23, డిసెంబర్ 2013, సోమవారం

సమస్యాపూరణం - 1272 (భువిని శాత్రవు లెల్ల)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది......
భువిని శాత్రవు లెల్ల బంధువులు గారె.
ఈ సమస్యను పంపిన గూడ రఘురామ్ గారికి ధన్యవాదాలు.

19 కామెంట్‌లు:

  1. ఆలస్యానికి కవిమిత్రులు మన్నించాలి. ప్రయాణంలో ఉన్నాను.

    రిప్లయితొలగించండి
  2. ద్వేష, మీర్ష, గ్రోధంబును విడచి పెట్టి
    విశ్వ కల్యాణ మాసించి విమల ప్రేమ,
    మైత్రి, కారుణ్యమును బంచు మానవులకు
    భువిని శాత్రవులెల్ల బంధువులు గారె.

    రిప్లయితొలగించండి
  3. శ్రీ శంకరయ్య గారికి నమస్సులు

    బుస్సి హైదరుజంగులు పూని కక్ష
    రామరాజును చంపిరి రణమునందు
    శత్రులిరువురు వింతగ మిత్రులైరి
    భువిని శాత్రవు లెల్ల బంధువులు గారె

    రిప్లయితొలగించండి
  4. నా రెండవ పూరణ

    అతుల ప్రేమ రసంబది యందజేసి
    మిగుల కారుణ్యమును పంచు మేధగలుగ
    భువిని జెనులెల్ల మైత్రిని చవినిజూడ
    భువిని శాత్రవులెల్ల బంధువులు గారె

    రిప్లయితొలగించండి
  5. పండిత నేమాని గారికి పూజ్యులు గురుదేవులు
    శంకరయ్య గారికి వందనములు

    సృష్టిలోపల తానొక జీవి ననుచు
    జనన మరణము లొకరీతి సాగు ననుచు
    నెరుక గల్గిన రోజున నెంచి జూడ
    భువిని శాత్రవు లెల్ల బంధువులు గారె

    రిప్లయితొలగించండి
  6. మానవులు ద్వేశ భావము మరచి పోయి
    ప్రేమ బంచుచు నుండగ ప్రీతి తోడ
    మైత్రి యన్నది వృద్ధియై మమత లొలుక
    భువిని శాత్రవు లెల్ల బంధువులు గారె.

    రిప్లయితొలగించండి
  7. ఈనాటి పూరణలన్నియు అలరించు చున్నవి. అందరికి శుభాభినందనలు.

    శ్రీ లక్ష్మీనారాయణ గారు:
    మీ పద్యము బాగుగ నున్నది. క్రోధంబులు మరియు కారుణ్యములు అని బహువచనము వాడుట బాగుండును కదా.

    శ్రీ కృష్ణారావు గారు:
    మీ 2వ పద్యములో "భువిని" అనే పదము 2 మారులు వాడబడినది. పునరుక్తి దోషము లేకుండా మరొక పదమును వాడితే బాగుండును కదా.

    శ్రీ బొడ్డు శంకరయ్య గారు:
    మీ పద్యములో "ద్వేశ" అనుట టైపు పొరపాటు అనుకొంటాను. ద్వేష అనవలెను కదా.

    స్వస్తి.

    రిప్లయితొలగించండి
  8. పండిత నేమాని గురువర్యులుకు నమస్సులు, సవరణతో............

    మానవులు ద్వేష భావము మరచి పోయి
    ప్రేమ బంచుచు నుండగ ప్రీతి తోడ
    మైత్రి యన్నది వృద్ధియై మమత లొలుక
    భువిని శాత్రవు లెల్ల బంధువులు గారె.

    రిప్లయితొలగించండి
  9. పండిత నేమాని గారికి పూజ్యులు గురుదేవులు
    శంకరయ్య గారికి వందనములు
    ===============*===================
    kanna vaari kashtamulanu mannu jesi,
    yanna dammula sukhamula kaddu baduchu,
    sodari kutuMbamunakunu sunna pettu
    భువిని శాత్రవు లెల్ల, బంధువులు గారె?
    (sunna pettu= vaMchiMchu)

    రిప్లయితొలగించండి
  10. శ్రీ శంకరయ్య గురుదేవులకు,శ్రీ నేమాని గురుదేవులకు వినమ్రవందనములతో.....

    శ్రీ నేమాని గురుదేవులకు ధన్యవాదములతో...
    =========*===============
    కన్న వారి కష్టము లను మన్ను జేసి ,
    యన్న దమ్ముల సుఖముల కడ్డు బడుచు
    సోదరి సదనమునకును సున్న పెట్టు
    భువిని శాత్రవు లెల్ల, బంధువులు గారె?

    రిప్లయితొలగించండి
  11. ప్రబల శత్రులౌ సుమశర ప్రభృతుల దగు
    యోగ బలముచే నరికట్టి యొప్పు మీర
    నాత్మ దృష్టితో నలరెడు నట్టి యెడల
    భువిని శాత్రవు లెల్ల బంధువులు గారె

    రిప్లయితొలగించండి




  12. గాంధిజీ యహింసయు,బుద్ధు కరుణ రసము
    నమల హృదయ ఫలకము నందమరచుకొని
    ద్వేషభావమ్ము స్వార్థమ్ము విడచిపెట్ట
    భువిని శాత్రవులెల్ల బంధువులు గారె!

    రిప్లయితొలగించండి
  13. శ్రీ పండిత నేమాని గురువరులకు నమస్కారములు
    దోషము గమనించాను. మీ సూచనకు ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  14. కవిమిత్రులకు నమస్కృతులు.
    ఈరోజు మా అన్నయ్య (పెద్దమ్మ కొడుకు) మరణించడంతో మీ పూరణలను పరిశీలించలేకపోయాను. రేపు, ఎల్లుండి కూడా నేను బ్లాగుకు అందుబాటులో ఉండకపోవచ్చు. రెండు రోజుల సమస్యలను షెడ్యూల్ చేసి ఉన్నాను.
    అసౌకర్యానికి మన్నించవలసిందిగా సవినయంగా మనవి చేస్తున్నాను.
    ఈరోజు పూరణలు చెప్పిన కవిమిత్రులందరికీ అభినందనలు.
    వాత్సల్యంతో పూరణ గుణదోష విచారణ చేస్తున్న నేమాని గురువులకు పాదాభివందనాలు.

    రిప్లయితొలగించండి
  15. చెట్టులెక్కడ మొలకెత్తు, జెప్పు మింక
    కననజాతశత్రువు గూర్చి కమ్మగాను,
    మినప వంటకమొక్కటి మెచ్చ జెపుమ
    భువిని - శాత్రవు లెల్ల బంధువులు - గారె.

    రిప్లయితొలగించండి
  16. ఆత్మబంధువులేనంచు యందరకును
    తలను నాలుకవై నీవు మెలగుచుండ
    వారు వీరను భేదపు భావము విడి
    భువిని శాత్రవు లెల్ల బంధువులు గారె

    రిప్లయితొలగించండి
  17. తాతల ప్రాయమందునను తారక రాముడు తల్లడిల్లగా
    ప్రీతిని సేవ జేయుటకు రీతిగ చేరిన పార్వతమ్మనున్
    ఖాతరు చేయకే వదరు కాకుల కూతలు మున్ను సంతుకున్
    మాతను బెండ్లియాడి జనమాన్యుఁ డనంబడి పొందె సన్నుతుల్

    రిప్లయితొలగించండి