14, డిసెంబర్ 2013, శనివారం

సమస్యాపూరణం - 1263 (సుర లసురులు గూడి రొకట)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది......
సుర లసురులు గూడి రొకట చుట్టము లగుచున్.
ఈ సమస్యను సూచించిన కందుల వరప్రసాద్ గారికి ధన్యవాదాలు.

33 కామెంట్‌లు:

  1. సురమాతయు కశ్యపునక
    సురమాతయు పత్నులయినచో సోదరులై
    మరి కలసి మెలసి యనువుగ
    సుర లసురులు గూడి రొకట చుట్టము లగుచున్.

    రిప్లయితొలగించండి
  2. హరి పంచగ నమృతమును
    సుర లసురులు గూడి రొకట చుట్టము లగుచున్
    వెఱగున మైకము వీడగ
    సుర లొక్కరె గ్రోలి రంట చోద్యమ నంగన్

    రిప్లయితొలగించండి
  3. పర వశమున సుధ గ్రోలగ
    సుర లసురులు గూడి రొకట చుట్టము లగుచున్
    కరి వరదుడు యోచిం చగ
    మురి పించెను యసుర తతిని మోహిని తానై

    రిప్లయితొలగించండి
  4. guruvu gaaru please see this link sir,
    http://kandishankaraiah.blogspot.in/2012/04/669.html
    సమస్యాపూరణం - 669 (కనము, వినము, పలుకము)
    కవిమిత్రులారా,

    ఈరోజు పూరించవలససిన సమస్య ఇది...

    కనము, వినము, పలుక మనెడు జ్ఞానులకు నతుల్.

    But it is very use full for all
    thank you very much sir

    with regards
    varaprasad

    రిప్లయితొలగించండి
  5. లక్ష్మీదేవి గారూ,
    నిజమే.. వాళ్ళు చుట్టాలే... ఆ లెక్కన ఈనాటిది సమస్యే కాదు.
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    రాజేశ్వరి అక్కయ్యా,
    మీ రెండు పూరణలూ బాగున్నవి. అభినందనలు.
    మొదటి పూరణ మొదటి పాదాన్ని ‘హరి పంచగ నమృతమ్మును’ అంటే గణదోషం తొలగిపోతున్నది.
    *
    వరప్రసాద్ గారూ,
    ధన్యవాదాలు.
    ఆనాడు కవర్గానికి జ్ఞకారంతో యతి గురించి మంచి చర్చే జరిగింది.

    రిప్లయితొలగించండి
  6. వరముల్ నీయగ హరుకున్;
    పరమోత్సాహంబు! శివశివ! పరుగున జనిరా
    వరమానమ్ముల బొందగ,
    సుర లసురులు గూడి రొకట చుట్టము లగుచున్.

    (భోళా శంకరుడు కైలాసంలో ఒకసారి వరములనివ్వ బూనగా సురాసురులు..చుట్టాల వలె కదిలి వెళ్ళారని భావము)


    రిప్లయితొలగించండి
  7. టేకుమళ్ళ వెంకటప్పయ్య గారూ,
    మంచి పూరణ చెప్పారు. అభినందనలు.
    ‘వరముల్ నీయగ - వరముల నీయగ, హరుకున్ - హరునకు" అనండి. రెండవ పాదంలో గణదోషం.. నా సవరణలతో మీ పద్యం.....
    వరముల నీయగ హరునకు
    పరమోత్సాహం బటంచు పరుగున జనియున్
    వరముల ముదమున బొందగ,
    సుర లసురులు గూడి రొకట చుట్టము లగుచున్.

    రిప్లయితొలగించండి
  8. ధరమున సౌరిక భూమిగ
    నెరిగిన నాంధ్రుల రాష్ట్రమునిక విభజింపన్
    పొరపొచ్చాలను మరచిన
    సురలసురులు కూడిరొకట చుట్టములగుచున్.

    రిప్లయితొలగించండి
  9. మారెళ్ళ వామన్ కుమార్ గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    మొదటి పాదం అర్థం కాలేదు.

    రిప్లయితొలగించండి
  10. శ్రీ శంకరయ్య గురుదేవులకు,శ్రీ నేమాని గురుదేవులకు వినమ్రవందనములతో.....

    శ్రీ శంకరయ్య గురుదేవులకు ధన్యవాదములతో...
    ============*============
    మరణమ్మును గూల్చం గను
    సుర లసురులు గూడి రొకట,చుట్టము లగుచున్
    కరగించి పాల కడలని,
    హరి హరులకు బంచిరి సిరి హాలా హలమున్!

    రిప్లయితొలగించండి
  11. వరప్రసాద్ గారూ,
    మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
    టైపాటు వల్ల ‘కడలిని’... ‘కడలని’ ఐనట్టుంది.

    రిప్లయితొలగించండి
  12. శ్రీ శంకరయ్య గారికి నమస్సులు

    పరమాత్ముని కృపచేతను
    సురలసురులు మైత్రి జూపి సుధ శోదించ
    న్నరిగిరి సాగరముదరికి
    సుర లసురులు గూడి రొకట చుట్టము లగుచున్

    రిప్లయితొలగించండి
  13. భాగవతుల కృష్ణారావు గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  14. గురువుగారికి నమస్సులు,
    సౌరిక అనగా స్వర్గము అనే అర్థంతో, సౌరిక భూమి అనగా దేవ భూమి అని రాయాలని నా ప్రయత్నం.

    రిప్లయితొలగించండి
  15. వామన్ కుమార్ గారూ,
    నిజమే... నేను సరిగా అర్థం చేసుకోలేకపోయాను. మన్నించండి..

    రిప్లయితొలగించండి
  16. శ్రీ శంకరయ్య గురుదేవులకు ధన్యవాదములతో...

    అవునండి గమనించ లేదు.
    =============*===============
    మరణమును జయించ దలచి
    సుర లసురులు గూడి రొకట,చుట్టము లగుచున్.
    కరగించిరి సిరి సంపద,
    ఖర దూషణ దనయులవలె కలియుగ మందున్!

    (మరణము = అపకీర్తి,సుర లసురులు = పాలక ప్రతి పక్షము)

    రిప్లయితొలగించండి
  17. హరి దా బంచగ నమృతము
    సురలసురులు గూడి రొకట చుట్టము లగుచున్
    అరచేతు లొడిసి పట్టుకు
    బిరబిర మని ద్రాగి రపుడు బేబే వనుచున్

    రిప్లయితొలగించండి
  18. వరప్రసాద్ గారూ,
    సవరించిన మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    సుబ్బారావు గారూ,
    పూరణ బాగుంది. అభినందనలు.
    ఒకచోట కూడినా సురలకే అమృతం దక్కింది, అసురులకు దక్కలేదు కాదా (రాహుకేతువులను మినహాయించి)

    రిప్లయితొలగించండి

  19. పండిత నేమాని గారికి పూజ్యగురుదేవులు
    శ౦కరయ్యగారికి వందనములు

    తరుచగ పాలసముద్రము

    సురలసురులు గూడిరొకట చుట్టములగుచున్

    దొరకొన నమృతపు భాండము

    సరగున కలహించి రకట శత్రువులగుచున్



    రిప్లయితొలగించండి
  20. సురలనగా సుగుణమ్ము ల
    సురులన దుర్గుణము లగుచు జొక్కు నెదలలో
    నిరతము నవ్విధము దలప
    సుర లసురులు గూడి రొకట చుట్టము లగుచున్

    రిప్లయితొలగించండి
  21. హరి మనుమం డనిరుద్ధుఁ డ
    సుర సుత నుషఁ బెండ్లియాడు శుభవేళను ము
    ప్పిరిగొన్న సంతసమ్మున
    సుర లసురులు గూడి రొకట చుట్టము లగుచున్.

    రిప్లయితొలగించండి
  22. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    పండిత నేమాని వారూ,
    మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  23. నాగరాజు రవీందర్ గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  24. అరయగ నెన్నికలప్పుడు
    నరుల విధము తిట్టు కొనుచు నధికారముకై
    కరములు గలుపుచు నుండిరి
    సుర లసురులు గూడి రొకట చుట్టము లగుచున్

    రిప్లయితొలగించండి
  25. గండూరి లక్ష్మినారాయణ గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.

    రిప్లయితొలగించండి

  26. సురల సుగుణముల లవడిన
    నరు లసుర గుణముల గొనిన నరులు గలరు భువిన్
    పురములలో నివసించుచు
    సుర లసురులు గూడి రొకట చుట్టము లగుచున్

    రిప్లయితొలగించండి
  27. బొడ్డు శంకరయ్య గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  28. మిత్రులారా! శుభాశీస్సులు.ఈ నాడు అందరి పూరణలు అలరించుచున్నవి. అందరికి అభినందనలు.

    శ్రీ శంకరయ్య గారి పద్యము ప్రశంసనీయముగా నున్నది.

    స్వస్తి.

    రిప్లయితొలగించండి
  29. గురువర్యులకు వందనములు,
    రెండవ పాదములో గణ భంగమును సవరించుతూ.......

    సురల సుగుణముల లవడిన
    నరు లసుర గుణముల గొనిన నరులు గలరు భూ
    పురములలో నివసించుచు
    సుర లసురులు గూడి రొకట చుట్టము లగుచున్

    రిప్లయితొలగించండి
  30. అరయగ కామము క్రోధము
    విరివిగ శాంతము సహనము విరియుచు నుండన్
    నరునకు హృదయము నందున
    సుర లసురులు గూడి రొకట చుట్టము లగుచున్

    రిప్లయితొలగించండి


  31. విరివిగ జనులిట కామిం
    ట్ల రిపులయిరహో జిలేబి టక్కరు పిల్లా !
    పరిపరి విధముల నరులై
    సుర లసురులు గూడి రొకట చుట్టము లగుచున్!

    జిలే‌బి

    రిప్లయితొలగించండి
  32. తిహార్ జైలు:

    జరుపుచు రేపులు హత్యలు
    తరచుగ జైలున కలియుచు తాదాత్మ్యమునన్
    సరసపు మాటల నాడుచు
    సురలసురులు గూడి రొకట చుట్టము లగుచున్

    రిప్లయితొలగించండి