రామ నామము ప్రాణమై రామ దాసు శక్తి మీరగ గొలిచిన భక్తి మునిగి వెతల పాలిట బడ వైచె వేలు పనుచు కసిగ దూషించె రాముని పసిడి తొడిగి క్రోధమే మేలుగద సర్వ గుణము లందు
కవిమిత్రులకు నమస్కృతులు. ఈరోజే మా అబ్బాయిని ఆసుపత్రినుండి డిస్చార్జ్ చేశారు. ఇంతకు ముందే ఇల్లు చేరుకున్నాము. బాగున్నాడు. కాకుంటే దాదాపు రెండు నెలలు విశ్రాంతి తీసుకోవాలి. ఈ పదిరోజులూ నాకు నిద్రాహారాలు సరిగా లేవు. శారీరక శ్రమకు, మానసిన ఒత్తిడికి లోనయ్యాను. మా అబ్బాయి యోగక్షేమాల గిరించి పరామర్శించిన మిత్రులకు ధన్యవాదాలు.
పండిత నేమని వారికి నమస్కారములు మీ సూచన మేరకు చందోబద్ధ రచన చేసే ప్రయత్నం చేయుచున్నాను. శంకరయ్యగారు, మీ అబ్బాయి త్వరగా కోలుకోవాలి అని ఆశిస్తున్నాను ------------- కరుణ మనస్సున్నా దానము చెయ్యలేదెందు, విచక్షణ విరివిగున్నా ఎన్నడూ సాయపడలేదు, నాది నేను అనే పరుగులో శాంతి దొరకనే దొరకదు, అట్టి జీవితముపై, క్రోధమే మేలుగద సర్వగుణములందు.
రాజేశ్వరి అక్కయ్యా, మీ రెండు పూరణలూ బాగున్నవి. అభినందనలు. రెండవ పూరణలో ‘బంధించె నలుక బూని’ అనండి. * జిలేబీ గారూ, మీ భావాన్ని శైలజ గారు ఛందోబద్ధం చేశారు చూడండి. * పండిత నేమాని వారూ, వినయము సర్వగుణప్రధానమంటూ విరుపుతో చక్కని పూరణ చెప్పారు. అభినందనలు. * గోలి హనుమచ్ఛాస్త్రి గారూ, దుష్టులపై చూపే క్రోధం మేలైనదన్న మీ పూరణ బాగుంది. అభినందనలు. * సుబ్బారావు గారూ, విరుపుతో మీ పూరణ బాగుంది. అభినందనలు. * కెంబాయి తిమ్మాజీరావు గారూ, క్రోధం గుణం కాదనీ, అరిషడ్వర్గాల్లో ఒకటని, సత్త్వగుణమే మేలని మీరు చెప్పిన పూరణ బాగుంది. అభినందనలు. * గండూరి లక్ష్మినారాయణ గారూ, శాంతము మేలంటూ మీరు చెప్పిన పూరణ బాగుంది. అభినందనలు. * శైలజ గారూ, విరుపుతో చక్కని పూరణ చెప్పారు. అభినందనలు. జిలేబీ గారి భావానికి మీరిచ్చిన పద్యరూపం బాగుంది. ధన్యవాదాలు.
శ్రీ కంది శంకరయ్య గారికి శుభాశీస్సులు. మీ అబ్బాయి ఆసుపత్రి నుండి యింటికి వచ్చినందులకు సంతోషము. వానికి మా శుభాశెస్సులు - భగవంతుని కృపతో త్వరలోనే పూర్తిగా కోలుకోగలడు. స్వస్తి.
ధన్యవాదములు గురువుగారు,వచ్చేశారా.. ఎన్నో రోజులయినట్లుంది,.మీ సూచనలు చదివి..మీ అబ్బాయిగారికి బాగుంది కదా..చాలా సంతోషం..మీరు ఇప్పుడయినా తగిన విశ్రాంతి తీసుకోండి...కృతజ్ఞతలతో...
ఏ గుణమ్మైన సందర్భమెంచి చూప సత్ఫలిత మిచ్చునే కాని స్వయముగాను, దుర్గుణము కాదు సవ్యమౌ దృష్టి జూడ, పాపకృత్యమ్ములందు జూపంగ నట్టి క్రోధమే మేలుగద సర్వ గుణములందు.
వర్తకమ్మును సేయంగ - వచ్చి యిటకు వరుస రాజ్యమ్ము స్థాపించి - మరియు మరియు భారతీయుల పీడించు - వారి పైన క్రోధమే మేలుగద సర్వ - గుణములందు ! ______________________________
రామ నామము ప్రాణమై రామ దాసు
రిప్లయితొలగించండిశక్తి మీరగ గొలిచిన భక్తి మునిగి
వెతల పాలిట బడ వైచె వేలు పనుచు
కసిగ దూషించె రాముని పసిడి తొడిగి
క్రోధమే మేలుగద సర్వ గుణము లందు
రిప్లయితొలగించండిఅదిమి పెట్టిన క్రోధమ్ము మతిని గాల్చు
తొక్కి బెట్టిన క్రోధమ్ము బీపీ ని పెంచు
మనసున ముళ్ళు గుచ్చిన వెలిగక్కిన
క్రోధమే మేలుగద సర్వ గుణము లందు !!
జిలేబి
కలికి రోటను బంధించె యలుక బూని
రిప్లయితొలగించండిచెవిని మెలిబెట్టి దండించె దైవ మనక
భక్తి సామ్రాజ్య మందున ముక్తి నొంద
క్రోధమే మేలుగద సర్వ గుణము లందు
భువి ననర్థములకు నెల్ల మూల మగును
రిప్లయితొలగించండిక్రోధమే, మేలుగద సర్వ గుణము లందు
వినయ మయ్యదె సమకూర్చు విజయములను
శాంతి సౌఖ్యము లొసగు యశమ్ము బెంచు
శిష్టజనులను బాధించ చేరివచ్చు
రిప్లయితొలగించండిదుష్టజనులను శిక్షించ దోషమేమి
లేదు, వారిని వారించ, మీద జూపు
క్రోధమే మేలుగద సర్వగుణములందు.
కష్టములు గలుగుటకును గార ణంబు
రిప్లయితొలగించండిక్రోధమే, మేలు గద సర్వ గుణము లందు
దాన మయ్యది గలిగించు ధర్మ పధ ము
దాన ధర్మము లీ రెండు మాన వలదు
పండిత నేమానిగారికి పూజ్యులు గురుదేవులు
రిప్లయితొలగించండిశంకరయ్య గారికి వందనములు
క్రోధము గుణము కాదు శత్రువని తెలియ
విశ్వ శాంతిని గోరుచు విడువ వలయు
క్రోధమే ; మేలు గద! సర్వ గుణము లందు
సత్త్వ గుణ మొక్కటే యిది సత్యమనగ
కలహముల కెల్ల మూల మీ ఖలము పైన
రిప్లయితొలగించండిక్రోధమే, మేలుగద సర్వ గుణము లందు
శాంతమే, నరునకు మన శ్శాంతి నిచ్చు
శాంతి సంతోషముల కంటె సౌఖ్యమేది.?
కలుగు కష్టనష్టములకుకారణమ్ము
రిప్లయితొలగించండిక్రోధమే, మేలుగద సర్వ గుణములందు
శాంత మయ్యదె సాధించు సౌఖ్యములను
సహన శీలము శాంతికి సాక్షి యగును
జిలేభి గారి భావము నచ్చి ...ఈ పద్యము..
రిప్లయితొలగించండిఅదిమి పెట్టిన కోపము హానికరము
మట్టు బెట్టగ క్రోధము మహికి శాంతి
బయట బెట్టగ క్రోధము భాధ తీరు
క్రోధమే మేలుగద సర్వ గుణములందు
కవిమిత్రులకు నమస్కృతులు.
రిప్లయితొలగించండిఈరోజే మా అబ్బాయిని ఆసుపత్రినుండి డిస్చార్జ్ చేశారు. ఇంతకు ముందే ఇల్లు చేరుకున్నాము. బాగున్నాడు. కాకుంటే దాదాపు రెండు నెలలు విశ్రాంతి తీసుకోవాలి.
ఈ పదిరోజులూ నాకు నిద్రాహారాలు సరిగా లేవు. శారీరక శ్రమకు, మానసిన ఒత్తిడికి లోనయ్యాను.
మా అబ్బాయి యోగక్షేమాల గిరించి పరామర్శించిన మిత్రులకు ధన్యవాదాలు.
పండిత నేమని వారికి నమస్కారములు
రిప్లయితొలగించండిమీ సూచన మేరకు చందోబద్ధ రచన చేసే ప్రయత్నం చేయుచున్నాను.
శంకరయ్యగారు, మీ అబ్బాయి త్వరగా కోలుకోవాలి అని ఆశిస్తున్నాను
-------------
కరుణ మనస్సున్నా దానము చెయ్యలేదెందు,
విచక్షణ విరివిగున్నా ఎన్నడూ సాయపడలేదు,
నాది నేను అనే పరుగులో శాంతి దొరకనే దొరకదు,
అట్టి జీవితముపై, క్రోధమే మేలుగద సర్వగుణములందు.
రాజేశ్వరి అక్కయ్యా,
రిప్లయితొలగించండిమీ రెండు పూరణలూ బాగున్నవి. అభినందనలు.
రెండవ పూరణలో ‘బంధించె నలుక బూని’ అనండి.
*
జిలేబీ గారూ,
మీ భావాన్ని శైలజ గారు ఛందోబద్ధం చేశారు చూడండి.
*
పండిత నేమాని వారూ,
వినయము సర్వగుణప్రధానమంటూ విరుపుతో చక్కని పూరణ చెప్పారు. అభినందనలు.
*
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
దుష్టులపై చూపే క్రోధం మేలైనదన్న మీ పూరణ బాగుంది. అభినందనలు.
*
సుబ్బారావు గారూ,
విరుపుతో మీ పూరణ బాగుంది. అభినందనలు.
*
కెంబాయి తిమ్మాజీరావు గారూ,
క్రోధం గుణం కాదనీ, అరిషడ్వర్గాల్లో ఒకటని, సత్త్వగుణమే మేలని మీరు చెప్పిన పూరణ బాగుంది. అభినందనలు.
*
గండూరి లక్ష్మినారాయణ గారూ,
శాంతము మేలంటూ మీరు చెప్పిన పూరణ బాగుంది. అభినందనలు.
*
శైలజ గారూ,
విరుపుతో చక్కని పూరణ చెప్పారు. అభినందనలు.
జిలేబీ గారి భావానికి మీరిచ్చిన పద్యరూపం బాగుంది. ధన్యవాదాలు.
మద్దూరి ఆదిత్య గారూ,
రిప్లయితొలగించండిసంతోషం. మీ ప్రయత్నాన్ని ప్రారంభించండి. మీకు అన్ని విధాల సహకరించడానికి నేను, బ్లాగు మిత్రులు ఎప్పుడూ సిద్ధమే.
శ్రీ కంది శంకరయ్య గారికి శుభాశీస్సులు.
రిప్లయితొలగించండిమీ అబ్బాయి ఆసుపత్రి నుండి యింటికి వచ్చినందులకు సంతోషము. వానికి మా శుభాశెస్సులు - భగవంతుని కృపతో త్వరలోనే పూర్తిగా కోలుకోగలడు. స్వస్తి.
ధన్యవాదములు గురువుగారు,వచ్చేశారా.. ఎన్నో రోజులయినట్లుంది,.మీ సూచనలు చదివి..మీ అబ్బాయిగారికి బాగుంది కదా..చాలా సంతోషం..మీరు ఇప్పుడయినా తగిన విశ్రాంతి తీసుకోండి...కృతజ్ఞతలతో...
రిప్లయితొలగించండిగురువులకు ధన్య వాదములు
రిప్లయితొలగించండిచిరం జీవికి స్వస్థత చేకూరి నందులకు చాలా సంతోషం గాఉంది. అందరికీ దీపావళి శుభా కాంక్షలు
రిప్లయితొలగించండిఏ గుణమ్మైన సందర్భమెంచి చూప
సత్ఫలిత మిచ్చునే కాని స్వయముగాను,
దుర్గుణము కాదు సవ్యమౌ దృష్టి జూడ,
పాపకృత్యమ్ములందు జూపంగ నట్టి
క్రోధమే మేలుగద సర్వ గుణములందు.
కమనీయం గారూ,
రిప్లయితొలగించండిసందర్భాన్ని బట్టి క్రోధమూ సద్గుణమే అన్న మీ పూరణ బాగుంది. అభినందనలు.
శ్రీ నేమానిగారికి ధన్యవాదములు.
రిప్లయితొలగించండిమాస్టరు గారూ ! మీ అబ్బాయికి స్వస్థత చేకూరిందన్నారు. సంతోషము.
మీరు మానసికంగా, శారీరకంగా బాగా అలసిపోయి ఉన్నారు. కొంతకాలము విశ్రాంతి తీసుకోండి.
అందరికీ వందనములు !
రిప్లయితొలగించండిఅందరి పూరణలూ అలరించు చున్నవి !
తప్పుదారిన తిరిగే కొడుకును మార్చాలంటే :
01)
______________________________
తల్లిదండ్రుల మాటల - తాలు జేసి
తాళిగట్టిన భార్యను - తక్కరించి
దారి తప్పి చరించెడి - తనయు మార్చ
క్రోధమే మేలుగద సర్వ - గుణములందు !
______________________________
బాలురైనా , లవకుశులపై క్రోధము న్యాయమే గదా :
రిప్లయితొలగించండి02)
______________________________
యాగ హయమును బంధించి - హద్దు మీఱి
యాహవమ్మును నాపు , క - ట్టాయితముల
నాహవమ్మున నిర్జించి - యాగ రక్ష
సేయ సమకట్టు శ్రీరాము - న్యాయమైన
క్రోధమే మేలుగద సర్వ - గుణములందు !
______________________________
ఆహవము = యాగము = యుద్ధము
కట్టాయితము = సంసిద్ధము
మానభంగ సమయంలో భీముని క్రోధము మేలే గదా :
రిప్లయితొలగించండి03)
______________________________
మానవతిని, మదవతిని - మామ యెదుట
నిండు పేరోలగంబున - నేర మనక
వలువ లూడ్చగ సమకట్టు - వారి పైన
క్రోధమే మేలుగద సర్వ - గుణములందు !
______________________________
ఐదూళ్ళైనా యివ్వని దుర్యోధనాదులపై పాండవులకు :
రిప్లయితొలగించండి04)
______________________________
వరుస వనవాస , యఙ్ఞాత - వాసములను
పూర్తి గావించి రాజ్యమ్ము - బొందు కొఱకు
రాయబారము విఫలము - సేయ , తుదకు
క్రోధమే మేలుగద సర్వ - గుణములందు !
______________________________
దొంగతనముగా భార్య నెత్తుక పోయిన వానిపై :
రిప్లయితొలగించండి05)
______________________________
భర్త లేనట్టి సమయమ్ము - వనము జొచ్చి
పర్ణశాలను నుండంగ - పట్టి నెట్టి
పడతి గొనిపోయి బంధించు - వాని పైన
క్రోధమే మేలుగద సర్వ - గుణములందు !
______________________________
భారతీయుల పీడించే వారిపై నేతాజీకి :
రిప్లయితొలగించండి06)
______________________________
వర్తకమ్మును సేయంగ - వచ్చి యిటకు
వరుస రాజ్యమ్ము స్థాపించి - మరియు మరియు
భారతీయుల పీడించు - వారి పైన
క్రోధమే మేలుగద సర్వ - గుణములందు !
______________________________
అదుపు తప్పిన భార్యపై భర్తకు :
రిప్లయితొలగించండి07)
______________________________
అత్తమామల నెదిరించి - యదుపు లేక
నాడ పడుచుల నవహేళ - నలను జేసి
భర్త మాటను జవదాటు - భార్యపైన
క్రోధమే మేలుగద సర్వ - గుణములందు !
______________________________
ఆరు శత్రువులందున నమిత సులభ
రిప్లయితొలగించండిరీతి పోగొట్ట గలిగిన లెస్సయయిన
దిదియె నమ్ము బాలక! విని యెఱుగ వేమి?
క్రోధమే మేలుగద సర్వగుణములందు.