5, నవంబర్ 2013, మంగళవారం

సమస్యాపూరణం - 1226 (దీపము నార్పఁగ గృహమున)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది.....
దీపము నార్పఁగ గృహమునఁ దేజ మ్మెసఁగెన్.
ఈ సమస్యను పంపిన గూడ రఘురామ్ గారికి ధన్యవాదాలు.

35 కామెంట్‌లు:

 1. దీపము బెట్టుచు నిత్యము
  నాపరమేశుని వదలక నర్చన లిడుచున్
  ధూపముతో చెడుశక్తుల
  దీపము నార్పఁగ, గృహమునఁ దేజ మ్మెసఁగెన్.

  రిప్లయితొలగించు
 2. దీప మొకటి నీల కిరణ
  రూపమ్ము విపత్కరమ్ము లోకుల కనుచున్
  జూపుచు శాస్త్రజ్ఞుండా
  దీపము నార్పగ గృహమున తేజమ్మెసగెన్

  రిప్లయితొలగించు
 3. కోపమ్మున నరసింహుని
  రూపమ్మున వచ్చి రుధిర లోచనుఁడగుచున్
  శ్రీపతి వేగమె దితికుల
  దీపము నార్పఁగఁ గృహమున తేజమ్మెసఁగెన్.

  దితికుల దీపము = హిరణ్యకశిపుడు ( నరసింహుడు అని చెప్పుటలో ఈ అర్థము ప్రస్ఫుటము )

  రిప్లయితొలగించు
 4. ఈ పడతి బొమ్మ చీకటి
  లోపల తా వెల్గు చూడు లోనికి రమ్మా
  చూపెద నని తా నొక్కడు
  దీపము నార్పఁగ, గృహమునఁ దేజ మ్మెసఁగెన్.

  రిప్లయితొలగించు
 5. పాపము గదమఱి గుడిలో
  దీపము నార్పగ, గృహమున దేజమ్మెసగన్
  దీపాల వెలుగు లీ నెను
  దీపావళి నాడు మిగుల దేదీ ప్యముగాన్

  రిప్లయితొలగించు
 6. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించు
 7. దీపము సుజ్ఞానమొసగును
  దీపము తిమిరమునుమాపిదీప్తినియిచ్చున్
  కోపము అజ్ఞానములనెడి
  దీపము నార్పగ గృహమున దేజమ్మెసగెన్

  రిప్లయితొలగించు
 8. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించు
 9. దితి = నఱకుడు

  కోపము నసత్య భామయె
  పాపము చెల్లినదియనుచు పట్టెను శరమున్
  శ్రీపతి భళిభళి యనదితి
  దీపము నార్పగ గృహమున దేజ మ్మెసగెన్

  నవంబర్ 05, 2013 10:57 AM

  రిప్లయితొలగించు
 10. పండితనేమానిగారికి పూజ్యులుగురుదేవులు
  శంకరయ్యగారికి వందనములు
  దీప పరబ్రహ్మము తిమి
  రాపహరణ మిచ్చు జ్ఞాన మాముష్మికమున్
  పాపపుసంపద పొందగ
  దీపమునార్పగ గృహమున తేజమ్మెసగెన్

  రిప్లయితొలగించు
 11. శ్రీ శంకరయ్య గురుదేవులకు, శ్రీ నేమాని గురుదేవులకు వినమ్రవందనములతో..

  శ్రీ శంకరయ్య గురుదేవులకు ధన్యవాదములతో...

  కన్యాశుల్కము వ్రాసినది " శ్రీ కందుకూరి" వారని పొరబడితిని మన్నించగలరు గురువుగారు.

  సాధువు దీనజనులకు రక్షణ కొరకు ఖలుల యింట దీపము నార్పిన పాపము గాదని దెలుపగ
  ============*============
  పాపము గాదులె యింటను
  దీపము నార్పిన,దెలుపగ దీనజనులకున్
  పాపములు జేయు వారల
  దీపము నార్పఁగ,గృహమునఁ దేజ మ్మెసఁగెన్.
  (పాపములు జేయు వారలు = ఖలులు )

  రిప్లయితొలగించు
 12. దీపము స్వయంప్రకాశము
  నీ పగిదిని దానె వెలుగు నే చీకటిలోన్
  జూపించెద నని విద్యు
  ద్దీపము నార్పగ గృహమున దేజమ్మెసగెన్.

  రిప్లయితొలగించు

 13. గోపుర మందొక దినమున
  దీపము బెట్టగ కడివెడు దీవెన లొసగన్
  కాపుర మందున గలతల
  దీపము నార్పఁగ, గృహమునఁ దేజ మ్మెసఁగెన్.

  =========*===========
  శ్రీ పతి కాపరి యని నా
  భూపతి దాపునకు నేగి బొగడగ వినినా
  ద్వైపాయనుండు నాపద
  దీపము నార్పఁగ, గృహమునఁ దేజ మ్మెసఁగెన్.

  రిప్లయితొలగించు
 14. సరదాగా "గోపురం" పసుపు పొడి పై
  ==========*========
  "గోపుర" పసుపును వాడగ
  కోపము నశియించి మనము గూరిమి నొందన్
  కాపుర మందున గలతల
  దీపము నార్పఁగ, గృహమునఁ దేజ మ్మెసఁగెన్.

  రిప్లయితొలగించు
 15. పండిత నేమాని గారికి పూజ్యగురుదేవులు
  శంకరయ్య గారికి వందనములు
  దీపమ్ములు ఎటుజూచిన
  దీపికలే యింటి ని౦డ దీపావళి సొం
  పేపారంగను విద్యు
  ద్దీపము న్నార్పగ గృహమున తేజమ్మెసగెన్

  రిప్లయితొలగించు
 16. మాపటి కరెంటు కోతల
  దీపపుచిరుకాంతి వెతలు తికమక పెట్టన్
  పాపలు కరెంటు రాగనె
  దీపము నార్పఁగ గృహమున తేజమ్మొసగెన్

  రిప్లయితొలగించు
 17. గురువుగారూ! కవిమిత్రులు అజ్ఞానమును, కలతలను మరియు ఆపద లను వాటిని దీపముతో పోల్చడము సమ్మతమేనా?

  రిప్లయితొలగించు
 18. అయ్యా! శ్రీ సహదేవుడు గారూ! శుభాశీస్సులు.
  మన మిత్రులు కొందరు అజ్ఞానమును, కలతలను, ఆపదలను దీపముతో పోల్చేరు. ఈ విషయములో మీరు వెలిబుచ్చిన సందేహము ఉచితమైనదే. దీపము జ్ఞానమునకు సంకేతము కాని అజ్ఞానమునకు కాదు. అలాగే శాంతి సౌఖ్యములను దీపముతో పోల్చగలము కాని కలతలను ఆపదలను పోల్చుట సరికాదని నా అభిప్రాయము. స్వస్తి.

  రిప్లయితొలగించు
 19. శ్రీమతి శైలజ గారికి అభినందనలతో.....

  దితి కి పుట్టిన వారు దైత్యులుగా పిలువబడతారు. నరకాసురుడు దైత్యుడు అనబడతాడు గానీ దితి అనుట సమంజసము కాదని నా అభిప్రాయము.

  రిప్లయితొలగించు
 20. శ్రీమతి శైలజ గారికి అభినందనలతో.....

  మీ మొదటి పద్యము మొదటి పాదములోనూ మూడవ పాదములోనూ ఒక లఘువు ఎక్కువగా ఉన్నది.

  "దీపము సుజ్ఞానమొసగుఁ", "కోపంబజ్ఞానములను" అంటే సరిపోతుంది.

  కానీ, శ్రీ పండిత నేమాని వారన్నట్లు, అజ్ఞానము, కోపములను ( negative things ) దీపముతో పోల్చడము భావ్యము కాదు.

  రిప్లయితొలగించు
 21. వ్యాపించె జీకటి క్యాండ ల్
  దీపము నార్పగ గృహమున, దేజమ్మెసగెన్
  దీపమ్ములచే విద్యుత్
  సాపా టొ నరించి రంత సంతోషముతో .


  రిప్లయితొలగించు
 22. పాపలు పుట్టిన రోజని (దినమని)
  ఆపక దీపము లదనుగ నార్పెద రెటులో
  పాపము గాదట, చిత్రము
  దీపము నార్పఁగ గృహమునఁ దేజ మ్మెసఁగెన్.

  రిప్లయితొలగించు
 23. పాపపు జగతిని మనుగడ
  శాపమ్ముగ పరిగణించె సౌఖ్యము లేకన్
  లోపము లెంచక యాశల
  దీపము నార్పంగ గృహము దేజమ్మె సగెన్

  రిప్లయితొలగించు
 24. శ్రీ సంపత్ కుమార్ శాస్త్రిగారికి నమస్సులు..
  నా మొదటి పద్యములో ఒక లఘువు ఎక్కువ వుందన్నారు,..నల గణం వచ్చింది కద అక్షరాలు సరిపోయాయనే భావించాను..ఇక అజ్ఞానం , కోపము అంటారా..ఆపద , కలతలు , ఆశలు, పాపము, ఇవన్నీ దీపమునకు సంకేతాలుగానే మన సాహతీ మిత్రులు వ్రాసారు,..అజ్ఞానం కూడా వాటి కోవలోకే వస్తుంది కదా..అవి సరి అయినవే అయితే ..నాదేనా కానిది..అజ్ఞానాన్ని తిమిరంతో పోలుస్తారు, నిజమే... ఏమరుపాటులో అజ్ఞానం అని పడింది,..
  అందుకే రెండవ పద్యం వ్రాసాను.. ఇక దితి విషయానికొస్తే ,..గణాలకి సరిపోయే పర్యాయపదాలు అందరూ వాడుతున్నారు కదండీ.. శంకరాభరణం భ్లాగులోని ఆంధ్రభారతి లోనే నేను చూస్తుంటాను ,.అందులో దితి అని కొడితే నఱకుడు అని వచ్చింది.. అదే వాడాను ....అజ్ఞానం అన్న పదం వాడటమే ,..భావ్యం కానంత తప్పు అంటారా..అయినా మీరందరూ మహాకవులు,..నేను ఇంకా నడకలు మొదలుపెట్టి 2 నెలలే అయ్యింది..నడకే నేర్చుకుంటున్నపుడు సరి అయిన విధంగా నడవడం చెప్పాలి కానీ ..ఇలా నడవడమే తప్పంటే..?
  ఆంధ్రభారతి బ్లాగులో నేను చూసిన దితి కి అర్ధం ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను.. ఇలా వ్రాసినందుకు అన్యధా భావించవద్దని మనవి...

  దితి

  దితి : బహుజనపల్లి శబ్దరత్నాకరము గ్రంథసంకేతాది వివేచన పట్టిక
  సం. వి. ఇ. స్త్రీ.
  • 1. అసురుల తల్లి;
  • 2. నఱకుడు.
  దితి : బ్రౌణ్య తెలుగు-ఇంగ్లీష్ నిఘంటువు


  రిప్లయితొలగించు
 25. శ్రీమతి శైలజగారూ,

  ఏదో తప్పును సరిచేద్దమనుకున్నాను గానీ మీరింతలా బాధపడతారని తెలిసుంటే చెప్పేవాణ్ణి కాదుకదా............

  రిప్లయితొలగించు
 26. మిత్రులారా! శుభాశీస్సులు.
  విషయము: శ్రీ సంపత్ కుమార్ శాస్త్రి గారు & శ్రీమతి శైలజ భావములు:

  మనలో ఒకరి గుణ దోషములను ఇంకొకరు తెలుపుట సమంజసమే. ఇందులో మనసులకు హత్తుకుపోయేలా బాధపడుటకు తావులేదు. తప్పు ఒకరు చేసినా ఎక్కువమంది చేసినా తప్పు తప్పే. నలుగురు చేసిన తప్పు ఒప్పగును అనుట భావ్యము కాదు. తప్పులు అందరికీ సహజమే. తప్పును తెలిసికొని ఒప్పును అభ్యసించుట అందరికీ మంచిది. మనది నిత్యము అభ్యాసము చేసే పాఠశాల. అందుచేత అన్ని విషయములు బాగుగా అలవడే దాకా అన్ని విషయముల యందు శ్రద్ధ చూపుచు అందరూ సౌభ్రాత్రముతో సామరస్యముతో ముందుకు సాగ గలరని ఆశించుచూ .. స్వస్తి.

  రిప్లయితొలగించు
 27. మిత్రులారా !
  ఔను !
  తప్పు యెవరు చేసిన తప్పే !
  యే తప్పూ చెయ్యనివారు భూలోకంలో ఉంటారా ?
  పైలోకాలలో ఉంటారేమో ???

  యెప్పుడో ఒకప్పుడు అందరూ యేదో ఒక తప్పు చేసేవారే !
  పద్యాలలో తప్పు చూపుదామని భావించిన వారే
  ఒక్కొక్కసారి తప్పు చెయ్యవచ్చు !

  పొరబడ్డాను మన్నించండి అని
  శంకరార్యులే ఒప్పుకున్న సందర్భాలెన్నో !

  స్వాతంత్ర్యం యెలా మన జన్మ హక్కో
  తప్పు చెయ్యడం కూడా మన జన్మ హక్కే !
  దీన్ని కాదనడాని కెవరికీ అధికారం లేదు !
  అది రాజ్యాంగ విరుద్ధం !

  తెలిసీ కావాలని తప్పు చేస్తే అది అహంకారం !
  తెలిసినా, తెలియకుండా తప్పు జరుగుతుంది ! అది పొరపాటు !
  తెలియక తప్పు చేస్తే అది అఙ్ఞానం !
  అఙ్ఞానాన్ని మాపుకోవడమే సుఙ్ఞానం !
  అంటే తప్పు తెలుసు కొని దాన్ని దిద్దుకోవడమే వికాసం !
  అదే సృష్టి పరిణామం !
  ప్రతీ జీవీ వయసుతో పాటూ అనుభవం
  అనుభవం తో పాటూ ఙ్ఞానం పెంచుకుంటూ ఉంటుంది !

  ఇదొక
  విశ్వ అనే పదానికి నిజమైన అర్థాన్ని చెప్పే
  శంకరార్య కృత
  శంకరాభరణ వికసిత(open) ఉచిత(free)పద్య విశ్వ విద్యాలయం
  ఇక్కడ
  అందరూ విద్యార్థులే
  అందరూ అధ్యాపకులే !
  ఇది 24 గంటలూ 365 రోజులూ తెరిచే ఉంచబడుతుంది !
  నచ్చిన వారు నచ్చిన రీతిలో
  అధ్యయనం చెయ్యవచ్చు
  బోధనా చెయ్యవచ్చు !
  ప్రతీ రోజూ పరీక్షే
  పరీక్ష పేపరు ఎప్పుడూ ఎల్లరకూ అందుబాటులో ఉంటుంది !
  నచ్చిన వాళ్ళు వ్రాయవచ్చు !
  ఎప్పుడు వీలైతే అప్పుడు వ్రాయవచ్చు !
  ఫీజులెవరూ చెల్లించ నఖ్ఖర లేదు !
  ఏ విధమైన పట్టాలూ ప్రధానం చెయ్యబడవు !
  ఒఠ్ఠి ఙ్ఞాన మార్పిడి మాత్రమే !
  ఙ్ఞానాన్నివ్వడం పుచ్చుకోవడం
  అంతే !

  రిప్లయితొలగించు
 28. అందరికీ వందనములు !
  అందరి పూరణలూ అలరించు చున్నవి !

  విజయా వారి
  జగదేకవీరుని కథ సినిమాలో
  కె వి రెడ్డి గారి దర్శకత్వంలో

  అక్కడ

  మానస సరోవర తీర ప్రాంతంలో
  దేవకన్యలు శపిస్తే
  అన్నగారు ఱాయిగా మారిపోతే

  ఇక్కడ

  రాజభవనంలో
  గోడకున్న అన్నగారి పటము
  కింద పడితే

  అది చూసిన రాజమాత
  ఋష్యేంద్రమణి

  పింగళి గారి సాహిత్యంతో
  పెండ్యాల గారి స్వరాలలో
  లీల గారి గాత్రంతో

  "నను దయ గనవా - నా మొఱ వినవా
  మది నమ్మితి - నిన్నే మాతా
  యిక శరణము - నీవే మాతా

  అప శకునం - బయె నమ్మా
  సుతుడే యాపద - పాలాయెనో
  ఎటు జూచెదవో - ఎటు బ్రోచెదవో
  తనయుని భారము - నీదే

  నను దయ గనవా - నా మొఱ వినవా
  మది నమ్మితి - నిన్నే మాతా
  యిక శరణము నీవే మాతా

  ఆశా దీపం - ఆరిపోవునా
  చేసిన పూజలు - విఫలము లౌనా
  నీవు వినా , యిక - రక్షకు లెవరే
  కావగ రావా - కావగ రావా
  ఓ మాతా ఓ మాతా - ఓ మాతా ఓ మాతా "

  అని
  దీనాతి దీనంగా దేవి ముందు
  రోదిస్తుంటే

  గాలి గట్టిగా వీస్తుంది !

  దేవి దగ్గరున్న దీపం ఆరిపోతుంది
  రాజమాత మూర్చబోతుంది !

  *****
  విశ్రాంతి
  *****

  హాల్లో(గృహము) లైట్లు వెలుగుతాయ్ !
  కాంతులు విరజిమ్ముతాయ్ :

  01)
  ___________________________________

  శాపము నొందిన తనయుడు
  పాపము శిలవోలె మిగిలె ! - పరితాపముతో
  నా పవనుడు చెలరేగుచు
  దీపము నార్పఁగ ; గృహమునఁ - దేజ మ్మెసఁగెన్ !
  ___________________________________

  రిప్లయితొలగించు
 29. తక్కువ సమయమునందునె
  మిక్కిలి ధారాయుతమగు మేల్ పద్యములన్ -
  ఎక్కడొ చిన తప్పైనను,
  చక్కగ వ్రాయుట ఘనతయె! శైలజ గారూ!

  రిప్లయితొలగించు
 30. డా .ఆచార్య ఫణీంద్ర గారికి
  కృతజ్ఞతాభివందనములు..
  నా కెంతో ఇష్టమైన కందపద్యంలో మీ ప్రశంస చదివి నా కనులు చెమర్చాయి,ఆనందంతో...మీ మౌక్తికం బ్లాగు చూస్తుంటాను,.మీ వంటి మహాకవుల రచనలు చదివే పద్యాలపట్ల మక్కువ ,ఆశక్తి పెరిగింది,మరొక్కసారి ధన్యవాదములు..

  రిప్లయితొలగించు
 31. శ్రీ వసంత కిశోర్ గారికి ,నమస్సులు,..
  మీ వివరణ చాలా అద్బుతంగా వుంది , నిజంగా శంకరాభరణం వంటి బ్లాగు నేను చూడలేదు, మీ వంటి మంచి కవుల పద్య సుమాల సుగంధం శంకరాభరణం, శ్రీ శంకరయ్య గురువుగారు, శ్రీ నేమాని గురువుగారి చలవవలన నావంటి ప్రతి ఒక్కరూ వారి భావాలకు మెరుగులు దిద్ది పద్యాలు వ్రాయాలనే అభిలాషను నెరవేర్చుకునే అవకాశం, ప్రోత్సాహం కల్గిస్తోంది శంకరాభరణం....ఇటువంటి మంచి భ్లాగుని అందించిన శంకరయ్య గురువుగారికి సర్వదా కృతజ్ఞతలు...మంచి వివరణ యిచ్చినందుకు మీకు ధన్యవాదములు..

  రిప్లయితొలగించు
 32. మాపటి వేళల చీకటి
  మాపగ వెలిగించితి చిరు మట్టి ప్రమిద లో
  దీపింపగ; ప్రొద్దుట నా
  దీపము నార్పఁగ గృహమునఁ దేజ మ్మెసఁగెన్

  రిప్లయితొలగించు
 33. కోపము తాపము ప్రియమును
  పాపము పుణ్యము నవిద్య పాండిత్యములన్
  కాపాడు మనసు గ్రుడ్డిది
  దీపము నార్పఁగ గృహమునఁ దేజ మ్మెసఁగెన్


  గ్రుడ్డి దీపము = మినుకుమినుకుమను కాంతి హీనమగు దీపము
  (శ్రీహరి నిఘంటువు)

  "లోకంబులు లోకేశులు
  లోకస్థులుఁ దెగినఁ దుది నలోకం బగు పెం
  జీకటి కవ్వల నెవ్వం
  డే కాకృతి వెలుఁగు నతని నే సేవింతున్"

  రిప్లయితొలగించు


 34. పాపపు కార్యము తోడ్పడు
  దీపము నార్పఁగ గృహమునఁ, దేజమ్మెసఁగె
  న్నో పడతి నేతి యనుచున్
  తాపము కోపము విడచుచు తరుణము గానన్ !

  జిలేబి

  రిప్లయితొలగించు
 35. కోపము మోహము కూడిన
  దీపము నార్పఁగ గృహమునఁ దేజ మ్మెసఁగెన్
  తాపమ్మును తీర్చుచు భళి
  చూపుచు భగవాను మాయ సులభపు రీతిన్

  రిప్లయితొలగించు