13, డిసెంబర్ 2010, సోమవారం

ప్రహేళిక - 32

ఈ పండు ఏది?
ఆ.వె.
ఆకు పచ్చ ఒళ్ళు ,అంత గళ్ళూగళ్ళు
గాంచ దేహ మెల్ల కళ్ళు కళ్ళు
తిన్న వారి నోళ్ళు తీయని వాకిళ్ళు
పండు పేరు జెప్ప రండు!రండు!

మంద పీతాంబర్ గారు ఈ ప్రహేళికను పంపించారు. వారికి ధన్యవాదాలు.

6 కామెంట్‌లు:

  1. రాజేశ్వరి నేదునూరి గారూ,
    అజ్ఞాత గారూ,
    మీ సమాధానాలు కరెక్టే.
    "సీతాఫలం" అని వ్యవహారంలో ఉన్నా నిజానికి అది "శీత ఫలం". నాకెంతో ఇష్టమైన ఫలం అది. దాని గుణదోషాలు తెలుసుకొందామని "వస్తుగుణదీపిక"లో వెదికితే "సీతాఫలం" దొరకలేదు. తీరా చూస్తే "శీత ఫలం"లో దొరికింది. అప్పుడు తెలిసింది దాని అసలు పేరు. "పర్యాయ పద నిఘంటువు"లో దానికి ఉన్న పర్యాయ పదాలు .... అత్తి, అపుష్పం, ఉదుంబరం, కాంచనం, కాలస్కంధం, క్షీరవృక్షం, జంతుఫలం, పవిత్రకం, పుష్పశూన్యం, బ్రహ్మవృక్షం, మశకి, మేడి, యక్షఫలం, యజ్ఞయోగ్యం, యజ్ఞవృక్షం, యజ్ఞాంగం,యజ్ఞీయం, శీతఫలం, శ్వేతవల్కం, సదాఫలం, హేమదుగ్ధకం, హేమదుగ్ధి.
    "శబ్దార్థ చంద్రిక"లో మాత్రం "సీతాఫలం" ఉంది.

    రిప్లయితొలగించండి
  2. మంత్రిప్రగడ వేంకట బాలసుబ్రహ్మణ్యంమంగళవారం, డిసెంబర్ 14, 2010 9:41:00 AM

    గురువు గారూ,
    "శీత ఫలం" విశేషాలు తెలియజేసినందుకు కృతజ్ఞతలు.
    ఇలాగే ఇంకా ఇంకా మీ నుంచి నేర్చుకోవాలని ఆశిస్తూ...
    - మంత్రిప్రగడ వేంకట బాలసుబ్రహ్మణ్యం

    రిప్లయితొలగించండి
  3. ప్రహేళికను ప్రకటించిన గురువు శ్రీ శంకరయ్య గారికి,పాల్గొన్న విజ్ఞులకు ధన్యవాదాలు.
    అమ్మొ!సీతాఫలానికెన్నిపేర్లో?

    రిప్లయితొలగించండి
  4. సోదరు లందరికి నమస్కారములు.
    ప్రహేళికను అందించిన పీతాంబర్ గారికి , గురువు గారు వివరించి సీతాఫల విసిష్టతను తెలియ జెప్పినందుకు ధన్య వాదములు.అజ్ఞాత గారికి అభినందనలు. ఇంత మంచి పండితుల మధ్య కు నేను అడిగిడ గలగటం నా పూర్వ జన్మ సుకృతం .నా అదృష్టం . నిజమె ! సీతా ఫలానికి ఇన్ని పేర్లా ?

    రిప్లయితొలగించండి