ఆస్తి పంచుకొని విడిపోయి అప్పుల పాలై అలమటిస్తున్న తమ్ముళ్ళను యెంత మందిని యెన్ని సినిమాలలో చూడలేదు మనం !
అటువంటి తమ్మునితో ఒక అన్న :
01) _______________________________ కలసి యున్న శుభము - గలుగును వినుమన్న నాడు వినగ వైతి - నాదు మాట ! నేడు చూడు మిటుల - నిర్భాగ్యు డైతివి బుద్ధి నీకు లేదు - పుణ్యమూర్తి ! _______________________________
సత్యమూర్తి , పుణ్యమూర్తి రెండు పిల్లుల పేళ్ళు ! కలసి సంపాదించిన రొట్టెను సమంగా పంచుకోలేక నాకెక్కువ కావాలంటే నాకే యెక్కువ కావాలని దెబ్బలాడుకొని చివరికి ఒక కోతికి సమర్పించుకున్న తరువాత సత్యమూర్తి పుణ్యమూర్తితో :
02) _______________________________
కష్ట పడితిమి గద - కలసి యిరువురము సగము నాకు మరియు - సగము నీకు ననిన వినక కపికి- నర్పించితివి చూడు బుద్ధి నీకు లేదు - పుణ్యమూర్తి ! _______________________________
"వద్దని పెద్దలు చెప్పినా వినకుండా జూదమాడి , యోడి భార్యతో సహా కురుసభలో అవమానింప బడినప్పుడు నేను కోపావేశముతో రారాజును చంపబోతుంటే బుద్ధి లేకుండా ధర్మం గిర్మం అంటూ అడ్డు చెప్పావు ! ఆనాడు నీవడ్డు పడకుండా ఉండి ఉంటే ఈ అరణ్యవాసాలూ, అఙ్ఞాతవాసాలూ , రాయబారాలూ లేకుండా ఆనాడే నీవు రాజై ఉందువు గదా పుణ్యమూర్తీ"(నిందావాచకము) అంటూ ధర్మరాజు నధిక్షేపిస్తున్న భీముడు :
04) _______________________________
వలదు జూదమన్న - వారి మాట వినక భంగ పడితి మవ్వ!!! - భార్యతోడ నాడు రాజు జంప - నాపితి వేలనో బుద్ధి నీకు లేదు - పుణ్యమూర్తి ! _______________________________
మాయాబజారు సినిమాలో లక్ష్మణ కుమారునితో శశిరేఖ వివాహం నిశ్చయించు కొచ్చానని మహదానందంతో బలరాముడు చెప్పినప్పుడు
శ్రీకృష్ణుని స్వగతం :
05) _______________________________
ఆశ బెట్టి యిటుల - నభిమన్యు , శశిరేఖ ప్రేమ ద్రుంచ నగునె - పెద్ద వయ్యు ? చేతును సరి దీని - చిత్రాతి చిత్రంబు ! బుద్ధి నీకు లేదు - పుణ్యమూర్తి ! _______________________________
రాజు వైన నీవు - రాజసముగ జంపు ! చెట్టు చాటు నుండి - చెండ నేల ? నీతి లేనివాడ ! - నిర్దయా పూర్ణుడ ! బుద్ధి నీకు లేదు - పుణ్యమూర్తి !(నిందావాచకము) _______________________________
శ్రీకృష్ణపాండవీయం సినిమాలో నిద్రపోతున్న భీమునితో మత్తు వదలరా నిద్దుర మత్తు వదలరా అంటూ శ్రీకృష్ణుడు :
07) _______________________________
నిద్ర పోకు మిచట - భద్రత కరువౌను నేతి వాస నిచటి - నిలయమంత ! తెలివి లేని మేటి - తిండిపోతువు నీవు ! బుద్ధి నీకు లేదు - పుణ్యమూర్తి !(నిందావాచకము) _______________________________
బ్రహ్మ దేవుని వాహన మైన హంస నల చక్రవర్తి గుణ గణము లను దమయంతి వద్దను దమయంతి అందచందాలను నలచక్రవర్తి యొద్దను నుడివి వారి మధ్య రాయబారము నెఱపి , పరస్పరానురాగ బద్దులగునట్లు చేస్తుంది.
కుమార్తె మనసెరిగిన ఆమె తండ్రి స్వయంవరం ప్రకటించి సమస్త దేశాధీశులకూ వర్తమానం పంపిస్తాడు.
దమయంతిని మోహించిన ఇంద్రాగ్నియమవరుణులు నల దమయంతుల ప్రేమ నెరిగిన వారగుటచే నలుడు ఏమి చెప్పిననూ దమయంతి వినునని భావించి నలుడినే రాయబారిగా దమయంతి వద్దకు పంపనెంచి నలుగురు కలిసి కపటబుద్ధితో నలుని సమీపించి సహాయ మర్థించ నలుడు వేల్పులకు వందనము లాచరించి మీ చెప్పిన చొప్పున చేసెద చప్పున చెప్పుడని యడుగగా వారు కపటమును కనబడనీయకుండా చిరునవ్వులు రువ్వుతూ ఏమి చెప్పిననూ తప్పక చేయుదునని వాగ్ధానము చేయ మంటారు. అప్పుడు నలుడా వేల్పులతో
01) || తేటగీతి ||
తా రకా వళి, తమ గతుల్ - తప్పు గా క ! పొడుచు గావుత, సూర్యుడు - పడమటి దిశ ! పలికి బొంకడు, శశి వంశ - పా లకుండు! ప్రతిన బూనితి ! ఇదియె , నా - పితరు లాన !
నలుడి చ్చిన వాగ్దానముతో, సంతృప్తి జెందిన వేల్పులు అతనితో, తాము దమయంతిని వరించితిమి కావున , నీవు దమయంతి యొద్దకు వెళ్ళి మా గుణ గణ ములను వర్ణించి , మాలో ఏ ఒక్కరినైనా ఆమె వివాహము చేసుకొనుటకు , సమ్మతించునట్లు ప్రయత్నించ వలయునని , నలుణ్ణి దమయంతి వద్దకు రాయబారిగా పంపుతారు.
వేల్పుల కోరిక మేరకు రాయబారిగా వెళ్ళిన నలుడు , దమయంతితో.....
02) || మత్తేభము ||
అతివా ! దాపగ నేల ? ని న్వలచి , నీ - కత్యంత , సంతాప , దు స్థితి , చేకూరిచి , మీరరాని , సుర సం - దేశంబున , న్నేడు , ని న్వెతలం బెట్టగ , యేగు దెంచిన , మహా - నిర్భాగ్యు , డాపాపి , యా హిత దూరుం , డవివేకి , యా నలుడు , వీ - డే సుమ్ము ! బింబాధరా !!
యనుచు రాయబారిగ వచ్చిన నలునితో దమయంతి :
08) _______________________________
నిన్ను నేను మిగుల - ప్రేమించు చుండగా ననిమిషులను బెండ్లి - యాడు మనుచు రాయబారిగ నువు - రారాదు నలరాజ ! బుద్ధి నీకు లేదు - పుణ్యమూర్తి ! _______________________________
వసంత కిశోర్ గారూ, మీ ఎనిమిది పూరణలతో ఇవాళ నిజమైన శుభోదయమయింది. సంతోషం. అన్ని పూరణలూ వైవిధ్యంగా ఉన్నాయి. అభినందనలు. నలదమయంతుల పూరణలో మొదటి పాదంలో యతి తప్పింది. ‘నిన్ను నేను మిగుల మన్నించుచుండగా’ అంటే ఎలా ఉంటుంది? ‘నువు’ అన్న ప్రయోగమూ దోషమే. ‘రాయబారి వగుచు రారాదు...’ అనండి. * రాజేశ్వరి అక్కయ్యా, కర్యదీక్షను వదిలే బుద్ధిని గురించిన మీ మొదటి పూరణ బాగుంది. దుష్టబుద్ధిని గురించిన రెండవ పూరణ చక్కగా ఉంది. అభినందనలు. * సహదేవుడు గారూ, హరిశ్చంద్రుడు విషయంగా మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
వసంత కిశోర్ గారూ సవరించిన మీ పూరణ బాగుంది. అభినందనలు. ‘నువు’ శబ్దం విషయంలో నేను పొరబడ్డాను. మీరు చెప్పిందే సరియైనది. మన్నించండి. * పండిత నేమాని వారూ, ధన్యవాదాలు. నన్ను సంబోధిస్తూ మంచి పూరణ రూప ప్రసంసాపద్యాన్ని వ్రాసి ఆశీస్సులందించారు. సంతోషం. కాని ఆ విశేషణాలకు అర్హత లేనివాడనే.
చింతా రామకృష్ణారావు గారూ, ప్రొద్దు పొడవగానే బ్లాగులో మీ దర్శనం ఆనందాన్ని కలిగించింది. దుర్బుద్ధి లేనివాడను కనుకనే వృద్ధాశ్రమం దిక్కయింది. మీ పూరణ రూపంలో ఉన్న ప్రశంసకు ధన్యవాదాలు.
శ్రీ శంకరయ్య గురుదేవులకు, శ్రీ నేమాని గురుదేవులకు వినమ్రవందనములతో.....
శ్రీ శంకరయ్య గురుదేవులకు ధన్యవాదములతో...
నేను చదివిన పాట లోని భావము =======*============== భూమిజ పతి వైన భూమి లోన విషమ బుధ్ధి నీకు లేదు పుణ్యమూర్తి! దారి జూపు మయ్య దారిద్రుడను గాన భద్ర శైల ధామ బాగుగాను !
సత్యభామ శ్రీ కృష్ణుని తో =======*============== పలుకు లందు తీపి పంచదారను మించు బుధ్ధి లేదు నీకు పుణ్యమూర్తి, గోప సతుల తోడ కోలాటము గని నా మనము గాయ మయ్యె మంచి గాను !
కెంబాయి తిమ్మాజీ రావు గారూ, మీ పూరణ బాగుంది. అభినందనలు. * వరప్రసాద్ గారూ, మీ నాలుగు పూరణలు బాగున్నవి. అభినందనలు. * పండిత నేమాని వారూ, మీ రెండవ పూరణలోని సందేశాన్ని అవగతం చేసికొన్నాను. ధన్యవాదాలు. * సుబ్బారావు గారూ, పూరణ వ్యాజంతో నన్ను ప్రశంసించినందుకు ధన్యవాదాలు.
శ్రీ శంకరయ్య గురుదేవులకు ధన్యవాదములతో... శ్రీ హరి శివుని తో ==========*============= వైరి రిపుల కెల్ల వరము లిచ్చు చు నుండ వరము లొంది వారు కరము జూప వరము లొసగు వేళ బార్వతికి దెలుపు బుధ్ధి లేదు నీకు పుణ్యమూర్తి,
ప్రహాల్లదుని తో తండ్రి ============*================ హరి హరి యని నీవు వైరి పాదము బట్ట బుధ్ధి లేదు నీకు, పుణ్యమూర్తి శివుని పదము బట్టు స్థిరము గాను సుతుడా! పొంక మలర వరము పొంద గలవు
అలవాటు లో పొరబాటు "బుధ్ధి నీకు లేదు పుణ్యమూర్తి" "బుధ్ధి లేదు నీకు, పుణ్యమూర్తి " యయినది . మన్నించ గలరు తండ్రి తో ప్రహాల్లదుడు =========*========= హరి హరి యని బిలువ యా హరి యొసగు స ద్బుధ్ధి నీకు, లేదు పుణ్యమూర్తి మదిని దుష్ట బుద్ది మరణ కాలము నందు హరి హరి యన జాలు వరము లొసగు!
లక్ష్మీదేవి గారూ, పూరణ, దాని ననుసరించిన పద్యం నాకు సంతోషాన్ని కలిగించాయి. ధన్యవాదాలు. మిసన్న గారి వ్యాఖ్యను గమనించారు కదా! మొదటి పద్యం మొదటి పాదాన్ని ‘నాటి పూరణముల నానాడె పఠియించి’ అందాం. రెండవ పద్యంలో ‘సులభరీతి నొప్పుగా’ అందాం. అఖండ యతి అవుతుంది. అయినా ఫరవాలేదు. * చింతా రామకృష్ణా రావు గారూ, ‘ఆంధ్రామృతము’ బ్లాగులో శంకరాభరణం బ్లాగు ప్రశంసకు ధన్యవాదాలు. మీ సహకారం ఇలాగే కొనసాగించాలని మనవి. * వరప్రసాద్ గారూ, మీ తాజా పూరణలు రెండూ బాగున్నవి. అభినందనలు. మొదటి పూరణ మొదటి పాదంలో ప్రాసయతి తప్పింది. హరి అని ప్రాసపూర్వాక్షరం లఘువైతే యతిస్థానంలో వైరి అని గురువు వేశారు. ఆ పాదాన్ని ‘వారిజాక్షు డనుచు వైరిపాదము బట్ట.." అనండి. మీ సవరణ ఇప్పుడే చూశాను. ‘హరి సద్బుద్ధి నిస్తాడని’ తండ్రి ఎలా అంటాడు? అన్వయం కుదిరినట్టు లేదు. * శ్రీభాగవతుల కృష్ణారావు గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. * మిస్సన్న గారూ, శిశుపాలుని అధిక్షేపంగా మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
శ్రీ శంకరయ్య గురుదేవులకు ధన్యవాదములతో... గురువు గారు ప్రహాల్లదుని తో తండ్రి మరియు తండ్రి కి ప్రహాల్లదుడు సమాదానము
సవరణల తో " ప్రహాల్లదుని తో తండ్రి " బలుకులు ========*============== వారిజాక్షు డనుచు వైరిపాదము బట్ట బుధ్ధి లేదు నీకు, పుణ్యమూర్తి శివుని పదము బట్టు స్థిరము గాను సుతుడా పొంక మలర వరము పొంద గలవు !
తండ్రి తో ప్రహాల్లదుడు బలుకులు ============*=========== హరి హరి యని బిలువ యా హరి యొసగు స ద్బుధ్ధి నీకు, లేదు పుణ్యమూర్తి మదిని దుష్ట బుద్ది మరణ కాలము నందు హరి హరి యన జాలు వరము లొసగు !
శ్రీ సహదేవుడు గారూ! శుభాశీస్సులు. మీ పద్యము "దేశమేల గల్గు......" ను చూచేను. అభినందనలు. చిన్న సవరణ: 3వ పాదములో దేశ బాగు అను సమాసము సాధువు కాదు. దేశ ప్రగతి అని మార్చుదాము. స్వస్తి.
అందరికీ వందనములు !
రిప్లయితొలగించండిఅందరి పూరణలూ అలరింప నున్నవి !
ఆస్తి పంచుకొని విడిపోయి అప్పుల పాలై అలమటిస్తున్న
తమ్ముళ్ళను యెంత మందిని యెన్ని సినిమాలలో చూడలేదు మనం !
అటువంటి తమ్మునితో ఒక అన్న :
01)
_______________________________
కలసి యున్న శుభము - గలుగును వినుమన్న
నాడు వినగ వైతి - నాదు మాట !
నేడు చూడు మిటుల - నిర్భాగ్యు డైతివి
బుద్ధి నీకు లేదు - పుణ్యమూర్తి !
_______________________________
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిసత్యమూర్తి , పుణ్యమూర్తి రెండు పిల్లుల పేళ్ళు !
రిప్లయితొలగించండికలసి సంపాదించిన రొట్టెను సమంగా పంచుకోలేక
నాకెక్కువ కావాలంటే నాకే యెక్కువ కావాలని
దెబ్బలాడుకొని చివరికి ఒక కోతికి సమర్పించుకున్న
తరువాత సత్యమూర్తి పుణ్యమూర్తితో :
02)
_______________________________
కష్ట పడితిమి గద - కలసి యిరువురము
సగము నాకు మరియు - సగము నీకు
ననిన వినక కపికి- నర్పించితివి చూడు
బుద్ధి నీకు లేదు - పుణ్యమూర్తి !
_______________________________
అర్ధ వంత మైన యాచార వంతుడై
రిప్లయితొలగించండినిష్ట లందు నీవు నిగిడి యుండి
కష్ట మన్న గాని కార్య దీక్షను వీడు
బుద్ధి నీకు లేదు పుణ్య మూర్తి
పరీక్షలో కృతార్థుడు కాలేక పోయిన స్నేహితుడు
రిప్లయితొలగించండిపుణ్యమూర్తితో భానుమూర్తి :
03)
_______________________________
కష్టపడి చదివిన - కలుగు కృతార్థత
చెడ్డవారి గలువ - జెడెద వీవు
ననుచు నేను జెప్ప - వినవైతి వానాడు
బుద్ధి నీకు లేదు - పుణ్యమూర్తి !
_______________________________
శ్రీకృష్ణుడు రాయబారానికి బయలుదేరే ముందు
రిప్లయితొలగించండి"వద్దని పెద్దలు చెప్పినా వినకుండా జూదమాడి , యోడి
భార్యతో సహా కురుసభలో అవమానింప బడినప్పుడు
నేను కోపావేశముతో రారాజును చంపబోతుంటే
బుద్ధి లేకుండా ధర్మం గిర్మం అంటూ అడ్డు చెప్పావు !
ఆనాడు నీవడ్డు పడకుండా ఉండి ఉంటే
ఈ అరణ్యవాసాలూ, అఙ్ఞాతవాసాలూ , రాయబారాలూ
లేకుండా ఆనాడే నీవు రాజై ఉందువు గదా పుణ్యమూర్తీ"(నిందావాచకము)
అంటూ ధర్మరాజు నధిక్షేపిస్తున్న భీముడు :
04)
_______________________________
వలదు జూదమన్న - వారి మాట వినక
భంగ పడితి మవ్వ!!! - భార్యతోడ
నాడు రాజు జంప - నాపితి వేలనో
బుద్ధి నీకు లేదు - పుణ్యమూర్తి !
_______________________________
మాయాబజారు సినిమాలో
రిప్లయితొలగించండిలక్ష్మణ కుమారునితో శశిరేఖ వివాహం
నిశ్చయించు కొచ్చానని మహదానందంతో
బలరాముడు చెప్పినప్పుడు
శ్రీకృష్ణుని స్వగతం :
05)
_______________________________
ఆశ బెట్టి యిటుల - నభిమన్యు , శశిరేఖ
ప్రేమ ద్రుంచ నగునె - పెద్ద వయ్యు ?
చేతును సరి దీని - చిత్రాతి చిత్రంబు !
బుద్ధి నీకు లేదు - పుణ్యమూర్తి !
_______________________________
బాణం దెబ్బతో విలవిలలాడుతూ వాలి రామునితో :
రిప్లయితొలగించండి06)
_______________________________
రాజు వైన నీవు - రాజసముగ జంపు !
చెట్టు చాటు నుండి - చెండ నేల ?
నీతి లేనివాడ ! - నిర్దయా పూర్ణుడ !
బుద్ధి నీకు లేదు - పుణ్యమూర్తి !(నిందావాచకము)
_______________________________
శ్రీకృష్ణపాండవీయం సినిమాలో
రిప్లయితొలగించండినిద్రపోతున్న భీమునితో
మత్తు వదలరా నిద్దుర మత్తు వదలరా
అంటూ శ్రీకృష్ణుడు :
07)
_______________________________
నిద్ర పోకు మిచట - భద్రత కరువౌను
నేతి వాస నిచటి - నిలయమంత !
తెలివి లేని మేటి - తిండిపోతువు నీవు !
బుద్ధి నీకు లేదు - పుణ్యమూర్తి !(నిందావాచకము)
_______________________________
(పద్యములు నలదమయంతి చిత్రము నుండి)
రిప్లయితొలగించండిబ్రహ్మ దేవుని వాహన మైన హంస
నల చక్రవర్తి గుణ గణము లను దమయంతి వద్దను
దమయంతి అందచందాలను నలచక్రవర్తి యొద్దను నుడివి
వారి మధ్య రాయబారము నెఱపి , పరస్పరానురాగ బద్దులగునట్లు చేస్తుంది.
కుమార్తె మనసెరిగిన ఆమె తండ్రి స్వయంవరం ప్రకటించి
సమస్త దేశాధీశులకూ వర్తమానం పంపిస్తాడు.
దమయంతిని మోహించిన ఇంద్రాగ్నియమవరుణులు
నల దమయంతుల ప్రేమ నెరిగిన వారగుటచే
నలుడు ఏమి చెప్పిననూ దమయంతి వినునని భావించి
నలుడినే రాయబారిగా దమయంతి వద్దకు పంపనెంచి
నలుగురు కలిసి కపటబుద్ధితో నలుని సమీపించి
సహాయ మర్థించ
నలుడు వేల్పులకు వందనము లాచరించి
మీ చెప్పిన చొప్పున చేసెద చప్పున చెప్పుడని యడుగగా
వారు కపటమును కనబడనీయకుండా చిరునవ్వులు రువ్వుతూ
ఏమి చెప్పిననూ తప్పక చేయుదునని వాగ్ధానము చేయ మంటారు.
అప్పుడు నలుడా వేల్పులతో
01) || తేటగీతి ||
తా రకా వళి, తమ గతుల్ - తప్పు గా క !
పొడుచు గావుత, సూర్యుడు - పడమటి దిశ !
పలికి బొంకడు, శశి వంశ - పా లకుండు!
ప్రతిన బూనితి ! ఇదియె , నా - పితరు లాన !
నలుడి చ్చిన వాగ్దానముతో, సంతృప్తి జెందిన వేల్పులు అతనితో, తాము
దమయంతిని వరించితిమి కావున , నీవు దమయంతి యొద్దకు వెళ్ళి
మా గుణ గణ ములను వర్ణించి , మాలో ఏ ఒక్కరినైనా
ఆమె వివాహము చేసుకొనుటకు , సమ్మతించునట్లు
ప్రయత్నించ వలయునని , నలుణ్ణి దమయంతి
వద్దకు రాయబారిగా పంపుతారు.
వేల్పుల కోరిక మేరకు రాయబారిగా
వెళ్ళిన నలుడు , దమయంతితో.....
02) || మత్తేభము ||
అతివా ! దాపగ నేల ? ని న్వలచి , నీ - కత్యంత , సంతాప , దు
స్థితి , చేకూరిచి , మీరరాని , సుర సం - దేశంబున , న్నేడు , ని
న్వెతలం బెట్టగ , యేగు దెంచిన , మహా - నిర్భాగ్యు , డాపాపి , యా
హిత దూరుం , డవివేకి , యా నలుడు , వీ - డే సుమ్ము ! బింబాధరా !!
యనుచు రాయబారిగ వచ్చిన నలునితో దమయంతి :
08)
_______________________________
నిన్ను నేను మిగుల - ప్రేమించు చుండగా
ననిమిషులను బెండ్లి - యాడు మనుచు
రాయబారిగ నువు - రారాదు నలరాజ !
బుద్ధి నీకు లేదు - పుణ్యమూర్తి !
_______________________________
సత్యహరిశ్చంద్రుని బాధల జూచిన ప్రజల మనోగతం:
రిప్లయితొలగించండిసత్య వ్రతము నెంచి సాధించి నదిలేదు
యాలు సుతుల రాజ్య మంత వీడి
కాటి కాపు వైన కల్లలాడెడు పాడు
బుద్ధి లేదు నీకు పుణ్యమూర్తి!
అమ్మ దనము గాంచి యతివ లందరి పైన
రిప్లయితొలగించండికమ్మ నైన ప్రేమ నెమ్మ నంబు
వెగటు భావ మెంచి వెలది పైనను దుష్ట
బుద్ధి నీకు లేదు పుణ్య మూర్తి
వసంత కిశోర్ గారూ,
రిప్లయితొలగించండిమీ ఎనిమిది పూరణలతో ఇవాళ నిజమైన శుభోదయమయింది. సంతోషం.
అన్ని పూరణలూ వైవిధ్యంగా ఉన్నాయి. అభినందనలు.
నలదమయంతుల పూరణలో మొదటి పాదంలో యతి తప్పింది. ‘నిన్ను నేను మిగుల మన్నించుచుండగా’ అంటే ఎలా ఉంటుంది?
‘నువు’ అన్న ప్రయోగమూ దోషమే. ‘రాయబారి వగుచు రారాదు...’ అనండి.
*
రాజేశ్వరి అక్కయ్యా,
కర్యదీక్షను వదిలే బుద్ధిని గురించిన మీ మొదటి పూరణ బాగుంది.
దుష్టబుద్ధిని గురించిన రెండవ పూరణ చక్కగా ఉంది. అభినందనలు.
*
సహదేవుడు గారూ,
హరిశ్చంద్రుడు విషయంగా మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
శంకరార్య ! ధన్యవాదములు !
రిప్లయితొలగించండి08అ)
_______________________________
నేను నువ్వు మిగుల - నెయ్యంబు నుండగా
ననిమిషులను బెండ్లి - యాడు మనుచు
రాయబారిగ నువు - రారాదు నలరాజ !
బుద్ధి నీకు లేదు - పుణ్యమూర్తి !
_______________________________
నువు : బహుజనపల్లి శబ్దరత్నాకరము
రిప్లయితొలగించండినువ్వుయొక్క రూపాంతరము.
"నువుగింజకుఁ జోటిడదు తనువు." రా, వి. ౩, ఆ.
నువ్వు, నువు : బ్రౌణ్య తెలుగు-ఇంగ్లీష్ నిఘంటువు
nuvvu
[Tel.] n.
Sesamum; a crop of sesamum. నువ్వుచేను.
నువ్వులు sesamum seeds, తిలలు.
నువు : శ్రీహరి నిఘంటువు (రవ్వా శ్రీహరి)
వి.
నీవు. (వ్యా)
సరసభావ చతుర! శంకరార్యా! పద్య
రిప్లయితొలగించండికవుల పాలి దివ్య కల్ప భూజ!
శ్రితుల హితమె తప్ప చిక్కుల టక్కరి
బుద్ధి లేదు నీకు పుణ్యమూర్తి!
ప్రొద్దు పొడుపు ముందె పొందికగ సమస్య
రిప్లయితొలగించండిరోజుకొక్కటిచ్చి రుద్ర రూప!
వ్రాయ జేతువయ్య వాసిగ, ఘనుఁడ! దుర్
బుద్ధి నీకు లేదు పుణ్య మూర్తి.
వసంత కిశోర్ గారూ
రిప్లయితొలగించండిసవరించిన మీ పూరణ బాగుంది. అభినందనలు.
‘నువు’ శబ్దం విషయంలో నేను పొరబడ్డాను. మీరు చెప్పిందే సరియైనది. మన్నించండి.
*
పండిత నేమాని వారూ,
ధన్యవాదాలు. నన్ను సంబోధిస్తూ మంచి పూరణ రూప ప్రసంసాపద్యాన్ని వ్రాసి ఆశీస్సులందించారు. సంతోషం. కాని ఆ విశేషణాలకు అర్హత లేనివాడనే.
చింతా రామకృష్ణారావు గారూ,
రిప్లయితొలగించండిప్రొద్దు పొడవగానే బ్లాగులో మీ దర్శనం ఆనందాన్ని కలిగించింది.
దుర్బుద్ధి లేనివాడను కనుకనే వృద్ధాశ్రమం దిక్కయింది.
మీ పూరణ రూపంలో ఉన్న ప్రశంసకు ధన్యవాదాలు.
పండిత నేమానిగారికి పూజ్యగురుదేవులు
రిప్లయితొలగించండిశంకరయ్య గారికి వందనములు
స్పర్తి కైన నీవు సాయమ్ము జేతువు
మిత్రబృందములకు మేలొనర్తు
వన్నివేళలందు.నపకృతినొనరించు
బుధ్ధి లేదు నీకు పుణ్యమూర్తి
శ్రీ శంకరయ్య గురుదేవులకు, శ్రీ నేమాని గురుదేవులకు వినమ్రవందనములతో.....
రిప్లయితొలగించండిశ్రీ శంకరయ్య గురుదేవులకు ధన్యవాదములతో...
నేను చదివిన పాట లోని భావము
=======*==============
భూమిజ పతి వైన భూమి లోన విషమ
బుధ్ధి నీకు లేదు పుణ్యమూర్తి!
దారి జూపు మయ్య దారిద్రుడను గాన
భద్ర శైల ధామ బాగుగాను !
లంచావ తారుడు పలుకులు పుణ్యమూర్తి తో
రిప్లయితొలగించండి=======*==============
ఆటు పోటు లందు నలసి సొలసి నావు
వెనుకటి గుణ మేల వెఱ్ఱి వాడ !
దీప ముండ గానె దృప్తి జెంద వలయు
బుధ్ధి లేదు నీకు పుణ్యమూర్తి
లంచావ తారుడు పలుకులు పుణ్యమూర్తి తో
రిప్లయితొలగించండి=======*==============
లంచ మన్న దిపుడు లవణ మైనది జూడు,
కలిమి బలిమి గలుగ ఖలుల కిపుడు
నేత లెల్ల మ్రొక్క, నీతి యనుచు బల్క,
బుధ్ధి లేదు నీకు పుణ్యమూర్తి!
బుద్ధి లేదు నీకు పుణ్యమూర్తీ యంచు
రిప్లయితొలగించండిమందలించ రాదె మగనిని సతి?
బాధితుండ ననెడు భావమ్ము విడనాడి
శ్రేయము గనుమా విధేయుడవయి
సత్యభామ శ్రీ కృష్ణుని తో
రిప్లయితొలగించండి=======*==============
పలుకు లందు తీపి పంచదారను మించు
బుధ్ధి లేదు నీకు పుణ్యమూర్తి,
గోప సతుల తోడ కోలాటము గని నా
మనము గాయ మయ్యె మంచి గాను !
కోప గించుకొనక కూరిమి దోడన
రిప్లయితొలగించండిపూరణలను సరిగ బూర్తి జేయు
శంక రార్య ! నిన్ను శంకించ దగు జెడు
బుద్ధి నీకు లేదు పుణ్య మూర్తి !
శ్రీ సుబ్బారావు గారు, గురువు గారి పై మీ పద్యము బాగున్నది.
రిప్లయితొలగించండిమూడవ పాదం " శంక రార్య ! మమ్ము శంకించ దగు జెడు" అంటే ...
నాస్తికుఁడవు, హరిని నమ్మి కొలుచు మంచి
రిప్లయితొలగించండిబుద్ధిలేదు నీకు; పుణ్యమూర్తి
యైన రామచంద్రుఁ బూని ధ్యానించిన
నిహము పరములందు హితము గలుఁగు.
వరప్రసాద్ గారూ,
రిప్లయితొలగించండి“మిమ్మల్ని శంకించదగినట్టి చెడ్డబుద్ధి లేదు.." అని భావం.
కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగుంది. అభినందనలు.
*
వరప్రసాద్ గారూ,
మీ నాలుగు పూరణలు బాగున్నవి. అభినందనలు.
*
పండిత నేమాని వారూ,
మీ రెండవ పూరణలోని సందేశాన్ని అవగతం చేసికొన్నాను. ధన్యవాదాలు.
*
సుబ్బారావు గారూ,
పూరణ వ్యాజంతో నన్ను ప్రశంసించినందుకు ధన్యవాదాలు.
నాటి పూరణలెన్నైన నాడె చదివి
రిప్లయితొలగించండియొప్పు తప్పు దిద్దు యోర్మి గలదు!
రవ్వ యంత యేని లాభమాశించెడు
బుద్ధి నీకు లేదు-- పుణ్య మూర్తి
వీవు గురువు వైతి! వెట్టి పుణ్యము మాది
బడుల జదవకున్న బాధ వలద
నుచును సులభ రీతి యొప్పుగా బోధించు
సజ్జనుండ!మీకు జయము గలుగు!
లక్ష్మీదేవి గారూ! మీ పద్యాలలో మొదటి పదం తేట గీతి, మిగిలిన పాదాలు ఆటవెలది గాను కనుపిస్తున్నాయి. 7 వ పాదంలో యతి సందేహం.
రిప్లయితొలగించండిశంకరాభరణం బ్లాగులో ఇచ్చిన నాకు నచ్చిన సమస్య - దానికి నా పూరణము.
రిప్లయితొలగించండిhttp://andhraamrutham.blogspot.in/2013/11/blog-post_18.html
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిశ్రీ శంకరయ్య గురుదేవులకు ధన్యవాదములతో...
రిప్లయితొలగించండిశ్రీ హరి శివుని తో
==========*=============
వైరి రిపుల కెల్ల వరము లిచ్చు చు నుండ
వరము లొంది వారు కరము జూప
వరము లొసగు వేళ బార్వతికి దెలుపు
బుధ్ధి లేదు నీకు పుణ్యమూర్తి,
ప్రహాల్లదుని తో తండ్రి
============*================
హరి హరి యని నీవు వైరి పాదము బట్ట
బుధ్ధి లేదు నీకు, పుణ్యమూర్తి
శివుని పదము బట్టు స్థిరము గాను సుతుడా!
పొంక మలర వరము పొంద గలవు
అలవాటు లో పొరబాటు "బుధ్ధి నీకు లేదు పుణ్యమూర్తి" "బుధ్ధి లేదు నీకు, పుణ్యమూర్తి "
రిప్లయితొలగించండియయినది . మన్నించ గలరు
తండ్రి తో ప్రహాల్లదుడు
=========*=========
హరి హరి యని బిలువ యా హరి యొసగు స
ద్బుధ్ధి నీకు, లేదు పుణ్యమూర్తి
మదిని దుష్ట బుద్ది మరణ కాలము నందు
హరి హరి యన జాలు వరము లొసగు!
పండిత నేమాని గారికి పూజ్యగురుదేవులు
రిప్లయితొలగించండిశంకరయ్య గారికి వందనములు
శ్రీ భాగవతుల కృష్ణారావు గారి పూరణ
నాస్తికుడవు నీవు నారాయణుని గొల్చు
బుద్ధి నీకులేదు .పుణ్య మూర్తి
యతడు రక్ష నొసగి హితమును గూర్చున
టంచు ఋషులు దెల్పి రనఘు లార
రాజసూయాగ్రపూజకు కృష్ణుడు తగడంటూ శిశుపాలుడు ధర్మరాజుతో పల్కిన సందర్భంలో:
రిప్లయితొలగించండిరాజ సూయ మందు పూజకై ధర్మజ!
పసుల కాప రేల భావ్య మాయె?
బుద్ధి నీకు లేదు పుణ్యమూర్తి నదీసు-
తుండు లేడె నీకు దొంగ దొరికె!
లక్ష్మీదేవి గారూ,
రిప్లయితొలగించండిపూరణ, దాని ననుసరించిన పద్యం నాకు సంతోషాన్ని కలిగించాయి. ధన్యవాదాలు.
మిసన్న గారి వ్యాఖ్యను గమనించారు కదా!
మొదటి పద్యం మొదటి పాదాన్ని ‘నాటి పూరణముల నానాడె పఠియించి’ అందాం.
రెండవ పద్యంలో ‘సులభరీతి నొప్పుగా’ అందాం. అఖండ యతి అవుతుంది. అయినా ఫరవాలేదు.
*
చింతా రామకృష్ణా రావు గారూ,
‘ఆంధ్రామృతము’ బ్లాగులో శంకరాభరణం బ్లాగు ప్రశంసకు ధన్యవాదాలు. మీ సహకారం ఇలాగే కొనసాగించాలని మనవి.
*
వరప్రసాద్ గారూ,
మీ తాజా పూరణలు రెండూ బాగున్నవి. అభినందనలు.
మొదటి పూరణ మొదటి పాదంలో ప్రాసయతి తప్పింది. హరి అని ప్రాసపూర్వాక్షరం లఘువైతే యతిస్థానంలో వైరి అని గురువు వేశారు. ఆ పాదాన్ని ‘వారిజాక్షు డనుచు వైరిపాదము బట్ట.." అనండి.
మీ సవరణ ఇప్పుడే చూశాను. ‘హరి సద్బుద్ధి నిస్తాడని’ తండ్రి ఎలా అంటాడు? అన్వయం కుదిరినట్టు లేదు.
*
శ్రీభాగవతుల కృష్ణారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*
మిస్సన్న గారూ,
శిశుపాలుని అధిక్షేపంగా మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
శ్రీ శంకరయ్య గురుదేవులకు ధన్యవాదములతో...
రిప్లయితొలగించండిగురువు గారు ప్రహాల్లదుని తో తండ్రి మరియు తండ్రి కి ప్రహాల్లదుడు సమాదానము
సవరణల తో " ప్రహాల్లదుని తో తండ్రి " బలుకులు
========*==============
వారిజాక్షు డనుచు వైరిపాదము బట్ట
బుధ్ధి లేదు నీకు, పుణ్యమూర్తి
శివుని పదము బట్టు స్థిరము గాను సుతుడా
పొంక మలర వరము పొంద గలవు !
తండ్రి తో ప్రహాల్లదుడు బలుకులు
============*===========
హరి హరి యని బిలువ యా హరి యొసగు స
ద్బుధ్ధి నీకు, లేదు పుణ్యమూర్తి
మదిని దుష్ట బుద్ది మరణ కాలము నందు
హరి హరి యన జాలు వరము లొసగు !
మిస్సన్న గారూ, గురువు గారూ, ధన్యవాదాలండి.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిదేశమేల గల్గు దిట్టవై యుండియు
రిప్లయితొలగించండినమ్మ మాట మిగుల యాన జూడ
దేశ బాగు కైన దిగులుతో నెదురెంచు
బుద్ధి నీకు లేదు పుణ్యమూర్తి!
మంచి మనసు తోడ మనసు నొప్పించక
రిప్లయితొలగించండిమిత్ర గణము నొంది మేటి గాను
శంకరాభరణము సంచాలకుడవు కు
బుద్ధి నీకు లేదు పుణ్య మూర్తి
శంకరార్య మీరు శంకరా భరణమ్ముఁ
రిప్లయితొలగించండిబద్దె విద్య నేర్పు గద్దె జేసి
సద్విమర్శ లొసఁగ సహనమ్ము వీడెడు
బుద్ధి నీకు లేదు పుణ్యమూర్తి
పరుల నిందజేసి పరమ సంతోషమ్ము
రిప్లయితొలగించండిపరుల ధనము దోచి పండుగలను
పొంది బ్రతుకు గడుపు పుచ్చుచచ్చుల ముష్టి
బుద్ధి నీకు లేదు పుణ్యమూర్తి
శ్రీ సహదేవుడు గారూ! శుభాశీస్సులు.
రిప్లయితొలగించండిమీ పద్యము "దేశమేల గల్గు......" ను చూచేను. అభినందనలు.
చిన్న సవరణ: 3వ పాదములో దేశ బాగు అను సమాసము సాధువు కాదు. దేశ ప్రగతి అని మార్చుదాము. స్వస్తి.
శ్రీ నేమని గురువర్యులకు వందనములు. తమరి సూచనకు ధన్యవాదములు సవరించిన పద్యం:దేశమేల గల్గు దిట్టవై యుండియు
రిప్లయితొలగించండినమ్మ మాట మిగుల యాన జూడ
దేశ ప్రగతి కైన దిగులుతో నెదురెంచు
బుద్ధి నీకు లేదు పుణ్యమూర్తి!