1, జనవరి 2011, శనివారం

సమస్యా పూరణం - 187 (నూతన సంవత్సరమున)

కవి మిత్రులారా,
అందరికీ నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు.
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ......
నూతన సంవత్సరమున నూటికి నూఱే.

30 కామెంట్‌లు:

  1. గురువుగారికీ, మిత్రులకూ హూణ సంవత్సరాది శుభాకాంక్షలు.

    విష్యూ హేపీ న్యూ యియ
    రిష్యూ సాల్విల్ బిసాల్వు డెర్లీ దిసియర్!
    బీష్యూర్ టూసిట్,చాట్ అండ్
    కేష్యూస్ క్రంచింగు, ఫ్రండు! కంఫర్ టబ్లీ !

    (wish you happy new year
    issues all will be solved early this year
    be sure to sit chat and
    cashews crunching friend comfortably.)

    రిప్లయితొలగించండి
  2. పద్యంలో తప్పును సవరించు కొన్నాను. క్షంతవ్యుణ్ణి.
    సవరించిన పద్యం.

    విష్యూ హ్యాపీ న్యూ యియ
    రిష్యూ సాల్విల్ బిసాల్వు డెర్లీ దిసియర్!
    బీష్యూర్ టూసిట్,చాట్ అండ్
    క్యాష్యూస్ క్రంచింగు, ఫ్రండు! కంఫర్ టబ్లీ !

    రిప్లయితొలగించండి
  3. శంకరు సిగపై పలునెల
    వంకలు జేరెను కవితల వంకల శంకల్
    పంకజ భవుడై దీర్చెను
    అంకమునన్ జేర్చి గురువు అలసట లేకన్!

    శంకరయ్య గురువు శంకరా భరణమ్ము
    వేది కయ్యె పరమ వెడు కయ్యె!
    కవులు పండితులకు కమ్మని విందయ్యె
    కవుల చెలిమి గొప్ప కానుకయ్యె !


    క్రొత్త వత్సరమ్ము కోటి శుభాలిమ్ము !
    శాంతి నిమ్ము నూత్న కాంతి నిమ్ము !
    సత్య వాక్కు నిమ్ము సహనశీలత నిమ్ము !
    సర్వ జనుల కెల్ల సౌఖ్య మిమ్ము!

    శ్రీ శంకరయ్య గారికి,నూతన ఆంగ్ల వత్సరానికి ఆంగ్లంలోనే తెలుగు బాణిలో గ్రీటింగ్స్ చెప్పిన మిస్సన్న గారికి ,పేరు పేరునా మిత్రులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.

    రిప్లయితొలగించండి
  4. గురువుగారికి, మిత్రులకు నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు.
    మిస్సన్నగారూ ,మంద పీతాంబర్ గారూ చక్కని కవిత లందించారు.ధన్యవాదములు

    నేతల రీతులు మారునె
    చేతలు శూన్యంబు గాని చేతురు బాసల్
    కోతల శాతము చూతురు
    నూతన సంవత్సరమున నూటికి నూఱే!!

    రిప్లయితొలగించండి
  5. శ్రీ తిరుపతి వేంకన మన
    చేతమ్మున కొలువుదీరి చేకూర్చుత సం
    ప్రీతిగ సమ్ముద శాతము
    నూతన సంవత్సరమున నూటికి నూఱే!!!

    కవి పండితులైన కంది శంకరయ్య గారికీ , యితర కవీంద్రులందరికీ నూతనాంగ్ల సంవత్సర శుభాకాంక్షలు.......

    రిప్లయితొలగించండి
  6. కోతలు కోయుట మానిన ,
    నీతిని పాటించి జనిన, నిర్మల మతితో
    చేతలలో పని జూపిన,
    నూతన సంవత్సరమున నూటికి నూఱె!

    రిప్లయితొలగించండి
  7. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.
    ______________________________________

    01)
    భూతల మంతయు నేడిదె
    నాతురతన్ , జరుపు కొందు - రన్యోన్యముగా
    మాతా మేరీ కరుణను
    నూతన సంవత్సరమున నూటికి నూఱే.
    _____________________________________

    రిప్లయితొలగించండి
  8. విద్యాసాగర్ అందవోలు.శనివారం, జనవరి 01, 2011 12:14:00 PM

    శంకరయ్య గారికి, తమ అద్భతమైన పూరణల తో అలరిస్తున్న కవి మిత్రులందరికీ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు.
    మీ అందరి పూరణలు చాలా బాగుంటున్నాయి,
    నేను ప్రతి సమస్య కీ పూరణ పంప లేక పోయినా, మీ అందరి పద్యాల స్ఫూర్తి తో కృషి చేస్తున్నాను.
    త్వరలో మీ స్థాయి కి రాగలనని ఆశిర్వదించండి.
    నా పూరణ:
    నేతలు కోతలు మానిక
    చేతల తోడ ప్రజల కతి చేరువయైనన్
    రాతలు మారును మనవిక
    నూతన సంవత్సరమున నూటికి నూరే.

    విద్యాసాగర్ అందవోలు.

    రిప్లయితొలగించండి
  9. మిస్సన్న మహాశయులకు విష్షులు.(wishes)
    మహ చిత్రమైన పూరణ మీది.

    పీతాంబర ధరునికి
    ప్రణామములు.
    కోటి శుభములు
    చేకూర్చ వలెనని
    కోరు కొనెడి మీ
    యాకాంక్ష
    కొనియాడ దగినది.
    మీ పూరణ లోని కోరిక
    నెరవేరవలెనని కోరుకుందాం.

    మూర్తిగారికి మనస్కార
    నమస్కారములు.
    కోతల శాతం
    కొంత కుదిస్తే బాగుండేది!
    నూటికి నూరు శాతం చేసేసారు.
    నేతలెవరైనా చూస్తే మరీ ప్రమాదం గదూ!!!

    విష్ణు నందనులకు వందనములు.
    మీ పూరణ తో
    కొండలలో నెలకొన్న
    కోనేటి రాయుణ్ణే
    కిందకు దించేసారు
    మన కోసం!సంతోషం!

    విద్యాసాగర్ గారికి స్వాగత సుమాంజలి!
    మీ పూరణ లోని కాంక్ష సాకారమైతే !
    అంతకన్నా కావలసిన దేముంటుంది!

    రిప్లయితొలగించండి
  10. సాహితీ మిత్రులారా,
    మీకూ, మీ కుటుంబానికీ నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు.
    - మంత్రిప్రగడ వేంకట బాలసుబ్రహ్మణ్యం & కుటుంబం

    రిప్లయితొలగించండి
  11. మా తెలుగు తల్లి పదముల
    జేతుముగా పూజ లిడుచు సిరిమల్లెలలున్
    మా తల్లి పదము లిచ్చును
    నూతన సంవత్సరమున నూటికి నూఱే !!!

    రిప్లయితొలగించండి
  12. మిత్రులందఱూ కోరిన మంచి కోరికలన్నీ తీరాలని అందఱికీ వారి వారి కుటుంబాలకు సకల శుభములు చేకూరాలని మరోసారి భగవంతునికి ప్రార్ధనలు.

    కిశోర్ జీ, నేతల కోతల శాతమేమాత్రము కోసీనా వారికి పై అవకాశాలు శున్యమయిపోతాయి.

    రిప్లయితొలగించండి
  13. మిస్సన్న గారూ,
    ధన్యవాదాలు.
    ఇంగ్లీషులో ఇతర కవులు చెప్పిన కొన్ని కందపద్యాలను ఇంతకుముందు చదివాను. కాని ఇంత సలక్షణంగా, నిర్దోషంగా వ్రాసి మెప్పించడం మీకే చెల్లింది. అలాంటిది కనీసం ఆటవెలదిలోనైనా (ప్రాస బాధ ఉండదు కదా) వ్రాద్దామని విఫల ప్రయత్నం చేసాను. మీ ప్రతిభకు జోహార్లు.

    మంద పీతాంబర్ గారూ,
    ధన్యవాదాలు. నన్ను మునగచెట్టు ఎక్కిస్తున్నారు.
    మీ పూరణ స్ఫుర్తిదాయకంగా ఉంది. అభినందనలు.

    గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
    ఈ యేడూ 100% కోతలేనా :-) మీ రెండు పూరణలూ బాగున్నాయి. అభినందనలు.
    కవి మిత్రుల పూరణలను ప్రశంసించినందుకు సంతోషం.

    డా. విష్ణు నందన్ గారూ,
    మీ పూరణ "సమ్ముద"దాయకం. ధన్యవాదాలు.

    వసంత్ కిశోర్ గారూ,
    బాగుంది పూరణ. మీ పద్యం మిస్సమ్మ చిత్రంలో నాకిష్టమైన "కరుణించు మేరి మాతా" పాటను గుర్తుకు తెచ్చింది. ధన్యవాదాలు.
    పేరు పేరునా కవిమిత్రుల పూరణలను ప్రశంసించడం అభినందనీయం.

    విద్యాసాగర్ అందవోలు గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు. మీరు సంకోచించకుండా పద్యాలు వ్రాయడం కొనసాగించండి.
    "మాని + ఇక = మాని యిక అని యడాగమం వస్తుంది. అక్కడ సంధి లేదు.
    "నేత లిక మాని కోతలు" అంటే సరిపోతుంది.

    మంత్రిప్రగడ వేంకట బాలసుబ్రహ్మణ్యం గారూ,
    ధన్యవాదాలు. మీకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు.

    రిప్లయితొలగించండి
  14. శంకరయ్య గారూ,
    నా పద్యాన్ని సవరించినందుకు ధన్యవాదాలు,
    యతి, ప్రాసల మీద కొంచం అవగాహన వొచ్చింది కాని, వ్యాకరణం మీద దృష్టి పెట్టాలనమాట,
    మీ ప్రోత్సాహానికి ఎంతో కృతజ్ఞుడిని
    విద్యాసాగర్.

    రిప్లయితొలగించండి
  15. గురువు గారూ మీ ప్రశంసలకు శతథా కృతఙ్ఞుణ్ణి.
    మీరు ఇంగ్లీషులో పద్యం వ్రాయలేరంటే నేను నమ్మను.
    మీకుండే ఇతరేతర వ్యాపకాల వల్ల ఏకాగ్రత కుదరక పోవచ్చ్చు.
    ఇంతకీ నా యీ ప్రయత్నం ఫలించడానికి మీరు, మీ బ్లాగూ, మన
    మిత్రుల ప్రోత్సాహం, అన్నిటికీ మించి మీ సహృదయతా కారణం.
    నమశ్శతాలు.

    రిప్లయితొలగించండి
  16. వ్రాతలు మారునొ లేదో
    నూతన సంవత్సరమున, నూటికి నూఱే
    వాతలు మిగులునొ రైతుకు
    జాతక మెట్లుండునోయి సన్నుత చరితా!

    రిప్లయితొలగించండి
  17. వెంకట శాస్త్రిఆదివారం, జనవరి 02, 2011 1:05:00 AM

    అందరికీ,
    నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు.
    ఈ శంకరాభరణం బ్లాగ్ లో పూరణలు చదువుంతుంటే చాలా ఆనందంగా, స్ఫూర్తి దాయకంగా ఉంటోంది.
    కవి శ్రేష్టులందరూ గురువుగారి ఆధ్వర్యంలో ఇలాగే చక్కని పూరణలు అందిస్తూ ఉంటారని ఆశిస్తున్నాను.
    నమస్కారములు.
    వెంకట శాస్త్రి

    రిప్లయితొలగించండి
  18. 02)
    ___________________________________
    వేతన జీవుల వెతలును
    రోతలు కలిగించు , నేత -లున్నిద్రులు గాన్
    రైతుల రాతలు , మారిన
    నూతన సంవత్సరమున నూటికి నూఱే.
    ___________________________________

    రిప్లయితొలగించండి
  19. వసంత్ కిశోర్ గారూ,
    మీ రెండవ పూరణ కూడ బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  20. మిస్సన్న గారూ,
    మీ పూరణ ఉత్తమంగా ఉంది. అభినందనలు.
    నేను ఇంగ్లీషులో పద్యం వ్రాయలేక పోవడానికి ముఖ్య కారణం నాకు ఆ భాషలో ప్రావీణ్యం లేకపోవడమే. ఎప్పుడో స్కూల్ ఫైనల్ తో వదలివేసిన భాష! ఎంతైనా తెలుగు పండితుణ్ణి కదా!

    రిప్లయితొలగించండి
  21. ____________________________________
    03)
    జాతకు , లగస్త్య మునికిన్

    భ్రాతలు ! మన నేతలు , గడు , - పాతకు లకటా!

    చేతలు మారిన వీరివి !

    నూతన సంవత్సరమున నూటికి నూఱే.
    ______________________________________

    రిప్లయితొలగించండి
  22. ____________________________________
    04)
    ఘాతముచే పలు రైతుల
    చేతను లగుచున్న , వారు! - చెచ్చెర, వీరి
    న్నీతము నాతము గాచిన!
    నూతన సంవత్సరమున నూటికి నూఱే.
    _____________________________________

    రిప్లయితొలగించండి
  23. __________________________________
    05)
    మాతను, పితరుని , గురువున్
    చేతలలో గొల్తురేని! - స్థిరమగు భక్తిన్
    భ్రాతలు మీ కందరకును
    నూతన సంవత్సరమున నూటికి నూఱే.
    __________________________________

    రిప్లయితొలగించండి
  24. ___________________________________
    06)
    నూతన దంపతు లారా!
    చాతురి , మీ రిద్దరు,కడు - స్వచ్ఛందము గా
    సంతతి మితముం జేసిన
    నూతన సంవత్సరమున నూటికి నూఱే.
    ____________________________________

    రిప్లయితొలగించండి
  25. @ వసంత్ కిశోర్ గారు
    సంతతి మితం చేస్తే కూడా నూరు మంది పిల్లలా???? మరి మితం చేయకుంటే యింకెంతమందంటారూ ?????( సరదాకే లెండి ) ...బాగుంది .....

    రిప్లయితొలగించండి
  26. ______________________________________
    07)
    జోతలు జేయంగా వలె
    మాతకు,తాతకు ! స్వతంత్ర - మహ పోరాటమున్
    స్వంతము మరచిన నేతకు!
    నూతన సంవత్సరమున నూటికి నూఱే.
    _____________________________________

    మాత = భారత మాత
    తాత = గాంధీ తాత
    _____________________________________

    రిప్లయితొలగించండి
  27. అయ్య బాబోయ్!!!!!!!!!!!!!!!!!!

    విష్ణునందనా! సుందరా!

    మీకిలా స్ఫురించిందా !!!???

    కుటుంబ నియంత్రణ పాటిస్తే,
    నూటికి నూరు శాతం
    పిల్లలు కాదు స్వామీ
    దేశానికి శుభములు కలుగును గదా!
    డాక్టరు గారికి తెలియనిదా !
    మీ చమత్కారం గాని!
    కడుంగడు సరసులు మీరు!

    రిప్లయితొలగించండి
  28. కం. ఏతెంచె నవ నసంతము
    సీతాపతి మమ్ము బ్రోచి సిరుల నొసగియు
    న్నాతండిచ్చుత ! శుభములు
    నూతన సంవత్సరమున నూటికి నూరే !

    రిప్లయితొలగించండి
  29. ప్రీతిగ యౌవన మందున
    చేతలు చేసినవి మరచి జేజే లనుచున్
    తాతలు చెప్పెడి నీతులు
    నూతన సంవత్సరమున నూటికి నూఱే

    రిప్లయితొలగించండి