15, డిసెంబర్ 2013, ఆదివారం

సమస్యాపూరణం - 1264 (సంజ నిద్దుర చేకూర్చు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది......
సంజ నిద్దుర చేకూర్చు సంపదలను.
ఈ సమస్యను పంపిన పోచిరాజు సుబ్బారావు గారికి ధన్యవాదాలు.

13 కామెంట్‌లు:

  1. లేని రోగములను దెచ్చి హాని జేయు
    సంజ నిద్దుర, చేకూర్చు సంపదలను
    సత్య నిష్టతో పని జేయు సద్గుణులకు
    రేయి నిద్దుర కలిగించు హాయిగాను

    రిప్లయితొలగించండి
  2. ఆది దేవుని ప్రార్ధించ నుదయ సంధ్య
    యసుర సంధ్యని పేరొంది రసురు లనగ
    మిట్ట మధ్యాహ్న వేళల గట్టి యెండ
    సంజ నిద్దుర చేకూర్చు సంపద లను
    యనెడి పలుకులు వినలేదు మునుపు నిజము
    మూడు సంధ్యల యందున ముచ్చ టించ

    రిప్లయితొలగించండి
  3. బొడ్డు శంకరయ్య గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    రాజేశ్వరి అక్కయ్యా,
    మీ పూరణ బాగుంది.
    మొదటిపాదంలో ప్రాసయతి తప్పింది. ‘సంధ్య + అని’ అన్నప్పుడు యడాగమం వస్తుంది. ‘సంపదలను + అనెడి’ అన్నప్పుడు యడాగమం రాదు. అక్కడ సంధి నిత్యం.

    రిప్లయితొలగించండి
  4. శ్రీ శంకరయ్య గురుదేవులకు,శ్రీ నేమాని గురుదేవులకు వినమ్రవందనములతో.....

    ఒక స్వామీజీ బలుకులు పరుల బలుకులు నమ్మవలదు,నాకు ముడుపు గట్టి పాద సేవ జేయ మనుచు
    ===========*=====================
    సంజ నిద్దుర చేకూర్చు సంపద లను,
    కోడి నిద్దుర దీర్చు ను గోర్కె లనని
    బలుక నమ్మ వలదు మీరు,పాద సేవ
    ముక్తి కోరి జేయ వలయు ముడుపు గట్టి ।

    రిప్లయితొలగించండి
  5. పండిత నేమాని గారికి పూజ్యులు గురుదేవులు
    శంకరయ్య గారికి వందనములు

    రాతిరంతయు మేల్కొని రాజ్యమునకు
    రక్ష నొనరించు సైనిక వ్రాతమునకు
    సంజ నిద్దుర చేకూర్చు .సంపదలను
    మించు సుఖమును అలపు తగ్గించు హాయి

    రిప్లయితొలగించండి
  6. లేమిఁ గలిగించు సత్వంబు లేకపోవు
    మందమతులుగచేయునమాంతముగను
    సంజ నిద్దుర, చేకూర్చు సంపదలను
    మనుషజాతికి నిజయుక్త మార్గమరయఁ.

    రిప్లయితొలగించండి

  7. మంచి యలవాటు కాదార్య ! మానవునకు
    సంజ నిద్దుర, చేకూర్చు సంపదలను
    భక్తి శ్రధ్ధల బూజించ భర్గు నిలను
    ఆయ నేకద ! మనలను నాదు కొనును

    రిప్లయితొలగించండి
  8. పెంచు సోమరి తనమును ముంచు చురుకు
    సంజ నిద్దుర, చేకూర్చు సంపదలను
    నిత్య మొనరించు రాతిరి నిద్ర స్వస్థ్య
    భాగ్య ములమించు నారోగ్య భాగ్య మొకటె.

    రిప్లయితొలగించండి
  9. సంజ నిద్దుర చేకూర్చు సంపదలను
    గూర్చి యేమన వలెనయ్య! కొంప మునుగు
    పరమ శివుడా తరుణమున పరవశించు
    నతని ధ్యానించుటే గూర్చు నతుల సుఖము

    రిప్లయితొలగించండి
  10. శ్రీ శంకరయ్య గారికి నమస్సులు

    కళను పోషించి ప్రఖ్యాతి గాంచి నటులు
    నిధికి గనులయి రాత్రులు నిదుర లేమి
    నుదయ సాయంత్ర సంధ్యలె నిదురబోవ
    సంజ నిద్దుర చేకూర్చు సంపదలను

    మరొక పూరణ

    నటుడు హరిదాసు చోరుడు నాట్యకత్తె
    నిశిని నిదురకు నోచని దశకు చేరి
    రుభయ సంధ్యల నిదురకునుద్యమించ
    సంజ నిద్దుర చేకూర్చు సంపదలను

    రిప్లయితొలగించండి
  11. వరప్రసాద్ గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.
    *
    కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    సుబ్బారావు గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.
    ‘భర్గుని నిల/ నాయనే కద..’ అనండి.
    *
    గండూరి లక్ష్మినారాయణ గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    ‘స్వాస్థ్య’ మనండి.
    *
    పండిత నేమాని వారూ,
    మీ ‘అతుల’ పూరణము మనోజ్ఞంగా ఉంది. అభినందనలు.
    *
    భాగవతుల కృష్ణారావు గారూ,
    మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  12. వదలి చూడుము బాలుడా బద్ధకమును
    పరుల దూషణ, చాడీలు,వదలుమయ్య
    పాపకర్మలు, హింసను వదలు, వదలు
    సంజ నిద్దుర, చేకూర్చు సంపద లను,

    రిప్లయితొలగించండి