19, డిసెంబర్ 2013, గురువారం

సమస్యాపూరణం - 1268 (కప్పను గాపాడె నొక్క)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది......
కప్పను గాపాడె నొక్క కాకోదరమే.
ఈ సమస్యను సూచించిన కందుల వరప్రసాద్ గారికి ధన్యవాదాలు.

28 కామెంట్‌లు:

  1. కప్ప యొకటి శివుని కడకు
    చప్పున జనబూని పోవజాలక యకటా!
    తిప్పలు బడుచుండగ నా
    కప్పను గాపాడె నొక్క కాకోకదరమే

    రిప్లయితొలగించండి
  2. కప్పకు పడగను నీడగ
    మెప్పుగ తానుండె వెలుచ మీరిన మైత్రిన్
    తప్పక తాపస భూమిది
    కప్పను గాపాడె నొక్క కాకోదరమే

    రిప్లయితొలగించండి
  3. అప్పటి ముని ఋష్య శృంగుడు
    గొప్పగ తాతపము జేసి కూరిమి నింపెన్
    ఎప్పుడు నైరము దెలియక
    కప్పను గాపాడె నొక్క కాకోదరమే

    రిప్లయితొలగించండి

  4. తప్పని చెప్పగ నేరం
    బిప్పటి యీ రాజకీయ బేరములందున్
    తప్పని దని భావించుచు
    కప్పను గాపాడె నొక్క కాకోకదరమే.

    రిప్లయితొలగించండి
  5. అప్పటినిధి గుడినుందని
    తప్పుడు నరులేమొ వెడలె తస్కరులగుచున్
    మెప్పుగ చుట్టుక తాళపు
    కప్పను, గాపాడె నొక్క కాకోకదరమే.

    రిప్లయితొలగించండి
  6. జగద్గురువులు శ్రీ శంకరులు శృంగేరి నందు.........

    ఇప్పథమునందుఁ జూడఁగ
    కప్పను కాపాడెనొక్క కాకోదరమే
    గొప్పగు ధర్మము నిలబడఁ
    నిప్పుణ్యపుభూమటంచునెంచె తపముకై.

    రిప్లయితొలగించండి
  7. తప్పక దననే గొలిచెడి
    తప్పుడు పనులెరుగ నట్టి తన పోషకునిన్
    తిప్పలు పడకుండన్ కన
    కప్పను గాపాడె నొక్క కాకోకదరమే.

    రిప్లయితొలగించండి
  8. శ్రీ శంకరయ్య గురుదేవులకు,శ్రీ నేమాని గురుదేవులకు వినమ్రవందనములతో.....
    శ్రీ శంకరయ్య గురుదేవులకు,శ్రీ నేమాని గురుదేవులకు ధన్యవాదములతో...

    అప్పుల బారిన బడ్డ స్వదేశీ సంస్థలను విదేశీ సంస్థలు కొనుటపై
    ==========*================
    కప్పకు గప్పయె శత్రువు,
    కప్పల రాజ్యమున నధిక కప్పములడుగన్
    కప్పలు జిక్కగ నప్పుల
    కప్పను గాపాడె నొక్క కాకోదరమే!

    రిప్లయితొలగించండి
  9. తప్పని పరిస్థితిలో లోక్ పాల్ బిల్లును నామోదించుట
    =============*=====================
    తప్పులు ముదమున జేసెడి
    గప్పలు పదులుగను జేరి కలహము వీడెన్,
    తుప్పల నడుమను నిలచిన
    కప్పను గాపాడె నొక్క కాకోదరమే.

    (తుప్పల నడుమను నిలచిన కప్ప = కాంగ్రేస్ అధినేత్రి ,కాకోదరము = బిజెపి )

    రిప్లయితొలగించండి
  10. కప్పు , పాము ల చెలిమిని హరదన హళ్లి చామరాజ నగర జిల్లా కర్ణాటక (ఊటీ దారిలో ) చిన్న గ్రామమందు జుడ గలము .
    శివ రాత్రి పర్వ దినమందు శివ లింగము ముందు కప్పు నిలువగా దాని పై పాము వచ్చి పడగ విప్పి కనిపించును, ఆ వేడుక జరిగిన తరువాత మాత్రమే రుద్రాభిషేకము జరుగును.

    రిప్లయితొలగించండి
  11. గొప్పగ వానలు గురియగ
    కప్పలు ఈశుని గొలువగ కదలెను గుడికిన్
    ముప్పున బడుటను గనిచిరు
    కప్పను గాపాడె నొక్కకాకోదరమే

    రిప్లయితొలగించండి
  12. శ్రీ శంకరయ్య గారికి నమస్సులు

    చప్పున కరచిన సర్పము
    కప్పను మ్రింగంగజూడ గని శివుడలుగన్
    తప్పక శివుగళమెక్కుచు
    కప్పను గాపాడె నొక్క కాకోదరమే

    రిప్లయితొలగించండి
  13. పండిత నేమాని వారూ,
    శివుని సన్నిధిలో జాతివైరం మరిచాయంటారు. భాగుంది మీ పూరణ. అభినందనలు.
    *
    రాజేశ్వరి అక్కయ్యా,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    మూడవ పాదంలో ‘భూమి + ఇది’ అన్నప్పుడు యడాగమం వస్తుంది. ఆ పాదాన్ని ‘తప్పక తపోవన మ్మిది’ అనండి.
    *
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    రాజకీయాలను ప్రస్తావించిన మీ మొదటి పూరణ బాగుంది.
    తాళపు కప్పను చుట్టుకొని నిధిని కాపాడిన పామును గురించిన రెండవ పూరణ వైవిధ్యంగా చక్కగా అభినందనలు.
    *
    సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
    కప్ప, పాము స్నేహంగా మెదిలిన చోటు కనుక పీఠం నెలకొల్పడానికి అనువైన స్థలంగా భావించడం బాగుంది. మంచి పూరణ. అభినందనలు.
    ‘భూమి + అటంచు’ అన్నప్పుడు యడాగమం వస్తుంది. అక్కడ ‘భూమి యనుచు నెంచె...’ అందాం.
    *
    గండూరి లక్ష్మినారాయణ గారూ,
    కనకప్పను కాపాడిన పాము గురించిన మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    నాగరాజు రవీందర్ గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    కాని గుడ్లగూబకు ‘కాకభీరువు, కాకరూకము, కాకారి’ అనే కాని ‘కాకోదరము’ అన్న పదం లేనట్టుంది.
    *
    వరప్రసాద్ గారూ,
    ప్రస్తుత పరిస్థులకు అన్వయిస్తున్న మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
    *
    భాగవతుల కృష్ణారావు గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  14. శైలజ గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    ‘కప్పలు + ఈశుని’ అన్నప్పుడు సంధి నిత్యం. అక్కడ ‘కప్పలు శంకరుని గొలువ..." అందామా?

    రిప్లయితొలగించండి

  15. పండిత నేమాని గారికి పూజ్యులు గురుదేవులు
    శంకరయ్య గారికి వందనములు


    తప్పించెను ముప్పును వెం
    కప్పఫణిని మంట నుండి . జ్ఞప్తికి దోచన్
    గొప్పగ సిరులిచ్చుచు వెం
    కప్పను గాపాడె నొక్క కాకోదరమే

    రిప్లయితొలగించండి
  16. తప్పుల క్షమియించువాడు
    నప్పడు శ్రీ వేంకటేశుననవరత విధిన్
    గొప్పగ బూజించిన వెం
    కప్పను గాపాడెనొక్క కాకోదరమే.

    రిప్లయితొలగించండి
  17. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    ప్రత్యుపకారం చేసిన పామును గురించిన మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    మారెళ్ళ వామన్ కుమార్ గారూ,
    దైవకృప ఉంటే కాటేయవలసిన పామే కాపాడుతుందన్న మీ పూరణ బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  18. తిప్పలు బడి కప్ప యొకటి
    నిప్పులవలె కాల్చు యెండ నే ప్రసవించన్
    జప్పున పడగను కప్పుచు
    కప్పను గాపాడె నొక్క కాకోదరమే

    రిప్లయితొలగించండి
  19. శీనా శ్రీనివాస్ గారూ,
    ఎన్నాళ్ళకెన్నాళ్ళకు...! సంతోషం.
    మీ పూరణ బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  20. రవీందర్ గారూ,
    కేవలం జి.ఎన్. రెడ్డిగారి నిఘంటువులోనే ఆ అర్థం ఇవ్వబడింది. మిగిలిన నిఘంటువులలో లేదు. జి.ఎన్. రెడ్డిగారి పర్యాయపద నిఘంటువులో గుడ్లగూబకు కాకోదర మన్న పర్యాయపదాన్ని ఇవ్వలేదు.
    బహుశా జి.ఎన్. రెడ్డి గారు పొరబడి ఉండవచ్చు.

    రిప్లయితొలగించండి
  21. చప్పుడు చేయక యెగురుచు
    కప్పను గొనిపోవ నెంచి గరుడుడు రాగా
    ముప్పును గ్రహించి యపుడా
    కప్పను గాపాడె నొక్క కాకోకదరమే.

    రిప్లయితొలగించండి
  22. బొడ్డు శంకరయ్య గారూ,
    శత్రువు యొక్క శత్రువు మిత్రుడన్నట్టుగా చెప్పిన మీ పూరణ బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  23. శ్రీ వామన కుమార్ గారు:
    శుభాశీస్సులు. మీ పద్యము బాగుగ నున్నది. అభినందనలు.
    3వ గణము జగణము కారాదు. అందుచేత మీ పద్యములో 1వ పాదమును ఇలాగ మార్చుదాము:

    తప్పుల క్షమియించు నతడు

    శ్రీ షీనా గారు:
    మీ పద్యము బాగుగ నున్నది. అభినందనలు.

    కాల్చు + ఎండ = కాల్చునెండ (నుగాగమము) అగును.

    స్వస్తి.






    రిప్లయితొలగించండి
  24. అప్పులు జేసెడి ధనికుని
    తప్పక రక్షించి బ్యాంకు తప్పులు మాపున్
    చెప్పెదనది యెట్లన్నన్:
    కప్పను గాపాడె నొక్క కాకోదరమే!

    రిప్లయితొలగించండి


  25. అప్పా! బడిశము వేయుచు
    కప్పను గాపాడె నొక్క కాకోదరమే!
    కుప్పలు తెప్పలు నమ్ముచు
    చప్పున వచ్చి కడతేఱె చలికాపులటన్ !

    జిలేబి

    రిప్లయితొలగించండి
  26. తప్పులు చేయగ చిద్దుడు
    గొప్పగ వాదించె కపిలు కోర్టున బుసలన్!
    అప్పా! ఇది యెట్లన్నన్:
    "కప్పను గాపాడె నొక్క కాకోదరమే"

    చిద్దుడు = చిదంబరం
    కపిలు = కపిల్ సిబ్బల్

    రిప్లయితొలగించండి