10, నవంబర్ 2013, ఆదివారం

సమస్యాపూరణం - 1231 (సత్యదూరము గద)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది.....
సత్యదూరము గద హరిశ్చంద్రు గాథ.

22 కామెంట్‌లు:

 1. అందరికీ వందనములు !
  అందరి పూరణలూ అలరింప నున్నవి !

  ఔను మరి !
  దోచుకోవడం దాచుకోవడం మాత్రమే తెలిసిన వారికి :

  01)
  _____________________________________

  కలిమి దోచుటే నేడిల - బల మనుచును
  కల్లలాడుచు కార్యము - గడుపు కొనెడి
  భాగ్యవంతులు, మంత్రులౌ - వారికి గన
  సత్యదూరము గద హరి - శ్చంద్రు గాథ !
  _____________________________________

  రిప్లయితొలగించు
 2. కష్టానికీ , నష్టానికీ దేవుడిపై భారం వేసే వారు
  ఖచ్చితంగా నమ్ముతారు సత్యమే హరిశ్చంద్రుడని :

  02)
  _____________________________________

  కష్టజీవులు , పేదలు - నష్ట మైన
  కల్లలాడక, దుర్విధి - వల్ల జరిగె
  ననుచు దలచుచు దేవుని - నమ్ము వారు
  సత్యదూరము గద హరి- శ్చంద్రు గాధ
  యనుచు నెన్నడు తలపోయ - రయ్య జూడ !
  _____________________________________

  రిప్లయితొలగించు
 3. సతిని దాసిగ నమ్మిన సత్య వ్రతుడు
  కాటి కాపరిగా జేసె మేటి రాజు
  ధర్మ చరితులు వారలు ధరణి యందు
  వారణా సియె సాక్షిట వాదు లేల
  సత్య దూరము గద ? హరిశ్చంద్రు గాధ

  రిప్లయితొలగించు
 4. సత్యమన్నది వ్రతముగా నిత్యముగను
  తలచు వారల గాథలు తలను దూర
  సత్య ! దూరము గద హరిశ్చంద్రు గాధ
  తప్పననుచును తగ్గుమా తగ్గు తగ్గు.

  రిప్లయితొలగించు

 5. మాట కు మాట నాతొ అబద్ధము జెప్పు కృష్ణా
  తెలిసికొనుము హరిశ్చంద్ర గాధ ,సత్య, కృష్ణుని
  దెప్పంగ, నిత్య సత్య కృష్ణుండు నవ్వి పలికే
  సత్య, దూరము గద హరిశ్చంద్రు గాథ !


  జిలేబి

  రిప్లయితొలగించు
 6. మాట ఇచ్చి తుది వరకు మరలకుండ
  నిలిచి నట్టి యాదర్శము నేర్పు గాథ!
  మనదు పూర్వీకుల చరిత మాయ గాదసత్య
  దూరము గద హరిశ్చంద్రు గాథ.

  రిప్లయితొలగించు
 7. శ్రీ శంకరయ్య గురుదేవులకు,శ్రీ నేమాని గురుదేవులకు వినమ్రవందనములతో.....

  శ్రీ శంకరయ్య గురుదేవులకు ధన్యవాదములతో...

  శ్రీ మిస్సన్న గారు జెప్పినట్లు, లక్ష్మీదేవి గారూ మీ ఆసక్తి అనన్యసామాన్యం.
  లక్ష్మీదేవి గారూ అభినందనలు. మీ బాటను మేము కూడా నడచెదము. కొన్ని దినములు కొన్ని కారణములతో బ్లాగును చూచుటకు వీలు కాని సమయములలో మేము ఆ సమస్యలను పూరించుట లేదు.
  =========*===========
  కోతి వలె దిరుగు చున్న- నీతి లేని
  నేతల బలుకు లెల్లను- నిక్క ముగను
  సత్యదూరము గద,హరి - శ్చంద్రు గాథ
  యందు నర్థము వారికి- యర్థ మగునె?
  (నర్థము= ధర్మ విలువల ధనము )

  రిప్లయితొలగించు
 8. శ్రీ శంకరయ్య గురుదేవులకు, శ్రీ నేమాని గురుదేవులకు వినమ్రవందనములతో.....

  శ్రీ శంకరయ్య గురుదేవులకు ధన్యవాదములతో...

  కొద్ది సవరణలతో
  =========*===============
  కోతుల వలెను దిరిగెడి - నీతి లేని
  నేతలకు హరిశ్చంద్రుని - గాథలు కడు
  సత్యదూరము గద, హరి - శ్చంద్రు గాథ
  వినిన వీరు బొందినచో వి-వేకము, నది
  యాలు బిడ్డల కెల్ల ఘో-రాతి ఘోర
  మైన శాపమొసగు నయ్య - గాన జెప్ప
  వలదు మీరు ధర్మ నిరతి-ఖలుల కిపుడు!

  (యాలు బిడ్డలు = కుటుంబము మరియు ప్రజలు )

  ఖలులు హరిశ్చంద్రుని గాథలు వినిన ప్రజలను బానిసలు జేయును గద!

  రిప్లయితొలగించు
 9. గుండె నిండుగా ప్రజలలో నిండి నట్టి
  గొప్ప పౌరానికపు కథ తప్పుగాను
  "సత్య దూరము గద హరిచంద్ర గాథ "
  యనియు చెప్పుట, యనుచి తంబగును గాదె.

  రిప్లయితొలగించు
 10. శ్రీ శంకరయ్య గురుదేవులకు,శ్రీ నేమాని గురుదేవులకు వినమ్రవందనములతో...

  సత్య మార్గము,పాలన స్ఖలితమనుట
  సత్య దూరము గద, హరిశ్చంద్రు గాధ
  సత్యసాధన కఠినము, సత్యమొకటే
  శాశ్వతబ్రహ్మమని తెలుపు చరితము కద

  రిప్లయితొలగించు
 11. ఒకతను సత్య అనే ఆమెతో చెపుతున్నట్లుగా.........

  సత్య వచనమ్ము మాదు నిశ్చయమటంచు
  నష్ట కష్టమ్ములకునోర్చి నట్టివిభుని
  ప్రస్తుతింతుము నేటి ధర్మమునకిలను
  సత్య! దూరము కద హారిశ్చంద్రు గాథ.

  దూరము = తప్పులు వెదకుట

  రిప్లయితొలగించు
 12. మిన్ను నేకమౌటను మఱి మన్ను తోడ
  సత్య దూరము గద, హరి శ్చంద్రు గాధ
  సత్య వంతుల కయ్యది సాటి యగును
  జయము సాధించు నెప్పుడు సత్య మార్య !

  రిప్లయితొలగించు
 13. శ్రీ శంకరయ్య గురుదేవులకు ధన్యవాదములతో...

  ఔను మరి ! శ్రీ వసంత కిషోర్ గారు జెప్పినట్లు

  దోచుకోవడం దాచుకోవడం మాత్రమే తెలిసిన వారికి
  ==========*=============
  కూజితములు "పాడు జనులు" కోట్ల కొరకు కూడి గూడి
  భాజితమును బంచి వారు భారత మాత బిడ్డ లయి
  గోజిహ్వ గల్గి దిరుగుచు, కుజనుల పాదములకును
  పూజ సేయగ సత్యదూరము గద, హరి - శ్చంద్రు గాథ

  (కూజితము = పక్షి కూత,భాజితము = భాగము )

  రిప్లయితొలగించు
 14. మేక పోతులె బలిపీఠ మెక్కు గాని
  పులుల సింగాల నెంతురె పుడమినందు
  సంఘమందున లౌక్యమె సాగ నేడు
  సత్య దూరము గద! హరిశ్చంద్రు గాథ

  రిప్లయితొలగించు
 15. సంపత్ కుమార్ గారూ,
  తప్పులు వెదకుట , నిందించుట అనే అర్థంలో రు స్థానంలో ఋ వస్తుందనుకుంటున్నాను. ఒక వేళ ఇది సరి అయితే సమస్య పాదంలో రు/ ఋ మార్చుటకు వీలున్నదా?

  రిప్లయితొలగించు
 16. వరప్రసాద్ గారూ,
  మీరు పలికిన సాదర వాక్కులు నాకు మరింత ప్రోత్సాహాన్నిస్తున్నవి.
  ధన్యురాలను.

  రిప్లయితొలగించు
 17. అమ్మా మందాకిని గారూ,

  నాకు తెలిసి దూరు ( "రు" కారమే ) అనే పదమే సరియైనది అని అనుకొంటున్నాను. " ఋ" అనే అక్షరము అచ్చు. అది పదానికి మధ్యలో రావడము కుదరదు అనుకుంటాను.

  ఇక రెండవది....... "ర" కార "ఋ" కారాలను మార్చడానికి వీల్లేదనుకుంటాను. ఎందుకంటే ప్రాసవిషయములో కానీ, యతిమైత్రి విషయములో కాని ఈ రెండూ విభేదిస్తాయి కదా.

  ఎందుకైనా మంచిది, గురువుగారి వివరణకై వేచిచూద్దామండీ.

  రిప్లయితొలగించు 18. 1.
  ఎప్పుడనృతములె పలుక నిచ్చగించు
  స్వార్థపరులక్రమముగ సంపదలుదాచి
  ప్రజల మోసగింపగజూచు వారికెపుడు
  సత్యదూరము కద హరిశ్చంద్రు గాథ.
  ------
  2.
  కష్టపడుచు నిజాయితీ గాను బ్రతుకు
  సాగగా గుటుంబమ్మును సాకువారు
  సత్యవాక్కులైనట్టి ప్రజావళికిన
  సత్యదూరము కద హరిశ్చంద్రగాథ.

  రిప్లయితొలగించు
 19. కవిమిత్రులకు నమస్కృతులు.
  నిన్న కరీంనగర్, వేములవాడ వెళ్ళివచ్చాను. రోజంతా ప్రయాణంలో ఉండి బ్లాగును చూడలేకపోయాను. మన్నించండి.
  *
  మంచి మంచి పూరణలను అందించిన
  వసంత కిశోర్ గారికి,
  రాజేశ్వరి అక్కయ్యకు,
  గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
  లక్ష్మిదేవి గారికి,
  వరప్రసాద్ గారికి,
  గండూరి లక్ష్మినారాయణ గారికి,
  కెంబాయి తిమ్మాజీరావు గారికి,
  సంపత్ కుమార్ శాస్త్రి గారికి,
  సుబ్బారావు గారికి,
  సహదేవుడు గారికి,
  కమనీయం గారికి,
  అభినందనలు, ధన్యవాదాలు.
  *
  సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
  మీరు చెప్పిన అర్థంలో "దూఱు" సరియైన శబ్దం. అయితే బ్రౌణ్యం "దూరు" శబ్దాన్ని కూడా చెప్పింది.
  *
  లక్ష్మీదేవి గారూ,
  మీరు "ఱు" టైప్ చెయ్యబోయి "ఋ" చేశారనుకుంటున్నాను. ఒకవేళ మీ ఉద్దేశ్యం "ఋ' అయితే దోషమే. పదాంతర్భాగంగా అచ్చు ఉండదు కదా.

  రిప్లయితొలగించు
 20. గురువు గారూ,
  అయ్యో నిజమేనండీ, ఱు కు బదులు ఋ టైప్ చేసి చూసుకోనే లేదు. అచ్చు మధ్యలో ఉండదు కదా మనకు. ప్రాకృతం లో పదాల మధ్యలో అచ్చు వస్తూ కొంచెం వినోదం కలిగిస్తూ ఉంటాయి.
  సంపత్ కుమార శాస్త్రి గారూ , ధన్యవాదాలండి.

  రిప్లయితొలగించు