4, డిసెంబర్ 2013, బుధవారం

సమస్యాపూరణం - 1253 (సైంధవుఁడు చంపె భీముని)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది......
సైంధవుఁడు చంపె భీముని సమరమందు.

28 కామెంట్‌లు:

  1. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరింప నున్నవి !

    రిప్లయితొలగించండి
  2. శంకరార్యా !
    30-11-2013 నాటి దత్తపదిలో
    మొదటి పూరణలో
    4వపాదం చివరి అక్షరం
    5వ పాదం మొదటి అక్షరం కలిసి "బుధ"
    అవుతుంది !
    సమ్మతమేగా ?

    రిప్లయితొలగించండి
  3. ఆ దత్తపదిలోనే మిస్సన్నమహాశయులు

    రాజసూయ యాగ సందర్భంలో అగ్రపూజను కృష్ణునకు జేయుమని భీష్ముడు యుధిష్టిరునితో:

    ఆదిజు గన్న తండ్రియును యాదవ వంశ పయోధి రత్నమున్

    అన్నారు

    ఇంతకీ ఈ "ఆదిజుడు" ఎవరు ?

    రిప్లయితొలగించండి
  4. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరింప నున్నవి !

    అంధరాజుకు దురాలోచన అంధకారంలో :

    01)
    ___________________________________

    శకుని చంపెను సహదేవు - శంబరమున
    నకులు జంపెను భీష్ముండు - ఝకట మందు
    కవ్వడిని జంపె గర్ణుడు - కదన మందు
    సైంధవుడు చంపె భీముని - సమర మందు
    ధర్మజుని వధించె గురుడు - తగవు నందు
    అంతమాయెను యుద్ధంబు - చింత దీరె
    ననుచు విదురుడు చెప్పగా - వినిన రాజు
    నమిత సుఖమును బొందుచు - న్నంత లోన
    మేలుకొనెనంత వాస్తవ - మెదుట నిలువ
    చింత నొందెను స్వప్నంపు - వింత దలచి !
    ___________________________________
    రాజు = ధృతరాష్ట్రుడు

    రిప్లయితొలగించండి
  5. దుర్యోధనునికి దుర్వార్త :

    02)
    ___________________________________

    "సైంధవుడు చంపె భీముని - సమర మందు"
    వార్త విన్నట్టి రారాజు - వాని కిడగ
    చెలువ మొలికెడి హారంబు - విలువ గలది
    తీసుకొనకుండ చారుండు - తిరిగి చెప్ప

    "వాయుపుత్రుడు భీముండు - వాడు కాదు
    సైన్యమందున్న వేరొక - సైనికుండు
    భీమనామము గలవాడు - భీమ బలుడె"
    యన్న చారుని వార్తకు - ఖిన్నుడాయె !
    ___________________________________
    రారాజు = దుర్యోధనుడు

    రిప్లయితొలగించండి
  6. వసంత కిషోర్ గారు నమస్కారము ! గురువు గారు బ్లాగునకు అందుబాటు లో లేరు, వారు రేపు ఉదయము రావచ్చు గమనించ గలరు !

    రిప్లయితొలగించండి
  7. కనగ నభిమన్యుడానాడు కదనమందు
    కదముద్రొక్కుచు భీముడై కానుపించె
    తోడెనెవ్వరు పోకుండ త్రోసివేయ
    సైంధవుడు, చంపె ' భీముని ' సమర మందు

    రిప్లయితొలగించండి
  8. కనగ నభిమన్యుడానాడు కదనమందు
    కదముద్రొక్కుచు భీముడై కానుపించె
    తోడు వేరెవరు పోకుండ త్రోసివేయ
    సైంధవుడు, చంపె ' భీముని ' సమర మందు

    రిప్లయితొలగించండి
  9. కనగ నభిమన్యుడానాడు కౌరవులకు
    కదముద్రొక్కుచు భీముడై కానుపించె
    తోడు వేరెవరు పోకుండ త్రోసివేయ
    సైంధవుడు, చంపె ' భీముని ' సమర మందు

    రిప్లయితొలగించండి
  10. బాలు నందరు హతమార్చె పాశ వికము!
    ధర్మ రాజును దమ్ములు తల్ల డిల్లె!
    పాండు మధ్యము డేడ్చెను బాధ తోడ...
    సైంధవుఁడు చంపె భీముని సమరమందు.

    రిప్లయితొలగించండి
  11. సైంధవుఁడు చంపె భీముని సమరమందు
    యనుచు భీముడు విలపించె నన్న జూచి!
    తమ్ముడొచ్చిన తానిక తాళ లేడు.
    యేది! దారేది మనకింక! ఎవరు దిక్కు?

    రిప్లయితొలగించండి
  12. సైంధవుడు చంపె భీముని సమర మందు
    నమ్మితిర మీరు ? మఱి యది నమ్మ దగునె ?
    నిలువ జాలునె ? భీముని బలము ముందు
    తెలిసి మఱియును నిటులుగ దెలుప దగునె ?

    రిప్లయితొలగించండి
  13. భీకరమ్ముగ పోరాడి భీము డగుచు
    వీర యభిమన్యు నెదిరించ వీలుపడక
    బాలు డనిగూడ జూడక బంధుజనము
    సైంధవుడు చంపె భీముని సమరమందు

    రిప్లయితొలగించండి
  14. పండితుని వోలె నటియించు పామరుండు
    పలికె నొక్క డీరీతిగా భారతమున
    సరసమౌ కథ వినుడంచు జంకులేక
    సైంధవుడు చంపె భీముని సమరమందు

    రిప్లయితొలగించండి
  15. మిత్రులారా! శుభాశీస్సులు.
    ఈనాటి పూరణలు అలరించు చున్నవి. అందరికి అభినందనలు.

    శ్రీ వసంత కిశోర్ గారి పద్యములన్నియును చాల బాగుగ నున్నవి.

    శ్రీ గోలి హనుమఛ్ఛాస్త్రి గారు:
    మీ 3వ పద్యమును తీసికొనగా--
    కనగ అని ప్రారంబించి కానుపించె అన్నారు. మార్చితే బాగుంటుంది.
    3వ పాదములో గణభంగము ఉన్నది.

    శ్రీ వేంకటప్పయ్య గారు:
    బాలు నందరు అని బహువచనములో హతమార్చె అనరాదు - హతమార్చిరి అనాలి.
    పాశవికము అన్న తరువాత గా అని చేర్చాలి.
    పాండు మధ్యముడు అనరాదు పాండవమధ్యముడు అనాలి.

    మీ 2వ పద్యంలో:
    2వ పాదము, మరియు 4వ పాదము మొదటలో యడాగమము రాదు.
    తమ్ముడొచ్చిన అనరాదు - తమ్ముడు వచ్చిన అనాలి.

    శ్రీ సుబ్బా రావు గారు:
    మీ పద్యము బాగుగ నున్నది.

    శ్రీమతి శైలజ గారు:
    వీర యభిమన్యు అనరాదు. వీరు నభిమన్యు అని నుగాగమము చేస్తే బాగుంటుంది.

    స్వస్తి.

    రిప్లయితొలగించండి

  16. దండి యభిమన్యు వెనువెంట తమ్మి మొగ్గ
    రమ్ము భేదించ వచ్చు వారలను మిగుల
    క్రోధియై యడ్డుపడియు పరోక్షముగను
    సైంధవుడు చంపె భీముని సమర మందు

    రిప్లయితొలగించండి
  17. శ్రీ నేమాని వారికి నమస్సులు

    మీతో వాదన చేయుట నా ఉద్దేశము కాదు క్షమించండి.
    నా పద ప్రయోగమునందున్న తప్పులను చేయబోవు ప్రయత్నములందు సవరించ ప్రయత్నించెదను.

    రిప్లయితొలగించండి
  18. నాడు నిజమెన్న తులలేని క్రీడి సుతుని
    సైంధవుడు చంపె భీముని సమరమందు
    బాలునకు తోడు రానీక పరమశివుని
    వరము తన కండయై నిల్చి వరలుచుండ

    రిప్లయితొలగించండి
  19. పండిత నేమాని గారికి పూజ్యగురుదేవులు
    శంకరయ్య గారికి వందనములు
    తమ్మిమొన వద్ద భీముడన్ దంతి పైన
    నెక్కి వచ్చిన వడముడి కెదురు నిల్చి
    సైంధవుడు చంపె భీముని. సమరమందు
    కుపితుడై వాయుసూనుడు గుదియనేసె


    రిప్లయితొలగించండి
  20. శ్రీ నేమానివారికి ధన్యవాదములు..
    నా పూరణ దోషములను సవరించుచున్నాను.

    కదలి యభిమన్యుడానాడు కౌరవులకు
    కదముద్రొక్కుచు భీముడై కానుపించె
    తోడుగాబోవు వారిని త్రోసివేయ
    సైంధవుడు, చంపె ' భీముని ' సమర మందు

    రిప్లయితొలగించండి
  21. మిత్రులకు శుభాశీస్సులు.

    ఈనాటి అందరి పూరణలు చాలా బాగుగ నున్నవి. అందరికి అభినందనలు. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  22. శ్రీ శంకరయ్య గురుదేవులకు, శ్రీ నేమాని గురుదేవులకు వినమ్రవందనములతో....

    భీముడత్యంత బలశాలి భీకరుండు
    కౌరవుల జంపగలిగిన ఘనుడతండు
    వీరపురుషుడు సంగ్రామ విజయు డెటుల
    సైంధవుఁడు చంపె భీముని సమరమందు?

    రిప్లయితొలగించండి