22, నవంబర్ 2013, శుక్రవారం

సమస్యాపూరణం - 1242 (గాంగేయుఁడు పెండ్లియాడి)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది......
గాంగేయుఁడు పెండ్లియాడి కనె సత్సుతులన్.

25 కామెంట్‌లు:

  1. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించ నున్నవి !

    మాజీ ప్రధాని దేవెగౌడ తనయుడు కుమారస్వామి మొదటి భార్య అనిత.
    వీరికి నిఖిల్ గౌడ్ అనే కుమారుడు ఉన్నారు.
    కుమారస్వామి సిఎంగా ఉన్న సమయంలో రాధికను రహస్యంగా వివాహం చేసుకున్నట్లు,
    వీరికి షమిక అనే పాప ఉందని ప్రచారం.

    చెవులు లేని పాము సంగీతానికి ఊగడం నిజమైతే
    గాంగేయునిక్కూడా పిల్లలున్నట్టే :

    01)
    ___________________________________

    కంగారు పడెద రేలనొ ?
    సంగీతము వినిన నూగు - సర్పము రీతిన్
    బంగారపు రాష్ట్రంబున
    గాంగేయుఁడు పెండ్లియాడి - కనె సత్సుతులన్ !
    ___________________________________
    గాంగేయుఁడు =కుమారస్వామి= మాజీ ప్రధాని దేవెగౌడ తనయుడు కుమారస్వామి
    బంగారపు రాష్ట్రం = బంగారం పండే రాష్ట్రం = బంగారం వంటి రాష్ట్రం = కర్ణాటక
    సుతులు = తనయులు (పిల్లలు)

    రిప్లయితొలగించండి
  2. భీష్ముడు నిత్య సత్య బ్రహ్మచారి !
    పిల్లల్ని కన్నది విచిత్ర వీర్యుడు గదా :

    02)
    ___________________________________

    అంగాంగము నిత్య వటువు
    గాంగేయుఁడు ! పెండ్లియాడి - కనె సత్సుతుల
    న్నంగన యంబిక యందున
    నంగన యంబాలి కందు - నను వీర్యుండే !
    ___________________________________
    వటువు = బ్రహ్మచారి

    రిప్లయితొలగించండి
  3. పిల్లల్ని కన్నది విచిత్ర వీర్యుడు అదీ విచిత్రంగా :

    03)
    ___________________________________

    బంగారపు వన్నె గలుగు
    యంగన లిద్దరి నపూర్వ - మనదగు రీతిన్
    హంగుగ , వైమాత్రుడు నౌ
    గాంగేయుఁడు , పెండ్లియాడి - కనె సత్సుతులన్ !
    ___________________________________
    హంగు = పద్ధతి = ఉపాయము
    వైమాత్రుడు = సవతితల్లి కొడుకు
    వైమాత్రుడు నౌ గాంగేయుఁడు = విచిత్రవీర్యుడు

    రిప్లయితొలగించండి
  4. లింగాపుర వాసినియగు
    మంగను శుభ లగ్నమందు మానసమలరన్
    రంగాచారి కుమారుడు
    గాంగేయుడు పెండ్లియాడి కనె సత్సుతులన్

    రిప్లయితొలగించండి
  5. హంగుగ పేరును నాటక
    రంగములో భీష్మునిగను రాజిల్లెగదా
    రంగారాయుండభినవ
    గాంగేయుడు, పెండ్లియాడి కనె సత్సుతులన్

    రిప్లయితొలగించండి
  6. పండిత నేమాని గారికి పూజ్య గురుదేవులు
    శంకరయ్య గారికి వందనములు
    లొంగడు వివాహమాడగ
    గాంగేయుడు.పెండ్లి యాడి కనె సత్సుతులన్
    అంగన పృథ మంత్ర మహిమ
    సంగమమై శమన వాయు జంభారులతోన్

    రిప్లయితొలగించండి
  7. రంగాచారికి గల దొక
    మంగా యను బేర నొప్పు మంచి దుహితయున్
    అంగన యందము మెచ్చీ
    గాంగేయుడు పెండ్లి యాడి కనె సత్సుతులన్

    రిప్లయితొలగించండి
  8. గంగ సుతులలో మిగిలెను
    గాంగేయుఁడు; పెండ్లియాడి కనె సత్సుతులన్,
    భంగపఱచె నియమమనుచు
    నంగన విడిచెను తనపతి నన్యాయముగాన్

    రిప్లయితొలగించండి
  9. శ్రీ శంకరయ్య గురుదేవులకు నా తప్పులను తెలియ పరచినందులకు ధన్యవాదములు.
    తప్పుల జేయకుండు నట్లు ప్రయత్నించెదను గురువు గారు.
    శ్రీ వసంత కిషొర్ గారు కుమారస్వామి రెండవ వివాహము నిజమే!
    నాది కూడా మీ రూటే
    కుమారస్వామి కుమారుడు కూడా తండ్రి వలె దిరుగుచున్నాడు, వానిని జూచి కుమారస్వామి తో స్నేహితులనెరి
    ======*========
    సంగాతకత్తెల జెలిమి,
    సంగీతమున కలవడి సాగుచునుండన్
    సాంగత్యమునన్ బల్కిరి
    గాంగేయుఁడు పెండ్లియాడి కనె సత్సుతులన్ !

    రిప్లయితొలగించండి
  10. వసంత కిశోర్ గారూ,
    మీ మూడు పూరణలూ బాగున్నవి. అభినందనలు.
    *
    పండిత నేమాని వారూ,
    గాంగేయుడనే వ్యక్తిని గురించిన మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    భీష్మ పాత్రధారిని గురించిన మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    కెంబాయి తిమ్మాజీరావు గారూ,
    మీరు భీష్ముణ్ణి వదిలి కుంతిని పట్టారు. బాగుంది మీ పూరణ. అభినందనలు.
    *
    సుబ్బారావు గారూ,
    మీరూ నేమాని వారి బాట పట్టారు కదా! మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    లక్ష్మీదేవి గారూ,
    గంగను విషయంగా చేసికొన్న మీ పూరణ బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  11. శ్రీ నేమాని గురుదేవుల "లింగాపుర వాసి" పద్యము బహు సుందరము గానున్నది

    రిప్లయితొలగించండి
  12. వరప్రసాద్ గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  13. పండిత నేమాని గారికి పూజ్య
    శంకరయ్య గురుదేవులకు వందనములు

    మంగళమయి నారాయణి
    గంగాధర సుతుడు తారకాంతకుడై త
    న్వంగిని సకి శ్రీవల్లిని
    గాంగేయుడు పెండ్లి యాడి కనె సత్సుతులన్
    గాంగేయుడు =సుబ్రహ్మణ్య స్వామి [స్కందుడు]

    రిప్లయితొలగించండి
  14. చెంగావి చీర గట్టియు
    శృంగారమునొలక బోయు చెలిని వరించ్యా
    గంగ వలదనిన వినకను
    గాంగేయుడు పెండ్లియాడి కనె సత్సుతులన్.

    రిప్లయితొలగించండి
  15. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    గాంగేయుడు శబ్దానికి ఉన్న అర్థభేదాన్ని వినియోగించుకొని చక్కని పూరణ చెప్పారు. బాగుంది. అభినందనలు.
    *
    గుండూరి లక్ష్మినారాయణ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘వరించ్యా" ?

    రిప్లయితొలగించండి
  16. గంగను శిరమున గలిగిన
    జంగముదేవర కొమరుడు శరవణభవుడా
    గంగకు పుత్రుడు వరుసకు,
    గాంగేయుడు పెండ్లియాడి కనె సత్సుతులన్

    రిప్లయితొలగించండి
  17. పొంగారెడు సంత సమున
    సింగా రించుకు పదమనె శ్రీలత బావన్
    రంగము జేరిన తదుపరి
    గాం గేయుడు పెండ్లి యాడి కనె సత్పుతు లన్

    రిప్లయితొలగించండి
  18. మాస్టరు గారూ ! నాదొక సందేహము..గాంగేయుడు (సుబ్రహ్మణ్యస్వామి) పెండ్లియాడి కనె సత్సుతులన్ .....స్కందునికి సంతానము ఉన్నదా...అలా వ్రాయవచ్చునా...

    రిప్లయితొలగించండి
  19. గ్యాంగుకు లీడరు కావున
    గాంగేయుండని పిలుతురు, గల్లీ గల్లీ
    హంగామా జేయుచు నా
    గాంగేయుఁడు పెండ్లియాడి కనె సత్పుతులన్!

    రిప్లయితొలగించండి
  20. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    సుబ్రహ్మణ్యస్వామికి నలుగురు పుత్రులు. వారి పేర్లు......
    శాఖుఁడు, విశాఖుఁడు, నైగమేషుఁడు, పృష్ఠజుఁడు.
    (‘ఆంధ్రభారతి’ నుండి)

    రిప్లయితొలగించండి
  21. బొడ్డు శంకరయ్య గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు
    *
    రాజేశ్వరి అక్కయ్యా,
    శ్రీలత బావ పేరు గాంగేయుడా? బాగుంది మీ పూరణ. అభినందనలు.
    *
    సహదేవుడు గారూ,
    మీ పూరణ చమత్కార జనకంగా ఉంది. అభినందనలు.
    కాకుంటే కొన్ని వ్యావహారికాలను (గల్లీ గల్లీ) ప్రయోగించారు.

    రిప్లయితొలగించండి
  22. గంగా ధరునికి కొమరుడు
    హంగుగ నెమలిన తిరిగెడు అంబా సుతుడున్
    మంగళముగశ్రీవల్లిని
    గాంగేయుడు పండ్లియాడి - కనె సత్సుతులన్

    రిప్లయితొలగించండి
  23. మాస్టరు గారూ !నా సందేహ నివృత్తి చేశారు..ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  24. గంగను జేరుచు మ్రొక్కగ
    భంగును గ్రోలుచును భక్తి పరవశ మెసగన్
    వంగుచు రాహులు పల్కెను:
    "గాంగేయుఁడు పెండ్లియాడి కనె సత్సుతులన్"

    రిప్లయితొలగించండి