17, డిసెంబర్ 2013, మంగళవారం

సమస్యాపూరణం - 1266 (పదవీ విరమణము)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది......
పదవీ విరమణము గొప్ప వర మగునుగదా!
ఈ సమస్యను సూచించిన పోచిరాజు సుబ్బారావు గారికి ధన్యవాదాలు.

31 కామెంట్‌లు:

  1. పదిలపు బ్రతుకులు మీకని
    అదనపు ప్రేమలను పంచి యభయ మ్మిడగన్
    కదలని గరళపు గద్దియ
    పదవీ విరమణము గొప్ప వర మగును గదా !

    రిప్లయితొలగించండి
  2. అదనునకు వచ్చు నున్నత
    పదవి తనకు ముందు నున్న వాడు చనినచో
    కద అట్టివాడు పొందెడు
    పదవీ విరమణము గొప్ప వరమగును గదా

    రిప్లయితొలగించండి
  3. ముదమున భగవంతునికై
    పదసేవలు చేయగలుగు భాగ్యము కలుగున్
    కుదురుగ దేవుని తలుపగ
    పదవీ విరమణము గొప్ప వర మగునుగదా!

    రిప్లయితొలగించండి
  4. నేనూ శ్రీ నేమాని వారి బాటలోనే ..

    పిదపను తానధికారగు
    గుదిబండగ నున్నవాడు కూడకనున్నన్
    మదిసంతోషము వానికి
    పదవీ విరమణము గొప్ప వర మగునుగదా !

    రిప్లయితొలగించండి
  5. మాస్టారూ,
    సందేహం - విరమణము అనే పదం సరియేనా? తెలుగు నిఘంటువులో వెదికితే 'విరమణ' అన్న పదమూ లేదూ, 'విరమణము' అన్న పదమూ లేదూ! ఆశ్చర్యం వేసింది. భాషావేత్తలు సందేహనివృత్తి చేయగలరు.
    ధన్యవాదాలతో,
    చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
  6. చంద్రశేఖర్ గారూ,
    నిజమే.. మీ సందేహం హేతుబద్ధమైనదే. జనబాహుళ్యంలో అధికంగా ప్రచారంలో ఉన్న ఈ పదం నిఘంటువులలో లేదు. విరామము, విరమించు మొదలైనవి కవిపించాయి.
    ఈ సమస్యను "పదవీచ్యుతి తలఁప గొప్ప వర మగును గదా" అని మారుద్దామా?

    రిప్లయితొలగించండి
  7. రాజేశ్వరి అక్కయ్యా,
    మంచి ప్రయత్నం చేశారు. పద్యం బాగుంది. కాని భావం అర్థం కాలేదు.
    *
    పండిత నేమాని వారూ,
    బాగుంది. సీనియర్ పదవీ విరమణ జూనియర్ కు వరమే కదా! మంచి పూరణ. అభినందనలు.
    *
    లక్ష్మీదేవి గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  8. పండిత నేమాని గారికి పూజ్యులు గురుదేవులు
    శంకరయ్య గారికి వందనములు

    కుదురుగ నుద్యోగమ్మున
    పదోన్నతిని పొంది నీతిపథమున పనులన్
    బెదరక జేయుచు చివరకు
    పదవీచ్యుతి తలప గొప్ప వరమౌను గదా

    రిప్లయితొలగించండి
  9. శ్రీ శంకరయ్య గురుదేవులకు,శ్రీ నేమాని గురుదేవులకు వినమ్రవందనములతో.....
    శ్రీ శంకరయ్య గురుదేవులకు ధన్యవాదములతో...
    ==============*==============
    మద గజ మొక్కటి ముదమున
    పదవీచ్యుతి తలప గొప్ప వరమౌను గదా,
    మధుకము గోరెడి వనచర,
    మదనము వచ్చె పుడమికను మనుజుల,కెల్లన్!

    (మద గజము = దుష్ట నేత,వనచరములు = పదవిని పొంద గోరు వారు,మనుజుల=సామాన్యులు )

    రిప్లయితొలగించండి
  10. శ్రీ శంకరయ్య గారికి నమస్సులు

    పదునగునధికారి పలుకు
    బదిలీలను నరకబాధ పలువిధ ఋణమున్
    వదలని సంసార ఝరిని
    పదవీ విరమణము గొప్ప వర మగునుగదా

    రిప్లయితొలగించండి


  11. పదవి యున్నంత కాలమ్ము పరమ శివుని
    ఒక్క మారైన దలచక యున్న నాకు
    దైవ ధ్యానమే నాకిక భావ మగుట
    పదవి విరమణ యొక గొప్ప వరము సుమ్ము

    రిప్లయితొలగించండి
  12. ముదమును నీయవు సరిగద
    గుదిబండగమారెనేడు గొలువులు జేయన్
    సదమల భావము నింపిన
    పదవీ విరమణము గొప్ప వరమగును గదా

    రిప్లయితొలగించండి
  13. శ్రీ పండిత నేమాని మరియు శ్రీ కంది శంకరయ్య
    గురువరులకు నమస్కారము. మీరు చేయుచున్న
    సేవా కార్యమిదేగా

    పది మందికి మేలొనరుచు
    మదిగల సాహిత్య సేవ మక్కువ తోడన్
    వదలక జేసెడి మీ కీ
    పదవీ విరమణము గొప్ప వరము గదా !


    రిప్లయితొలగించండి
  14. శ్రీ పండిత నేమాని మరియు శ్రీ కంది శంకరయ్య
    గురువరులకు నమస్కారము. మీరు చేయుచున్న
    సేవా కార్యమిదేగా

    పది మందికి మేలొనరుచు
    మదిగల సాహిత్య సేవ మక్కువ తోడన్
    వదలక జేసెడి మీ కీ
    పదవీ విరమణము గొప్ప వరము గదా !


    రిప్లయితొలగించండి
  15. పదవిని నుండగ దెలియును
    పదవీ విరమణము గొప్ప వరమగును గదా
    పదవీ విరమణ జనులకు
    పదికిం బది మార్లు శివుని బ్రార్ధన జేయన్

    రిప్లయితొలగించండి
  16. పదవీ విరమణ తదుపరి
    మదికింపగుసేవజేయ మక్కువ తోడన్
    పదిలము గానిలుచుయశము
    పదవీ విరమణ గొప్ప వరమగును గదా

    రిప్లయితొలగించండి
  17. కవిమిత్రులకు నమస్కృతులు.
    ఈరోజు ‘పెన్షనర్స్ డే’. ఉదయంనుండి పెన్షనర్ల మీటింగులో వ్యస్తుణ్ణై ఉన్నాను. కొద్దిగా సమయం చిక్కితే బయటకు వచ్చి రేపటి సమస్యను షెడ్యూల్ చేశాను. ఈ మీటింగ్ పూర్తయ్యేసరికి ఏ రాత్రి అవుతుందో. మిత్రుల పూరణలను రేపు ఉదయం సమీక్షిస్తాను. మన్నించండి.

    రిప్లయితొలగించండి
  18. మిత్రులారా! శుభాశీస్సులు.
    ఈనాటి కొన్ని పూరణలను చూద్దాము:
    ముందుగా అందరికి అభినందనలు.

    శ్రీ తిమ్మాజీ రావు గారు:
    నీతిమంతులగు ఉద్యోగులను గురించి చెప్పిన మీ పద్యము చాల బాగుగ నున్నది.

    శ్రీ టేకుమళ్ళ వేంకటప్పయ్య గారు:
    కీ.శే. నందమూరి గారిని ఎన్నుకొన్నారు. కొన్ని మార్పులతో మీ పద్యము:

    చెదరక సినిమా సీమను
    వదలెను ప్రాయ మ్మరువది వచ్చుట తోడన్
    మది సేవించె తెలుగునే
    పదవీ చ్యుతి దలప గొప్ప వరమగును గదా

    శ్రీ వరప్రసాద్ గారు:
    మీ భావము పద్యము బాగుగ నున్నవి.

    శ్రీ భాగవతుల కృష్ణా రావు గారు: నమస్కారములు.
    మీ మొదటి పద్యము బాగుగ నున్నది. అందులో పలువిధ ఋణమున్ కి బదులుగా బహువిధ ఋణముల్ అందాము. ఉద్యోగపు బాధలు గురించిన మీ 2వ పద్యము కూడా బాగుగ నున్నది.

    శ్రీ సుబ్బా రావు గారు:
    భగవత్ ధ్యానమునకు అవకాశము కలుగుననే భావముతో మీ 2 పద్యములు బాగుగ నున్నవి.

    శ్రీమతి శైలజ గారు:
    కొలువులు గుదిబండలు అగుచున్నవనుచు, మరియు సంఘ సేవకు అవకాశము కలుగునను భావములతో మీ 2 పద్యములు బాగుగ నున్నవి.

    శ్రీ లక్ష్మీనారాయణ గారు:
    సాహిత్య సేవకు అవకాశము కలుగుననే భావముతో మీరు చెప్పిన పద్యము చాల బాగుగ నున్నది.

    స్వస్తి.

    రిప్లయితొలగించండి
  19. పదవీ విరమణ మన్నను
    పది మందియు దలతు రిట్లు పదవీ కాల-
    మ్మది పూర్తి యాయె నికనని
    కద మన వ్యవహార మందు గన నేడిలలో.

    పదవీ చ్యుతి యని పలికిన
    పదవిని గోల్పోయినాడు పాడు పనులచే
    మదమున నని భావించెద
    రిది సాజము నేడు దలుప నిలలో సర్వుల్.

    పదిమంది మెచ్చు రీతిని
    పదవిని కొనసాగి తుదకు పదవిని విడుచో
    పదవీ చ్యుతి కన్నను మరి
    పదవీ విరమణము గొప్ప వరమగును గదా.

    రిప్లయితొలగించండి
  20. తుది వరకు కొలువు నెరపుచు
    ముదముగ తన బాధ్యతలను ముగియించినచో
    కొద వేమియుండ దపుడు
    పదవీ విరమణము గొప్ప వరమగును గదా.

    రిప్లయితొలగించండి
  21. తుది వరకు కొలువు నెరపుచు
    ముదముగ తన బాధ్యతలను ముగియించినచో
    కొద వేమియుండ దప్పుడు
    పదవీ విరమణము గొప్ప వరమగును గదా.

    రిప్లయితొలగించండి



  22. ' పదవీచ్యుతి 'అంటే వేరే అర్థం వస్తుంది.'విరమణ 'నిఘంటువులో లేకపోతే ఇప్పుడు చేర్చుకోవచ్చును.,వాడుకలో ఉందికాబట్టి.మాయాబజార్ సినిమాలో రంగారావు చెప్పినట్లు ఎవరూ పుట్టించనిదే మాటలు ఎలా పుడతాయి?

    రిప్లయితొలగించండి
  23. శ్రీ మిస్సన్న గారూ! శుభాశీస్సులు.
    మీరు వివరణాత్మకముగ వ్రాసిన 3 పద్యములు బాగుగ నున్నవి. చాల సంతోషము. అభినందనలు.

    శ్రీ బొడ్డు శంకరయ్య గారు: శుభాశీస్సులు.
    ముదముతో ఉద్యోగమును పూర్తిగ జేసి ముగించిన వాని గూర్చి మీ పద్యము చాల బాగుగ నున్నది. అభినందనలు.

    డా. కమనీయం గారు! నమస్కారములు.
    మీ సూచన చాల బాగుగ నున్నది - సంతోషము. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  24. మంచి మంచి పూరణలు చెప్పిన కవిమిత్రులు...
    రాజేశ్వరి అక్కయ్యకు,
    పండిత నేమాని వారికి,
    లక్ష్మీదేవి గారికి,
    గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
    కెంబాయి తిమ్మాజీరావు గారికి,
    వరప్రసాద్ గారికి,
    భాగవతులు కృష్ణారావు గారికి,
    సుబ్బారావు గారికి,
    శైలజ గారికి,
    గండూరి లక్ష్మినారాయణ గారికి,
    మిస్సన్న గారికి,
    బొడ్డు శంకరయ్య గారికి,
    అభినందనలు, ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  25. పదవుల నింపగ లేమని
    యదనపు బాధ్యతల నీయ నలసట బెరుగన్
    దదనుకు ముదముగ వచ్చెడు
    పదవీ విరమణము గొప్ప వరమగును గదా!

    రిప్లయితొలగించండి
  26. శ్రీ గోలి హనుమఛ్ఛాస్త్రి గారూ! శుభాశీస్సులు.

    మీ పద్యము బాగుగ నున్నది. అభినందనలు.
    3వ పాదములో దదనుకు అనుట బాగులేదు. అదనునకు అనవలెను కదా.
    3వ పాదమును ఇలాగ మార్చుదాము:

    "ముదమున దుదకు లభించెడు"
    స్వస్తి

    రిప్లయితొలగించండి
  27. ముదనష్టపు విభజనతో
    తదనంతర నష్టమెంచి తన నప వాదుల్
    వదలవనగ స్వచ్ఛందపు
    పదవీ విరమణము గొప్ప వరమగును గదా!

    రిప్లయితొలగించండి
  28. సహదేవుడు గారూ,
    మీ రెండు పూరణలూ బాగున్నవి. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  29. ఎదలో బాధలు సడలగ
    కదనమ్ములు లేని యింట కడుపది నిండన్
    పదిలమ్మౌ పింఛనుతో
    పదవీ విరమణము గొప్ప వర మగునుగదా!

    రిప్లయితొలగించండి