27, నవంబర్ 2013, బుధవారం

సమస్యాపూరణం - 1247 (గొడ్డురాలి బిడ్డలు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది......
గొడ్డురాలి బిడ్డలు గుణకోవిదు లఁట.

23 కామెంట్‌లు:

  1. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరింప నున్నవి !

    ఒకరాజుగారు !
    ఆయనకో బావమరది !
    సింహాసనము పైన కాంక్ష !
    మహారాణికి పుట్టిన కవలల్ని పురిటి లోనే తప్పించి
    అడవులకు పంపించి చంపించే ప్రయత్నం !
    మహారాణి పక్కలో చీపురుకట్ట , గుండ్రాయి పెట్టి
    అవే పుట్టాయని నమ్మించే ప్రయత్నం !
    చివరి వరకూ ఆ తల్లి గొడ్రాలిననే బాధ పడుతూ ఉంటుంది !

    కాని దైవఘటన మరొకలా ఉండి
    ఆ పిల్లలిద్దరూ చావు తప్పించుకొని
    ఎక్కడెక్కడో పెరిగి, వీరులై,విషయం తెలుసుకొని
    పగ తీర్చుకుంటారు మేనమామపై !
    అదేదో సినిమాలో :

    01)
    ______________________________________

    అడ్డము తొలగించు కొనెడి - యవసరమున
    బిడ్డ లిద్దరి జంపగా - దొడ్డ యైన
    మేన మామయె పంపెను - కానలకును
    రాజ సింహాసనము బొందు - లాలసమున !

    దైవ వశమున బ్రతికిరి - చావకుండ
    అష్టకష్టాలు పడినట్టి - యర్భకులదె
    మేటి వీరులై యలరారె - సాటి లేని !
    గొడ్డురాలి బిడ్డలు గుణ - కోవిదు లఁట !
    ______________________________________

    రిప్లయితొలగించండి
  2. మంచి బావను మించిన పంచ మిన్న
    సంతు వలదని తనకింక పంత మూని
    అక్క పిల్లల బెంచెను మిక్కుట ముగ
    గొడ్డు రాలి బిడ్డలు గుణ కోవి దులట

    రిప్లయితొలగించండి
  3. వసంత కిశోర్ గారూ,
    సుప్రభాతం!
    ఉదయాన్నే విఠలాచార్య సినిమాను చూసిన అనుభూతి కలిగింది మీ పూరణ నేపథ్యాన్ని చదువుతూంటే.
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    రాజేశ్వరి అక్కయ్యా,
    పెంపుడు తల్లిపై మీ పూరణ బాగుంది. అభినందనలు.
    ‘పంచ మిన్న’....?

    రిప్లయితొలగించండి
  4. పలికె నొకడిట్లు సభలోన ప్రజ్ఞ మెరయ
    వినుడు నా మాట లెంతయు వింత కావు
    మూగవాని గానము కర్ణములకు విందు
    గొడ్డు రాలి బిడ్డలు గుణ కోవిదులట

    రిప్లయితొలగించండి
  5. పండిత నేమాని వారూ,
    ప్రాజ్ఞుడు సభాముఖంగా చెప్పినప్పుడు నమ్మక తప్పుతుందా? చక్కని పూరణ. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  6. శ్రీ శంకరయ్య గురుదేవులకు, శ్రీ నేమాని గురుదేవులకు వినమ్రవందనములతో.....

    శ్రీ వసంత కిషోర్ గారు మీ వివరణ బాగున్నది . శ్రీ రాజేశ్వరి అక్కయ్య గారి అక్క పిల్లల తల్లి బాగున్నది. శ్రీ నేమాని గురుదేవుల వింతలు బాగున్నవి.

    మరి నేను కూడా మరియొక వింత (నిజము)

    బిడ్డలు ఇక కలుగరని తెలిసి చింతించు చున్న భార్య తో భర్త
    =========*===================
    బాగుగా వినవలె సత్య భామ నీవు
    గొడ్డు రాలి బిడ్డలు గుణ కోవిదులట,
    యత్త లేని వారలు కడు యుత్తములట,
    నీతి శతకమనుచు బల్కె నేర్పు తోడ !

    రిప్లయితొలగించండి
  7. శ్రీ వరప్రసాద్ గారూ! శుభాశీస్సులు.
    మీ పద్యము బాగుగనున్నది. అభినందనలు. ఒక చిన్న సూచన:
    కడు + ఉత్తములట అనుచోట యడాగమము రాదు. నుగాగమము వచ్చును. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  8. పండిత నేమాని గారికి పూజ్యగురుదేవులు
    శంకరయ్య గారికివందనములు

    నేతిబీరలో నేతిని నిండు మనము
    త్రాగి ప్రసవించె నొక యెద్దు దానిపాలు
    గ్రోలి మృగతృష్ణ తానము గూర్మి జేయు
    గొడ్డు రాలి బిడ్డలు గుణ కోవిదు లట

    రిప్లయితొలగించండి
  9. కన్న బిడ్డలె చూడని కాల మిదియె
    ప్రేగు బంధము కాకున్న ప్రేమ తోడ
    బెంచి పోషించి మమతనే బంచి నట్టి
    గొడ్డు రాలిబిడ్డలు గుణకోవిదులట

    రిప్లయితొలగించండి
  10. సంతు లేదని చింతించి యింతి యొకతి
    దిక్కు లేనట్టి శిశువుల దెచ్చి నిండు
    ప్రేమతడను బోషించి పెంచినట్టి
    గొడ్డురాలి బిడ్డలు గుణ కోవిదు లఁట!

    రిప్లయితొలగించండి
  11. శ్రీ నేమాని గురుదేవులకు ధన్యవాదములతో...
    టైపు జేయు నపుడు నుగాగమము ను
    మొన్న కుశలాయక మను పుస్తకము జదివితిని, అందు (నేను యేమియు సేయ లేను మరియు కడు యుత్తమ మైన) అను ప్రయోగము గుర్తుకు వచ్చి మార్చితిని

    తెలుగు భాషలోనే చాలా అపురూపమైన అత్యద్భుతమైన ప్రయోగము ఈ అనులోమ విలోమ గీత గర్భ ఆట వెలది. ఇది సాధించిన శ్రీమాన్ వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి కవి గారి పాదాభివందము.

    "ఆంద్రామృతం " బ్లాగు జూచిన తరువాత నేనొక గర్బ కవిత ( తేట గీతి / ఆట వెలది) వ్రాసితిని.
    మేము ది 18/04/2013 కేరళ నుండి కర్ణాటక వచ్చునపుడు బండిపుర " వీరప్పన్ " సంచరించు అడవిలో ఏనుగు దాడి జేయ బోయి కనికరించినది.
    ============*===========
    గజగజ వణికితిమి గజ గమనము గని
    పద పద యని వడి వడిగ పరుగు లిడగ
    కదలక నిలచె కడు కనికరమున నది
    మరి మరి దలచితి మదియె మరులు గొనుచు !

    రిప్లయితొలగించండి
  12. గొడ్డు రాలి బిడ్డలు గుణ కోవిదుల ట
    వింటి రేయిది యెచ టను ? వింత గొలిపె
    గొడ్డు రాలికి పుడమిని బిడ్డ లుంట
    యరయ కలికాల మాహాత్మ్య మగును సుమ్ము

    రిప్లయితొలగించండి
  13. కన్నవారిని ప్రేమతో కానలేని
    బిడ్డలున్నట్టి తలిదండ్రి వేదనెంతొ,
    అడ్డదారులు పట్టని యర్భకులను
    పెంచుకొనుచున్న సంతాన వేడ్కలేని
    గొడ్డురాలి బిడ్డలు గుణకోవిదులట

    రిప్లయితొలగించండి
  14. పండిత నేమాని గారికి పూజ్యగురుదేవులు
    శంకరయ్య గారికి వందనములు
    భరత సంస్కృతి నెగతాళి పరచి నట్టి
    గొడ్డు[వంధ్యత్వము]రాలి[నశించి]బిడ్డలుగుణకోవిదు లట
    మటము లేని మార్గమును స్ఫుట మొనర్చు
    మయ్య శ్రీశైలవాస దయాలవాల

    రిప్లయితొలగించండి

  15. పండిత నేమాని గారికి పూజ్యగురుదేవులు
    శంకరయ్య గారికి వందనములు
    సత్యధర్మనిరతుడునుసద్గురుండు
    స్వామి రాఘవేంద్రుని పూజ సలిపెనేని
    వరము లొసగును సంతాన ప్రాప్తి కలుగ
    గొడ్డు[వంధ్యత్వము]రాలి[నశించి]బిడ్డలు గుణకోవిదు లట
    జనన మందుట జూడమే యనఘులార


    రిప్లయితొలగించండి
  16. శ్రీ బొడ్డు శంకరయ్య గారి పద్యమును సవరించుచూ:

    కన్నవారిని ప్రేమతో గానలేని
    బిడ్డ లున్నట్టి పితరుల వెతలు మెండు
    అడ్డ దారులు పట్టని యర్భకులను
    పెంచుకొనుచున్న పిల్లల వేడ్క లేని
    గొడ్డు రాలి బిడ్డలు గుణకోవిదులట

    రిప్లయితొలగించండి
  17. అయ్యా! వరప్రసాద్ గారూ!
    వ్యాకరణ శుద్ధముగా పద్యములను వ్రాయుట సమంజసము. అందరి కవుల పుస్తకములను తిరగవేసి అందులోని దోషములను మీరు కూడా అనుసరించుట తగదు. నన్నయ్య, తిక్కన్న, శ్రీనాథుడు వంటి వారి కావ్యములే ప్రామాణికములు. ఉకారము తరువాత సంధి నిత్యము; అందుచేత ఉకారము తరువాత యడాగమము వచ్చే ప్రసక్తే యుండదు. వ్యాకరణమును జాగ్రత్తగా అధ్యయనము చెయ్యండి. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  18. శంకరార్యా ! ధన్యవాదములు !

    అందరి పూరణలూ అలరించు చున్నవి !

    వరప్రసాద్ గారికి ధన్యవాదములు !

    ||ఆ||
    ఇనగణత్రయంబు - నింద్రద్వయంబును
    హంస పంచకంబు - నాట వెలది !
    సూర్యు డొక్కరుండు - సురరాజు లిద్దరు
    దినకరద్వయంబు - తేటగీతి !

    వరప్రసాద్ గారూ పరికించండి !

    రిప్లయితొలగించండి
  19. రాణి కోమలి బిలుతురు ' రాలి ' యనుచు
    ప్రక్కనున్నట్టి పంకజ భర్త తిట్టె
    కన్న కొడుకును " కంటివా దున్న, యెలుగు
    గొడ్డు " రాలి బిడ్డలు గుణకోవిదులట.

    రిప్లయితొలగించండి
  20. పండిత నేమాని గురువర్యులకు నమస్కారములు,
    సవరణకు ధన్యవాదములు

    రిప్లయితొలగించండి
  21. కన్న బిడ్డలు లేనట్టి కన్య యొకతి
    రక్త బంధము లేకున్న ముక్తి కొరకు
    ప్రేమ మీరగ పోషించి పెంచి నట్టి
    గొడ్డురాలి బిడ్డలు గుణకోవిదులట

    రిప్లయితొలగించండి