16, నవంబర్ 2013, శనివారం

సమస్యాపూరణం - 1236 (ఆర్తజనరక్ష సేయని)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది......
ఆర్తజనరక్ష సేయని హరియె దిక్కు.

25 కామెంట్‌లు:

  1. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరింప నున్నవి !

    కాళ్ళల్లో సత్తువుంటే పరుగెత్తడం
    లేదంటే నువ్వే దిక్కని లొంగిపోవడం
    ఆర్తజన భక్షణ చేస్తుందే గాని
    ఆర్తజన రక్ష సేయదు గదా హరి (సింహము) :

    01)
    _________________________________

    అడవిని చను వేళ నకట - హరిని జూచి
    అరచినను మానకుండునె - కరువ కుండ
    నడుగు లందు బలమె రక్ష - యగును ! కాక
    ఆర్తజనరక్ష సేయని - హరియె దిక్కు !
    _________________________________
    అడుగు = పాదము

    రిప్లయితొలగించండి
  2. విలయ తాండవ మందున్న కలిని మించి
    దుష్ట శ్క్షణ జేయుట కష్ట మనుచు
    మౌన ముద్రను తపియించు మాయ లకట
    ఆర్తి జనరక్ష సేయని హరియె దిక్కు

    రిప్లయితొలగించండి
  3. కొమ్మ కొమ్మను దుముకుచు కోరి కోరి
    లంక ముట్టించి గెలిచెను బింక ముగను
    రామ భక్తిని చాటెను లక్ష ణముగ
    ఆర్త జనరక్ష సేయని హరియె దిక్కు

    హరి = కోత

    రిప్లయితొలగించండి
  4. అక్షరంబది మారయనర్థ మగును
    ' ఆర్త జనరక్ష సేయగ హరియె దిక్కు'
    వ్రాయమంటిని నేనట్లు, వ్రాసితీవు
    ' ఆర్త జనరక్ష సేయని హరియె దిక్కు' .

    రిప్లయితొలగించండి
  5. క్షమించాలి
    మొదటి పద్యం రెండవ పాదంలో ....దుష్ట శిక్షణ
    చివరి పాదంలో ఆర్త జన ...అని ఉండాలి
    ఇక ...హరి = కోతి ...అని ఉండాలి ......అసలు పద్యాలే తప్పుంటే ....? ? ? ఫ్ఛ్
    గో................విం............ద

    రిప్లయితొలగించండి
  6. ఆర్త జన రక్ష సేయని హరియె దిక్కు
    నాకనుచు వ్యంగ్య భాషలో సాదరముగ
    జేయ నిందాస్తుతిని భక్త శేఖరుండు;
    ఖేదమును బాపె శౌరి వినోదమొంది

    రిప్లయితొలగించండి
  7. చేరబిల్చిన కృష్ణకున్ చీరెలిచ్చె
    చేతగాదన గజరాజు జేరదీసె
    విడచి చేతల, చేతులన్ వేడు వరకు
    ఆర్త జనరక్ష సేయని హరియె దిక్కు.

    రిప్లయితొలగించండి
  8. ఆర్తజనరక్ష సేయని హరియె దిక్కు
    దిశల నెచ్చట కానము దీన జనుల
    నెల్ల వేళల గాచుచు, హేల జగతి
    నడుపు వాడయ్య మాస్వామి,నమ్మవోయి!

    రిప్లయితొలగించండి
  9. హరిని నమ్మని వారెల్ల యందు రిటుల
    ఆర్తజన రక్ష సేయని హరియె దిక్కు
    నీకు, హరిపదమ్ములునమ్ము నిర్మలులకు
    రక్ష సేయును హరితాను లక్ష ణముగ

    రిప్లయితొలగించండి
  10. వసంత కిశోర్ గారూ,
    ‘సింహము’ అనే అర్థంతో మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    రాజేశ్వరి అక్కయ్యా,
    మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
    *
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    ఒక్క అక్షరంతో అర్థం మారిందన్న మీ మొదటి పూరణ బాగుంది.
    సమయం వచ్చేదాక రక్షణ సేయడన్న రెండవ పూరణ కూడా బాగుంది. అభినందనలు.
    *
    పండిత నేమాని వారూ,
    ‘నిందాస్తుతి’తో భగవత్కృపకు పాత్రులైన భక్తుల కథలను ఎన్నో విన్నాము. చాలా మంచి పూరణ. అభినందనలు.
    *
    లక్ష్మీదేవి గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.
    మొదటి పాదానికి, ‘దిశల నెచ్చట కానము’ నకు అన్వయం కుదరనట్టుంది. ‘దిక్క/టంచు పలుకుట తగదు దీనార్తజనుల..." అంటే ఎలా ఉంటుంది?
    *
    శైలజ గారూ,
    అది ఒక శైవుడు వైష్ణవునితో అన్నమాటగా స్వీకరించాలా? బాగుంది మీ పూరణ. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  11. శ్రీ శంకరయ్య గురుదేవులకు, శ్రీ నేమాని గురుదేవులకు వినమ్రవందనములతో.....

    శ్రీ శంకరయ్య గురుదేవులకు ధన్యవాదములతో...

    ఇద్దరు పాపులు నరకము నకు బోయి ఇటు లనుచున్నారు
    ===========*==================
    నరహరి మనమున్నది ఘోర నరక మందు
    జెప్ప వలయు మంచి పనులు గొప్పగాను
    లెక్క దప్పుగ జెప్పిన డొక్క జించు
    నార్తజనరక్ష సేయని హరియె,దిక్కు
    మనకు పాపుల రక్షించు మాధవుండు!

    రిప్లయితొలగించండి
  12. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  13. గురువుగారూ, దిక్కగు వంటి ప్రయోగమేదైనా చేద్దామనుకొని సంశయించినాను.
    నిజమే అన్వయం కుదరలేదు. మీ సవరణ బాగున్నది. ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  14. పండిత నేమాని గారికి పూజ్యులు గురుదేవులు
    శంకరయ్య గారికి వందనములు

    ఇంటిలోని పోరును భరియించ లేక
    ఆలి కోర్కెల ధాటికి నాగలేక
    బ్రతుకు వలదని విలపించు భర్త కిపుడు
    ఆర్తరక్షణ సేయని హరియె దిక్కు

    హరి =సింహము

    రిప్లయితొలగించండి
  15. శంకరయ్య గారికి నేమాని వారికి నమస్కారం,
    మీ సలహాల మేరకు ఛందస్సు గూర్చి నేర్చుకోనుచున్నాను
    నాకు గణములను సమకూర్చుకోనుచు భావమును నిలబెట్టుట
    చాల కష్టం అనిపించింది ఇది తేటగీతి లో నా తొలి ప్రయత్నం
    తప్పులను మన్నించండి

    చెరకు వింటివాని చరచేరి, హాయి అనుకొని,
    కరుకు మాటలే రక్షించే కవచ మగునని,
    కడకు సోమరి తనమున సర్వం చదిరిన
    కుటిల, ఆర్త, జనరక్ష సేయని హరియె దిక్కు.

    రిప్లయితొలగించండి
  16. కవిమిత్రులు గోలి వారి పూరణ చాలా బాగుంది. వారికి అభినందనలు.

    అడవుల యుపయోగంబుల నంద జేయ
    అక్రమార్కుల దోపిడీ నాప గాను
    వన్య సంరక్షణార్థము వసుధ పైన
    నార్త జనరక్ష సేయని హరియె దిక్కు
    (హరి = సింహము)

    రిప్లయితొలగించండి
  17. వరప్రసాద్ గారూ,
    మీ పంచపాది పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    కెంబాయి తిమ్మాజీరావు గారూ,
    భార్యాబాధితుడనై వృద్ధాశ్రమాన్ని ఆశ్రయించిన నన్నే విషయంగా చేసుకున్నట్టున్నారు మీ పూరణ. చాలా బాగుంది. అభినందనలు.
    *
    మద్దూరి ఆదిత్యగారూ,
    మీ ప్రయత్నం, పద్యం వ్రాయాలనే తపన ప్రశంసనీయం.
    కాని మీరు వ్రాసిన పద్యంలో తేటగీతి లక్షణాలు ఏమాత్రమూ లేవు. మీరు తేటగీతి లక్షణాన్ని సరిగా అర్థం చేసికొనలేదనుకుంటాను.
    *
    సహదేవుడు గారూ,
    సింహం ఉన్న అడవిలో కలప దొంగతనమా? కష్టమే! చాలా బాగుంది మీ పూరణ. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  18. మాస్టరు గారూ ! ధన్యవాదములు.
    సహదేవుడు గారూ ! ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  19. పండిత నేమాని వారి పద్యము, తిమ్మాజీ రావు గారి పద్యము ఇచ్చిన ఊతము తో:

    కానుపింపుమయ్య!తివిరి కావు మయ్య!
    విశ్వనాధుడవీవేల వినవొ గాని
    యింతి దెప్పుచుండెను నిత్యమిటుల "తమరి
    కార్త జనరక్ష సేయని హరియె దిక్కు"


    గురువుగారు.,
    నా పద్యాలు అయితేగియితే స్వగతాలే తప్ప అన్యాపదేశాలు కావు.

    రిప్లయితొలగించండి
  20. రామకృష్ణ గారూ,
    బహుకాల దర్శనం. సంతోషం.
    మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  21. 1.ఇంద్ర గణాలు: నల IIII, నగ IIIU, సల IIUI, భ UII, ర UIU, త UUI గణాలు.
    ౨.సూర్య గణాలు: గలము లేక హగణం: UI ., మరియూ.. III నగణం.
    మనకు ఇవి కావాలి తేటగీతి రాయాలంటే అంతే..
    సూర్య - ఇంద్ర - ఇంద్ర - సూర్య - సూర్య. ప్రతి పాదం లో ఉండాలి.
    ఇది నేను అనుసరించిన సూత్రం
    పై సూత్రం ప్రకారం
    చెరకు వింటివాని చరచేరి, హాయి అనుకొని,
    iii iiui iiui ui iiii
    ఇదే ప్రకారం 4 పాదాలు ప్రయత్నించాను
    నేను వదిలిన నియమం తెలిపిన యడల సరిదిద్దే ప్రయత్నం కూడా చేసెదను

    రిప్లయితొలగించండి
  22. ఆదిత్య గారూ,
    మీరు చెప్పిన తేటగీతి లక్షణం సరియైనదే. కాని గురులఘువుల విషయంలో మీరు పొరపాటు చేశారు.
    మీరిచ్చిన పాదానికి గురు లఘువులు క్రింది విధంగా ఉంటాయి.
    చెరకు వింటివాని చరచేరి, హాయి అనుకొని,
    I I I U I U I I I U I U I I I I I
    ‘విం’ అనుస్వారం (సున్నా) ఉన్నది కనుక గురువవుతుంది. పాదం చివరిది నలం (ఇంద్రగణం) అవుతున్నది. అక్కడ ఉండవలసింది సూర్యగణం..
    గురువులు....
    ౧. ఆ,ఈ,ఊ,ౠ,ఏ,ఐ,ఓ,ఔ అనే అచ్చులు.
    ౨. పై అచ్చులతో కూడిన హల్లులు - ఉదా. కా,కీ,కూ,కౄ,కే,కై,కో,కౌ.
    ౩. అనుస్వారంతో కూడిన అక్షరాలు. ఉదా. కం, విం, చుం, తృ, పెం, సొం,
    ౪. విసర్గతో కూడిన అక్షరాలు. ఉదా. మః, సః, రిః...
    ౫. పొల్లు అక్షరంతో కూడినవి. ఉదా. అప్, దిక్,. అచ్, సత్, నన్, బస్...
    ౬. ద్విత్వాక్షరాలకు ముందున్నవి.. ఉదా. అక్క అన్నప్పుడు ‘క్క’ అన్న ద్విత్వాక్షరానికి ముందున్న ‘అ’ గురువౌతుంది.
    ౭. సంయుక్తాక్షరాలకు ముందున్నవి. ఉదా. చక్రి అన్నప్పుడు ‘క్రి’ అన్న సంయుక్తాక్షరానికి ముందున్న ‘చ’ గురువవుతుంది.

    రిప్లయితొలగించండి
  23. శ్రీ ఆదిత్య గారూ! శుభాశీస్సులు.
    మీరు పద్యము వ్రాయుటకు ప్రయత్నించుట ముదావహమే. కాని గణములను గుర్తించుటలోనే చాల తప్పులు దొరలినవి. మీ పద్యము మొదటి పాదమును చూడండి.

    చెరకు వింటివాని చరచేరి హాయి అనుకొని =

    న రల సల హ నల గణములు - యతి వేయలేదు.
    4 పాదములలోను గణములు సరిగా వేయ లేదు. జాగ్రత్తగా నేర్చుకొని మరల మరల ప్రయత్నించండి. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  24. పూజ్యులు గురుదేవులు శ౦కరయ్య గారికి
    వందనములు. వేమనపద్యము ఆధారముగా నేనుపద్యమువ్రాసినాను మీకు బాధకలిగించిన
    క్షంతవ్యుడను

    రిప్లయితొలగించండి
  25. తిమ్మాజీ రావు గారూ,
    నేనేదో సరదాగా అన్నాను. అంతే!

    రిప్లయితొలగించండి