9, నవంబర్ 2013, శనివారం

సమస్యాపూరణం - 1230 (సాహెబు ముప్ప్రొద్దులందు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది.....
సాహెబు ముప్ప్రొద్దులందు సంధ్యను వార్చున్.

21 కామెంట్‌లు:

  1. స్నేహము జేసెను బాపని
    మోహా వేశమును వీడి పూజించె హరిన్
    ఆహరి నామమె మధురము
    సాహెబు ముప్పొద్దు లందు సంధ్యను వార్చున్ !

    రిప్లయితొలగించండి
  2. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !

    యెంతకీ పిల్లలు పుట్టక పోతే
    ఒక దర్గాలో నున్న మహిమగల సాహెబు బాబాకు
    మ్రొక్కినందువలన పుట్టిన హరిబాబా !
    కాని అందరూ సాయిబూ అని పిలుస్తారు !
    సాహెబు అనేది పిలుపే గాని అతడు తురకవాడు కాదు !
    నూటికి నూరుపాళ్ళు సద్వంశ సంజాతుడైన బ్రాహ్మణుడు !
    కావుననే మూడు పూటలా సంధ్య వారుస్తాడు !
    ఎనీ డౌట్స్ ????

    01)
    ________________________________

    సాహెబు యన గాదు తురక
    సాహెబుబాబాకు మ్రొక్క - జన్మించుటచే
    నా హరిబాబా నందురు
    సాహెబు ముప్ప్రొద్దులందు - సంధ్యను వార్చున్ !
    ________________________________

    రిప్లయితొలగించండి
  3. అతడి పేరు సాహెబు !
    తురకల యింట బుట్టిన వాడు !
    కాని వీర బ్రహ్మేంద్ర స్వామిని సేవించిన సిద్ధయ్య వలె

    రూప, నామ బేధమే గాని
    దేవుడొక్కడే అని మనసా వాచా నమ్మేవాడు !
    అతడు సర్వ మత సహనుడు !
    సర్వమత సమ్మతుడు !
    అన్ని మతముల యందు
    అందలి యాచార వ్యవహారములయందు యిచ్ఛగలిగినవాడు !

    పైగా యెవరే మనుకుంటారో
    అనే భయం లేనివాడు !
    గొప్ప సాహసి !
    మన కుహనా రాజకీయ నాయకుల వలె కాదు
    నిఝంగానే లౌకికవాది !

    అందుకే మిత్రులతో కలసి
    చర్చి కెళ్తాడు !
    మశీదు కెళ్తాడు !
    గురుద్వారా కెళ్తాడు !
    గుడి కెళ్తాడు !

    అతడు ముప్రొద్దులా సంధ్య వారిస్తే మీకేమన్నా అభ్యంతరమా ???

    02)
    ________________________________

    సాహెబు యైతే నేం ? బల్
    సాహసవంతుడు పర మత - సమ్మతు డౌటన్
    సాహెబ్‌ఖానా వలెనే
    సాహెబు ముప్ప్రొద్దులందు - సంధ్యను వార్చున్ !
    ________________________________
    సమ్మతి = ఇచ్ఛ
    సాహెబ్‌ఖానా = గృహ యజమాని- ఇంటి సొంతదారు

    రిప్లయితొలగించండి
  4. రాజేశ్వరి అక్కయ్యా,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    వసంత కిశోర్ గారూ,
    మీ రెండు పూరణలూ బాగున్నవి. అభినందనలు.
    మొదటి పూరణలో "సాహె బనగ గాదు" అనీ, రెండవ పూరణలో "సాహె బైన నేమిటి" అనండి. "సాహెబు + అన" అన్నప్పుడు యడాగమం రాదు. సంధి నిత్యం.

    రిప్లయితొలగించండి

  5. ఐదు పొద్దు లందు నమాజు సాగించు సాహేబు,
    ముప్ప్రొద్దులందు సంధ్యను వార్చున్ బ్రాహ్మడు
    మనో దండం బెట్టి పని సాగించు మరొకండు
    ఏక త్రిగుణాత్మక పంచ భూతా నమో నమః !!

    శుభోదయం
    జిలేబి

    రిప్లయితొలగించండి
  6. ఆ హా ! యేమని జెప్పుదు
    నా హిమగిరిసుత గరుణన నారంభించిన్
    బీహారు నగర మందలి
    సాహెబు ముప్ప్రొద్దు లందు సంధ్యను వార్చున్

    రిప్లయితొలగించండి
  7. శ్రీ శంకరయ్య గురుదేవులకు,శ్రీ నేమాని గురుదేవులకు వినమ్రవందనములతో.....

    శ్రీ శంకరయ్య గురుదేవులకు ధన్యవాదములతో...

    వసంత కిశోర్ గారూ నో డౌట్స్ సార్! అభ్యంతరమూ లేదు ! నాది కూడా అదే బాట
    ========*===========
    సాహసి యగు నొక్కడు దన -సంతతి యందు జ్యేష్టునకు
    సాహెబనుచు నామ కరణ -స్వామి సన్నిధి యందు జేయ
    పాహి పాహి యనుచు నతడు -బట్టె పంకజ నాభుని పదము
    సాహెబు ముప్ప్రొద్దులందు -సంధ్యను వార్చున్ గనుడని
    బాహాటముగ బల్కెరి ఘన పండిత వర్యులు నేడు !

    రిప్లయితొలగించండి
  8. శ్రీ శంకరయ్య గారికి ధన్యవాదములు

    మీ సాహిత్య సేవకు ముగ్దుడ నైతిని, మీ బ్లాగు మంచి కవి మిత్రుల పద్యములతో నిత్య నూతన శోభతో మమ్ము అలరించు చున్నది.

    మీకు వ్యక్తి గతముగా నెన్ని సమస్యలున్న " సమస్యాపూరణ " యిచ్చి సాహిత్య సేవ జేయుచున్న మీకు నా పాదాభి వందనములు.

    పెద్ద పురుషోత్తం (08197481658)

    తిరుపతి

    రిప్లయితొలగించండి
  9. ఒక హిందూదేశపు గూఢచారి ముస్లిము "సైనికులకు" పట్టుబడ్డాడు:

    జాహాపన! వీనిని గను
    మా - హైందవగూఢచారి! మనవారంతా
    మోహపడినట్టు కాడొక
    సాహెబు| ముప్ప్రొద్దులందు సంధ్యను వార్చున్!!

    రిప్లయితొలగించండి
  10. జిలేబీ గారూ,
    "నమో నమః"
    *
    సుబ్బారావు గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    రెండవ పాదం చివర టైపాట్లు ఉన్నట్టున్నాయి.
    *
    వరప్రసాద్ గారూ,
    మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
    *
    పెద్ద పురుషోత్తం గారూ,
    నా బ్లాగు మీకు నచ్చినందుకు ధన్యవాదాలు.
    కేవలం చదివి ఆనందించడమే కాక పూరణ పద్యాల బాగోగులను తెలియజేయండి. ఔత్సాహిక కవులను ప్రోత్సహించండి.
    *
    గూడ రఘురాం గారూ,
    మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  11. ఈ హరిశర్మను గనుమా
    శ్రీ హరి నర్చించు సతము శివుని నుతించున్
    సోహమ్మని ధ్యానించును
    సాహెబు! ముప్పొద్దు లందు సంధ్యను వార్చున్!

    రిప్లయితొలగించండి
  12. నాగరాజు రవీందర్ గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    మిస్సన్న గారూ,
    చక్కని పూరణ నందించారు. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  13. స్నేహితుడు నాకు వీరే
    శ్రీహరి శర్మంద్రు పూజ చేయును గుడిలో
    జీహా ! యనిచెప్పె నిటు
    సాహెబు! ముప్పొద్దు లందు సంధ్యను వార్చున్!

    రిప్లయితొలగించండి
  14. కంది శంకరయ్య గారికి నమస్కారములు
    'వాహబు' నమాజు రోజుకు
    దోహలముగ నైదు సార్లు దోయిలి జదువన్
    రాహులు శర్మ కలెక్టరు
    సాహెబు! ముప్పొద్దు లందు సంధ్యను వార్చున్

    రిప్లయితొలగించండి
  15. శంకరార్యా ! ధన్యవాదములు !

    డౌట్సేమీ లేనందుకు, అభ్యంతరం చెప్పనందుకూ
    చక్కగా పూరణ చేసినందులకూ
    మిత్రులు వరప్రసాద్ గారికి ధన్యవాదములు !

    అందరి పూరణలూ అలరించు చున్నవి !

    రిప్లయితొలగించండి
  16. మూడవపాదం గణ సవరణతో...

    స్నేహితుడు నాకు వీరే
    శ్రీహరి శర్మంద్రు పూజ చేయును గుడిలో
    జీహా ! యనిచెప్పె నిటుల
    సాహెబు! ముప్పొద్దు లందు సంధ్యను వార్చున్!

    రిప్లయితొలగించండి
  17. MANNINCHANDI SIR.NENU MORNING BANK BRANCH MENTION CHEYALEDU.EPUDU MENTION CHESTHUNNANU.{JANGIDI RAJENDAR,SBH{AREPALLY }WARANGAL DISRTICT.A/C NO:62257143263} PLZ HELP ME.

    రిప్లయితొలగించండి
  18. దాహము వోట్లకు సీట్లకు
    మోహము మీరగ ఘనమగు మోసము తోడన్
    రాహులు గడ్డపు మీసపు
    సాహెబు ముప్ప్రొద్దులందు సంధ్యను వార్చున్

    రిప్లయితొలగించండి


  19. కలడు కలండనెడు వాడు కలడో !

    లాహిల్లాహిరసూలని
    సాహెబు, ముప్ప్రొద్దులందు సంధ్యను వార్చున్
    స్వాహా యని పారుడు మేల్
    వాహే గురు శిక్ఖులు, ప్రభువాయని యితరుల్ !

    జిలేబి

    రిప్లయితొలగించండి
  20. సాహస మొందుచు జందెము
    బాహాటముగా నమర్చి భండన మందున్
    ఆహాహా! యని రాహులు
    సాహెబు ముప్ప్రొద్దులందు సంధ్యను వార్చున్

    సాహెబు = గౌరవనీయుడు

    రిప్లయితొలగించండి