30, ఏప్రిల్ 2017, ఆదివారం

సమస్య - 2350 (గయ్యాళినిఁ బెండ్లియాడ...)

కవిమిత్రులారా! 
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
"గయ్యాళినిఁ బెండ్లియాడఁగా సుఖ మబ్బున్"
(లేదా...)
"గయ్యాళిన్ దగఁ బెండ్లియాడి నపుడే కల్గున్ గదా సౌఖ్యముల్"

29, ఏప్రిల్ 2017, శనివారం

న్యస్తాక్షరి - 40 (శ-కుం-త-ల)

అంశము- శకుంతలా దుష్యంతుల ప్రణయము
ఛందస్సు- తేటగీతి
మొదటి పాదం రెండవ గణం ప్రథమాక్షరం 'శ'
రెండవ పాదం మూడవ గణం ప్రథమాక్షరం 'కుం'
మూడవ పాదం నాల్గవ గణం ప్రథమాక్షరం 'త'
నాల్గవ పాదం ఐదవ గణం ప్రథమాక్షరం 'ల' ....ఉండాలి!

28, ఏప్రిల్ 2017, శుక్రవారం

సమస్య - 2349 (వడగాలుల చల్లదనము...)

కవిమిత్రులారా! 
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
"వడగాలుల చల్లదనము వర్ణింతు నెటుల్"
(లేదా...)
"వడగాలుల్ వడి వీఁచుచుండఁగ నెటుల్ వర్ణింతుఁ దచ్చీతమున్"

27, ఏప్రిల్ 2017, గురువారం

నిషిద్ధాక్షరి - 35

కవిమిత్రులారా,
అంశం - కర్ణుఁడు
నిషిద్ధాక్షరములు - క వర్ణము, దాని గుణింతములు, క వర్ణముతో కూడిన సంయుక్తాక్షరములు.
ఛందస్సు - మీ ఇష్టము.

26, ఏప్రిల్ 2017, బుధవారం

సమస్య - 2348 (అన్నమె లేని నరుఁడు...)

కవిమిత్రులారా! 
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
"అన్నమె లేని నరుఁడు పరమాన్నముఁ బంచెన్"
(లేదా...)
"అన్నమె లేని పేద పరమాన్నముఁ బంచెను గ్రామమంతటన్"

25, ఏప్రిల్ 2017, మంగళవారం

సమస్య - 2347 (కోరి దాగెను విష్ణువు...)

కవిమిత్రులారా! 
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
"కోరి దాగెను విష్ణువు కోటరమున"
(లేదా...) 
"కోరి జనార్దనుం డపుడు కోటరమందున దాగె భీతుఁడై"

24, ఏప్రిల్ 2017, సోమవారం

సమస్య - 2346 (నల్లని మల్లియలతో...)

కవిమిత్రులారా! 
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
"నల్లని మల్లియలతో ఘనంబుగఁ గొల్తున్"
(లేదా...)
"నల్లని మల్లెలన్ గొని ఘనంబుగఁ బూజ నొనర్తు భక్తితోన్"
ఈ సమస్యను పంపిన కవిమిత్రునకు ధన్యవాదాలు.

23, ఏప్రిల్ 2017, ఆదివారం

సమస్య - 2345 (మగనికి బిడ్డ కలిగెనని...)

కవిమిత్రులారా! 
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
"మగనికి బిడ్డ కలిగెనని మానిని మురిసెన్"
లేదా...
"మగనికి బిడ్డపుట్టెనని మానిని పల్కె జనాళి మెచ్చగా"
ఈ సమస్యను పంపిన బొగ్గరం ప్రసాద రావు గారికి ధన్యవాదాలు.

22, ఏప్రిల్ 2017, శనివారం

శుభవార్త!

రాజేశ్వరక్కయ్యకు శస్త్ర చికిత్స సత్ఫలప్రదమయింది.

  జైశ్రీరామ్.
శ్రీమతి నేదునూరి రాజేశ్వరక్కయ్య.
ఆర్యులారా! మన నేదునూరి రాజేశ్వరక్కయ్యకు శస్త్ర చికిత్స  ఫలప్రదమయింది. 
శస్త్ర చికిత్సాలయము నుండి ఇంటికి పంపించినారట. 
ప్రస్తుతం కులాసాగా  ఉన్నారని తెలిసింది. 
అతి త్వరలో మన బ్లాగులను చదువుతూ వారి అమూల్యమైన అభిప్రాయాలతోపాటు 
సూచనలను కూడా ఇవ్వగలరు.
అక్కయ్య ఆరోగ్యం కుదుట పడాలని, వేగంగా క్రోలుకోవాలని 
సహృదయులయిన మీరంతా ఆకాంక్షించారు. 
మీ ఆకాంక్షల సత్ ఫలమే అక్కయ్య పునరారోగ్యవంతులవటం.
మీ అందరికి పేరు పేరునా ధన్యవాదాలు తెలుపుకొంటున్నాను.
అక్కయ్యకు పరిపూర్ణ ఆరోగ్యంతో 
నిండు నూరేళ్ళ జీవితాన్ని ప్రసాదించాలని మనసారా కోరుకొంటూ 
ఆంధ్రామృతం పాఠకుల తరపున అక్కయ్యకు అభినందనలు తెలియఁ జేస్తున్నాను.
 జైహింద్.
('ఆంధ్రామృతం' బ్లాగునుండి... శ్రీ చింతా రామకృష్ణారావు గారికి ధన్యవాదాలతో...)

సమస్య - 2344 (వానలే లేక...)

కవిమిత్రులారా! 
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
"వానలే లేక సస్యముల్ పండె మెండు"
(లేదా...)
"వానలు లేక యీ పుడమి వర్ధిలె పంటలు పండ మెండుగన్" 

21, ఏప్రిల్ 2017, శుక్రవారం

సమస్య - 2343 (పాము కనుపించ...)

కవిమిత్రులారా! 
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
" పాము కనుపించ గరుడుండు భయము నొందె"
లేదా...
"గరుడుఁడు భీతినొందె నురగమ్మును గాంచిన తత్క్షణంబునన్"
ఈ సమస్యను పంపిన పూసపాటి నాగమణి గారికి ధన్యవాదాలు.

20, ఏప్రిల్ 2017, గురువారం

చమత్కార పద్యం - 251

సీతా రావణ సంవాద ఝరి
 3 (-క +న)
ఈ శ్లోకంలో ‘క’ ను తీసి వేసి ఆ స్థానంలో ‘న’ ఉంచాలి

సీతే! శ్రీశ్చ వికాశితా ఖలు వధూ కామప్రియాంగస్య మే
దారిద్ర్యం పురి క ర్తితం గుణ గణైః కాలోచితప్రస్థితేః,
హా మాయాకర కామితాన్య లలనాలగ్నాంత రంగః ప్రియః
పాపాత్మన్! కలయే నసంగత మిదం సర్వం త్వదుక్తం వచః।।
ఉన్నది ఉన్నట్లుగా.....
రావణోక్తి:
సీతే = ఓ సీతా
వధూ కామ ప్రియాంగస్య = స్త్రీలకు మన్మథుని వలె సుందరుడనైన
మే = నాకు
శ్రీః = సంపద
వికాశితా = విప్పారినది
కాలోచిత ప్రస్థితేః = కాలాను గుణ్య ప్రయాణ సన్నాహము గల
మే = నా యొక్క
గుణగణైః = గుణ సమూహములతో
పురి = పట్టణమందు
దారిద్ర్యం కర్తితం = దరిద్రము నరికి వేయబడినది...అని రావణ కృత స్వస్తుతి!
అట్లే
ప్రియః = నీ ప్రియుడు
మాయాకర కామితాన్య లలనాలగ్నాంత రంగః = మాయావి పరకాంతలందు మనసు నిలుపు వాడు.... అని రామనింద
సీతా ప్రత్యుక్తి...
సర్వం త్వదుక్తం వచః = నీ పలుకంతయు
సంగతం నకలయే = సరియైనదిగా తలచను... అని సమాన్యార్థం
కలయే = క కారము లోపింపగా
నసంగతం = న కారముతో కూడినది అని సంకేతార్థము
క తీసి వేసి న ప్రతిక్షేపించగా
వధూనామ ప్రియాంగస్య = స్త్రీల కప్రియమగు శరీరము గల
మే = నా యొక్క
శ్రీః = సంపద
వినాశితా = నశింపజేయ బడినది!
నాలోచిత ప్రస్థితే = అనాలోచితముగా ప్రయాణము చేయు
మే = నా యొక్క
పురి = పట్టణమందు
దారిద్ర్యం నర్తితం = దరిద్రము నర్తించును
అని రావణ నిందగా మారింది
అట్లే
మాయానర నామితాన్య లలనాంత రంగః = లీలా మానుష విగ్రహుడు,పర స్త్రీలందు మనసు చేర్చని వాడు
ప్రియః = ప్రేమ పాత్రుడు... అని రామ స్తుతిగా పరిణమించింది.

(‘బంధకవిత్వం’ వాట్సప్ సమూహం నుండి శ్రీ వైద్యం వేంకటేశ్వరాచార్యులకు ధన్యవాదాలతో...)

సమస్య - 2342 (రామరాజ్యమ్మునన్...)

కవిమిత్రులారా! 
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
"రామరాజ్యమ్మునన్ గనరాదు నీతి"
(లేదా...)
"రాముని రాజ్యమందుఁ గనరావు గదా శ్రుతి ధర్మపద్ధతుల్"

19, ఏప్రిల్ 2017, బుధవారం

చమత్కార పద్యం - 250

సీతా రావణ సంవాద ఝరి
 2 (-వ)
భూజాతే! నవభూషణో భవవరోపేత స్సదా వర్జితా
కీర్త్యౌఘోఽహ మివాస్తి కః కృతపరావజ్ఞశ్చ లోకే నరః
ప్రాణానాం దయితం వనైక నిలయం సీతే, కుతో మన్యసే
వ్యాహారస్తవ నీచవారహిత ఇత్యేవావగచ్ఛామి రే!

గమనిక : ఈశ్లోకంలో 'వ'కారము చ్యావిత మగును
రావణోక్తి:
ఆత్మస్తుతి:
నవ భూషణః = నూతనాలంకారములు గలవాడను
భవవరోపేతః = ఈశ్వర వరములు కలిగిన వాడను
సదా వర్జితా కీర్త్యౌఘ = ఎప్పుడు అపకీర్తిచేరనీయని వాడను
కృత పరావజ్ఞః = శత్రువులకు అవమానము ఘటించు వాడను
అని రావణుని ఆత్మస్తుతి
3వపాదంలో
వనైక నిలయం = వనములోనే వుండు వాడు అని రామనింద!
సీతా ప్రత్యుక్తి:
రే నీచ = ఓ నీచుడా!
తవ వ్యాహారః = నీ పలుకు
నీచవార హితః = నీచులకు మాత్రమే హితమైనది .  . అని సామాన్యార్థం కలిగి
వా రహితః = 'వ'కారము లేనిది అని సంకేతం
వ కారం తీసేస్తే రావణుడి సంగతి చూడండి
న భూషణః = ఆభరణములు లేని వాడను
భరోపేతః = భూమికి భారమైన వాడను
సదార్జితా కీర్త్యౌఘః = ఎప్పుడూ చెడు కీర్తి సంపాదించుకొను వాడను . అని రావణుని ఆత్మనిందగా మారుతుంది
కృత పరాజ్ఞః = శత్రువుల ఆజ్ఞలను నెరవేర్చు వాడను
అనికూడా!
3వపాదంలో వ తీస్తే
నైక నిలయం = ఒక చోట కాక సర్వవ్యాపకుడు అని రామ స్తుతిగా పరిణమించింది!

(‘బంధకవిత్వం’ వాట్సప్ సమూహం నుండి శ్రీ వైద్యం వేంకటేశ్వరాచార్యులకు, శ్రీ కె. శేషఫణి శర్మ గారలకు ధన్యవాదాలతో...)

సమస్య - 2341 (కారమె వారలకు...)

కవిమిత్రులారా! 
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
"కారమె వారలకు పెండ్లి కారణమయ్యెన్"
(లేదా...)
"కారమె వారి పెండ్లి కొక కారణ మయ్యెను వింటివే చెలీ"
(ఆకాశవాణి వారి సమస్య... బొగ్గరం ప్రసాద రావు గారికి ధన్యవాదాలతో...)

18, ఏప్రిల్ 2017, మంగళవారం

చమత్కార పద్యం - 249

సీతా రావణ సంవాదఝరి!
ఒక అద్భుత సంస్కృత కావ్యం
అశోక వృక్షం క్రింద వున్న సీత దగ్గరకు వచ్చిన రావణుడు రాముని నిందించడం ఆత్మస్తుతి చేసుకోవడం మొదటి మూడు పాదాల్లో వుంటుంది!
సీతఒరే మూర్ఖుడా! నీమాటలలో ఫలానా అక్షరాన్ని తీసేయ్!” అంటుంది. అంతే మొత్తం అర్థం మారిపోతుంది! రామనింద రామస్తుతిగా మారుతుంది! రావణుని ఆత్మస్తుతి స్వనిందగా మారుతుంది!
అద్భుతమైన 50 శ్లోకాలను వ్రాసిన వారు కర్నూలు జిల్లా ఔకు గ్రామవాసి కీ.శే. బచ్చు సుబ్బరాయగుప్త!
ఆంధ్ర టీకా తాత్పర్యం వ్రాసిన వారు కర్నూలు వాసి అష్టావధాని కీ.శే. పుల్లాపంతుల వేంకట రామ శర్మ!
వాటిని అలాగే పెట్టడానికి ప్రయత్నిస్తా!
(పై వాక్యాలన్నీ శ్రీ కె. శేషఫణి శర్మ గారివి)
 1  (_)
భూజాతేఽ లసమాన విగ్రహయుతః సీతేహ్యలర్కోపమః
భర్తా తే వికలస్వర స్వవదనో యుద్ధే చలశ్రీవృతః।
నిష్ణాతో లలనానురూప తను సంయుక్తో స్మ్యహం పాలనే
వాక్తే పాప! సదావిలేతి సుజనాః కే బ్రువంతి క్షితౌ!
 ........ఉన్నది ఉన్నట్టుగా చూస్తే
రావణోక్తి: రామనింద
అలసమాన విగ్రహయుతః = ప్రకాశించని విగ్రహము కలవాడు
అలర్కోపమః = పిచ్చి కుక్కతో సమానుడు
వికలస్వర స్వవదనః = నోరెత్తి మాటలాడలేనివాడు
చల శ్రీవృతః = సంపద తొలగినవాడు
రావణ ఆత్మస్తుతి:
పాలనే నిష్ణాతః = పాలనా దక్షుడను
లలనానురూప సంయుక్తః = స్త్రీలకు మనోహర సౌందర్యము కలవాడను
సీత ప్రత్యుక్తి.....
అవిలా = ఎప్పుడునూ కలుషమైనది (రావణునిమాట) అని సామాన్యార్థం
విశేషార్థం....
అవిలా = లకార రహితమైనది
 ....ఇప్పుడు అన్నింటా లకారాన్ని తీసివేసి చూద్దాం...
అసమాన విగ్రహయుతః = సాటి లేని శరీరము కలవాడు
అర్కోపమః = సూర్య సమానుడు
వికస్వర స్వవదనః = ప్రకాశించు కంఠధ్వని కలవాడు
శ్రీవృతశ్చ = సంపద్యుక్తుడు
అని రామస్తుతిగా మారింది
ఇక తీసేస్తే రావణుడేమైనడో చూడండి
నానురూప తను సంయుక్తః = అనర్హ శరీర యుతుడను
పానే నిష్ణాతః = మద్య పాన నిరతుడను
అని రావణ ఆత్మస్తుతి ఆత్మనిందగా మారింది
ఇంతటి అద్భుతాలు చేసిన కవులున్నారు! అటువంటి వారికి శిరసా నమామి!

(‘బంధకవిత్వం’ వాట్సప్ సమూహం నుండి శ్రీ వైద్యం వేంకటేశ్వరాచార్యులకు ధన్యవాదాలతో...)

దత్తపది - 110 (చారు-సాంబారు-రసము-పులుసు)

చారు - సాంబారు - రసము - పులుసు
పై పదాలను అన్యార్థంలో ఉపయోగిస్తూ
మహాభారతార్థంలో
నచ్చిన ఛందస్సులో పద్యాన్ని వ్రాయండి.

17, ఏప్రిల్ 2017, సోమవారం

సమస్య - 2340 (పగలె శోభించెఁ జంద్రుఁడు...)

కవిమిత్రులారా! 
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
"పగలె శోభించెఁ జంద్రుఁ డంబరముపైన"
(లేదా...)
"పగలె శశాంకుఁ డంబరముపై విలసిల్లెను సత్కవీశ్వరా"
(ఆకాశవాణి వారి సమస్య... బొగ్గరం ప్రసాద రావు గారికి ధన్యవాదాలతో...)

16, ఏప్రిల్ 2017, ఆదివారం

సమస్య - 2339 (దారమే లేని హారము...)

కవిమిత్రులారా! 
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
"దారమే లేని హారము తరుణి దాల్చె"
(లేదా...)
"దారము లేని హారము నితంబిని దాల్చెను సంతసంబునన్"
(ఆకాశవాణి వారి సమస్య... బొగ్గరం ఉమాకాన్త ప్రసాద్ గారికి ధన్యవాదాలతో...)

15, ఏప్రిల్ 2017, శనివారం

సమస్య - 2338 (భీతిల్లిన వారలు...)

కవిమిత్రులారా! 
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
"భీతిల్లిన వారలు రణవీరులు ధీరుల్"
(లేదా...)
"భీతినిగొన్న వార లరివీర భయంకరు లాజివిక్రముల్"
(ఆకాశవాణి వారి సమస్య... బొగ్గరం ఉమాకాన్త ప్రసాద్ గారికి ధన్యవాదాలతో...)

14, ఏప్రిల్ 2017, శుక్రవారం

సమస్య - 2337 (భుక్తియె లేనట్టి...)

కవిమిత్రులారా! 
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
"భుక్తియె లేనట్టి  పరమభోగి యతండే"
(లేదా...)
"భుక్తిహుళక్కియౌ పరమభోగి యతండు ధరాతలంబునన్"
(ఆకాశవాణి వారి సమస్య... బొగ్గరం ఉమాకాన్త ప్రసాద్ గారికి ధన్యవాదాలతో...)

13, ఏప్రిల్ 2017, గురువారం

దత్తపది - 109 (తల)

నాలుగు పాదాల ప్రారంభంలో 'తల'ను అన్యార్థంలో ప్రయోగిస్తూ
ఇష్టదైవాన్ని స్తుతిస్తూ
నచ్చిన ఛందస్సులో పద్యాన్ని వ్రాయండి.

12, ఏప్రిల్ 2017, బుధవారం

సమస్య - 2336 (శ్రీనాథుని కృతిగ...)

కవిమిత్రులారా! 
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
"శ్రీనాథుని కృతిగ మనుచరిత్రయె యొప్పున్"
(లేదా...)
"శ్రీనాథుండు రచించి మించె మనుచారిత్రమ్మునున్ బ్రీతితో"
(కవిమిత్రులకు మనవి... ఈరోజు మా బావమరది దశదిన కర్మకాండకు వెళ్తున్నాను. రోజంతా వ్యాస్తుడనై ఉంటాను. కనుక దయచేసి పరస్పర గుణదోష విచారణ చేసికొన వలసిందిగా మనవి.)

11, ఏప్రిల్ 2017, మంగళవారం

సమస్య - 2335 (బాణఘాతముల్ సుఖమిచ్చు...)

కవిమిత్రులారా! 
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
"బాణఘాతముల్ సుఖమిచ్చు పడుచులకును"
లేదా...
"బాణపు దెబ్బలే పడుచు వారికి సౌఖ్యము నిచ్చు నెప్పుడున్"
(ణ-న ప్రాస నిషిద్ధము)

10, ఏప్రిల్ 2017, సోమవారం

సమస్య - 2334 (శకునికిఁ దమ్ముండు...)

కవిమిత్రులారా! 
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
"శకునికిఁ దమ్ముండు కృపుఁడు సాత్యకి సుతుఁడున్"
(లేదా...)
"శకునికిఁ దమ్ముఁడౌఁ గృపుఁడు సాత్యకి పుత్రుఁడు ద్రోణుఁ డన్నయున్"

9, ఏప్రిల్ 2017, ఆదివారం

సమస్య - 2333 (ధర్మబద్ధము లఁట...)

కవిమిత్రులారా! 
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
"ధర్మబద్ధము లఁట తప్పు లెల్ల"
(లేదా...)
"తప్పక సేయునట్టివగు తప్పు లగున్ గన ధర్మబద్ధముల్"
ఈ సమస్యను పంపిన కందుల వరప్రసాద్ గారికి ధన్యవాదాలు.

8, ఏప్రిల్ 2017, శనివారం

సమస్య - 2332 (గొడుగును మధ్యాహ్నవేళ...)

కవిమిత్రులారా! 
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
"గొడుగును మధ్యాహ్నవేళఁ గోరుట తగునే"
(లేదా...)
"గొడుగును పాదరక్షలను గోరుట యొప్పునె మండుటెండలో"
ఈ సమస్యను సూచించిన మిట్టపెల్లి సాంబయ్య గారికి ధన్యవాదాలు.

7, ఏప్రిల్ 2017, శుక్రవారం

సమస్య - 2331 (వీచె మందమారుతము....)

కవిమిత్రులారా! 
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
"వీచె మందమారుతము క్ష్మాభృత్తు వీఁగె"
(లేదా)
"వీచిన మందవాతమున వీఁగెను శైలము దూది భంగినిన్"
ఈ సమస్యను సూచించిన పోచిరాజు కామేశ్వర రావు గారికి ధన్యవాదాలు.

6, ఏప్రిల్ 2017, గురువారం

సమస్య - 2330 (జనకుండని పెండ్లియాడె...)

కవిమిత్రులారా! 
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
"జనకుండని పెండ్లియాడె జానకి రామున్"
(లేదా)
"జనకు డటంచు మోదమున జానకి పెండిలి యాడె రామువిన్"
ఈ సమస్యను పంపిన వీటూరి భాస్కరమ్మ గారికి ధన్యవాదాలు.

5, ఏప్రిల్ 2017, బుధవారం

సమస్య - 2329 (రామునకు సహోదరి...)

కవిమిత్రులారా! 

ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
"రామునకు సహోదరి గదా రమణి సీత"
లేదా...
"రామునకున్ సహోదరి ధరాసుత సీత గదా తలంపగన్"

4, ఏప్రిల్ 2017, మంగళవారం

సమస్య - 2328 (నీచదశ నంది సజ్జనుల్...)

కవిమిత్రులారా! 
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
"నీచదశ నంది సజ్జనుల్ నీల్గుచుంద్రు"
లేదా...
"నీచదశస్థులై సతము నీల్గుచునుందురు సజ్జనుల్ భువిన్"

3, ఏప్రిల్ 2017, సోమవారం

సమస్య - 2327 (తల్లిఁ బెండ్లాడి...)

కవిమిత్రులారా! 
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది.... 
"తల్లిఁ బెండ్లాడి రాముఁ డుదాత్తుఁ డయ్యె"
లేదా...
"తల్లికి తాళి గట్టిన యుదాత్త చరిత్రుని రాము గొల్చెదన్"

2, ఏప్రిల్ 2017, ఆదివారం

సమస్య - 2326 (పార్థుఁ డర్జునునకు...)

కవిమిత్రులారా! 
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది.... 
"పార్థుఁ డర్జునునకు బావమమఱఁది"
లేదా... 
"పార్థుఁ డనంగ నర్జునుని బావమఱంది సుమీ తలంపఁగన్"

1, ఏప్రిల్ 2017, శనివారం

సమస్య - 2325 (నారద మునిసత్తమునకు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
"నారద మునిసత్తమునకు నలువురు భార్యల్"
లేదా...
"నారద మౌనిముఖ్యునకు నల్వురు భార్య లతిప్రసన్నులున్"
ఈ సమస్యను పంపిన మిట్టపెల్లి సాంబయ్య గారికి ధన్యవాదాలు.