శ్రీ శంకరయ్య గురుదేవులకు, శ్రీ నేమాని గురుదేవులకు వినమ్రవందనములతో.....
శ్రీ శంకరయ్య గురుదేవులకు, శ్రీ నేమాని గురుదేవులకు ధన్యవాదములతో... ===========*============= జానకీ!వార్త దెలియునా? జక్కరమున యముని సదనంబు గలదట,యవనియందు వింత లకు వింత జూడగ వేగిరమున రమ్ము,"శంకరా భరణపు"బ్లాగులోన! (జక్కరము = మా ఊరి ప్రక్క నున్న ఊరు )
శ్రీ గోలి హనుమఛ్ఛాస్త్రి గారూ! శుభాశీస్సులు. మీ పద్యము బాగుగ నున్నది. అభినందనలు. చిన్న సూచన: రాక్షస పాలి కాల యముని సదనంబు అనే సమాసము సాధువు కాదు. అసురుల వంశమునకు యముని సదనంబు అంటే బాగుంటుంది. స్వస్తి.
వసంత కిశోర్ గారూ, ఇహమందే నరకాన్ని చూపే ఆడ, మగ యములకు మనకు కొదవలేదు. మీ రెండు పూరణలూ ప్రస్తుత కాలానుగుణంగా బాగున్నవి. అభినందనలు. * రాజేశ్వరి అక్కయ్యా, నాది నాది అనే భావాన్నే నాకంగా భావించే వారి గురించిన మీ పూరణ బాగుంది. అభినందనలు. * ‘సుగుణ సంచయ ముని సదనము" అన్న మొదటి పూరణ, తాజాగా పంపిన రెండవ పూరణ బాగున్నవి. అభినందనలు. * గోలి హనుమచ్ఛాస్త్రి గారూ, రాక్షసుల పాలిటి యముని సదన్నాన్ని గురించిన మీ పూరణ బాగుంది. అభినందనలు. నేమాని వారి సవరణను గమనించండి. * వరప్రసాద్ గారూ, వింత వింత పూరణలను కవిమిత్రులు అందజేస్తున్నారు కదా! బాగుంది మీ పూరణ. అభినందనలు. * సంపత్ కుమార్ శాస్త్రి గారూ, ఉత్సాహ సంచయ ముని సదనమును గురించిన మీ పూరణ బాగుంది. అభినందనలు. * సుబ్బారావు గారూ, మీ పూరణ బాగుంది. అభినందనలు. చివరి పాదంలో యతి తప్పడమే కాక అన్వయం కూడా తప్పినట్లుంది. ఒకసారి పరిశీలించండి. * నాగరాజు రవీందర్ గారూ, చెలియకు మునిసదనాన్ని చూపించిన మీ పూరణ బాగుంది. అభినందనలు. * లక్ష్మీదేవి గారూ, సారథికి ముని సదనాన్ని చూపించిన మీ పూరణ బాగుంది. అభినందనలు. ఆటవెలది పద్యంలో ‘కాంచి + పొందె’ అన్నప్పుడు గసడదవాదేశం ఉండదు. అక్కడ ‘కాంచి పొందె’ అనే ఉంటుంది.
అందరికీ వందనములు !
రిప్లయితొలగించండిఅందరి పూరణలూ అలరింప నున్నవి !
ఆడయముని ఆత్మహత్యా సదనం :
01)
________________________________
రామ సింహాసనం బెక్కి - రక్కసి వలె
అధమునొకనిని మంత్రుల - ప్రధనమందు
తలను నిల్పగ నెంచుచు - తప్పుదారి
రాజకీయము నడుపుచు - రాక్షసముగ
ఎన్నికలలోన లాభము - నెంచుకొనుచు
ఆత్మ హత్యాసదృశమని - యరయ లేక
అడ్డగోలుగ దుర్భుద్ధి - నాత్ర పడుచు
నిలిపిన సమూహ మది జూడ - నిశ్చయముగ
యముని సదనంబు గలదఁట - యవనియందు.
________________________________
రామసింహాసనము = అయోధ్య (ప్రస్తుతం ఢిల్లీ)
ప్రధనము = యుద్ధము(పోటీ)
(group of monsters) ఆడ యమ భటుల గుంపు :
రిప్లయితొలగించండి02)
________________________________
న్యాయ మన్యాయ మనకుండ - నక్కల వలె
అన్నదమ్ముల విడదీయ - నంధులైన
ఆంధ్రజాతిని విభజించు - నధముల గన
యముని సదనంబు గలదఁట - యవనియందు.
________________________________
భ్రమను కలిగించు జగతియె భాగ్య మనగ
రిప్లయితొలగించండినాది నాదను కాంక్షలె నాక మంచు
కోరు జనులకు నిలయమ్ము కోర్కె దీర్చ
యముని సదనంబు గలదట యవని యందు
భద్రమగు నైమిశారణ్య ప్రాంతమందు
రిప్లయితొలగించండివీతరాగుల, యోగుల, విమలమతుల,
శుద్ధ సత్త్వుల నిలయమున్ సుగుణ సంచ
యముని సదనంబు గలదట యవనియందు
రిప్లయితొలగించండిధర్మ రక్షణకై పుట్టి ధరణిలోన
భూమి పుత్రిని పెండ్లాడె పుణ్యమూర్తి
పవనజుని స్వామి రాక్షస పాలి కాల
యముని సదనంబు గలదట యవనియందు
శ్రీ శంకరయ్య గురుదేవులకు, శ్రీ నేమాని గురుదేవులకు వినమ్రవందనములతో.....
రిప్లయితొలగించండిశ్రీ శంకరయ్య గురుదేవులకు, శ్రీ నేమాని గురుదేవులకు ధన్యవాదములతో...
===========*=============
జానకీ!వార్త దెలియునా? జక్కరమున
యముని సదనంబు గలదట,యవనియందు
వింత లకు వింత జూడగ వేగిరమున
రమ్ము,"శంకరా భరణపు"బ్లాగులోన!
(జక్కరము = మా ఊరి ప్రక్క నున్న ఊరు )
వింధ్యపర్వతశ్రేణులఁ వెదకి జూడ
రిప్లయితొలగించండిమోక్షసామ్రాజ్య సాధనంబునకు తీవ్ర
తపములొనరించుచున్న నుత్సాహ సంచ
య మునిసదనంబు గలదఁట యవనియందు
శ్రీ గోలి హనుమఛ్ఛాస్త్రి గారూ! శుభాశీస్సులు.
రిప్లయితొలగించండిమీ పద్యము బాగుగ నున్నది. అభినందనలు. చిన్న సూచన:
రాక్షస పాలి కాల యముని సదనంబు అనే సమాసము సాధువు కాదు. అసురుల వంశమునకు యముని సదనంబు అంటే బాగుంటుంది. స్వస్తి.
ఎన్ని చోటులు వెదకిన నన్ని చోట్ల
రిప్లయితొలగించండియముని సదనంబు గలదట యవని యందు
రక్షకులము గా బఱగుచు శిక్ష వేయు
గీ ములే యా య మునిసద నమ్ము లండ్రు
నాగరాజు గారూ, మీ పూరణ బాగున్నది.
రిప్లయితొలగించండినేనూ అదే బాట పడుతున్నాను.
ఇంద్రునికి తోడయి యరుల నెగుర గొట్టి
భూమి కరుదెంచు వేళల భూపతి యగు
వీర దుష్యంతుడు నిలుపు, వేగ మేల
య? ముని సదనంబు గలదఁట యవనియందు
రథము దింపు మనుచు రథ సారథిని గోరె;
భరతు గాంచి వొందె పరమ సుఖము.
మదిని నిండె కడకు మగువ శకుంతల
కునిదె మంచి రోజు కూడె ననుచు.
అమ్మా! లక్ష్మీదేవి గారూ! శుభాశీస్సులు.
రిప్లయితొలగించండిమీ పద్యములు 2 బాగుగ నున్నవి. అభినందనలు.
తేటగీతి పద్యము తరువాత ఆటవెలదిని వ్రాసేరు. ఆ రెండు పద్యములను విడి విడిగా వ్రాస్తే బాగుండెడిది. స్వస్తి.
మరియొక ప్రయత్నము:
రిప్లయితొలగించండిఎన్నడో యమపురి గూర్చి యింతలంత
లనుచు నుండిరి గాని, నే డద్భుతమట
యముని సదనమ్ము, కలదట యవని పైని
దానినేనియు మించు సౌధమ్ము భళిర!
వసంత కిశోర్ గారూ,
రిప్లయితొలగించండిఇహమందే నరకాన్ని చూపే ఆడ, మగ యములకు మనకు కొదవలేదు.
మీ రెండు పూరణలూ ప్రస్తుత కాలానుగుణంగా బాగున్నవి. అభినందనలు.
*
రాజేశ్వరి అక్కయ్యా,
నాది నాది అనే భావాన్నే నాకంగా భావించే వారి గురించిన మీ పూరణ బాగుంది. అభినందనలు.
*
‘సుగుణ సంచయ ముని సదనము" అన్న మొదటి పూరణ, తాజాగా పంపిన రెండవ పూరణ బాగున్నవి. అభినందనలు.
*
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
రాక్షసుల పాలిటి యముని సదన్నాన్ని గురించిన మీ పూరణ బాగుంది. అభినందనలు.
నేమాని వారి సవరణను గమనించండి.
*
వరప్రసాద్ గారూ,
వింత వింత పూరణలను కవిమిత్రులు అందజేస్తున్నారు కదా! బాగుంది మీ పూరణ. అభినందనలు.
*
సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
ఉత్సాహ సంచయ ముని సదనమును గురించిన మీ పూరణ బాగుంది. అభినందనలు.
*
సుబ్బారావు గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
చివరి పాదంలో యతి తప్పడమే కాక అన్వయం కూడా తప్పినట్లుంది. ఒకసారి పరిశీలించండి.
*
నాగరాజు రవీందర్ గారూ,
చెలియకు మునిసదనాన్ని చూపించిన మీ పూరణ బాగుంది. అభినందనలు.
*
లక్ష్మీదేవి గారూ,
సారథికి ముని సదనాన్ని చూపించిన మీ పూరణ బాగుంది. అభినందనలు.
ఆటవెలది పద్యంలో ‘కాంచి + పొందె’ అన్నప్పుడు గసడదవాదేశం ఉండదు. అక్కడ ‘కాంచి పొందె’ అనే ఉంటుంది.
పండిత నేమారి గారికి పూజ్యగురుదేవులు
రిప్లయితొలగించండిశంకరయ్య గారికి వందనములు
పాపచింతన కలిగిన భయద ముగను
సృష్టినాశన కార్యముల్ చిత్రగుప్త
మగుచు న్యాయము ధర్మము నమలు పరచు
యముని సదనoబు గలదట యవని యందు
మరియొకపూరణ
మానవుల సేవ జేయుచు మమత ప్రేమ
పంచి యిచ్చిన మనసుయే స్వర్గమనగ
ధర్మభ్రష్టుల శిక్షించి కర్మ బాపు
యముని సదనoబు గలదట యవని యందు
నరక మందున సేవకుల్ నర్మముగను
రిప్లయితొలగించండిపలుకు చుందురు తమలోన : భారతమున
మురికివాడయన్ పేరున మెరయుచుండు
యముని సదనంబు గలదఁట యవనియందు.
పాపులకు నరకమందున బడును శిక్ష
రిప్లయితొలగించండిలందురే కాని తగు శిక్ష లచలమందె,
పొలయు చుండిరి, నిత్యము పొందు వారు
యముని సదనంబు గలదట యవనియందు.
పెద్దలకు నమస్కారములతో,
రిప్లయితొలగించండిఇంద్రునికి తోడయి యరుల నెగుర గొట్టి
భూమి కరుదెంచు వేళల భూపతి యగు
వీర దుష్యంతుడు నిలుపు, వేగ మేల
య? ముని సదనంబు గలదఁట యవనియందు
రథము దింపు మనుచు రథ సారథిని గోరె;
భరతు కాంచి పొందె పరమ సుఖము.
మదిని నిండె కడకు మగువ శకుంతల
కునిదె మంచి రోజు కూడె ననుచు.
నేమాని పండితులకు విదేశీయాన శుభాకాంక్షలు. విదేశాల్లో ఉన్నా శంకరాభరణం మఱచి పోవద్దని మనవి.
రిప్లయితొలగించండికెంబాయి తిమ్మాజీ రావు గారూ,
రిప్లయితొలగించండిమీ రెండు పూరణలూ బాగున్నవి. అభినందనలు.
‘మనసు + ఏ’ అన్నప్పుడు యడాగమం రాదు. అక్కడ ‘హృదయమే/యెడదయే’ అనండి.
*
మిస్సన్న గారూ,
వ్యంగ్యభరితమైన మీ పూరణ బాగుంది. అభినందనలు.
*
గండూరి లక్ష్మినారాయణ గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
మొదటి పాదంలో గణదోషం. ‘పాపులకు నరకముననే పడును శిక్ష..." అందాం.
శ్రీ కంది శంకరయ్య గారికి మరియు శ్రీ మిస్సన్న గారికి శుభాశీస్సులు.
రిప్లయితొలగించండిమీరు తెలియజేసిన శుభాకాంక్షలు మాకు మిక్కిలి ఆనందమును గూర్చినవి. మీకు అభినందనలు. స్వస్తి.
పూజ్యగురుదేవులు శంకరయ్య గారికి
రిప్లయితొలగించండివందనములు
మీసవరణకు ధన్యవాదములు
మహిని పాపమ్ము జేసెడి మనుజు లార
రిప్లయితొలగించండినరక లోకమ్ము భువిలోకి తరలెనంట
శిక్ష తప్పించు కోలేరు జీవులార
యముని సదనంబు గలదట యవని యందు.
కాలపురములో పాపులు వేలకొలది
రిప్లయితొలగించండివచ్చిచేరుచు నిండగా వశముగాక
పిచ్చి లేసిన కాలుడు వచ్చె భువికి
యముని సదనంబ గలదట యవని యెందు
ధరనిలో పాప కర్మలు ధాటి గాను
చేయబూన కోమానవ జీవితమున
ఎక్కడో శిక్షపడునని లెక్క గొనకు
యముని సదనంబ గలదట యవని యెందు