1, జనవరి 2014, బుధవారం

సమస్యాపూరణం - 1280 (ప్రజలు రోదింత్రు)

కవిమిత్రులారా,
 ఈరోజు పూరించవలసిన సమస్య ఇది......
ప్రజలు రోదింత్రు నూత్నసంవత్సరమున.

35 కామెంట్‌లు:

 1. మిత్రులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు

  రిప్లయితొలగించండి
 2. మిత్రులారా!
  అందరికీ నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు.

  నూతన సంవత్సరమునకు సాదర స్వాగతము పలుకుదాము:

  జేజే నూతన వత్సరమ్మ! భువన శ్రేయోనుసంధాయినీ!
  జేజే మంగళ యోగ పర్వకలితా! జేజే వినోదాత్మికా!
  జేజే సంతత ధర్మ మార్గనిరతా! జేజే వివేకోజ్జ్వలా!
  జేజే యంచివె గూర్తు స్వాగత నతుల్ స్నిగ్ధాంతరంగమ్మునన్

  రిప్లయితొలగించండి
 3. అందరికీ వందనములు !
  అందరి పూరణలూ అలరింప నున్నవి !

  2014 సంవత్సరములో
  రాజకీయ పార్టీలు ప్రజాసంక్షేమానికి పోటీపడి పరుగులు పెడితే
  సంతోషం తట్టుకోలేని ప్రజలు యేడవక యేం జేస్తారు ?

  01)
  ________________________________

  వారు వీరును పోటీల - బడుచు వేగ
  నుచిత ధాన్యాలు వస్తువుల్ - యూరువాడ
  యెందరెందరి కో యిడ - నేడ్పు లేక
  తల్లడిల్లుచు సంతోష - ముల్లసిల్ల
  ప్రజలు రోదింత్రు నూత్నసంవత్సరమున !
  ________________________________
  వారు వీరు = అన్ని రాజకీయ పార్టీలు

  రిప్లయితొలగించండి
 4. అమంగళం శాంతించు గాక !

  పాలకుల పీడ యెక్కువైతె
  ప్రజలు యేడవరా మరి ???

  02)
  ________________________________

  వేల, లక్షల కోట్లను - చాల దోచి
  నేత లందరు జేబులు - నింపు కొనిన
  ప్రభుత యధికార గణమంత - పరువు విడచి
  ప్రజల గజదొంగవోలెను - బాధ పెట్ట
  ప్రజలు రోదింత్రు నూత్నసం - వత్సరమున !

  గాలివానలు తూఫాన్లు - కలిగె నేని
  కార్లు బస్సులు, రైళ్ళును - కాలె నేని
  యాక్సిడెంటులు మరణాలు - నధిక మైన
  ప్రజలు రోదింత్రు నూత్నసం - వత్సరమున !

  తిండి గింజలు ధరలవి - తేజరిల్ల
  తిండి కొనలేని ప్రజలంత - దీను లైన
  ఆదుకొను వారె కరవైన - నట్టి వేళ
  ప్రజలు రోదింత్రు నూత్నసం - వత్సరమున !

  మానభంగాలు, హత్యలు - మరువలేక
  పట్ట పగలైన స్త్ర్రీలదె - బైట దిరుగ
  సాహసించగ లేనట్టి - సమయ మొదవ
  ప్రజలు రోదింత్రు నూత్నసం - వత్సరమున !
  ________________________________

  కాని యిటువంటి వన్నియు - కలుగుటకును
  కాలమింకను చాన్నాళ్ళు - గడువ వలెను
  కలిపురుషు నాయు వంతయు - కరుగ వలెను
  కలియుగాంతము వరకును - గడువు గలదు !

  కాన నూత్నవత్సరమున - గలుగు నెన్నొ
  మంగళంబులు మరి మరి - మంగళములు !
  ఆయురారోగ్య, సంపద - లలరు చుండ
  ప్రజ సుఖింత్రు నూతన వత్స - రమున మేలు !

  రిప్లయితొలగించండి
 5. అందరికీ ఆంగ్ల నూతన వత్సర శుభాకాంక్షలు.

  పదమూడు వెడలి పోయెను
  పదునాలుగు రెండు వేల పైనను వచ్చెన్
  పదిలముగా సుఖశాంతులు
  వదలక మీకందవలయు వత్సరమందున్.

  రిప్లయితొలగించండి
 6. గురువు గారికి ,అన్నయ్య గారికి, మిత్రబృందమునకు, నమస్సులు! మీకు మీ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు !

  - నరసింహ మూర్తి

  రిప్లయితొలగించండి
 7. శంకరాభరణ సాహితీ మిత్రులందరికి నూతన సంత్సర శుభ కాంక్షలతో ...
  మీ తలచు కార్య సిద్ధిని,
  ఖ్యాతిని పెంపొంద జేసి యాద్యాంతంబున్
  నూతన సంవత్సర శ్రీ
  మాతా శీస్సులనిడి కుసుమంబుల జల్లున్.


  రిప్లయితొలగించండి
 8. శ్రీ శంకరయ్య గురుదేవులకు,శ్రీ నేమాని గురుదేవులకు వినమ్రవందనములతో.....
  శ్రీ శంకరయ్య గురుదేవులకు ధన్యవాదములతో...

  ముందుగా గురుదేవులకు,కవి మిత్రులకు మరియు బ్లాగు వీక్షకులకు నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు.

  ప్రజల మధ్య చిచ్చు బెట్టి ,ప్రజలకు నాయకులు జెప్పు "నూతన సంవత్సర శుభాకాంక్షలు." విని రోదింత్రు నూత్నసంవత్సరమున

  ఉదాహరణ :ప్రస్తుత కేంద్ర మంత్రి జార్ఖండ్ విడదీసి వాజ్ పేయ్ తప్పు జేసినారు,మరి యిప్పుడు ఈ ముండా కొడుకు ఏమి జేయుచున్నాడు ?
  ==============*==============
  నీతి జాతి లేక దిరుగు నేతలెల్ల
  నెమ్మనమున నున్న మదిని నెరలు బెట్టి
  నెరల మధ్య నిలిచి యుండి ఖరము వలెను
  బలుక శుభ వచనమ్ములు వారిని గని
  ప్రజలు రోదింత్రు నూత్నసంవత్సరమున !

  రిప్లయితొలగించండి
 9. శ్రీ సహదేవుడు గారికి మరియు శ్రీ వసంత కిషోర్ గారికి ధన్యవాదములతో...

  నిజమండి పిల్లలు తప్పు జేసిన యడల పెద్దలను దండించిన 75% తప్పులు జరుగవు.

  నా అనుభవము తో జెప్పుచున్నాను, ఒకండు మెటార్ సైకెల్ సైలెన్సర్ పికి పెద్ద శబ్దము జేయుచు దిరుగుచు నుండ నేను గమనించినది ప్రక్కన నడచు బాట సారులు బలికినది "వీడి అమ్మా బాబులను తన్నిన వీడికి బుద్ది వచ్చు " " కని గాడిదల వలె ఊరిపై విడచి నారని " గాన మొదటి ముద్దాయిలు తల్లి దండ్రులే.

  మరొకటి : అగ్రకులపు అమ్మాయి ఒక మెకానిక్ తో తిరుగుచున్నది. ఆ విషయము తల్లి దండ్రులకు రెండు సంవత్సరముల తరువాత దెలిసినది. కట్టడి జేయ ఇల్లు పీకి పందిరి వేయచున్నది. అప్పుడు పంచాయితి పెద్దను నేను. తల్లి దండ్రులకు తీరిక లేదు నా విషయములు (బాధలు ) పట్టించు కొనుటకు గాన ప్రేమతో పలుకరించు వారి కొరకు వెదుకగా మెకానిక్ దొరికాడు, అతడు మంచి వాడు ఇది ఆ అమ్మాయి సమాదానము.

  నేను తండ్రికిచ్చిన సలహా అతని కంటే ఎక్కువ ప్రేమ మీరు జూపిన యడల మీ అమ్మాయి మీ వైపుకు వచ్చును లేకున్న మరిచిపోవుట మంచిదని. తరువాత ఏమి జరిగినదొ తెలియదు 4 సంవత్సరములకు ఆ అమ్మాయి పైనలియర్ చదువు చున్నది. నన్ను జూచిన ఆ ఆమ్మాయి పలుకరించదు, నేను కూడా పలుకరించను.

  రిప్లయితొలగించండి
 10. వంశీ పరుచూరి గారూ,
  వసంత కిశోర్ గారూ,
  పండిత నేమాని వారూ,
  గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
  గండూరి లక్ష్మినారాయణ గారూ,
  వరప్రసాద్ గారూ,
  ధన్యవాదాలు. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు!

  రిప్లయితొలగించండి
 11. ఈ ప్రజా స్వామ్య ప్రతినిధు లెంత కాల
  మాచరింతురో దుర్నీతి యంత వరకు
  ప్రజలు రోదింత్రు, నూత్న వత్సరమున
  మార్పు జరుగునా? నేతలు మారగలర !

  రిప్లయితొలగించండి
 12. గురుదేవులకు, బ్లాగు కవిమిత్రులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు.
  నూతన వత్సర మియ్యిది
  యాతనల ముగింపు పాడి యైశ్వరమిడున్
  చైతన్య స్రవంతి! సుధా
  గీతిక వలె రాగ భావ కీర్తుల నొసగున్

  రిప్లయితొలగించండి

 13. అందరికీ నూతనాంగ్ల సంవత్సర శుభాకాంక్షలు.

  భారతావనిలోన భాగ్యరేఖలు పండి
  ..........ప్రజలెల్ల సుఖములన్ బడయవలయు,
  సోదరత్వపుగంధ మీ దివ్యభువిలోన
  ..........వ్యాప్తమై హర్షంబు లందవలయు,
  ధర్మమార్గమునందు ధరవారలెల్లరు
  ..........చరియించి సుఖముల నరయవలయు,
  సంకల్పశుద్ధితో జనసమూహములన్ని
  ..........సత్కార్యమగ్నులై సాగవలయు,
  ఇనుమడించు యశము లీవత్సరంబంత
  ప్రజల కందవలయు బహుళగతుల,
  నఖిలభారతాన నారోగ్యభాగ్యంబు
  లందుచుండవలయు ననవరతము.

  విద్యార్థిలోకాన వినయదీప్తులు కల్గి
  ..........విజ్ఞానపవనాలు వీచవలయు,
  ఛాత్రు లీధరలోన శ్రద్ధపూనుచునుండి
  ..........నవ్యమార్గంబూని నడువవలయు,
  నిత్యంబులైనట్టి నికషలన్నింటిలో
  ..........ఘనమైన విజయాలు కలుగవలయు,
  విద్యార్జనంబందు విజ్ఞతన్ జూపించి
  ..........యన్నింట మెప్పుల నందవలయు,
  ఇట్టు లెల్లగతుల నీవత్సరంబంత
  విద్యనేర్చువారి యుద్యమమున
  సానుకూలమౌచు సంతసంబందించు
  చుండుగాత, భారతోర్విలోన.

  పాలకాగ్రణులందు మేలైన భావాల
  ..........జన్మంబు లీనేల జరుగవలయు,
  భరతభూభాగాన పరమతసహనంబు
  ..........నిరతసౌఖ్యదమౌచు పెరుగవలయు,
  బహుకష్టములనుండు భాగ్యహీనుల జూచి
  ..........కఠినుల హృదయాలు కరుగవలయు,
  సస్యవర్ధకమైన సద్వృష్టి కలుగంగ
  ..........ధరలవృద్ధి యొకింత తరుగవలయు,
  రమ్య మైనట్టి యీవత్సరంబునందు
  దేవుడిలలోన దయతోడ తిరుగవలయు,
  స్వార్థభావైకకారణ జన్యమైన
  నరుల మనముల కుటిలంబు విరుగవలయు.

  రిప్లయితొలగించండి
 14. శ్రీ శంకరయ్య గారికి నమస్సులు
  అందరికీ ఆంగ్ల నూతన వత్సర శుభాకాంక్షలు

  శ్రీయున్ సౌఖ్యము శాంతి సంపద యశశ్రీ వైభవోపేతమై
  పీయూషంబు సృజించి మానవులలో పెంపారు సౌశీల్యతన్
  శ్రేయోభావము పెంచి విశ్వజన సంక్షేమమ్ము వర్ధిల్లగా
  జేయున్ గావుత నూత్న వత్సరము రంజిల్లంగ నల్దిక్కులన్

  నా పూరణ
  అటు తెలంగాణ వాదుల యాశ దీర్చ
  కిటు సమైక్యాంధ్ర వాదుల యీప్సితమ్ము
  దీర్చకనె జనె '' పదమూ " డదేమి యనుచు
  ప్రజలు రోదింత్రు నూత్నసంవత్సరమున

  మరొక పూరణ

  కప్పగంతులిడి జనుల కడలిముంచి
  తమదు పదవుల గాపాడు దశకుజేరి
  దేశ భక్తులు భోక్తలై తిరుగ జూచి
  ప్రజలు రోదింత్రు నూత్నసంవత్సరమున

  రిప్లయితొలగించండి
 15. ముక్క లగు నెడ రాష్ట్రము ముదిత లార !
  ప్రజలు రోదింత్రు , నూత్న సంవత్సరమున
  నొ కరికి నొకరు మోదాన నొడలు మఱచి
  చెప్పు కొందురు గ మఱి యా శీ స్సు లిలను

  రిప్లయితొలగించండి
 16. నూతన ఆంగ్ల సంవత్సర శుభా కాంక్షలు

  ఇరువది, యొకటి యు, నాలుగు
  నరయంగా మంచి సంఖ్య యన్నిటి కంటెన్
  తిరముగ వత్సర మంతయు
  సిరి రాసుల నిచ్చి మనకు శ్రీ పతి జేయున్

  రిప్లయితొలగించండి
 17. వసంత కిశోర్ గారూ,
  మీ మొదటి పూరణ బాగుంది. రెండవ దానిని పూరణగా స్వీకరించడం లేదు. చక్కని ఖండకృతి. అద్భుతంగా వ్రాశారు. అభినందనలు.
  మొదటి పూరణలో ‘వస్తువుల్ యూరువాడ’ అన్నదానిని ‘వస్తువు లూరువాడ’ అనండి.
  *
  వరప్రసాద్ గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.
  *
  గండూరి లక్ష్మినారాయణ గారూ,
  విరుపుతో మంచి పూరణ చెప్పారు. అభినందనలు.
  *
  భాగవతుల కృష్ణారావు గారూ,
  మీ రెండు పూరణలూ బాగున్నవి. అభినందనలు.
  *
  సుబ్బారావు గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 18. మూడు పంటలు కేదారముల జెలంగు
  శాంతి సౌభాగ్యములు వికాసమ్మునొందు
  వ్యాధులెల్ల నశించు స్వాస్థ్యంబు దనరు
  ప్రజలు సుఖమొందెదరు నూత్న వత్సరమున

  రిప్లయితొలగించండి
 19. నేటి స్థితిని కనుగొని, నాటి ప్రాభ
  వమ్ము సుంతయు గనలేక, నమ్మ లేక,
  ఆంధ్రి కిట్టి యవస్థ అయ్యనెటులొయని
  ప్రజలు రోదింత్రు నూత్నసంవత్సరమున.

  రిప్లయితొలగించండి
 20. నీతి తప్పినా , మాటలు నీటి మూట
  లైన, కష్టాలు పెరిగినా ,పైన పిడుగు
  పడిన భరియింత్రు ,దొంగలే ప్రభువులైన
  ప్రజలు రోదింత్రు నూత్నసంవత్సరమున!!!

  రిప్లయితొలగించండి
 21. నిర్వివాదంపు రీతిగ నేర్పు తోడ
  రాష్ట్ర విభజన జరుగని రచన జేయ
  వనరుల కొరత పీడించ వగచి సర్వ
  ప్రజలు రోదింత్రు నూతన వత్సరమున

  రిప్లయితొలగించండి
 22. రామకృష్ణ గారూ,
  బాగుంది మీ పూరణ. అభినందనలు.
  మొదటి పాదంలో గణదోషం. అక్కడ ‘నేటి స్థితిని కనుంగొని...’ అంటే సరి. ‘కాగా’ అనే అర్థంలో ‘అయ్యన్’ అన్నారు. ఇది చింత్యము.
  *
  మంద పీతాంబర్ గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.
  ‘తప్పినా, పెరిగినా’ అని వ్యావహారికాలను వాడాలు. ‘తప్పినన్, పెరిగినన్’ అంటే సరి!
  *
  సహదేవుడు గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 23. బ్లాగు కవి మిత్రులందరికీ ఆంగ్ల నూతన సంవత్సర శుభా కాంక్షలు
  శ్రేయోదాయక విభవ
  శ్రీయుతమై విశ్వ జనులు ప్రీతిని జెందన్
  బాయక ధర్మ పథమున స
  హాయపడగ హితవు నూత్న హాయన మొసగెన్

  ధనిక వర్గమ్ము సిరులతో దనరు చుండ
  పేదలందరు మరి కొంత పేదలవగ
  నేటి పాలనా విధముకు గాటు దిన్న
  ప్రజలు రోదింత్రు నూతన వత్సరమున

  రిప్లయితొలగించండి
 24. గురదేవులు శ్రీ కంది శంకరయ్య గారికి, పండిత నేమాని గారికి నమోవాకములు.
  గురుదేవులకు,కవి మిత్రులకు మరియు బ్లాగు వీక్షకులకు నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు.

  రిప్లయితొలగించండి
 25. గురుదేవులు శ్రీ కంది శంకరయ్య గారికి, పండిత నేమాని గారికి నమోవాకములు.
  గురుదేవులకు,కవి మిత్రులకు మరియు బ్లాగు వీక్షకులకు నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు.

  రిప్లయితొలగించండి
 26. ధాన్య రాశులు పండించు ధాత్రిమనది
  తిండి గింజలు దొరకని దేశమాయె
  జాతి సంక్షేమ పథకాలు పాతరేసి
  నీతి దప్పుచు పాలించు నేతలున్న
  ప్రజలు రోదింత్రు నూతన సంవత్సరమున

  రిప్లయితొలగించండి
 27. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  ‘విధముకు’ను ‘విధమునకు’ అనవలసి ఉన్నది. అక్కడ ‘విధమునఁ గాటుదిన్న..’ అనండి.
  *
  బొడ్డు శంకరయ్య గారూ,
  బాగున్నది మీ పూరణ. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 28. ప్రీతిగ స్వాగత మిడెదము
  జాతికి మేల్గూర్చు క్రొత్త సాలుకు నేడే
  ఖ్యాతిని గలిగించు మనకు
  నూతన సంవత్సరంబు న్యూనత మాన్పున్.

  రిప్లయితొలగించండి
 29. శ్రీ శంకరయ్య గురుదేవులకు ధన్యవాదములతో...
  ============*===============
  నూతన వత్సరమా! యీ
  భూతల మందున జనులకు పొంకమలరగన్
  ఖ్యాతి నిడి,మము గురు వర్యుల
  ప్రీతికి దాసులను జేసి పేరిమి నిమ్మా!

  రిప్లయితొలగించండి
 30. ధరను నేరాలు ఘోరాలు ధరలు పెరుగు
  నేడుకేడును చూడగా నేడుపేను
  చూడనింకేమి పెరుగునో పీడలనుచు
  ప్రజలు రోదింత్రు నూత్నసంవత్సరమున.

  రిప్లయితొలగించండి
 31. వరప్రసాద్ గారూ !
  మీరు చెప్పేది
  ఎలుకలను తోలడానికి - యింటికి నిప్పెట్టుకున్నట్టుంది !

  రిప్లయితొలగించండి
 32. శ్రీ శంకరయ్య గురుదేవులకు, శ్రీ నేమాని గురుదేవులకు ,కవి మిత్రులకు మరియు బ్లాగు వీక్షకులకు నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు.

  పెరుగుచున్నట్టి సరుకుల ధరల జూసి
  ప్రజలు రోదింత్రు,నూత్న సంవత్సరమున
  ఢిల్లి పాలకులొకవేళ ఉల్లి ధరను
  దించి ప్రకటించ ప్రజలెల్ల ధీమ నొందు

  రిప్లయితొలగించండి
 33. గురువు గారు..,
  ధన్యవాదములు.
  సవరించుచున్నాను.

  నేటి స్థితిని కనుంగొని, నాటి ప్రాభ
  వమ్ము సుంతయు గనలేక, నమ్మ లేక,
  ఆంధ్రి కిట్టి యవస్థ యా? యనుచు సీమ
  ప్రజలు రోదింత్రు నూత్నసంవత్సరమున.

  రిప్లయితొలగించండి