30, నవంబర్ 2013, శనివారం

దత్తపది - 35 (ఆది-సోమ-మంగళ-బుధ)

కవిమిత్రులారా!
ఆది - సోమ - మంగళ - బుధ
పై పదాలను ఉపయోగిస్తూ మీకు నచ్చిన ఛందస్సులో
భారతార్థంలో పద్యం వ్రాయండి.

39 కామెంట్‌లు:

  1. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరింప నున్నవి !

    దేవా ! దీనబాంధవా !
    అసహాయురాలరా ! కావరా ! దేవా

    మకరి పాలై శరణము వేడిన - కరిని కాపాడి నావే
    హిరణ్యకశిపూ తామస మణచీ - ప్రహ్లాదు రక్షించి నావే
    కుమతులు చేసే ఘోరము నాపీ - కులసతి గాపాడ లేవా

    అంటూ "పాండవ వనవాసం" చిత్రంలో సాయిత్రి
    అదే మహాశయా , ద్రౌపది ప్రార్థన :

    01)
    _______________________________

    సభను మానము గోల్పోవు - సమయ మందు
    సోమకాసురు ద్రుంచిన - సోమగర్భు
    నాది సూకర రూపుని - నాత్మభువును
    మానమును నిల్పి కలిగించు - మంగళంబు
    ధర్మరాజాది పతులెల్ల - తగ్గిరయ్య
    యనుచు మానిని ద్రౌపది - యార్తి దీర
    తనను గావగ శ్రీకృష్ణు - దలచి యరచె !
    _______________________________
    తగ్గు = వెనుకకు దీయు
    అరచు = మొరపెట్టు


    రిప్లయితొలగించండి
  2. అలిగితివా సఖీ ప్రియా - అలుక మానవా
    అని శ్రీకృష్ణుడు ప్రార్థించడానికి కొంచెం ముందు
    అలుకలకొలికి , సత్యభామ శ్రీకృష్ణునితో :

    02)
    _______________________________

    ఆదివారము వెడలినా - వామె వెంట
    సోమవార మే భామ తో - సోలి నావొ ?
    మంగళ, బుధ వారము లెట - మసలి నావొ?
    లక్ష్మివారము యెవరయ్య - రమణి నీకు?
    శుక్రవారము వస్తివి - చూడ నన్ను
    వీలు లేదయ్య ! పోవయ్య - వెన్నదొంగ !
    యెచట శనివారముందువో - యచటి కీవు !
    _______________________________


    రిప్లయితొలగించండి
  3. మాన్చ్చి రంగస్థల పద్యాలన్దిన్చారుగా వసంతమహోదయా!

    రిప్లయితొలగించండి
  4. శ్రీ శంకరయ్య గురుదేవులకు, శ్రీ నేమాని గురుదేవులకు వినమ్రవందనములతో.....

    శ్రీ శంకరయ్య గురుదేవులకు , శ్రీ నేమాని గురుదేవులకు ధన్యవాదములతో...

    ==========*==========
    ఆది నుండి పాండవ పక్ష పాతి యైన
    సోమ కాసురు గూల్చిన సుందరుండు
    మంగళా కారుడు మహిలో మనుజ రూపి
    యై బుధ జనుల సద్గురువై నిలువగ
    శుక్ర తతుల నేలిన యట్టి వక్ర బుద్ది
    స్థిరము గా శని కౌరవ శిరము లందు
    నిలిచి యుండ గడ వరకు నెమ్మనమున
    సజ్జన దరికి జేరెను శాంతి యపుడు !

    రిప్లయితొలగించండి
  5. కపట నిద్రలోనున్న కృష్ణుని వద్దకు వెళ్ళిన అర్జునుని మాటలు.

    సోమవంశంపు వారికి సూర్యుడీవు
    బుధజనంబులు గొల్చు శ్రీమూర్తి వీవు
    మంగళంబులు గల్గగా మదిని దల్తు
    ఆది దేవుడ కనుము నీ యర్జునుడను.

    రిప్లయితొలగించండి

  6. శ్రీ వసంత మహోదయా! మంచి పద్యాలనందించిన మీకు ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి




  7. ఆదినారాయణు నవతారమూర్తి,
    సోమశేఖరు మిత్ర,సుందరవదన,
    మంగళమ్మును గూర్చు మా పాండవులకు,
    ననుచు బ్రార్థనజేసె నమితభక్తి
    బుధుడైన ధర్మజ భూజాని యచ్యుతు.

    రిప్లయితొలగించండి
  8. పండిత నేమాని గారికి పూజ్యగురుదేవులు
    శ౦కరయ్యగారికి వందనములు

    ఆ దినమందు కీచకుడు అంతిపురమ్మునసోమమిచ్చుశా
    తోదరి ద్రౌపదిన్ మదను తూపులు తాకగ సంచలించి మ
    ర్యాదను వీడి వెంటబడెనా బుధ వర్యులు నిండు రాట్ సభన్
    ఆదురితమ్ము జూచిన జనాళి యమంగళ సూచకమ్మనెన్

    రిప్లయితొలగించండి
  9. రాయబారమునకు పోవుచున్న శ్రీకృష్ణునితో ధర్మజుని పలుకులు.....
    ఆదినుండి మా హితుఁడవు యాదవాబ్ధి
    సోమ! మాకును కౌరవ సోదరులకు
    మంగళముఁ గోరువాఁడవు; మా పుడమిని
    బుధవరుల్ మెచ్చ నిప్పించఁ బొసఁగు సంధి.

    రిప్లయితొలగించండి
  10. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  11. వసంత కిశోర్ గారూ,
    మీ రెండు పూరణలూ చక్కగా ఉన్నాయి. అభినందనలు.
    మొదటి పూరణలో ‘బుధ’ శబ్దం కనిపించలేదు.
    *
    వరప్రసాద్ గారూ,
    అన్ని వారాలతో చక్కని పద్యం చెప్పారు. అభినందనలు.
    మొదటి పాదంలో యతిదోషం. ‘ఆదినుండి పాండవ హిత మభిలషించు’ అందామా?
    *
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    కమనీయం గారూ,
    ద్విపదలో మీ పూరణ బాగుంది. అభినందనలు.
    చివరి రెండు పాదాలలో గణదోషం.. నా సవరణ...
    "ననుచు బ్రార్థనజేసె నమితమౌ భక్తి
    బుధుడైన ధర్మజ భూజాని హరిని."
    *
    కెంబాయి తిమ్మజీ రావు గారూ,
    దత్తపది పూరణకు వృత్తాన్ని ఎన్నుకొనడం సాహసమే. సంతోషం. బాగుంది. అభినందనలు.
    ‘కీచకుఁడు అంతిపురమ్ము" అని విసంధిగా వ్రాయరాదు కదా.. అక్కడ ‘చేదివిభుఁ డంతిపురమ్ము’ అందాం..
    అలాగే ‘సభన్ + ఆదురితమ్మును" అన్నదానిని ‘బుధవర్యులు చీదరింపగా/ నా దురితమ్ము’ అంటే బాగుంటుందేమో!

    రిప్లయితొలగించండి
  12. శ్రీ భాగవతుల కృష్ణారావు గారి పూరణ

    ఆది కురు పాండవులు వైరులగుట చేత
    బుధజనులు గురుకృప భీష్మ భూరితతులు
    రణము మంగళ మొసగదు రాజ్య కాంక్ష
    వీడి సోమ మందక హింస వీడుమనిరి

    రిప్లయితొలగించండి
  13. శ్రీ భాగవతుల కృష్ణారావు గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    ‘సోమము’ ఏ అర్థంలో ప్రయోగించారు?

    రిప్లయితొలగించండి
  14. పూజ్యగురుదేవులుశంకరయ్య గారికి
    వందనములు
    మీరుచేసిన సవరణలకు ధన్యవాదములు

    రిప్లయితొలగించండి
  15. సోమ బుధజను లాదిగా జూచుచుండ
    మంగళాంగన ద్రౌపది మానవతిని
    వలువలను విప్పి యవమాన పరచె నౌర!
    నిండు సభలోన దుశ్శాస నుండు ఖలుడు.

    రిప్లయితొలగించండి
  16. సోమ బుధ జను లాదిగా జూచుచుండ
    మంగళాంగన ద్రౌపది మానవతిని
    వలువలను విప్పి యవమాన పరచె నౌర!
    నిండు సభలోన దుశ్శాస నుండు ఖలుడు.

    రిప్లయితొలగించండి
  17. శంకరయ్యగారికి వందనములు 'సోమము'
    ను'శ్రమ' 'యను'అర్ధములో నుపయోగించినారని శ్రీ
    కృష్ణారావుగారు తెలియజేసారు
    [శబ్ద రత్నాకరము]

    రిప్లయితొలగించండి
  18. సోమ లతవంటి ద్రోవది సోయ గమ్ము
    మంగ ళాంగన సతియను మాట మరచి
    బుధవ రులుతల వంచిన జూద మందు
    నాది దేవుని ప్రార్ధించె నాద రింప

    రిప్లయితొలగించండి
  19. గురువు గారికి కవి మితృలందరికీ నమస్కారములు.
    చాలా రోజుల తరువాత నా చిన్ని ప్రయత్నం :

    ఆది మధ్యాంతరహితుండు అయిన శివుడు
    సోమ శేఖర నామమున స్తోత్రమంది
    మంగళమ్ములనాశించు మనుజులకును
    విబుధ తేజమ్ము నందించు విహిత మూర్తి.

    రిప్లయితొలగించండి
  20. గురువు గారూ, మీ పూరణలో వారాలు అందంగా ఇమిడిపోయినాయి.

    ఆదిత్యుడొసగె బాలుని ;
    యాదినమున సోమదార లందున విడువం
    గా,దీనకమంగళమది,
    తా దు:ఖించె నొక యంబుధరమై కురిసెన్.

    రిప్లయితొలగించండి
  21. గండూరి లక్ష్మినారాయణ గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    ‘సోమ’ శబ్దానికి అన్వయం?
    *
    రాజేశ్వరి అక్కయ్యా,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    మారెళ్ల వామన కుమార్ గారూ,
    బహుకాల దర్శనం. సంతోషం.
    మీరు శివపరంగా చెప్పారు. భారతార్థంలో చెప్పాలి కదా. ‘రహితుండు + అయిన’ అని విసంధిగా వ్రాశారు. రెండవ పాదంలో గణదోషం.
    భారతార్థంలో మీ పద్యానికి నా సవరణ.,... శివుడు అర్జునునకు పాశుపతాస్త్రాన్ని ఇవ్వడం....

    ఆది మధ్యాంతరహితుడైనట్టి శివుడు
    సోమ శేఖరాహ్వయముతో స్తోత్రమంది
    మంగళాస్త్రము నందించఁ బొంగె నరుఁడు
    విబుధ తేజమ్ము నందెను విహిత మూర్తి.

    రిప్లయితొలగించండి
  22. భారతార్ధం అనే మాట నేను చదువుకో లేదు. మన్నించ ప్రార్థన. సవరణతో మీరు పంపిన పద్యం అద్భుతం. ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  23. మీరు మిత్రుని కొఱకై సవరించిన పద్యము అద్భుతంగా ఉంది. వారాలూ ఇమిడిపోయినాయి, గొప్ప దృశ్యము ఆవిష్కరింప బడింది. మంచి సన్నివేశాన్నీ ఎంచుకున్నారు.

    రిప్లయితొలగించండి
  24. లక్ష్మీదేవి గారూ,
    ధన్యవాదాలు.
    మీరేం తక్కువ తిన్నారా? మీ ‘అంబుధరం’ కవితామృతాన్ని కురిపించింది. మంచి పూరణ. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  25. శ్రీ కంది శంకరయ్య గురువర్యులుకు నమస్కారములు

    సోమము= పరాక్రమము అను అర్థ్హములో ఉపయోగించాను

    పరాక్రమ జ్ఞానవంతులు మొదలగు వారు అను భావముతో వ్రాశాను.
    అన్వయము సరిగా లేకున్నచో తెలియజేయ ప్రార్థన

    రిప్లయితొలగించండి
  26. గురువుగారూ సవరణకు ధన్యవాదములు.
    మీ పద్యము అద్భుతంగా ఉంది.

    రిప్లయితొలగించండి



  27. నిజమే.గణదోషం కలిగినది.మీరు సూచించినట్లు 3,4,పాదాలని సవరిస్తున్నాను.' ననుచు ప్రార్థించెను నమితమౌ భక్తి,
    బుధుడైన ధర్మజ భూజాని హరిని '. ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  28. ఆది నుండియు సంధికై యనునయించు
    మంగళ కరుడౌ కృష్ణుని మాటవినక
    బుధవర్గమ్ము వలదన్న పోరు సేయ
    సోమము గలిగిన కురురాజు యడుగిడెను

    రిప్లయితొలగించండి
  29. బొడ్డు శంకరయ్య గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    మూడవ పాదంలో గణదోషం. ఆ పాదాన్ని ‘బుధగణము వలదన్నను పోరు సేయ’ అందాం.

    రిప్లయితొలగించండి
  30. మా బండి ఆలస్యం:

    రాజసూయ యాగ సందర్భంలో అగ్రపూజను కృష్ణునకు జేయుమని భీష్ముడు యుధిష్టిరునితో:


    ఆదిజు గన్న తండ్రియును యాదవ వంశ పయోధి రత్నమున్
    వేదనుతున్ విధాతృ సురబృంద శచీధవ సోమ వందితున్
    మోదము తోడ ధర్మసుత! ముందుగ కొల్వుము మంగళంబగున్
    మేదిని మెచ్చ సద్బుధులు మీ మఖమౌ పరిపూర్ణ మియ్యెడన్.

    రిప్లయితొలగించండి
  31. మిస్సన్న గారూ,
    ఆలస్యమైనా అద్భుతమైన పద్యా న్నిచ్చారు. అభినందనలు, ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి

  32. శ్రీ కంది శంకరయ్య గురుదేవులకు నమస్సులు, సవరణతో........

    ఆది నుండియు సంధికై యనునయించు
    మంగళ కరుడౌ కృష్ణుని మాటవినక
    బుధ గణము వలదన్నను పోరు సేయ
    సోమము గలిగిన కురురాజు చనెనుగద.

    రిప్లయితొలగించండి
  33. శంకరార్యా ! ధన్యవాదములు !
    దత్తపదిలో మొదటి పూరణలో
    4వపాదం చివరి అక్షరం
    5వ పాదం మొదటి అక్షరం కలిసి "బుధ"
    అవుతుంది !
    సమ్మతమేగా ?

    రిప్లయితొలగించండి