటే ఎలా ఉంటుంది?

    రిప్లయితొలగించండి
  17. గురువుగారూ, ధన్యవాదములు. నందనులు కి తప్పుగా టైపు చేసాను. తప్పు తర్వాత చూసాను. పరితాప చింతు లైరి నాకు కూడా సరి అనిపించలేదు. మేరేమిటంటారో చూద్దామనుకొన్నాను. పరితాప వంతు లైరి బాగుంది.మీ సూచనకు కృతజ్ఞతలు.

    రిప్లయితొలగించండి
  18. లోహవిహగముఁముష్కరులుగొనిపోయి - అని వ్రాద్దమనుకున్నానండీ - లో కు లు కు ప్రాసవేసి - అచ్చుతప్పు బడింది. మీరు చెప్పిన సవరణలు బాగున్నాయి

    రిప్లయితొలగించండి