శ్రీ కంది శంకరయ్య గారూ! శుభాశీస్సులు. గన్నవరము జామకాయలు మరియు కడప మిరియములు గురించిన అతిశయోక్తిగా మీరు జరిపించిన సంభాషణ పద్యము బాగున్నది. అభినందనలు. స్వస్తి.
కడప మిరియములు గుమ్మడి కాయలనడం వంటిదే ఈ విభజిస్తే యేదో వస్తుందనడం కూడా :
01) ___________________________________
కళ్ళు తెరుతురు విభజన - ఘాతకులును కలసి యున్ననె సుఖములు - గలుగు నంచు ! కడకు మిగులును విభజన - కావ్యమందు కడప మిరియముల్ గుమ్మడి - కాయలంత !!! ___________________________________
రిప్లయితొలగించండిఅడప మురిపెముల్ అమ్మడి సొగసంత
గడప మురిపెముల్ వల్లి రంగులంత
ఒడప మురిపెముల్ వాగు చెలు వంత
కడప మిరియముల్ గుమ్మడికాయలంత!!
శుభోదయం
జిలేబి
(పరార్!)
కాన వచ్చుచునుండు విజ్ఞాన శాస్త్ర
రిప్లయితొలగించండివేత్తల ప్రయోగ శాలలో వింత గొలుపు
నట్టి యాంత్రి కాదర్శక మందు గనిన
కడప మిరియముల్ గుమ్మడి కాయలంత
(యాంత్రికాదర్శకము = మైక్రోస్కోపు)
మిత్రులందరకు శుభాశీస్సులు.
రిప్లయితొలగించండిమరియొక సారి నా మనవి:
మన బ్లాగులో వర్గ వైషమ్యములకు గాని ప్రాంతీయ భేదములకు గాని ఇతరములైన సున్నితములైన విషయములను గురించి గాని ఎట్టి ప్రస్తావనలును తేవద్దు. స్వస్తి.
గండు చీమల చిత్రమున్ గనుచు నుంటి
రిప్లయితొలగించండిచిత్రమైనట్టి పాట్లనే చీమ పడియె
దూలమంతగ కనబడు మ్రోల నింటి
కడప, మిరియముల్ గుమ్మడి కాయలంత
అతిశయోక్తుల యల్లుడు నాడె నిటుల
రిప్లయితొలగించండికడప నా జన్మభూమని గర్వపడుదు
బాంబు మోతల తెలవార పగలు మాకు
పిల్లవాడైన తొడగొట్టి బెదర గొట్టు
కడప మిరియముల్ గుమ్మడి కాయ లంత!
కడప మిరియముల్ గుమ్మడి కాయ లంత
రిప్లయితొలగించండియగుపడును మఱి భూతద్ద మందు జూడ
ఒక్క కడపయే కాకుండ యెక్క డైన
నటులె గన్పడు నిజమిది యార్య ! యౌన ?
పండిత నేమాని గారికి పూజ్యగురుదేవులు
రిప్లయితొలగించండిశంకరయ్య గారికివందనములు
పళ్ళెరమునందు బియ్యము పనసపండు
కాయ గూరలు తములము కాంచనమ్ము
కడప మిరియముల్ గుమ్మడి కాయలంత
చెరకు బెల్లపు ముద్ద భూ సురులకిడిరి
కార్తికమ్మున నింతులు కలుగ సంతు
ఆరు ఆడుగుల గెలవేసె అరటి చెట్టు
రిప్లయితొలగించండికంది చేనుకి నువ్వులు కాపు కాసె
కడప మిరియముల్ గుమ్మడి కాయ లంత
కలవు వింతలు యెన్నియో కలి యుగాన
శ్రీ శంకరయ్య గురుదేవులకు, శ్రీ నేమాని గురుదేవులకు వినమ్రవందనములతో.....
రిప్లయితొలగించండిశ్రీ శంకరయ్య గురుదేవులకు, శ్రీ నేమాని గురుదేవులకు ధన్యవాదములతో...
ఈ మధ్య క్రొత్త రకపు వంగడములు వచ్చు చున్నవి
ఉ : పసుపు పచ్చ కాప్ ఛికమ్ , ఒక కేజీ వంకాయ మొ ...
=======*===============
కూర గాయలు (గాయాలు) గొన బోతి నూరి సంత
కు, మురిపించెను ముందుగా క్రొత్త రకపు
కడప మిరియముల్ గుమ్మడి కాయ లంత
గలవు, మెరయు చుండెను ద్రాక్ష ఫలముల వలె!
టంగుటూరి మిర్యమ్ముల మ్రింగ లేము
రిప్లయితొలగించండితాటి పండ్లంత నుంటచే, తాత చెప్పె
కాని వినలేదు సామెత దీని నేను
కడప మిరియముల్ గుమ్మడికాయలంత.
కడప ప్రాంతము నందున గడప గడప
రిప్లయితొలగించండిబాంబులు తయారు గావించు పనుల యందు
చిన్నవారు పెద్ద పనుల జేయు విధము
రోషమును గలిగించగా లోకులకును
కడప మిరియముల్ గుమ్మడి కాయలంత
ఒక వస్తువుయొక్క పరిమాణము పెద్దదా చిన్నదా అనేది పోలికతో మాత్రమే చెప్పగలము కానీ ఇదమిద్ధంగా యిది అని చెప్పలేము కదా అనే భావన.
రిప్లయితొలగించండిఈ పూరణ సమస్యను పరిష్కరిస్తుందో లేదో గురువుగారే శెలవియ్యాలి.
సూక్ష్మజీవులు = చీమలు మొ!!
పిల్లతనమున నిచ్చెన పెద్దదిగను
పెరిగినప్పుడు చూడగ కురుచ యగును
సూక్ష్మ జీవుల దృష్టితో చూచినపుడు
కడప మిరియముల్ గుమాడికాయలంత
శాస్త్ర వేత్తలు శోధనశాల యందు
రిప్లయితొలగించండిసూక్ష్మ దర్శితో ఖాద్య వస్తువుల నరయు
చుండ వారలకగుపడె జోద్యముగను
కడప మిరియముల్ గుమ్మడి కాయలంత.
దొరుకు చున్నవి గగనంపు తోట లోన
రిప్లయితొలగించండివెలుగు చున్నవి చుక్కల పూలు మెండు
చంద మామను మించిన జాతి ఫలము
కడప మిరియముల్ గుమ్మడి కాయ లంత
పండిత నేమాని గారికి పూజ్యగురుదేవులు
రిప్లయితొలగించండిశంకరయ్య గారికివందనములు
శౌర్య సాహస విక్రమ ఛవినిపెంచు
కడప మిరియముల్.గుమ్మడి కాయలంత
వజ్ర వైడూర్యమణులతో వాసికెక్కి
కడప రాయలసీమలో గ్రాలుచుండు
రిప్లయితొలగించండిఇరువు రొకచోఁ గలిసి తమ పురముల ప్ర
శస్తి గొప్పగాఁ జెప్పఁగసాగినారు;
“గన్నవరము జొన్నలు జామకాయలంత!”
“కడప మిరియాలు గుమ్మడికాయలంత!”
గురువు గారు చాలా చమత్కార భరిత మైన పద్యము వ్రాసారు.
రిప్లయితొలగించండిజిలేబీ గారూ,
రిప్లయితొలగించండిఅభినందనలు.
*
పండిత నేమాని వారూ,
సూక్ష్మదర్శిని విషయంగా మీ పూరణ బాగుంది. అభినందనలు.
*
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
చీమకు మిరియం గుమ్మడికాయంతగా కనిపింస్తుంది. విరుపు కూడా బాగుంది. అభినందనలు.
*
సహదేవుడు గారూ,
అల్లుని గొప్పలతో మీ పూరణ బాగుంది. అభినందనలు.
*
సుబ్బారావు గారూ,
భూతద్దాన్ని విషయంగా చేసికొన్న మీ పూరణ బాగుంది. అభినందనలు.
*
కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
అయ్యవారిని సత్కరించిన మీ మొదటి పూరణ, రాయలసీమ పౌరుషాన్ని తెలిపిన రెండవ పూరణ బాగున్నవి. అభినందనలు.
*
శైలజ గారూ,
కలియుగపు వింతలను గురించిన మీ పూరణ బాగుంది. అభినందనలు.
‘ఆరు+అడుగులు’ అని విసంధిగా వ్రాసారు. ఆపాదాన్ని ‘ఆ రడుగులుగ గెలవేసె నరటిచెట్టు’ అందాం.
‘వింతలు + ఎన్నియో" అన్నప్పుడు యడాగమం రాదు. ఆ పాదాన్ని ‘కలవు వింత లెన్నెన్నొ యీ కలియుగాన" అనండి.
*
వరప్రసాద్ గారూ,
హైబ్రీడ్ కూరగాయలు, ధాన్యం మొదలైనవి అలాగే ఉంటున్నాయి. మీ పూరణ బాగుంది. అభినందనలు.
*
మిస్సన్న గారూ,
సామెత చెప్పినట్లు.. మీ పూరణ చమత్కారజనకంగా ఉంది. అభినందనలు.
*
బొడ్డు శంకరయ్య గారూ,
కడప బాంబుల ప్రస్తావనతో మీ పూరణ బాగుంది. అభినందనలు.
*
సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
మీ సూక్ష్మదృష్టి పూరణ బాగుంది. అభినందనలు.
*
గండూరి లక్ష్మినారాయణ గారూ,
మీ సూక్ష్మదర్శిని పూరణ బాగుంది. అభినందనలు.
*
రాజేశ్వరి అక్కయ్యా,
మీ ఊహాలోకపు పూరణ బాగుంది. అభినందనలు.
కడప కోట్ల లంచము లెక్కకట్ట లేము
రిప్లయితొలగించండికడప హత్యలన్నియు ఘనకార్యములట
కడపమిరియముల్ గుమ్మడి కాయలంత
కడప యందన్నియు విచిత్ర కరణములవి
తెలుసుకోర తెలివిలేని తెలుగువాడ!
శ్రీ కంది శంకరయ్య గారూ!
రిప్లయితొలగించండిశుభాశీస్సులు.
గన్నవరము జామకాయలు మరియు కడప మిరియములు గురించిన అతిశయోక్తిగా మీరు జరిపించిన సంభాషణ పద్యము బాగున్నది. అభినందనలు. స్వస్తి.
చంద్రశేఖర్ గారూ,
రిప్లయితొలగించండికడప వైచిత్ర్యాన్ని వివరిస్తూ చక్కని పూరణ చేసారు. అభినందనలు.
*
వరప్రసాద్ గారూ,
పండిత నేమాని వారూ,
...................... ధన్యవాదాలు.
అందరికీ వందనములు !
రిప్లయితొలగించండిఅందరి పూరణలూ అలరించు చున్నవి !
కడప మిరియములు గుమ్మడి కాయలనడం వంటిదే
ఈ విభజిస్తే యేదో వస్తుందనడం కూడా :
01)
___________________________________
కళ్ళు తెరుతురు విభజన - ఘాతకులును
కలసి యున్ననె సుఖములు - గలుగు నంచు !
కడకు మిగులును విభజన - కావ్యమందు
కడప మిరియముల్ గుమ్మడి - కాయలంత !!!
___________________________________
https://www.facebook.com/photo.php?fbid=326092097530947&set=a.137584453048380.27540.100003904789679&type=1&theater
రిప్లయితొలగించండిఈనాటీ సమస్య...?
రిప్లయితొలగించండివిట్ఠల్ గారూ,
తొలగించండిశంకరాభరణం బ్లాగు మీకు స్వాగతం పలుకుతున్నది.
ఈ పేజీ చివర ఉన్న 'హోమ్' అన్న దానిని నొక్కండి.
విట్ఠల్ గారూ,
తొలగించండిశంకరాభరణం బ్లాగు మీకు స్వాగతం పలుకుతున్నది.
ఈ పేజీ చివర ఉన్న 'హోమ్' అన్న దానిని నొక్కండి.