వరప్రసాద్ గారూ, ఉత్పలమాల పాదాన్ని కందంలో ఇమిడ్చి చక్కని పూరణ చేశారు. చాలా బాగుంది. అభినందనలు. * చింతా రామకృష్ణా రావు గారూ, సమస్యను ప్రశ్నగా మార్చి మీరు చేసిన పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు, ధన్యవాదాలు. ఆధునికులైన చిత్రకవు లెవరితోనూ నాకు పరిచయం లేదు. ఎవరైనా నా దృష్టికి వస్తే మీకు తప్పక తెలియజేస్తాను.
ఆశలు మెరిసే ఆకాశం అందంగా తోచెన్,తోకచుక్కలు తోడురంమని తొందరపెట్టెన్ ఆకాశం ఇచ్చునా ఉతం, తోకచుక్క తోడు ఎంతవరకు పరిమితం తెలియని వయస్సున్ తల్లి మాటను చేవినపెట్టని తండ్రి మాటను లక్ష్యపెట్టని ఛందమున్ మనస్సెగసెన్ ఆలోచన అవగాహన అనే రెక్కలురాని పక్షి యెగిరెన్ వినువీధిని ఱివ్వుఱివ్వునన్
గణాలను గుర్చించే పరీక్షలో ఉత్తీర్ణత సాధించలేదు అందువలన ఇది ఛందో బద్ధ రచన కాదు అంశాన్ని చూసి ఊరక ఉండలేక పూరించితిని ధన్యవాదములు
కెంబాయి తిమ్మాజీ రావు గారూ, మీ తారాజువ్వల పూరణ బాగుంది. అభినందనలు. * రాజేశ్వరి అక్కయ్యా, మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు. * గూడ రఘురాం గారూ, టెండుల్కర్ ప్రస్తావనతో మీ పూరణ బాగుంది. అభినందనలు. * మద్దూరి ఆదిత్య గారూ, మంచి భావాన్ని అందించారు. అభినందనలు. * మిస్సన్న గారూ, బాలచంద్రుని ప్రస్తావనతో మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు. * సంపత్ కుమార్ శాస్త్రి గారూ, మీరు మిస్సన్న గారి లాగా బాలచంద్రుని విషయంగా స్వీకరించినా మీ పూరణ శబ్దసౌందర్యంతో విలసిల్లుతూ మనోహరంగా ఉంది. అభినందనలు. * కమనీయం గారూ, మీ పూరణ కరుణరస భరితమై అలరారుతున్నది. అభినందనలు.
గురువుగారికి, పెద్దలందరికీ నమస్కారములు. ఇన్ని రోజుల తర్వాత శంకరాభరణ దర్శనము ఆనందము కలిగించినది. గురువుగారి అబ్బాయి ఆరోగ్యం చక్కబడిందనుకుంటాను. అత్రి అహల్య సమస్య పూరణ చేయలేక విడిచి, మిగిలినవి అన్నీ వ్రాసి పోస్ట్ చేయుచున్నాను. గమనించగలరు.
యమునినైన నింకెవ్వరినైన భక్త జనుల బాధవెట్టెడు వారి క్షణములోనె నాశమొనరింప గలవాడు నైన శివుడు కాలితోఁ దన్నుటే మేటి కనికరమ్ము.
సీమాంతరమేగి మరల గ్రామమునకు మరలువేళ కాంతాగ్రజుడే ప్రేముడి నా తండ్రిని గనె; మామా యని బావమఱఁది మాటలు గలిపెన్
మించిన శోకమందకట మృత్యువు మేలనిపింపజేయు; నే వంచన లేని ధర్మపరిపాలన పుట్టుక చావులాపు; నీ వెంచుకొనంగ నేమరకమెప్పుడు; దుఃఖము తోడు జేర్చి యీ సంచిత పాప కర్మములు సౌఖ్యము లిచ్చును జన్మజన్మలన్.
లక్ష్మీదేవి గారూ, శంకరాభరణం పట్ల మీకున్న అవ్యాజానురాగానికి ముగ్ధుడనయ్యాను. ధన్యవాదాలు. మీ పూరణలను తీరికగా పరిశీలించి, ఆయా సమస్యల క్రింద పోస్ట్ చేస్తాను.
మిస్సన్న గారూ, సంతో్షమండీ. గురువు గారూ,పరిశీలనకు అనువు గా ఉంటుందని ఇక్కడ ఉంచినాను. ఆయా సమస్యల క్రింద పోస్ట్ చేసే శ్రమ తీసుకోవడం ఎందుకు? నేను చేస్తాను. నా తప్పులను దిద్దుకొని నేర్చుకోగలిగే అవకాశం ఉంటే నాకు చాలు. అన్నీ ఓపికతో చూస్తానన్నందుకే సంతో్షం కలిగినది. అనేక ధన్యవాదాలు మీకు.
లక్ష్మీదేవి గారూ, మీ పూరణలన్నీ అద్భుతంగా ఉన్నాయి. అభినందనలు. "పచ్చికఁ దిన నొల్లదు...." పూరణలో మొదటి పాదం కంద మయింది. దానిని తేటగీతిగా మార్చండి. "ఇచ్చినట్టి మాట నిలుప నిచ్చగించి" అంటే ఎలా ఉంటుంది?
గురువుగారూ, అనేక ధన్యవాదాలు. పొరబాటుగ కంద పాదంతో మొదలు పెట్టినట్టున్నాను. మన్నించగలరు. మీ సవరణ బాగున్నది. సవరించి ఆ పూరణను ఆ పోస్ట్ లో ప్రచురిస్తాను. అన్నీ ఆయా పోస్ట్ లలో ప్రచురిస్తాను.
అందరికీ వందనములు !
రిప్లయితొలగించండిఅందరి పూరణలూ అలరింప నున్నవి !
ధృవుడు :
01)
__________________________________________
వెక్కసమై విమాత పడ - వేసిన నేలను; దుఃఖ్ఖితాత్ముడై
యక్కట, తండ్రి యంకమున - హాయిగ గూర్చొన నోచనట్టి , యా
చక్కని బక్క , యెక్కె గద - చక్కగ శ్రీహరి యంక పీఠి పై
మిక్కిలి నిష్ట తోడ, తప - మే యొనరించిన పుణ్య సంపదన్
చుక్కల జేరి , మీరి యొక - చుక్కగ నిల్చెను శాశ్వతంబుగాన్ !
రెక్కలురాని పక్షి యెగి - రెన్ వినువీధిని ఱివ్వుఱివ్వునన్ !
__________________________________________
వెక్కసము = అసహ్యము
విమాత = సవతితల్లి
సంగీతముపై మక్కువతో
రిప్లయితొలగించండిచిన్నతనంలోనే ఇంటి నుండి పారిపోయి
ఎక్కడెక్కడో శుశ్రూష చేసి ప్రఖ్యాతి గాంచిన వాగ్గేయకారుడు :
(పేరు గుర్తు రావట్లేదు)
02)
__________________________________________
మక్కువ మీఱగా , విడచి, - మార్గణుడై యుపదేశి జేరి , తా
మక్కువ దీర నేర్చి , పర - మాధ్బుతమే యన బాడు చుండినన్
పెక్కురు మెచ్చిరే యతని - పిన్నవయస్సున ,గాన శ్రేష్ఠతన్ !
రెక్కలురాని పక్షి యెగి - రెన్ వినువీధిని ఱివ్వుఱివ్వునన్ !
__________________________________________
మార్గణుడు = యాచకుడు
ఉపదేశి = గురువు
భీష్మునితో సమాన మగు కీర్తి గాంచిన అభిమన్యుడు :
రిప్లయితొలగించండి03)
__________________________________________
ఒక్కడు చిక్కినాడు , కురు - యోధుల మధ్యను పద్మమందునన్
చిక్కిన చిక్కెగాక, తన - చేతల చీల్చెను వీర యోధులన్
పెక్కుర, చుట్టుముట్ట , నిల - పేరును కీర్తిని గాంచె బాలుడై
యక్కట కూలినాడు గద - యాహవ మందున యొంటి పోరుచున్ !
రెక్కలురాని పక్షి యెగి - రెన్ వినువీధిని ఱివ్వుఱివ్వునన్ !
__________________________________________
పద్మము = పద్మాకారపు సైన్య సమూహము = పద్మవ్యూహము
కిశోర్జీ ! రెక్కలురాని పక్షులను మూడింటిని పట్టుకుని చక్కగా యెగురవేశారు.
రిప్లయితొలగించండిమేమింకా వెతుకుతున్నాం...
ఒక పిల్ల వానికి భక్తి గలిగి చక్కని చదువుకై కృషి జేసినచో భగవంతుడు చక్కని భవిష్యత్తునిస్తాడని చెప్పగా వాని ఊహలో ....
రిప్లయితొలగించండిచక్కని విద్యయున్న మరి సాగును జీవన మెంతొ నిండుగా
మ్రొక్కిన చాలునింక హరి మోదము తోడను తోడునుండితా
దక్కగ జేయునింక కృషి తగ్గటు జేయుమనంగ నూహలో
రెక్కలురాని పక్షి యెగిరెన్ వినువీధిని ఱివ్వుఱివ్వునన్.
వసంత కిశోర్ గారూ,
రిప్లయితొలగించండిమీ మూడు పూరణలూ వైవిధ్యంగా చక్కగా ఉన్నాయి. అభినందనలు.
*
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
చూచి చదివి వసంత కిశోరు గారి
పూరణల మెచ్చినారు సద్బుద్ధితోడ
యోచనము జేయ మీకును నొనర దొరకు
సత్పథమ్ము గోలి హనుమచ్ఛాస్త్రి గారు!
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
రిప్లయితొలగించండినేను వ్యాఖ్యానించేలోగా మీ పూరణ వచ్చింది.
చాలా బాగుంది. అభినందనలు.
మాస్టరు గారూ ! ధన్యవాదములు.
రిప్లయితొలగించండిశ్రీ శంకరయ్య గురుదేవులకు, శ్రీ నేమాని గురుదేవులకు వినమ్రవందనములతో.....
రిప్లయితొలగించండిశ్రీ శంకరయ్య గురుదేవులకు ధన్యవాదములతో...
శ్రీ గోలి హనుమచ్ఛాస్త్రి గారు జెప్పినట్లు శ్రీ వసంత కిశోర్ గారు రెక్కలురాని పక్షులను మూడింటిని పట్టుకుని చక్కగా యెగురవేశారు...
ఆపై హనుమచ్ఛాస్త్రి గారు మంచి పక్షిని పట్టారు. నేను రెక్కలులేని పక్షిని పట్టాను
నిన్నటి పి యస్ ల్వి -25 రాకెట్ ను ( రెక్కలులేని, రాని పక్షి )
=========*============
ఘన కీర్తి నిచ్చు చిన్నద
యిన రెక్కలురాని పక్షి యెగిరెన్ వినువీ
ధిని ఱివ్వుఱివ్వునను,మం
చిని వెదకుచు వెడలె జనుల చింతలు దీర్చన్ !
(మంచి = అంగారక గ్రహముపై జనులు నివసించుటకు యోగ్యమైన పరిస్థితిని అంచనా వేయుటకు)
అక్కజ మద్దిరా! విను విహారము సల్పగ నుండగా వలెన్
రిప్లయితొలగించండిరెక్కలు రెండు.శంకరులు రేయిబవల్ విరచించు సృష్టిలో
రెక్కలు రాని పక్షివిహరించుట వింతయె. ఏ యుగంబులో
రెక్కలురాని పక్షి యెగిరెన్ వినువీధిని ఱివ్వుఱివ్వునన్ ?
ఆర్యా! నాదొక మనవి.
ఆధునికులైన చిత్ర, బంధ, గర్భ కవులను, వారి కవితలను తెలుప కోరుచున్నాను.
http://andhraamrutham.blogspot.in/2013/11/blog-post_8.html#.UnySxnCBnn4
వరప్రసాద్ గారూ,
రిప్లయితొలగించండిఉత్పలమాల పాదాన్ని కందంలో ఇమిడ్చి చక్కని పూరణ చేశారు. చాలా బాగుంది. అభినందనలు.
*
చింతా రామకృష్ణా రావు గారూ,
సమస్యను ప్రశ్నగా మార్చి మీరు చేసిన పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు, ధన్యవాదాలు.
ఆధునికులైన చిత్రకవు లెవరితోనూ నాకు పరిచయం లేదు. ఎవరైనా నా దృష్టికి వస్తే మీకు తప్పక తెలియజేస్తాను.
పండిత నేమాని గారికి పూజ్యులు గురుదేవులు
రిప్లయితొలగించండిశంకరయ్యగారికి వందనములు
చుక్కలు నిండు ఆకసముజూచెను వింత నమాసతామసిన్
పిక్కటిలంగ ధ్వానములు ప్రేలు టపాసులు దివ్వె పండగన్
పక్కుననవ్వు వెల్గు విరివానమతాబులు తార జువ్వనా
రెక్కలు లేని పక్షి యెగిరెన్ వినువీధిని రివ్వు రివ్వునన్
చక్కని చంద మామయట చల్లని వెన్నెల సోయ గంబులన్
రిప్లయితొలగించండిచుక్కలు చుట్టు ముట్టెనట సోద్దెము జూడగ మోద మందుచున్
మక్కువ మీరగా విరియు మానస మందున వింత కోర్కెలన్
రెక్కలు రాని పక్షి యెగిరెన్ విను వీధిని ఱివు ఱివ్వునన్
మొక్కలమగ్గలించనతిమోదముతోనణచెన్ విరోధులౌ
రిప్లయితొలగించండిపెక్కురు "బౌలరో"త్తములపీచము; "టెండులుకర్" క్రికెట్టులో
నక్కజుడయ్యె; చూడఁబదునాఱుశకమ్ములు నిండలేదయా!
రెక్కలురాని పక్షి యెగిరెన్ వినువీధిని ఱివ్వుఱివ్వునన్!
ఆశలు మెరిసే ఆకాశం అందంగా తోచెన్,తోకచుక్కలు తోడురంమని తొందరపెట్టెన్
రిప్లయితొలగించండిఆకాశం ఇచ్చునా ఉతం, తోకచుక్క తోడు ఎంతవరకు పరిమితం తెలియని వయస్సున్
తల్లి మాటను చేవినపెట్టని తండ్రి మాటను లక్ష్యపెట్టని ఛందమున్ మనస్సెగసెన్
ఆలోచన అవగాహన అనే రెక్కలురాని పక్షి యెగిరెన్ వినువీధిని ఱివ్వుఱివ్వునన్
గణాలను గుర్చించే పరీక్షలో ఉత్తీర్ణత సాధించలేదు అందువలన ఇది ఛందో బద్ధ రచన కాదు
అంశాన్ని చూసి ఊరక ఉండలేక పూరించితిని
ధన్యవాదములు
చక్కని దాన వంచు నెలజవ్వని నీవని మోహ మందునన్
రిప్లయితొలగించండిచెక్కిలి మీటి దీయగను చేడియ చెంతను ప్రేమ మీరగా
సొక్కుచు స్వర్గ సీమలను సోముని జూపగ మోస మెంచకన్
రెక్కలు రాని పక్షి యెగిరెన్ విను వీధిని ఱివ్వు ఱివ్వునన్
అక్కడ ఘోర యుద్ధమున నయ్యయు, బొంగర మాడు చుండి నీ
రిప్లయితొలగించండివిక్కడ! సిగ్గు లేదె యన నింతి యెడంద చివుక్క నంగ తా
నొక్కడె వీరుడై దునిమి యోధుల గూలెను బాల చంద్రుడే!
రెక్కలురాని పక్షి యెగిరెన్ వినువీధిని ఱివ్వుఱివ్వునన్
దిక్కులు పెక్కటిల్లు ఘనతీవ్ర మహోగ్ర విషాహవంబునం
రిప్లయితొలగించండిదక్కజమైన రీతి నినదార్భటయుక్త ప్రచండ రీతిఁ దా
నెక్కుచు నశ్వరాజమును యేగి గతించెను బాలచంద్రుడే
రెక్కలు రాని పక్షి యెగిరెన్ వినువీధిన ఱివ్వుఱివ్వునన్.
రిప్లయితొలగించండిచక్కగ రాదు పైకెగుర, చాచుచు రెక్కల గూడు వీడుచున్
బక్కి యొకండు కూన యది పాపము క్రిందబడంగ గ్రక్కున
న్నక్కడ జూచి ,జాలిగొని,యక్కున జేరిచి సేదదీర్చగా
రెక్కలురాని పక్షి యెగిరెన్ వినువీథిని రివ్వురివ్వునన్.
మిత్రులు గోలి వారికి ధన్యవాదములు !
రిప్లయితొలగించండిమిత్రులు వరప్రసాద్ గారికి ధన్యవాదములు !
శంకరార్యా ధన్యవాదములు !
అందరి పూరణలూ అలరించు చున్నవి !
కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
రిప్లయితొలగించండిమీ తారాజువ్వల పూరణ బాగుంది. అభినందనలు.
*
రాజేశ్వరి అక్కయ్యా,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
*
గూడ రఘురాం గారూ,
టెండుల్కర్ ప్రస్తావనతో మీ పూరణ బాగుంది. అభినందనలు.
*
మద్దూరి ఆదిత్య గారూ,
మంచి భావాన్ని అందించారు. అభినందనలు.
*
మిస్సన్న గారూ,
బాలచంద్రుని ప్రస్తావనతో మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
*
సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
మీరు మిస్సన్న గారి లాగా బాలచంద్రుని విషయంగా స్వీకరించినా మీ పూరణ శబ్దసౌందర్యంతో విలసిల్లుతూ మనోహరంగా ఉంది. అభినందనలు.
*
కమనీయం గారూ,
మీ పూరణ కరుణరస భరితమై అలరారుతున్నది. అభినందనలు.
గురువుగారికి, పెద్దలందరికీ నమస్కారములు.
రిప్లయితొలగించండిఇన్ని రోజుల తర్వాత శంకరాభరణ దర్శనము ఆనందము కలిగించినది.
గురువుగారి అబ్బాయి ఆరోగ్యం చక్కబడిందనుకుంటాను.
అత్రి అహల్య సమస్య పూరణ చేయలేక విడిచి, మిగిలినవి అన్నీ వ్రాసి పోస్ట్ చేయుచున్నాను. గమనించగలరు.
పెక్కగు సాధనమ్ములను పేర్మిని మానిసి నేర్పుతోడ తా
చక్కగ వాడనేర్చెనొక జాలపు గూటిని తోటివారితో
చొక్కపు రీతులందు కడు సొంపుగ నింపుగ లేఖ వ్రాయ నా
రెక్కలురాని పక్షి యెగిరెన్ వినువీధిని ఱివ్వుఱివ్వునన్.
బీరముల్ పలు విధముల పెక్కు మార్లు
పల్కె; పెంచుచు మూర్ఖపు భ్రమల కోటి,
వైరి బలముల నరయక పలికి, నాడు
కర్ణుఁడు సుయోధనుని జంపెఁ గదనమందు.
సురలను గెల్చినాడనని సొక్కెడు వైరిని రావణాసురున్
వరములగర్వమందదొక భ్రాంతిని చావిక రాదటంచునున్
తరుణిని మాయజేసి కడు ధైర్యముఁ జూపిన మూర్ఖుడైన దం
భ రతునిఁ జంపె రాఘవుడు భామినికై సురకోటి మెచ్చఁగన్.
మాపటి వేళల చీకటి
మాపగ వెలిగించితి చిరు మట్టి ప్రమిద లో
దీపింపగ; ప్రొద్దుట నా
దీపము నార్పఁగ గృహమునఁ దేజ మ్మెసఁగెన్.
ఇచ్చకమై పిల్లలకును
వచ్చును దీపావళి యను పండుగ; నవమిన్
వచ్చెడు రాముని పండుగ
తెచ్చును వేసవి శలవుల దివ్యమ్మదియే.
వరియించి వచ్చు కన్యను
సరికాదను ప్రవరుకథను సామర్థ్యముగా
విరచించిన మను చరితము
విరసంబౌ కావ్యమొ, ప్పె వీనుల విందై.
ఆరు శత్రువులందున నమిత సులభ
రీతి పోగొట్ట గలిగిన లెస్సయయిన
దిదియె నమ్ము బాలక! విని యెఱుగ వేమి?
క్రోధమే మేలుగద సర్వగుణములందు.
తలతిరిగెడు నొక రోగము
కొలువైయున్నట్టి మేను కొరతల మదిలో
కలత పడెడు వేళలలో
కలి గలిగిన వానియింట కలవే సుఖముల్.
కొద్ది కుతూహలంబు, చిఱు కోరిక కల్గగ పద్యవిద్యలో
నెద్ది,ఘనంబునై వెలయు హెచ్చగు జ్ఞానము? శూన్యమే సుమా!
సుద్దుల తీరుగా పలికి సొక్కెడు నాకిది నిక్కమేయగున్
పద్దెము వ్రాయు విద్దె యనఁ బాచిక లాడిన చందమే సుమా!
యమునినైన నింకెవ్వరినైన భక్త
జనుల బాధవెట్టెడు వారి క్షణములోనె
నాశమొనరింప గలవాడు నైన శివుడు
కాలితోఁ దన్నుటే మేటి కనికరమ్ము.
సీమాంతరమేగి మరల
గ్రామమునకు మరలువేళ కాంతాగ్రజుడే
ప్రేముడి నా తండ్రిని గనె;
మామా యని బావమఱఁది మాటలు గలిపెన్
మించిన శోకమందకట మృత్యువు మేలనిపింపజేయు; నే
వంచన లేని ధర్మపరిపాలన పుట్టుక చావులాపు; నీ
వెంచుకొనంగ నేమరకమెప్పుడు; దుఃఖము తోడు జేర్చి యీ
సంచిత పాప కర్మములు సౌఖ్యము లిచ్చును జన్మజన్మలన్.
కోరిన వరములనెల్లను
బేరములాడక యొసగెడు పేరిమి దైవం
బై రూఢియయిన కరుణా
క్షీరాబ్ధిశయనుఁ డనంగ శివుఁడే గదరా!
కూరిమి దాను భక్తులకు కోర్కెల దీర్చు దయామృతాబ్ధి శ్రీ
నీరజనేత్రి దీవనల నెమ్మనమందున కోరువారికిన్
చేరి పదాంబుజమ్ములను సెల్వమటంచు భజించువారికిన్
గౌరియె యేఱు గంగ నదికాదని యందురు పండితోత్తమ్ముల్.
గతిలేక వాని పదముల
సతతము సేవించుచున్న జనులందరికా
వెతలను దీర్పంగ మహిషపతి
తల ఖండించెనంట పార్వతి కినుకన్.
ఇచ్చిన నొక మాటకనుచు
హెచ్చయిన బాధ పడు కథ నెట్లు వినెనొ
నచ్చట నిలిచి మేసెడి యాశ వీడె;
పచ్చికను దిన నొల్లదు పాడియావు.
వాలిని,వాని సోదరుని వైరముఁ దీర్చి సయోధ్య జేయగా
జాలకపోయె, బల్మిగొని సంగరమందున నిల్చిపోరగా
పోలిక లేని వీర వరపుత్రుని రామునిఁ జేర్చె తోడుగా;
వాలిని సంహరించినది వాయుసుతుండని నమ్మిరందఱున్.
అల శంకరార్యులనుఁ గని
విలపించెను తరుణిదాను వేదనతోడన్
కలదే భాగ్యమటంచున్.
కలిమి గలుఁగు గృహిణి కంటఁ గన్నీ రొలుకన్.
కలమునుఁ బట్టు ధీమతులు, కత్తినిఁ బట్టిన వీరులిద్ధరన్
నిలిచి యశమ్ముఁ బొందుదురు,నిశ్చయమియ్యది యాలకించినన్
పలువిధ గాధలియ్యెడను పాడగ వింటిమి బాల్యమందునన్;
తలచినఁ గంట నీరమిక ధారలు గట్టును సంతసమ్మునన్.
అతిశయ మొక్కెడ శ్రోతక
మితమగు నానందమిడగ మెచ్చునటంచున్
శతవిధముల యత్నములను
సతతము కవులెల్ల జేయ సమ్మతమగునే?
లక్ష్మీదేవి గారూ అభినందనలు. మీ ఆసక్తి అనన్యసామాన్యం.
రిప్లయితొలగించండిలక్ష్మీదేవి గారూ,
రిప్లయితొలగించండిశంకరాభరణం పట్ల మీకున్న అవ్యాజానురాగానికి ముగ్ధుడనయ్యాను. ధన్యవాదాలు.
మీ పూరణలను తీరికగా పరిశీలించి, ఆయా సమస్యల క్రింద పోస్ట్ చేస్తాను.
మిస్సన్న గారూ, సంతో్షమండీ.
రిప్లయితొలగించండిగురువు గారూ,పరిశీలనకు అనువు గా ఉంటుందని ఇక్కడ ఉంచినాను.
ఆయా సమస్యల క్రింద పోస్ట్ చేసే శ్రమ తీసుకోవడం ఎందుకు? నేను చేస్తాను.
నా తప్పులను దిద్దుకొని నేర్చుకోగలిగే అవకాశం ఉంటే నాకు చాలు.
అన్నీ ఓపికతో చూస్తానన్నందుకే సంతో్షం కలిగినది.
అనేక ధన్యవాదాలు మీకు.
లక్ష్మీదేవి గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణలన్నీ అద్భుతంగా ఉన్నాయి. అభినందనలు.
"పచ్చికఁ దిన నొల్లదు...." పూరణలో మొదటి పాదం కంద మయింది. దానిని తేటగీతిగా మార్చండి. "ఇచ్చినట్టి మాట నిలుప నిచ్చగించి" అంటే ఎలా ఉంటుంది?
గురువుగారూ,
రిప్లయితొలగించండిఅనేక ధన్యవాదాలు. పొరబాటుగ కంద పాదంతో మొదలు పెట్టినట్టున్నాను. మన్నించగలరు.
మీ సవరణ బాగున్నది. సవరించి ఆ పూరణను ఆ పోస్ట్ లో ప్రచురిస్తాను.
అన్నీ ఆయా పోస్ట్ లలో ప్రచురిస్తాను.
రెక్కలు లేని పక్షియని రివ్వున లేచుచు తల్లి ప్రేమతో
రిప్లయితొలగించండిమక్కువతోడ మైమరచి మబ్బుల మాటున పట్టి కాళ్ళతో
చక్కని పక్షికూనను విశాల నభమ్మున త్రిప్పుచుండగా
రెక్కలురాని పక్షి యెగిరెన్ వినువీధిని ఱివ్వుఱివ్వునన్ !
బొడ్డు శంకరయ్య గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
రక్కస రాజకీయమున రంధుల నందున నేర్పు లేకయే
రిప్లయితొలగించండిగ్రక్కున దూకి కాంగ్రెసున గారవ మొందగ నేతగా భళా
చక్కని చుక్క వద్ర నట షౌకుగ చూడగ తోచునిట్టులన్:
రెక్కలురాని పక్షి యెగిరెన్ వినువీధిని ఱివ్వుఱివ్వునన్