ఓం నమశ్శివాయ
రచన : పండిత నేమాని రామజోగి సన్యాసి రావు
రచన : పండిత నేమాని రామజోగి సన్యాసి రావు
ఓం నమశ్శివాయ యోగీంద్ర వినుతాయ
పార్వతీ హృదబ్జ భాస్కరాయ |
దీనబాంధవాయ దివ్యస్వరూపాయ
శంకరాయ లోక శంకరాయ ||
ఓం నమశ్శివాయ చోక్షరాడ్వాహాయ
శ్రితహితాయ చంద్రశేఖరాయ |
భూతనాయకాయ భువనాధినాథాయ
శంకరాయ లోక శంకరాయ ||
ఓం నమశ్శివాయ చోత్తమ వరదాయ
భోగిరాజ ముఖ్య భూషణాయ |
దక్ష మదహరాయ రక్షాయ సాంబాయ
శంకరాయ లోక శంకరాయ ||
ఓం నమశ్శివాయ చోర్వీధరస్థాయ
శివతరాయ ప్రమథసేవితాయ |
త్రిపుర నాశకాయ త్రిదశేంద్ర వినుతాయ
శంకరాయ లోక శంకరాయ ||
ఓం నమశ్శివాయ చోమాహృదీశాయ
సుజన రక్షకాయ సుందరాయ |
నీలకంధరాయ నిగమాంత వేద్యాయ
శంకరాయ లోక శంకరాయ ||
పార్వతీ హృదబ్జ భాస్కరాయ |
దీనబాంధవాయ దివ్యస్వరూపాయ
శంకరాయ లోక శంకరాయ ||
ఓం నమశ్శివాయ చోక్షరాడ్వాహాయ
శ్రితహితాయ చంద్రశేఖరాయ |
భూతనాయకాయ భువనాధినాథాయ
శంకరాయ లోక శంకరాయ ||
ఓం నమశ్శివాయ చోత్తమ వరదాయ
భోగిరాజ ముఖ్య భూషణాయ |
దక్ష మదహరాయ రక్షాయ సాంబాయ
శంకరాయ లోక శంకరాయ ||
ఓం నమశ్శివాయ చోర్వీధరస్థాయ
శివతరాయ ప్రమథసేవితాయ |
త్రిపుర నాశకాయ త్రిదశేంద్ర వినుతాయ
శంకరాయ లోక శంకరాయ ||
ఓం నమశ్శివాయ చోమాహృదీశాయ
సుజన రక్షకాయ సుందరాయ |
నీలకంధరాయ నిగమాంత వేద్యాయ
శంకరాయ లోక శంకరాయ ||
పండిత నేమాని వారూ,
రిప్లయితొలగించండిశంకరకృపాపాత్రతకు అర్హత నందించే మనోహరమైన స్తోత్రాన్ని అందించారు. కాగితంపై వ్రాసి పెట్టుకున్నాను. ధన్యవాదాలు.
శ్రీ నేమాని గురుదేవులకు వినమ్రవందనములతో....
రిప్లయితొలగించండికార్తీక మాసము నందు మనోహరమైన శివ "శంకరాయ లోక శంకరాయ " స్తోత్రమును మాకందించి నందులకు ధన్యవాదములు.
నేమాని పండితార్యా! నమోన్నమః
రిప్లయితొలగించండిశంకర శంకరా యనుచు సన్నుతి జేతు నిరంతరమ్ము నా
సంకట మాన్పగా దగదె చల్లని చూపుల చంద్రమౌళి! యే
వంకకు బోదు కాదనిన బాముల బెట్టుట భావ్యమౌనొకో?
కింకరు నందు జాలి గొని కేలును చాచవె! చేదుకో గదే!
ఇంద్రుడు బ్రహ్మయున్ మునులు నెల్ల సురల్ పరమేశ! నీ దయా
సంద్రము నందు మున్గగను సారెకు బారులు దీరి నిల్తురే!
సాంద్రత హెచ్చి దుర్భవపు క్షార జలమ్ముల మున్గు చుంటి నా
గేంద్ర శయాను సన్నిహిత! కీడు హరించి కృపాబ్ధి ముంచవే!
వరప్రసాద్ గారూ,
రిప్లయితొలగించండిధన్యవాదాలు.
*
మిస్సన్న గారూ,
భక్తిరసపూర్ణమైన చక్కని పద్యాలు వ్రాశారు. అభినందనలు, ధన్యవాదాలు.
పానకంలో పుడకలా ‘దయాసంద్రము’ అన్న సమాసం పడింది.
శ్రీ శంకరయ్య గారికి. శ్రీ మిస్సన్న గారికి, శ్రీ వరప్రసాదు గారికి శుభాశీస్సులు. అభినందనలు.
రిప్లయితొలగించండిశ్రీ మిస్సన్న గారూ! మీ పద్యములు బాగుగ నున్నవి. సంకట మాన్పగా అనుట బాగులేదు. సంకటము అనునది సాధువు. స్వస్తి.
నమస్కారములు
రిప్లయితొలగించండికార్తీక మాసమున పఠించ దగిన శివస్తోత్రమును మాకందించిన పూజ్య గురువులు శ్రీ పండిత నేమాని వారికి శిరసాభి వందనములు
నేమాని పండితార్యా! సంకటమార్పగా కు టైపాటది.
రిప్లయితొలగించండిగురువుగారూ! అవును పుడకే కానీ, ప్రాసకోసం పాటు.