3, డిసెంబర్ 2013, మంగళవారం

సమస్యాపూరణం - 1252 (కాలచక్రము నాఁపుట)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది......
కాలచక్రము నాఁపుట కడు సులభము.
ఈ సమస్యను పంపిన కందుల వరప్రసాద్ గారికి ధన్యవాదాలు.

39 కామెంట్‌లు:

  1. సాధ్యమే యేరికేనియు జగతిలోన
    కాలచక్రము నాపుట? కడు సులభము
    భక్తి యోగమటంచు శ్రీపతిని గొలిచి
    దాటుమీ భవచక్రమున్ త్వరిత గతిని

    రిప్లయితొలగించండి
  2. తెలుపు నలుపుల దారము నూలు వడుకు
    ధాత విధాతల వంటి ధర్ము లకును
    సుమతి యనసూయ లనుబోలు సుదతు లనగ
    కాల చక్రము నాపుట కడు సులభము

    తెలుపు నలుపు.... = రాత్రిం బవళ్ళు

    రిప్లయితొలగించండి
  3. శ్రీ శంకరయ్య గురుదేవులకు,శ్రీ నేమాని గురుదేవులకు వినమ్రవందనములతో.....
    శ్రీ శంకరయ్య గురుదేవులకు,శ్రీ నేమాని గురుదేవులకు ధన్యవాదములతో...
    సమస్యను అద్భుతముగా మలచిన గురుదేవులకు పాదాభివందనములతో ...

    టి.వీ లలో వచ్చెడి ప్రకటనలపై హాస్యముగా
    ===========*==============
    ఆఫ్రికా యందు దొరకిన జాఫ్రికాను
    వాడిన వనితలు గలరు వారి తోడ
    మీరు మాతనాడిన,మీకు మీరి నట్టి
    కాలచక్రము నాపుట కడు సులభము!
    ============*===========
    నాలుగు యుగములందున కాలుని గని
    నరుల వ్యధలను ద్రుంచెడి నరక యంత్ర
    మును మునులు రచియించిరి!పుడమి జనుల
    కాలచక్రము నాపుట కడు సులభము!

    రిప్లయితొలగించండి
  4. అమ్మా! రాజేశ్వరి గారూ! శుభాశీస్సులు.
    మీ ప్రయత్నము బాగుగ నున్నది. అభినందనలు. కొన్ని సూచనలు.
    1. మొదటి పాదములో ప్రాసయతి నియమము పాటింపబడ లేదు.
    2. అన్వయ సౌలభ్యము కొరకు మరికొన్ని మార్పులు చేసితిని.
    మార్పులతో మీ పద్యము:

    తెలుపు నలుపు లనెడి దారములను వడుకు
    పంకజాసన, పద్మాక్ష, భర్గులకును
    సుమతి, యనసూయ లనుబోలు సుదతులకును
    కాలచక్రము నాపుట కడు సులభము

    శ్రీ వరప్రసాద్ గారూ! శుభాశీస్సులు.
    మీ పద్యములు బాగుగ నున్నవి. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  5. ఎవరి దరమును గాదార్య ! యిప్పుడమిని
    కాల చక్రము నాపుట, కడు సులభము
    ముక్తి నొందుట నేరుగా భువిని మఱి ని
    భక్తి శ్రధ్ధల బూజించ పరమ శివుని

    రిప్లయితొలగించండి
  6. దేశ దేశాల బౌద్ధులు తిరిగి తిరిగి
    ఆంధ్ర దేశాన తలపెట్టె అమరపురిన
    నాయకులకెల్ల ముడుపులు నచ్చ కున్న
    కాల చక్రము నాపుట కడు సులభము

    రిప్లయితొలగించండి
  7. శ్రీ సుబ్బా రావు గారూ! శుభాశీస్సులు.
    మీ పద్యము బాగుగ నున్నది. అభినందనలు.

    శ్రీ టేకుమళ్ళ వేంకటప్పయ్య గారూ: శుభాశీస్సులు.
    మీ పద్యము బాగుగా నున్నది. అభినందనలు.
    2వ పాదమును ఇలాగ మార్చుదాం:
    ఆంధ్ర దేశాన తలపెట్టి రమరపురిని

    రిప్లయితొలగించండి
  8. కారు చక్రమా బ్రేకులు కట్టి యాప
    చక్రమడ్డు జేసి రవికి ఛాయ వెలయ
    దురితుల దునుమగా చక్రి ధరణి,నెటుల
    కాలచక్రము నాపుట కడు సులభము?

    రిప్లయితొలగించండి
  9. శాశ్వతముగావు సుఖ దు:ఖ సమ్ముదములు
    జంకకను చిత్త శుద్ధితో జనుచు ముందు
    నియతితో కార్య మొనరించు నీకు కష్ట
    కాల చక్రము నాపుట కడు సులభము

    రిప్లయితొలగించండి
  10. పండిత నేమాని గారికి పూజ్యగురుదేవులు
    శ౦కరయ్యగారికి వందనములు
    వరదలు ముంపులునువచ్చి పంట నాశ
    మాప తగుచర్య చేపట్టి నాపదందు
    కరుణ తో సహాయము జేయ కరువు కాట
    కాల చక్రము నాపుట కడు సులభము

    రిప్లయితొలగించండి
  11. చెలుల నడుమను కూర్చుండి చిన్ననాటి
    ముచ్చటల జెప్పుకొనుచున్న ముగ్ధలకును,
    సుతుని పతిని గాంచు సతికి; సుంత తడవు
    కాలచక్రము నాఁపుట కడు సులభము.

    రిప్లయితొలగించండి
  12. శంకరార్యా ! ధన్యవాదములు !
    దత్తపదిలో మొదటి పూరణలో
    4వపాదం చివరి అక్షరం
    5వ పాదం మొదటి అక్షరం కలిసి "బుధ"
    అవుతుంది !
    సమ్మతమేగా ?

    రిప్లయితొలగించండి
  13. కరము నందున కనిపించి కాంతి నొసగి
    వేన వేలుగ రూపాల వెల్లి విరిసి
    కాల వివరము దెలుపుచు కదలు చేతి
    కాల చక్రము నాపుట కడు సులభము

    రిప్లయితొలగించండి
  14. అందరికీ అభినందనలు. అందరి పద్యములు అలరించుచు నున్నవి.క్

    శ్రీ సహదేవుడు గారు:
    మీ పద్యములో అన్వయము సులభముగా లేదు.

    శ్రీ లక్ష్మీనారాయణ గారు:
    మీ పద్యములో కష్ట కాల చక్రము అను ప్రయోగము వినూత్నముగా నున్నది.

    శ్రీ తిమ్మాజీ రావు గారు:
    మీ పద్యములో "ఆపదందు"అనుట సాధువు కాదు. ఆపదలను అందాం. కరువు సాధువు కాదు. కరవు అనుట సాధువు.

    శ్రీమతి లక్ష్మీ దేవి గారు:
    ముగ్ధలకు సతులకు కాలచక్రం సుంత నాపుట కడు సులభము అన్నారు కదా. ఇది స్త్రీమూర్తులకే తెలియదగిన విషయము - అనుభవైక వేద్యము కదా.

    స్వస్తి.

    రిప్లయితొలగించండి
  15. అమ్మా శైలజ గారు! శుభాశీస్సులు.
    మీ పద్యము బాగుగ నున్నది. కనిపించి అనుట వ్యావహారిక ప్రయోగము. కన్పట్టు అనుట సాధువు. చేతి కాల చక్రము అన్నారు కదా. కాల చక్రమునకు కాల యంత్రమునకు పొరబడి నట్టులున్నారు. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  16. పండిత నేమాని గారికి పూజ్యగురుదేవులు
    శ౦కరయ్యగారికి వందనములు
    భాగవతుల కృష్ణారావు గారిపూరణ
    జాతకముల౦దు మార్పులు చాల జేయ
    గ్రహములకు శాంతి గూర్చ నిగ్రహములంచు
    మంత్రవాదుల దృష్టిలో మనదు జాత
    కాల చక్రము నాపుట కడు సులభము

    రిప్లయితొలగించండి
  17. శ్రీ భాగవతుల కృష్ణా రావు గారు! నమస్కారములు.
    మీ పద్యము చాల బాగుగ నున్నది. అభినందనలు. చిన్న సూచన:
    దుగాగమ సంధి నీదు నాదు తనదు లకు మాత్రమే పరిమితము. మనదు అనరాదు. కొందరు మీదు మాదు తమదు అని వాడుచున్నారు కానీ అది వ్యాకరణ సమ్మతము కాదు. జాతక చక్రము అంటే అర్థవంతమే కాని జాతకాల చక్రము అనుటలో అన్వయము సరిగా అగుటలేదు. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  18. శ్రీ శంకరయ్య గారికి శ్రీ నేమని వారికి నమస్సులు
    కందుల వారి ప్రోత్సహంతో నేటి నా ప్రయత్నం


    కాలం అంటే కేవలం శంకరుడే
    మార్పు అనేది మాయ
    త్రిగుణములకు ప్రతీకలైన బ్రహ్మ శ్రీపతి శంకరులు వేరుకారన్న మాయ తొలగిననంత
    కాల తత్త్వం అర్ధమయ్యి చక్రం ఆగిపోతుంది
    పరబ్రహ్మంలో మనస్సు లీనమై పోతుంది


    కాల కాలుని పాదము కద్దు ననుచు
    మ్రొక్కి, జ్ఞానము నిమ్మని, రోగ విడువ
    బ్రహ్మ! శ్రీపతి!శివునిపై భ్రాంతి తొలగ
    కాల చక్రము నాపుట కడు సులభము !

    రిప్లయితొలగించండి
  19. శ్రీ ఆదిత్య గారూ! శుభాశీస్సులు. మీ పద్యము బాగుగ నున్నది. కొన్ని సూచనలు. మీపద్యములోని (1) పాదము కద్దు (2) రోగ విడువ అనే ప్రయోగములు అర్థమగుట లేదు. మీరు వేదాంత విజ్ఞానమును ఆశ్రయించేరు కాని భావము స్ఫుటముగా లేదు. అధ్యాత్మ యోగ సాధకులు కాలచక్రమును దాటి పోగలరు కాని కాల చక్రమును ఆపగలరా? స్వస్తి

    రిప్లయితొలగించండి
  20. అయ్యా! నాగరాజు గారు!
    శుభాశీస్సులు. మీ పద్యము బాగుగనున్నది. అభినందనలు.
    కాలయంత్రమైన గడియారమును కాలచక్రముగ భావించగలమా? స్వస్తి.

    రిప్లయితొలగించండి
  21. మానవాళికి సాధ్యము కానె గాదు
    కాల చక్రము నాపుట, కడు సులభము
    కాల గతితోడ పయనించి నేల పైన
    బ్రతుకు సాగించు చుండుట పంకజాక్ష.

    రిప్లయితొలగించండి

  22. శ్రీ నేమని వారికి నమస్సులు

    కద్దు : మాండలిక పదకోశము (ఆం.ప్ర. సాహిత్య అకాడమీ) సబబు; సరి. [పశ్చిమకృష్ణ]
    రోగము విడువ అనవలసి ఉన్నది ఛందో నియమం కోసం రోగ మాత్రమే వాడినాను.
    ఇక త్రికలలను దాటిన తరువాత "మార్పు" మిధ్య అని తెలిస్తే
    ఆగిన చక్రానికి తిరుగుతున్న చక్రానికి ఆపాదించబడ్డ మార్పు కానరాదు
    కాబట్టి ఆ చక్రం తిరగటమే లేదుఅని అర్ధమగును
    తిరగని చక్రాన్ని ఆపే అవసరమే లేడుకదండి

    అందుకే ఉన్నది కాలమే శివుడే అన్నాను
    శివాయ గురవే నమః

    రిప్లయితొలగించండి
  23. శ్రీ నేమాని గురువు గారికి, శ్రీ కంది శంకరయ్య గురువు గారికి నమస్సులు.


    కాల చక్రమునాపుట కడు సులభము
    యన్న వాక్యము సత్యముననియు దలచి
    దుష్ట కార్యములడరించు ధూర్త జనుల
    సంహరించుటకెఱగును చక్రధారి!

    (ఎఱగును = దిగివచ్చును, అవతరించును)

    రిప్లయితొలగించండి
  24. శ్రీ నేమాని గురుదేవులకు ధన్యవాదములు.
    అందరి పద్యములు అలరించుచు నున్నవి.
    అందరికీ ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  25. శ్రీ ఆదిత్య గారూ! శుభాశెస్సులు.
    మా ఇంటిపేరు "నేమాని" వారు.
    నేను మీతో వేదాంత విషయములు గురించి మాటాడలేను. మీ పద్యములో అన్వయము సులభంగా లేదు. ఛందస్సు గురించి పదములలో మార్పులను చేస్తే అర్థము ఉంటుందా? వ్యాకరణ శుద్ధమైన భాషలో చదువరికి మీ మనసులోని భావము సులభముగా అర్థము అగునట్లు పద్యములను వ్రాయండి. కాస్త శ్రమ తీసికొని అభ్యాసము చేస్తే అదే వచ్చును. విజయోస్తు.

    రిప్లయితొలగించండి
  26. శ్రీ వామన్ కుమార్ గారు! శుభాశీస్సులు.మీ పద్యము బాగుగ నున్నది. అభినందనలు. సులభము తరువాత యన్న అని యడాగమము చేసేరు. యడాగమము రాదు. సులభమన్న అని సంధి నిత్యముగా వచ్చును. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  27. తిమ్మాజీరావు గారి పూరణ చాలా బాగుంది.

    రిప్లయితొలగించండి
  28. పండిత నేమాని గారికి పూజ్యగురుదేవులు
    శంకరయ్య గారికి వందనములు


    జగము మిథ్య ని బ్రహ్మము సత్య మనుచు
    ఆత్మ పరమాత్మ తత్వమ్ము నరసినంత
    కాలమందున లీనమై గ్రాలుచుండ
    కాలచక్రము నాపుట కడుసులభము

    రిప్లయితొలగించండి



  29. 1.క్రొత్త దంపతులకు మది గోర్కెలూర
    దివము,రాత్రియు దెలియని తీయనైన
    యనుభవమ్ముల సుఖియించు నట్టి యెడల ,
    కాలచక్రమునాపుట కడుసులభము.
    -------
    2.ఫల్గుణుని తీవ్ర శపథమ్ము ఫలము నొంద,
    వేరుమార్గము లేమియు వెన్నుడపుడు
    సైంధవుడు వెల్వడ రవికి జక్రమడ్డ
    కాలచక్రము నాపుట కడు సులభము.
    -------

    రిప్లయితొలగించండి
  30. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !

    మంచివేగంతో వెళ్ళే కారుటైరు కాలితే :

    01)
    ________________________________

    పిచ్చి వేగాన పోయెడు - వేళలోన
    గూట మొక్కటి లోనికి - గుచ్చుకొనిన
    గాలి పోయిన పిమ్మట - కారు టైరు
    కాల; చక్రము నాపుట - కడు సులభము !
    ________________________________

    రిప్లయితొలగించండి
  31. మిత్రులార! శుభాశీస్సులు.
    ఈనాటి సమస్యకు మంచి మంచి పూరణలను జేసిన మీ అందరికి శుభాభినందనలు. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  32. శ్రీ శంకరయ్య గురుదేవులకు, శ్రీ నేమాని గురుదేవులకు వినమ్రవందనములతో.....
    దోషములను సూచించి సవరించ మనవి.....

    భర్త వ్రతమును కలిగిన భార్య మణులు
    సుమతి యనసూయ వారలు శోభితముగ
    మహిని యున్నట్టి వారికి మహిమచేత
    కాల చక్రము నాపుట కడు సులభము

    రిప్లయితొలగించండి
  33. శ్రీ సుధర్శన్ కుస్మ గారు:
    మీ పద్యము బాగుగ నున్నది. అభినందనలు. దానిని మీ కోర్కె మేరకు ఈ విధముగా సవరించుచున్నాను:

    పరమ సాధ్వీమణులు సదా భవ్యమతులు
    సుమతి అనసూయ మొదలైన సుగుణవతులు
    మహిమమున వారి సంకల్ప మాత్రముననె
    కాలచక్రము నాపుట కడుసులభము


    రిప్లయితొలగించండి
  34. శ్రీ నేమాని వారికి నమస్సులు

    మీతో వాదన చేయుట నా ఉద్దేశము కాదు క్షమించండి.
    నా పద ప్రయోగమునందున్న తప్పులను చేయబోవు ప్రయత్నములందు సవరించ ప్రయత్నించెదను.

    రిప్లయితొలగించండి