25, నవంబర్ 2013, సోమవారం

సమస్యాపూరణం - 1245 (తనివి గల్గించె రాముఁడు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది......
తనివి గల్గించె రాముఁడు దానవులకు
ఈ సమస్యను పంపిన కందుల వరప్రసాద్ గారికి ధన్యవాదాలు.

26 కామెంట్‌లు:

 1. బాణమొక్కటే సతిపైని ప్రాణ మొకటె
  ధర్మవర్తన మొక్కటే తప్ప నట్టి
  ప్రభువు చేతిలో వీడగ ప్రాణ మెల్ల
  తనివి గల్గించె రాముడు దానవులకు

  రిప్లయితొలగించు
 2. అసుర సేవలలో వ్యర్థ మయ్యె జన్మ,
  ధర్మ మూర్తియౌ రాము శస్త్రముల దాకి
  పొందగలమిక శాశ్వత ముక్తి ననుచు
  దనివి గల్గించె రాముడు దానవులకు

  రిప్లయితొలగించు

 3. దానవుండైన ధర్మమ్ము దయయుయున్న
  ఘన విభీషణు వోలెనే గాతు ననుచు
  ధర్మ నిరతి దయాగుణ దాన శీల
  త, నివి గల్గించె రాముఁడు దానవులకు

  రిప్లయితొలగించు
 4. andariki namaskaramulu.andari puranalu chala baguntunnavi.guruthulyulara..!mithrulala..!nenoka shubhaka karyanni nirvarthincha dalichanu.adentante!nenu shivaramaraju padyakavyam pusthakam printing chepinchadalichanu.daniki 15000 karchavuthundi.nenu koddiga venukabadi vunnanu,na pusthaka printing koraku mi vanthu amaina sahakarinchagalarani na manavi.......!!!!!!!!!plz contact;9866017692, A/c No:SBH:62257143263.plz help me.

  రిప్లయితొలగించు
 5. యాగ రక్షణ గావించి యా మునులకు
  తనివి గల్గించె రాముడు , దానవులకు
  మోక్ష మిచ్చెను సంహారము జరిపి మఱి
  దైవ మెప్పుడు భక్తుల గావ యుండు

  రిప్లయితొలగించు
 6. ముక్తి గల్గించె రాముఁడు పుడమిపైన
  పుట్టవలసినట్టి యగత్యములవి లేవు
  తమకుననెడి యూహ వలను, దైవమగుచు
  తనివి గల్గించె రాముఁడు దానవులకు

  రిప్లయితొలగించు
 7. రామ పాదము తాకుచు లంక జనులు
  రక్ష గోరగ, వారికి రాము డపుడు
  సత్య శీలత ధర్మము చాటి జెప్పి
  తనివి గల్గించె రాముడు దానవులకు

  రిప్లయితొలగించు
 8. రామబాణ మిడెను ముక్తి రక్కసులకు
  ప్రేమ భావము తోడ విభీషణునకు
  పట్టమును గట్టి లంకకు ప్రభువు జేసి
  తనివి గల్గించె రాముడు దానవులకు

  రిప్లయితొలగించు
 9. పండిత నేమాని గారికి పూజ్యగురుసేవులు
  శంకరయ్య గారికి వందనములు
  వరబలమదగర్వితుడు రావణుని జంపి
  భరము తొలగించె నుర్వికి. సురల కెల్ల
  తనివి గల్గించె రాముడు. దానవులకు
  రాజు జేసె విభీషణు లంక పురికి

  రిప్లయితొలగించు
 10. పండిత నేమాని గారికి పూజ్య గురుదేవులు
  శంకరయ్య గారికి వందనములు
  శ్రీభాగవతుల కృష్ణారావు గారి పూరణ
  రావణానంతరము నందు రాజ్యమునకు
  పట్టమును విభీషణునకు గట్టి మిగుల
  తనివి గల్గించె రాముడు దానవులకు
  ప్రాణ రక్షణ గూర్చెను భాగ్యమనగ

  రిప్లయితొలగించు
 11. ధాత్రి నవతార మెత్తిన దనుజవైరి
  దుష్ట సంహారమొనరించి శిష్టులకును
  దనివి గల్గించె, రాముడు దానవులకు
  శాపముక్తుల జేసి మోక్షమ్ము నొసెగె.

  రిప్లయితొలగించు
 12. శ్రీ శంకరయ్య గురుదేవులకు, శ్రీ నేమాని గురుదేవులకు వినమ్రవందనములతో.....

  శ్రీ శంకరయ్య గురుదేవులకు , శ్రీ నేమాని గురుదేవులకు ధన్యవాదములతో...
  ========*==============
  పరమ భక్తుల కెల్లను వరము లిచ్చి ,
  వైరి ననుచు రణము నందు గోరి నిలిచి,
  శాపములను బాపుచు పాపు లకును,
  తనివి గల్గించె రాముడు దానవులకు !

  రిప్లయితొలగించు

 13. నాకు నిత్యం సూచనలిచ్చిన శంకరయ్య గారికి నేమాని వారికి నమస్సులు
  నన్ను ప్రోత్సహించిన కందుల వరప్రసాద్ గారికి ప్రత్యేక ధన్యవాదములు


  రామ కథలో అంశాలన్నీ మనలో అసురత్వాన్ని పోగొట్టేవే అన్ని విషయాన్ని ఆధారముగా ఈ రచన చెసితిని

  ధర్మ మార్గము వీడిన కర్మ జీవి
  యత్మ యొక్కటె నన్నింట న న్న బుద్ది
  ని చ్చి, భోదించి సన్మార్గ మెంచి నడచి,
  తనివి గల్గించె రాముడు దానవులకు!

  రిప్లయితొలగించు
 14. ఆదిత్య గారు ధన్యవాదములు

  "ధర్మ మార్గము వీడని కర్మ జీవి " గా మార్చండి

  రిప్లయితొలగించు

 15. నిద్ర గరువయి సురలెల్ల నిలిచి యుండ
  భద్ర గిరి జేరి వారికి భద్రత నిడి
  తనివి గల్గించె రాముడు,దానవులకు
  ముక్తి మార్గము జూపిన పుణ్య మూర్తి !

  రిప్లయితొలగించు
 16. శ్రీ వరప్రసాద్ గారూ! శుభాశీస్సులు.
  మీ పద్యము బాగుగ నున్నది. అభినందనలు.
  3వ పాదములో ఒక అక్షరము తక్కువగా నున్నది. సరిజేయండి. స్వస్తి.

  రిప్లయితొలగించు
 17. శ్రీ ఆదిత్య గారూ! శుభాశీస్సులు.

  పద్దెము లల్లుట నేర్చితి
  మద్దూరి కవీ! జయోస్తు! మా సలహాలున్
  తద్దయు నీ కీయగలము
  విద్దెల రాణించగలవు వేడుక మీరన్

  రిప్లయితొలగించు
 18. శ్రీ తిమ్మాజీ రావు గారూ! శుభాశీస్సులు.

  మీ పద్యము బాగుగ నున్నది. అభినందనలు.
  లంకపురికి అనే సమాసము సాధువు కాదు. లంకాపురికి అనవలెను. లంకపురికి బదులుగా లంకకు భళి! అబి మార్చుదాము. స్వస్తి.

  రిప్లయితొలగించు
 19. శ్రీ నేమాని గురుదేవులకు ధన్యవాదములతో...

  సవరణతో
  =======*==============
  పరమ భక్తుల కెల్లను వరము లిచ్చి ,
  వైరి ననుచు రణము నందు గోరినిలిచి,
  శాపములనెల్ల బాపుచు పాపు లకును,
  తనివి గల్గించె రాముడు దానవులకు !

  రిప్లయితొలగించు
 20. జంగిడి రాజేందర్ గారూ,
  నేను మీకు ఆర్థికంగా సహాయం చేయలేని స్థితిలో ఉన్నాను. అసలే వృద్ధాశ్రమంలో ఉంటున్నవాణ్ణి.
  కాకుంటే పుస్తకప్రచురణలో ముఖ్యమైన కంపోజింగ్ (టైపింగ్) ఖర్చుతో కూడిన పని. మీ పుస్తకాన్ని నేను ఉచితంగా టైప్ చేసి ఇవ్వగలను. యూనికోడ్‍లో కాని, అనూ ఫాంట్స్‌లో కాని మీరు ఎలా కోరుకుంటే అలా..
  ఇంతకీ మీ ‘శివరామరాజు’ కావ్యం ఎవరు ఎప్పుడు వ్రాశారు?

  రిప్లయితొలగించు
 21. కవిమిత్రులకు నమస్కృతులు.
  మా మిత్రుడి కూతురు నిశ్చితార్థానికి వెళ్ళి ఇప్పుడే ఆశ్రమం చేరుకున్నాను. ఉదయం నుండి మీ పూరణలను చూసే అవకాశం లేకపోయింది.
  ఎలాగూ పండిత నేమాని వారు దయతో పూరణలను సమీక్షించారు. సంతోషం.
  మంచి పూరణల నందించిన ....
  సహదేవుఁడు గారికి,
  పండిత నేమాని వారికి,
  గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
  సుబ్బారావు గారికి,
  లక్ష్మీదేవి గారికి,
  శైలజ గారికి,
  బొడ్డు శంకరయ్య గారికి,
  కెంబాయి తిమ్మాజీ రావు గారికి,
  గండూరి లక్ష్మినారాయణ గారికి,
  వరప్రసాద్ గారికి,
  అభినందనలు, ధన్యవాదాలు.
  *
  మద్దూరి ఆదిత్య గారూ,
  మీ ప్రయత్నం ప్రశంసనీయం. నేమాని వారి ఆశీస్సులను అందుకున్నారు. శుభం!
  మీ పూరణ నిర్దోషంగా చక్కగా ఉంది. అభినందనలు.
  ఇక కొనసాగించండి మీ పద్యరచన... మార్గదర్శకులై నేమానివారు, మిత్రులు, నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తూనే ఉంటాము.
  *
  లక్ష్మీదేవి గారూ,
  ధన్యవాదాలు.

  రిప్లయితొలగించు
 22. అందరికీ వందనములు !
  అందరి పూరణలూ అలరించు చున్నవి !

  రాముడు పాలించిన రాజ్యంలో
  రక్కసి అధికారంలో కొస్తే
  తనివి కలిగించేది రాక్షసులకే గదా :

  01)
  ______________________________

  దేశ స్వాతంత్ర్యమునకిది - క్లేశమనుచు
  నెవరు చెప్పిన వినకుండ - నెనరు లేక
  విభజనకు సిద్ధమైనది - వెరపులేక
  రాము రూపు కేంద్ర ప్రభుత్వ - రక్కసి యిట
  మరచి యైక్యత , సఖ్యత - మంచి యనెడు
  మానవాభివృద్ధుల నెల్ల - మంట గలిపి
  కట్టగా నున్న కట్టెల - కట్లు విప్పి
  విరువ సమకట్టె , దుర్బుద్ధి - వేరుపఱచి !
  తనివి గల్గించె రాముడు - దానవులకు !
  ______________________________
  క్లేశము = ఆపద
  నెనరు = ప్రేమ
  వెరపు = భయము
  రిప్లయితొలగించు
 23. మిత్రులారా !
  దిగి రాను దిగి రాను
  దివి నుండి భువికి
  అని దేవులపల్లి వారన్నట్లు

  ఈ రాష్ట్రం ఏమైపోయినా
  ఈ దేశం ఏమైపోయినా
  నేను పట్టించుకోను !
  పట్టించుకున్నా స్పందించను !
  స్పందించినా, నా స్పందనను ఎక్కడా
  వ్యక్తం చెయ్యబోను !

  వాస్తవ ప్రపంచాన్ని విడిచి పెట్టి
  ఊహాలోకంలోనే బ్రతికేస్తూ
  యిక ముందు
  అభినవ నీరో చక్రవర్తి అని పేరు తెచ్చుకోడానికై
  నా శాయశక్తులా
  కృషి చేస్తానని
  మీకందరికీ
  నా లిఖితపూర్వక హామీ !

  చిత్తగించ గలరు !

  రిప్లయితొలగించు