11, నవంబర్ 2013, సోమవారం

సమస్యాపూరణం - 1232 (హీనుఁడు సజ్జనులకెల్ల)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది.....
హీనుఁడు సజ్జనులకెల్ల హిత మొనరించెన్.

27 కామెంట్‌లు:

  1. భానుని కిరణము సోకిన
    సూనము వికసించి నటుల శోభలు విరియన్
    జ్ఞానపు సెగదగి లినతరి
    హీనుడు సజ్జనుల కెల్ల హిత మొన రించెన్

    రిప్లయితొలగించండి
  2. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరింప నున్నవి !

    ఎప్పుడో అర్థశతాబ్దం క్రిందటి సంగతి !
    పూర్వం "చందమామ" లో "గుండు భీమన్న కథలు "
    కొన్ని సంవత్సరములపాటు ప్రతీ సంచికలోనూ వచ్చేవి !
    అతడొక వివేకహీనుడు !
    తెలిసీ తెలియక కొన్ని తప్పు పనులు చేస్తూ ఉంటాడు !
    కాని ఆ పనుల వల్ల యెవరికీ యే విధమైన అపకారం జరగక పోగా
    నారదుడు కల్పించిన కలహాలన్నీ లోకకల్యాణం కోసమే ఐనట్టు
    చివరికి కొందరికి మేలు చేకూరుతుంది !

    ఈ రోజు నా కథానాయకుడు గుండు భీమన్నే :

    01)
    _____________________________________

    కాని పను లొనర్చు నతడు !
    గాని , జనుల కగుచు నుండు - కల్యాణంబే !
    కానితన మెరుగని , తెలివి
    హీనుఁడు సజ్జనుల కెల్ల - హిత మొనరించెన్ !
    _____________________________________
    కాని = కొరగాని = చేతగాని
    కానితనము = చెడ్డతనము

    రిప్లయితొలగించండి
  3. పాము బారి నుండి గురువు గారిని కాపాడిన
    పరమానందయ్య శిష్యుడు :

    02)
    _____________________________________

    ఙ్ఞాన మది లేక జేసియు
    ప్రాణంబులు నిల్పె గురుని - పామదె చేరన్ !
    మౌనియు , శాపమున మతివి
    హీనుఁడు సజ్జనుల కెల్ల - హిత మొనరించెన్ !
    _____________________________________

    రిప్లయితొలగించండి
  4. రాజేశ్వరి అక్కయ్యా,
    ఔను మరి! జ్ఞానపు సెగ తగిలిన హీనుడైన బోయ రామాయణం చెప్పి లోకోపకారం చెయ్యలేదా?
    మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
    *
    వసంత కిశోర్ గారూ,
    గుండు భీమన్న, పరమానందయ్య శిష్యుడు విషయాలుగా మీ రెండు పూరణలూ బాగున్నవి. అభినందనలు.
    "తెలివి హీనుడు" అని సమాసం చేయరాదు కదా. "కానితన మెఱుంగని మతి/హీనుఁడు..." అందామా?

    రిప్లయితొలగించండి
  5. తప్పవు తుందేమో అని భయం భయంగా ఓపెన్ చేశాను హమ్మో బోలెడు సంతోషం
    ఇంకేముంది బోలెడు ధన్య వాదములు

    రిప్లయితొలగించండి
  6. పరులకు మంచి చేస్తే జాతకము బాగుపడుతుందని చెబితే ఒకడు సజ్జనులకెల్ల హితమొనరించాడని నా భావం...

    దీనత తొలగును బ్రతుకున
    నీ నష్టములన్ని దొలగు నిజమని చెప్పన్
    బూనుచు నదృష్ట జాతక
    హీనుఁడు సజ్జనుల కెల్ల హిత మొనరించెన్ !

    రిప్లయితొలగించండి
  7. చిన్న సవరణ తో...

    దీనత తొలగును బ్రతుకున
    నీ నష్టములన్ని మాయు నిజమని చెప్పన్
    బూనుచు నదృష్ట జాతక
    హీనుఁడు సజ్జనుల కెల్ల హిత మొనరించెన్ !

    రిప్లయితొలగించండి
  8. శ్రీ శంకరయ్య గురుదేవులకు, శ్రీ నేమాని గురుదేవులకు వినమ్రవందనములతో.....

    శ్రీ శంకరయ్య గురుదేవులకు ధన్యవాదములతో...
    ========*=============
    కానడు ర(క)వి కుల మందున
    హీనుఁడు, సజ్జనుల కెల్ల హిత మొనరించెన్
    జ్ఞానుల, మౌనుల సూక్తులు
    మానస మందునను నిలుపి మరులు గొనంగన్ !

    రిప్లయితొలగించండి
  9. పరమేశ్వరుడు లోకహితార్థమై జగద్గురుడై ఎల్లరకు జ్ఞానబోధ గావించెను కదా.

    జ్ఞాననిధానుండును ని
    త్యానందుడు లోకగురుడు త్ర్యంబకుడగు నీ
    శానుడు భావాభావ వి
    హీనుడు సజ్జనుల కెల్ల హిత మొనరించెన్

    రిప్లయితొలగించండి
  10. జ్ఞాని యొకండొక సభలో
    పూనికతో సంశయముల పురజనులకునే
    మైనను దీర్చుతరి యడుగు
    హీనుఁడు సజ్జనులకెల్ల హిత మొనరించెన్.

    రిప్లయితొలగించండి
  11. పండిత నేమాని గారికి పూజ్యులు గురుదేవులు
    శంకరయ్యగారికి వందనములు
    మానవతావాది యతడు
    హీనజనులపాలి కల్పవృక్షమ్ముగ స
    మ్మానితు డయ్యెను క్రౌర్య వి
    హీనుడుసజ్జనుల కెల్ల హిత మొనరించెన్

    రిప్లయితొలగించండి
  12. నేనని హాలాహలమును
    తానై భక్షించినాడు త్ర్యంబకుడు శివుం
    డా నీలగళుడు రాగవి-
    హీనుడు సజ్జనుల కెల్ల హిత మొన రించెన్.

    రిప్లయితొలగించండి
  13. దానవ ధరణీ పతి బలి
    జ్ఞానుండును దాన ధర్మ సత్కార్యములన్
    మానక జేసెడి దుర్నయ
    హీనుడు సజ్జనులకెల్ల హితమొనరించెన్.

    రిప్లయితొలగించండి



  14. రాజేశ్వరిగారూ,అన్నిటిలోకి ఈసారి మీ పూరణ ఉత్తమంగా ఉన్నది.అభినందనలు.

    రిప్లయితొలగించండి
  15. హీనంబయినఉడుతతన
    మేనున రాముని గురుతులు మెప్పుగ బొందెన్
    జ్ఞానము వికసించగబల
    హీనుడు సజ్జనులకెల్ల హితమొన రించెన్

    రిప్లయితొలగించండి
  16. దానవుఁ గడుపున బుట్టియు
    మానడె హరినామ భజన మదిలో నెపుడున్
    కూనడు ప్రహ్లాదుడు భయ
    హీనుఁడు సజ్జనుల కెల్ల హితమొన రించెన్!

    రిప్లయితొలగించండి
  17. రాజేశ్వరి నేదునూరి గారూ పూరణలో వికసించిన పూల పోలిక చాలా బాగుంది.
    -------------------
    భానుని కిరణము సోకిన
    సూనము వికసించి నటుల శోభలు విరియన్
    జ్ఞానపు సెగదగి లినతరి
    హీనుడు సజ్జనుల కెల్ల హిత మొన రించెన్"

    రిప్లయితొలగించండి
  18. నమస్కారములు
    పూజ్య గురువుల అధ్బుత మైన విశ్లేషణ నా పద్యానికి వన్నెతెచ్చింది ఆ ప్రతిభ వారెదే
    గురువులు శ్రీ శంకరయ్య గారికి ,శ్రీ కమనీయం గారికి ,శ్రీ లక్కరాజు గారికీ ధన్య వాదములు

    రిప్లయితొలగించండి
  19. జ్ఞాననిధి ధర్మనిరతియు
    దానాదులు సత్యనిష్ట తత్పరతయు సం
    ధానించి దుష్ట కృత్య వి
    హీనుఁడు సజ్జనులకెల్ల హితమొనరించెన్.

    రిప్లయితొలగించండి
  20. ఈనేలన్ ధర్మమునకు
    హానికలిగినపుడె దాల్చియవతారములన్
    తానెధర(గాచె జన్మవి
    హీనుడు సజ్జనులకెల్లహితమొనరించెన!

    రిప్లయితొలగించండి
  21. వీనుల విందగు పలుకుల
    దీనుల హరిజన హితుండు ధీమంతుండు
    న్నానాటి గాంధి సంగవి
    హీనుఁడు సజ్జనులకెల్ల హిత మొనరించెన్

    రిప్లయితొలగించండి


  22. మానము తీసిన వాడౌ
    హీనుఁడు ; సజ్జనులకెల్ల హిత మొనరించెన్
    వీనుల విందుగను మధుర
    గానపు కైపుల పలుకుల గని మాన్యుండౌ !

    జిలేబి

    రిప్లయితొలగించండి
  23. వానా కాలపు చదువున
    పూనుచు సరదా పుడింగి పూరణ లిడుచున్
    దీనుడు గభీర కవితా
    హీనుఁడు సజ్జనులకెల్ల హిత మొనరించెన్ 😊

    పుడింగి = అధికుడనుకొనువాడు (మాండలిక పదకోశము)

    రిప్లయితొలగించండి


  24. మానస మున కల్మషము, ప్ర
    ధానముగా దుష్టతనము, తగు గురు కృపతో
    జ్ఞానము నొందుచు మారగ
    హీనుఁడు సజ్జనులకెల్ల హిత మొనరించెన్


    జిలేబి

    రిప్లయితొలగించండి