వివరణ: మన దేశములోని పశ్చిమ ఉత్తర రాష్ట్రములలో కొందరి సంప్రదాయములో దీపావళి పండుగయే ఉగాది. వారు మన వలె కాక పూర్ణిమ నుండి పూర్ణిమ వరకు చాంద్రమాసమును లెక్కింతురు - అందుచేత అన్ని చాంద్రమాసములును వారి లెక్కలలో మనకంటే 15 రోజులు ముందుగనే వచ్చును. ఆ విధముగా దీపావళి పండుగ కార్తిక మాసములోనే వచ్చును - అదియే ఉగాది. స్వస్తి.
అయ్యా! హనుమఛ్ఛాస్త్రి గారూ! శుభాశీస్సులు. మీ పద్యము బాగుగ నున్నది. అభినందనలు. చిన్న సవరణలు. 1. 2వ పాదాదిన యడాగమము చేసి "యింటి" అని మీరు వ్రాసేరు. అక్కడ యడాగగమము రాదు. 2. ఇంటి పెద్దలు అని బహువచనముతో మొదలిడి "చెప్పె" అనుట సరికాదు. ఆ పాదమును ఇలాగ మార్చుదాము: "ఇంటి పెద్దలు కొడుకుతో నిట్టు లనిరి" -- స్వస్తి.
శ్రీ శంకరయ్య గురుదేవులకు, శ్రీ నేమాని గురుదేవులకు వినమ్రవందనములతో.....
శ్రీ శంకరయ్య గురుదేవులకు ధన్యవాదములతో... శివ భక్తుల మధ్య సంభాషణ =========*============= శివ శివ యనుచు మది నిండ శివుని నిల్ప కార్తికమ్మున వచ్చునుగాది మనకు భక్త వరులార! రారండి భజన సేయ గరళ కంఠుని మన మెల్ల వరము లడుగ!
నేడు అయిదు రాష్ట్రములకు ఎన్నికల జరుగు చున్నవి, ఆ ప్రాంత వాసులు నీతిపరులను ఎన్నుకొనిన మనకు మంచి జరుగునని ఆ ప్రాంత వాసి జెప్పుట ! ===========*============ అయిదు సంవత్స రములకు నములు జరుపె డెన్నికల తోడను,శివుని కిష్టమైన కార్తికమ్మున వచ్చు నుగాది మనకు నీతి గా నోటు(ఓటు)వేయగ నేత లకును!
రాజేశ్వరి అక్కయ్యా, మలినభావాలు తొలఁగి సద్భావాల ఉగాది వచ్చిందంటారు. బాగుంది మీ పూరణ. అభినందనలు. * వసంత కిశోర్ గారూ, తనయునితో తప్పు చెప్పించారు. మంచి పూరణ. అభినందనలు. * పండిత నేమాని వారూ, ఔత్తరాహికులు దీపావళిని సంవత్సరాదిగా జరుపుకొనడం నిజమే. చాలా బాగుంది మీ పూరణ. అభినందనలు. * జిలేబీ గారూ, పున్నమి నెలరేడు చైత్రం నుండి ఫాల్గుణం దాకా నెలకొకసారే కనిపిస్తాడు. శంకరాభరణంలో పద్యాల వెన్నెల మాత్రం ప్రతిరోజూ ఆహ్లాదాన్ని ఇస్తూనే ఉంది ఇప్పటిదాకా... ఇకముందు ఏం కానున్నదో. * సంపత్ కుమార్ శాస్త్రి గారూ, మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు. * గోలి హనుమచ్ఛాస్త్రి గారూ, దోషసవరణానంతరం మీ పూరణ బాగుంది. అభినందనలు. ‘అగు + ఉగాది’ అన్నప్పుడు సంధి లేదు. అది ‘అగు నుగాది" అవుతుంది. * బొడ్డు శంకరయ్య గారూ, విరుపుతో చక్కని పూరణ చెప్పారు. అభినందనలు. * కెంబాయి తిమ్మాజీరావు గారూ, మీ రెండు పూరణలూ వైవిధ్యంగా చక్కగా ఉన్నాయి. అభినందనలు. ‘దీపావళీనాడు’ అనకుండా ‘దిపావళి దినాన’ అనండి. * సుబ్బారావు గారూ, మీ పూరణ బాగుంది. అభినందనలు. కాని మార్గశీర్షం ప్రథమమున వచ్చునన్నారు? * భాగవతుల కృష్ణారావు గారూ, బాగుంది మీ పూరణ. అభినందనలు. ‘లాభములను అష్ట..’ అని విసంధిగా వ్రాసారు. అక్కడ ‘లాభములకు/నష్టలక్ష్మి..." అనండి. * వరప్రసాద్ గారూ, మీ పూరణ బాగుంది. అభినందనలు. కాని సమస్యకు పరిష్కారం కనిపించలేదు. రెండవ పూరణ కూడా బాగుంది. ‘సంవత్సరములకు నమలు జరుప/నెన్నికల..’ అనండి. * సహదేవుడు గారూ, బాగుంది మీ పూరణ. అభినందనలు. * మిస్సన్న గారూ, టెండుల్కర్‍పై మీరు కురిపించిన అక్షరాక్షతలకు ధన్యవాదాలు.
కటిక చీకట్లు తొలగించి కాంతి నిడగ
రిప్లయితొలగించండికోట్ల దీపాలు వెలిగించు కొమ్మ లంత
మలిన మైనట్టి భావాలు తొలగి పోవ
కార్తి కమ్మున వచ్చు నుగాది మనకు
అందరికీ వందనములు !
రిప్లయితొలగించండిఅందరి పూరణలూ అలరింప నున్నవి !
కార్తికమ్మున యుగాదా ? తప్పు తప్పు :
01)
___________________________________
కార్తికమ్మున పండుగ - గలుగు నేది ?
తండ్రి యడిగిన ప్రశ్నకు - తడుముకొనుచు
కార్తికమ్మున వచ్చు ను - గాది మనకు
నంచు బాలుడు చెప్పగా - నయ్య నవ్వి
కాదు చైత్ర పాడ్యమి నాడు - గాది యనిన
తనదు తప్పును గ్రహియించె - తనయు డంత !
___________________________________
వైభవమ్ముగ జరిపెడు పర్వరాజ
రిప్లయితొలగించండిమగుచు దీపావళి చెలంగు నదె యుగాది
యగుట పశ్చిమోత్తర వాసులందు రిటుల
కార్తికమ్మున వచ్చు నుగాది మనకు
వివరణ: మన దేశములోని పశ్చిమ ఉత్తర రాష్ట్రములలో కొందరి సంప్రదాయములో దీపావళి పండుగయే ఉగాది. వారు మన వలె కాక పూర్ణిమ నుండి పూర్ణిమ వరకు చాంద్రమాసమును లెక్కింతురు - అందుచేత అన్ని చాంద్రమాసములును వారి లెక్కలలో మనకంటే 15 రోజులు ముందుగనే వచ్చును. ఆ విధముగా దీపావళి పండుగ కార్తిక మాసములోనే వచ్చును - అదియే ఉగాది. స్వస్తి.
రిప్లయితొలగించండిదీపావళి వచ్చు కార్తికమ్మున
వచ్చు నుగాది చైత్రమ్మున
శంకర కవితా'నెల'రేడు వచ్చు
చైవైజే ఆశ్రాభా ఆకామా పుమాపా !!
జిలేబి
శైవ వైష్ణవవులకభేదము తెలుపుతూ అద్వైతభావన కలిగించే మాసమును ఆధ్యాత్మిక ఉగాది గా పరిగణించుతూ......
రిప్లయితొలగించండిశైవ వైష్ణవులెంతయు సంతసమున
భక్తివిజ్ఞానదాయక పథమెఱింగి
మోదమందెడు రోజు యుగాది యనిన
కార్తికమ్మున వచ్చు నుగాది మనకు
ఉత్తరాదిన నొకయింట నుంటినేను
రిప్లయితొలగించండియింటి పెద్దలు కొడుకునకిట్లు చెప్పె
చైత్రమందున వారికసలగుగాది
కార్తికమ్మున వచ్చు నుగాది మనకు.
అయ్యా! హనుమఛ్ఛాస్త్రి గారూ! శుభాశీస్సులు.
రిప్లయితొలగించండిమీ పద్యము బాగుగ నున్నది. అభినందనలు. చిన్న సవరణలు.
1. 2వ పాదాదిన యడాగమము చేసి "యింటి" అని మీరు వ్రాసేరు. అక్కడ యడాగగమము రాదు.
2. ఇంటి పెద్దలు అని బహువచనముతో మొదలిడి "చెప్పె" అనుట సరికాదు. ఆ పాదమును ఇలాగ మార్చుదాము:
"ఇంటి పెద్దలు కొడుకుతో నిట్టు లనిరి" --
స్వస్తి.
శ్రీనేమాని గారూ ! ధన్యవాదములు. మీరు చూపిన సవరణతో...
రిప్లయితొలగించండిఉత్తరాదిన నొకయింట నుంటినేను
ఇంటి పెద్దలు కొడుకుతో నిట్టు లనిరి
చైత్రమందున వారికసలగుగాది
కార్తికమ్మున వచ్చు నుగాది మనకు.
హిమము కురిపించు ఋతువు సహేతుకముగ
రిప్లయితొలగించండికార్తికమ్మున వచ్చు, నుగాది మనకు
చైత్ర మాసములోవచ్చి షడ్రుచులను
గలిగినట్టి పాయసమిచ్చు కమ్మగాను.
పందితనేమాని గారికి పూజ్యగురుదేవులు
రిప్లయితొలగించండిశంకరయ్యగారికి వందనములు
చలికి నంతము మొదలు వసంతమని యు
గాది యడుగిడు చైత్రమ్ము కందళించ
పులిని సైతము వణకించుచలికి నాది
కార్తికమ్మున వచ్చునుగాదిమనకు
రిప్లయితొలగించండిపండిత నేమాని గారికి పూజ్యగురుదేవులు
శంకరయ్య గారికి వందనములు
షావుకారుకు లాభనష్టాల లెక్క
ముగియు దీపావళీ నాడు తిగువ క్రొత్త
గణుతి శ్రీకారమొనరింప యనగ తగును
కార్తికమ్మున వచ్చు నుగాది మనకు
కలుగు పుణ్యము మునుగంగ గంగ లోన
రిప్లయితొలగించండికార్తికమ్మున , వచ్చు నుగాది మనకు
చైత్ర మాసాన పాడ్యమి సై యనంగ
మాసముల కెల్ల బ్రధమము మార్గ శిరము
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండి
రిప్లయితొలగించండిపండిత నేమాని గారికి పూజ్యగురుదేవులు
శంకరయ్య గారికి వందనములు
శ్రీ భాగవతుల కృష్ణా రావు గారి పూరణ
ఉత్తరాదిని వణిజులు క్రొత్త లెక్క
లనుచు చిట్టాలు తెరచుచు లాభములను
అష్ట లక్ష్మిని ప్రార్ధింప నిష్ఠ పడుచు
కార్తికమ్మున వచ్చునుగాది మనకు
శ్రీ శంకరయ్య గురుదేవులకు, శ్రీ నేమాని గురుదేవులకు వినమ్రవందనములతో.....
రిప్లయితొలగించండిశ్రీ శంకరయ్య గురుదేవులకు ధన్యవాదములతో...
శివ భక్తుల మధ్య సంభాషణ
=========*=============
శివ శివ యనుచు మది నిండ శివుని నిల్ప
కార్తికమ్మున వచ్చునుగాది మనకు
భక్త వరులార! రారండి భజన సేయ
గరళ కంఠుని మన మెల్ల వరము లడుగ!
తనకు ఉద్యోగమొచ్చిన దినమే తమయింట ఉగాది పండుగని కుటుంబ సభ్యులతో ఇంటిపెద్ద చెప్పిన మాటగా...
రిప్లయితొలగించండికార్తికమ్మున పరమాత్మ కరుణ జూప
యెదురు జూచిన కొలువున నెంపి కైతి
చైత్ర మాసంబున నుగాది సర్వులకును
కార్తికమ్మున వచ్చు నుగాది మనకు
భారతమాత ముద్దుబిడ్డ సచిన్ టెండూల్కర్కు భారతరత్న బిరుదు లభించిన సందర్భంలో అక్షరాక్షతలు.
రిప్లయితొలగించండిబ్యాటు ఝళిపింప నరులకు భయము గల్గు
పరుగు దీసిన శతకము బాది వదలు
బంతి విసరిన నావలి యంతు జూచు
సచిను భారత మాతకు సత్సుతుండు.
విరులు మెల్లగా చల్లగా విరిసినట్లు
వెండి వెన్నెల హాయిగా పండినట్లు
సచిను నవ్విన మనసుకు సంతసమగు
నతడు భారతరత్నమే యది నిజమ్ము.
వీరుడవై క్రికెట్టునకు విస్తృత భాష్యము జెప్పి, బ్యాట్టుతో
పోరుచు, వాడి బంతులను పూనిక వేయుచు, వైరి సోదరుల్
'లేరితనిన్ జయింప నొరు లీభువి' నంచు వచించి మెచ్చుచున్
పారగ భీరులై, భరత పావన ధాత్రికి వన్నె తెచ్చుచో
లేరిక సాటి నీ కెవరు! లీలగ నైనను కాన రారులే!
చేరియు నాటలో నెవరు చేరగ రాని మహోజ్జ్వల స్థితిన్
నేరవు సుంత లౌక్యమును! నిర్మల మైన మనస్సు నెన్నడున్
జారగ నీవు కీర్తి బల సంజనితంబగు పొంగు లోయలో!
మీరిన బ్యాటు ఘంటమున మేలుగ దేశ క్రికెట్టు గాధ నిం
పారగ నొంటిగా తిరగ వ్రాసిన లేఖకు డంచు మెచ్చెదన్!
చోరుడ వంచు పల్కెదను సోదర మానసముల్ హరించుచో!
భారత రత్నమా! సచిను! భారత కీర్తి మహత్ప తాకమా!
Sri Missanna gaari అక్షరాక్షతలు.padyamulu bahu baagunnavi.
రిప్లయితొలగించండినేడు అయిదు రాష్ట్రములకు ఎన్నికల జరుగు చున్నవి, ఆ ప్రాంత వాసులు నీతిపరులను ఎన్నుకొనిన మనకు మంచి జరుగునని ఆ ప్రాంత వాసి జెప్పుట !
రిప్లయితొలగించండి===========*============
అయిదు సంవత్స రములకు నములు జరుపె
డెన్నికల తోడను,శివుని కిష్టమైన
కార్తికమ్మున వచ్చు నుగాది మనకు
నీతి గా నోటు(ఓటు)వేయగ నేత లకును!
రాజేశ్వరి అక్కయ్యా,
రిప్లయితొలగించండిమలినభావాలు తొలఁగి సద్భావాల ఉగాది వచ్చిందంటారు. బాగుంది మీ పూరణ. అభినందనలు.
*
వసంత కిశోర్ గారూ,
తనయునితో తప్పు చెప్పించారు. మంచి పూరణ. అభినందనలు.
*
పండిత నేమాని వారూ,
ఔత్తరాహికులు దీపావళిని సంవత్సరాదిగా జరుపుకొనడం నిజమే. చాలా బాగుంది మీ పూరణ. అభినందనలు.
*
జిలేబీ గారూ,
పున్నమి నెలరేడు చైత్రం నుండి ఫాల్గుణం దాకా నెలకొకసారే కనిపిస్తాడు. శంకరాభరణంలో పద్యాల వెన్నెల మాత్రం ప్రతిరోజూ ఆహ్లాదాన్ని ఇస్తూనే ఉంది ఇప్పటిదాకా... ఇకముందు ఏం కానున్నదో.
*
సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
*
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
దోషసవరణానంతరం మీ పూరణ బాగుంది. అభినందనలు.
‘అగు + ఉగాది’ అన్నప్పుడు సంధి లేదు. అది ‘అగు నుగాది" అవుతుంది.
*
బొడ్డు శంకరయ్య గారూ,
విరుపుతో చక్కని పూరణ చెప్పారు. అభినందనలు.
*
కెంబాయి తిమ్మాజీరావు గారూ,
మీ రెండు పూరణలూ వైవిధ్యంగా చక్కగా ఉన్నాయి. అభినందనలు.
‘దీపావళీనాడు’ అనకుండా ‘దిపావళి దినాన’ అనండి.
*
సుబ్బారావు గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
కాని మార్గశీర్షం ప్రథమమున వచ్చునన్నారు?
*
భాగవతుల కృష్ణారావు గారూ,
బాగుంది మీ పూరణ. అభినందనలు.
‘లాభములను అష్ట..’ అని విసంధిగా వ్రాసారు. అక్కడ ‘లాభములకు/నష్టలక్ష్మి..." అనండి.
*
వరప్రసాద్ గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
కాని సమస్యకు పరిష్కారం కనిపించలేదు.
రెండవ పూరణ కూడా బాగుంది. ‘సంవత్సరములకు నమలు జరుప/నెన్నికల..’ అనండి.
*
సహదేవుడు గారూ,
బాగుంది మీ పూరణ. అభినందనలు.
*
మిస్సన్న గారూ,
టెండుల్కర్‍పై మీరు కురిపించిన అక్షరాక్షతలకు ధన్యవాదాలు.
మీరిన బ్యాటు ఘంటమున మేలుగ దేశ క్రికెట్టు గాధ నిం
రిప్లయితొలగించండిపారగ నొంటిగా తిరగ వ్రాసిన లేఖకు డంచు మెచ్చెదన్!
---------------------------------
అద్భుతం మిస్సన్న గారూ.
కలుగు పుణ్యము మునుగంగ గంగ లోన
రిప్లయితొలగించండికార్తికమ్మున , వచ్చు నుగాది మనకు
చైత్ర మాసాన పాడ్యమి సై యనంగ
మాసముల కెల్ల ముఖ్యము మార్గ శిరము
సుబ్బారావు గారూ,
రిప్లయితొలగించండిసవరించిన మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
పూచు బంతులు మల్లెపూ బోలె దోచు
రిప్లయితొలగించండిసఖియ! తాపము బెంచగ చల్ల గాలి,
విరహముల క్రాగెడు వసంతవేళ యనగ
కార్తికమ్మున వచ్చు నుగాది మనకు.