29, డిసెంబర్ 2013, ఆదివారం

సమస్యాపూరణం - 1278 (తరుణికి నందమ్ము)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది......
తరుణికి నందమ్ము నొసఁగుఁ దలపైఁ గొమ్ముల్.
ఈ సమస్యను పంపిన కందుల వరప్రసాద్ గారికి ధన్యవాదాలు.

37 కామెంట్‌లు:

  1. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరింప నున్నవి !

    కోరలూ, కొమ్ములూ రాక్షస వనితల కలంకారములే గదా !

    01)
    __________________________________

    కరమున పానపు పాత్రయు
    నురమున బుఱ్ఱెల వరుసయు - నోటికి కోరల్
    నరమాంసము దిను రాక్షస
    తరుణికి నందమ్ము నొసఁగుఁ - దలపైఁ గొమ్ముల్ !
    __________________________________
    వరుస = మాల

    రిప్లయితొలగించండి
  2. సురుచిరవర్తన నుండుట
    తరుణికి నందమ్ము నొసగు, దలపై కొమ్ముల్
    కరుణారాహిత్యంబును
    గురుజనధిక్కారగుణము క్రోధం బరయన్.

    రిప్లయితొలగించండి
  3. మెరుగుగ నింటిని దిద్దుట
    మరి బంధువులందరందు మంచిని పొందన్
    సరిగా మెలగుట కొమ్ములు
    తరుణికి నందమ్ము నొసఁగుఁ దలపైఁ గొమ్ముల్.

    రిప్లయితొలగించండి
  4. చిరునగవుతో కళఁగొలుపఁ
    దరుణికి నందమ్ము నొసఁగు, తలపై కొమ్ముల్
    బరువైన కొలువు బాధ్యత
    నెరవేర్చఁగ డాబు దర్ప నేర్పులె జూడన్!

    రిప్లయితొలగించండి
  5. చిరుదరహాసము కరుణయు
    తరుణికి నందమ్ము నొసగు,దలపై కొమ్ముల్
    కరకుగ లాడెడు మాటలు
    పరులను హింసించుగుణము పడతికి తగునా?

    రిప్లయితొలగించండి

  6. అర విడిచిన పూమాలలు
    తరుణికి నందమ్ము నొసగు దలపై, గొ మ్ముల్
    బఱగుచు మైసూ రెడ్లకు
    కరమవి యంద మును గూర్చు గనులకు మిగులన్

    రిప్లయితొలగించండి
  7. వసంత కిశోర్ గారూ,
    రాక్షస తరుణిని గురించిన మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
    అహంకారానికి, గర్వానికి తలపై కొమ్ములను చెప్పడం జనసామాన్యమే. బాగుంది మీ పూరణ. అభినందనలు.
    *
    నాగరాజు రవీందర్ గారూ,
    చక్కని పూరణ చెప్పారు. అభినందనలు.
    *
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    ‘కొమ్ము’ శబ్దానికి ఉత్సాహము, బలము అనే అర్థాలున్నాయి. మీరు ఆ అర్థాన్ని గ్రహించినట్టున్నారు. బాగుంది. అభినందనలు.
    *
    సహదేవుడు గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.
    ‘దర్పనేర్పులు’ అనరాదు కదా. అక్కడ ‘దర్పనిష్ఠయె చూడన్’ అందామా?
    *
    శైలజ గారూ,
    మంచి పూరణ చెప్పారు. అభినందనలు.
    *
    సుబ్బారావు గారూ,
    మీ విరుపు వైవిధ్యంగా ఉంది. మంచి పూరణ. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  8. శ్రీ శంకరయ్య గురుదేవులకు,శ్రీ నేమాని గురుదేవులకు వినమ్రవందనములతో.....
    శ్రీ శంకరయ్య గురుదేవులకు ధన్యవాదములతో...

    సోదర సోదరీ మణులకు విజ్ఞప్తి నేను టివిలలో (సీరియళ్ళ) ఆడు వారు బలుకు పలుకులు విని కలత జెంది వ్రాసిన సమస్య యిది అన్యధా భావించ వలదు.
    ===========*==============
    కొరడా ఝుళి పించు నటుల
    నెఱజాణ బలుకు పలుకుల నెటికలు వినగా
    తెరపై వెలుగులు జిమ్మెడి
    తరుణికి నందమ్ము నొసఁగుఁ దలపైఁ గొమ్ముల్ !

    రిప్లయితొలగించండి
  9. శ్రీ శంకరయ్య గురుదేవులకు ధన్యవాదములతో...

    భీముడు దెచ్చినది పారిజాత పుష్పమని పొరబడితిని గురువుగారు

    రిప్లయితొలగించండి
  10. వరప్రసాద్ గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి


  11. పండిత నేమాని గారికి పూజ్యులు గురుదేవులు
    శంకరయ్య గారికి వందనములు

    మురియుచు నాడించగ మృగ
    తరుణికి నందమ్ము నొసగు దలపై కొమ్ముల్
    తరుశాఖ జిక్కు కొనగా
    వెరవున బంధించె నొక్క వేటరి మృగమున్

    రిప్లయితొలగించండి
  12. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  13. నరుడదె చూచుచు నుండగ
    మరులను పంచెడు వరుడని మనసున దలపన్
    మురిసిన వేళల నాహా!
    తరుణికి నందమ్ము నొసఁగుఁ దలపైఁ గొమ్ముల్.

    రిప్లయితొలగించండి
  14. సరదాలిడు వేషమ్ముల
    పరిపరి విధముల ధరించు పర్వములందున్
    దిరముగ గెలిచెను బహుమతి
    తరుణికి నందమ్ము నొసగు దలపై గొమ్ముల్

    రిప్లయితొలగించండి
  15. కురులందు మల్లె పూవులు
    తరుణికి నందమ్ము నొసగు, తలపై కొమ్ముల్
    తరుణ వృషభ మ్మున కిడును
    కరమందము, నీతి యెసగు ఘనునకు సొబగున్.

    రిప్లయితొలగించండి
  16. లక్ష్మీదేవి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    పండిత నేమాని వారూ,
    మూడు నాలుగు రోజులుగా మీ లోటు స్పష్టంగా కనిపిస్తున్నది. మీ పూరణ మహదానందాన్ని కలిగించింది.
    విచిత్ర వేషధారణ విషయంగా మీ పూరణ వైవిధ్యంగా ఉండి అలరించింది. అభినందనలు.
    *
    గండూరి లక్ష్మినారాయణ గారూ,
    మీ పూరణ ఒక నీతిపద్యంగా భాసిస్తున్నది. బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  17. కురులందు మల్లె పూవులు
    తరుణికి నందమ్ము నొసగు, తలపై కొమ్ముల్
    తరుణ వృషభ మ్మున కిడును
    కరమందము, నీతి యొసగు ఘనునకు సొబగున్.

    రిప్లయితొలగించండి
  18. శ్రీ శంకరయ్య గారికి నమస్సులు

    విరజాజులు మరుమల్లెలు
    తరుణికి నందమ్ము నొసగు; దలపై గొమ్ముల్,
    హరిణికి మేలిమి వర్ణము
    ధరణితనూజకు మిగిల్చె తరగని ముప్పుల్

    రిప్లయితొలగించండి

  19. పై పోస్ట్ లో కొన్ని టైపాటులు సవరిస్తూ

    వరుని గురించ జపించుచు
    విరహమునందిహము మరచి వీక్షించు తరిన్
    అరుదురు చెలులొసగిన యా
    తరుణికి నందమ్మునొసగు దలపై కొమ్ముల్.
    (అరుదురు = అల్లరి చేయు )


    వరములనందుట కొఱకు సు
    కరముగ తపమాచరించి కరుణ శుభా శం
    కరుని జపించిన దానవ
    తరుణికి నందమ్మునొసగు దలపై కొమ్ముల్.


    వరబలుడగు భీముడు కాం
    తారమునను గాంచినంత తరుణి హిడింబన్
    యురమున భావించెనంట
    “తరుణికి నందమ్మునొసగు దలపై కొమ్ముల్.”
    ( కాంతారము = అడవి)

    రిప్లయితొలగించండి
  20. భాగవతుల కృష్ణారావు గారూ,
    విరుపుతో మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    మారెళ్ళ వామన్ కుమార్ గారూ,
    మీ మూడు పూరణలూ ముచ్చటగా ఉండి అలరించాయి. అభినందనలు.
    సవరించిన పోస్ట్ లోను కొన్ని లోపాలు...
    మొదటి పూరణలో ‘గురించి’కి బదులు ‘గురించ’ అని టైపు చేశారు.
    మూడవ పూరణ రెండవ పాదంలో ప్రాసదోషం. అక్కడ ‘ప్రాంతరమందున గాంచినంత తరుణి...’ అనండి (ప్రాంతరము = అడవి)

    రిప్లయితొలగించండి
  21. వసంత మహోదయా అద్భుతమైన సమయోచిత స్ఫూర్తి!

    రిప్లయితొలగించండి
  22. గురువుగారికి ధన్యవాదములు. తమరిసవరణానంతర పద్యం:

    చిరునగవుతో కళఁగొలుపఁ
    దరుణికి నందమ్ము నొసఁగు, తలపై కొమ్ముల్
    బరువైన కొలువు బాధ్యత
    నెరవేర్చఁగ డాబు దర్ప నిష్టలె చూడన్!

    రిప్లయితొలగించండి
  23. పరమే శుని సేవించుచు
    నిరతము పతి ననుస రించి నీమము విడకన్
    తరియించగ మదిని దలచు
    తరుణికి నందమ్ము నొసగు దలపై కొమ్ముల్

    రిప్లయితొలగించండి
  24. నిరవధికముగా మద్యము
    విరివిగ సేవించుచుండి వీడుచు పనులన్
    తిరుగెడు భర్తను మార్చగ
    తరుణికి నందమ్ము నొసగు దలపై గొమ్ముల్.

    రిప్లయితొలగించండి
  25. సరగున వచ్చెడి పూతన
    నరసిన కన్నయ్య తలచె నాహా మరచెన్
    పరుగున వచ్చుచు రాక్షస
    తరుణికి నందమ్ము నొసఁగుఁ దలపైఁ గొమ్ముల్.

    రిప్లయితొలగించండి
  26. సరిసరి భీముని వలచిన
    విరిబోణీ! యేమి మనుజవెలదివి కాదా!
    మరి యేవీ మీ దానవ
    తరుణికి నందమ్ము నొసఁగుఁ దలపైఁ గొమ్ముల్?

    రిప్లయితొలగించండి
  27. శంకరార్యా ! ధన్యవాదములు !
    మిస్సన్నమహాశయా ! ధన్యవాదములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !



    రిప్లయితొలగించండి
  28. రాజేశ్వరి అక్కయ్యా,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.
    *
    బొడ్డు శంకరయ్య గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    మిస్సన్న గారూ,
    మీ రెండు పూరణలూ బాగున్నవి. అభినందనలు.
    ‘మనుజవెలది’ ప్రయోగమే పానకంలో పుడకలా ఉంది. :-)

    రిప్లయితొలగించండి
  29. మెరిసే యీకలు కోయల
    తరుణికి నందమ్ము నొసఁగుఁ దలపై ;కొమ్ముల్
    గరవల కివ్వగ వరుసగ
    గురువులుగామారు తెలుగు గుణితములోనన్ !!!

    రిప్లయితొలగించండి
  30. శ్రీ శంకరయ్య గురుదేవులకు, శ్రీ నేమాని గురుదేవులకు వినమ్రవందనములతో.....
    దోషములను సవరించ మనవి...

    విరజాజి పూలు తురిమిన
    తరుణికి నందమ్ము నొసగు దలపై, గొమ్ముల్
    శిరమున పెరిగిన తరుణిని
    పురుషులు మెచ్చంగ లేరు పుడమిని యెల్లన్.

    రిప్లయితొలగించండి
  31. మంద పీతాంబర్ గారూ,
    బహుకాల దర్శనం! సంతోషం.
    కొమ్ములు పెట్టి గురువులు చేసిన మీ పూరణ వైవిధ్యంగా ఉంది. అభినందనలు.
    *
    కుసుమ సుదర్శన్ గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    ‘పుడమిని యెల్లన్’ అన్నదానిని ‘భూతలమందున్’ అనండి.

    రిప్లయితొలగించండి
  32. గురువుగారూ మనుజవెలది నాకూ అచ్చం అలాగే అనిపించింది!!!!!!! కానీ.............

    రిప్లయితొలగించండి
  33. అరయగ సాహిత్య మొకటి
    మరియును సంగీత మలరి
    మదమున్నిడగా
    పరువము మెండుగ నిండిన
    తరుణికి నందమ్ము నొసఁగుఁ దలపైఁ గొమ్ముల్

    రిప్లయితొలగించండి
  34. వరమగు శాలువ కప్పగ
    తిరుగుచు గంగెద్దు ననుచు తిక్కల ఱేడై
    బరువగు సుందర వృషముని
    తరుణికి నందమ్ము నొసఁగుఁ దలపైఁ గొమ్ముల్

    రిప్లయితొలగించండి


  35. అరె! కొప్పుకదా చందము
    తరుణికి నందమ్ము నొసఁగుఁ, దలపైఁ_ గొమ్ముల్
    మరియాద దున్నపోతున
    కరయగ చేర్చును వివరణ గానుడి కవిరాట్



    జిలేబి

    రిప్లయితొలగించండి