26, ఏప్రిల్ 2017, బుధవారం

సమస్య - 2348 (అన్నమె లేని నరుఁడు...)

కవిమిత్రులారా! 
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
"అన్నమె లేని నరుఁడు పరమాన్నముఁ బంచెన్"
(లేదా...)
"అన్నమె లేని పేద పరమాన్నముఁ బంచెను గ్రామమంతటన్"

104 కామెంట్‌లు:



  1. అన్నా! జగదంబకరుణ
    యన్నుల మిన్నగ శుభముగ యద్భుత మవగన్
    కన్నుల గాంచితి కన్నా!
    అన్నమె లేని నరుఁడు పరమాన్నముఁ బంచెన్!

    జిలేబి

    రిప్లయితొలగించండి
  2. తిన్నని రాజమార్గమున తీరుగబోయెడి మంత్రివర్యు లే
    మన్నను చెల్లుబాటగునయాచితులైన జనాళి నింటిలో
    పన్నుగ పెండ్లి పేరున సపర్యలొనర్చెను పెక్కు రీతులన్
    సన్నుతరీతి నేడు;చెయి జాచెను నాడొక పేదవానిగా
    అన్నమెలేని పేద పరమాన్నము పంచెను గ్రామమంతటన్

    బొగ్గరం ప్రసాద రావు

    రిప్లయితొలగించండి
  3. అన్నమయ మీశరీరము
    మన్నును గలియును శతములు మన్నిన యంచున్
    మిన్నగు జ్ఞానము గలిగిన
    నన్నమె లేనినరుడు పరమాన్నము బంచెన్!

    అన్నమె లేనినరుడు = యోగి
    పరమాన్నము = జ్ఞానము (Ultimate food)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సీతాదేవి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'శతములు మన్నిన..'...?

      తొలగించండి
    2. గురువుగారికి నమస్సులు! వందలయేళ్ళు బ్రతికినా యని నా భావన!🙏🙏🙏

      తొలగించండి
    3. గురువుగారూ! శతాబ్ది మన్నిన యంటే భావము మరింత స్పష్టముగా యుండునేమో సూచించగలరు!

      తొలగించండి
  4. పన్నులు మసాల కారా
    లన్నిటి మీదన్ పెరుగగ లక్ష్మీ పూజన్
    పన్నుగ బిరియానియు చి
    త్రాన్నమె లేని నరుఁడు పరమాన్నముఁ బంచెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు


    1. తిన్నగ పదముల మెలికల
      మిన్నగ బట్టిరి జిలేబి మించారుగనన్!
      జన్నటి వేగము బారెను
      వన్నువ గా శాస్త్రి వారి పద్యము గదవే !

      జిలేబి

      తొలగించండి


    2. నా పంట పండె భళిరా
      నా పద్యమునిట జిలేబి నచ్చెను జూడన్ !
      జీపీయెసుశా స్త్రీ!మీ
      రౌ పదముల మేస్త్రి శంకరాభరణమునన్ !

      తొలగించండి
    3. ప్రభాకర శాస్త్రి గారూ,
      చిత్రాన్నంతో మీ పూరణ వైవిధ్యంగా, ప్రశస్తంగా ఉంది. అభినందనలు.

      తొలగించండి
    4. శాస్త్రి గారికి నమస్సులు. అద్భుతం గా చెప్పారు సర్.👏
      ఇది చదివితే జైట్లి గారు చక్కెర మీద కూడా అదనపు పన్ను వేస్తారేమో!

      తొలగించండి
  5. కన్నయ ప్రాణమిత్రుడనగాదె కుచేలుని యెంతజూడగన్
    పన్నములన్ పఠించుచును భారము కృష్ణుని యందు నిల్పగన్
    కన్నయ ప్రేమతో నిడిగ కాంచన మాది ధనంబు పొందగన్
    అన్నమె లేనిపేద పరమాన్నము బంచెను గ్రామ మంతటన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. తోపెల్ల వారూ,
      చక్కని పూరణ. అభినందనలు.
      "కుచేలుని నెంత..." అనండి.

      తొలగించండి


  6. తిన్నగ జేయ పూజలను తీరుగ నయ్యెను నెమ్మి , యీశ్వరిన్
    యన్నులమిన్న సాకతము, యద్భుతమయ్యెను యన్నపూర్ణయై
    మన్నన వృద్ధి గాంచనట, మానస మవ్వ యనంత మై చెలీ!
    అన్నమె లేని పేద పరమాన్నముఁ బంచెను గ్రామమంతటన్

    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'ఈశ్వరిన్+అన్నుల...' అన్నపుడు యడాగమం రాదు. "నెమ్మి నీశ్వరి। న్నన్నులమిన్న..." అనండి.
      కాగా అనే అర్థంలో `అవ్వ' సాధువు కాదు. "మానస మెంతొ యనంతమై..." అందామా?

      తొలగించండి
  7. వెన్నుని దర్శించుటచే
    నన్నింటను భక్తితోడ నమరిన శక్తిన్
    గ్రన్నన దీనజ నంబుల
    కన్నమె లేని నరుడు పరమాన్నము బంచెన్.

    వెన్నుని సర్వకాలముల వీడని భక్తి స్మరించుచుండి తా
    నన్నిట విశ్వరక్షకుని హర్షము నందుచు గాంచుచున్ సదా
    సన్నుతి సేయ నేర్పడిన శక్తిని నాతడు సద్ధితైషియై
    యన్నమె లేని పేద పరమాన్నము బంచెను గ్రామమంతటన్.

    హ.వేం.స.నా.మూర్తి.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మూర్తి గారూ,
      మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
  8. జన్నము చేయకుండ గురుసత్తముఁ గొల్వక పుస్తకమ్ములన్
    కొన్నయినన్ పఠింపకను కోరికలన్ విడనాడ నట్టి సాధువుల్
    చెన్నుగ దైవభాషణము చేయుట శిష్యుల కిట్టులే గదా
    అన్నము లేని పేద పరమాన్నముఁ బంచెను గ్రామమంతటన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సోమయాజులు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      రెండవ పాదంలో గణదోషం.సవరించండి.

      తొలగించండి
    2. AryA! tappunu cUpiMcinMduku dhanyavAdamulu. reMDava pAdM yI vidhMgA caduva galaru.
      కొన్నయినన్ పఠింపకను కోరికలన్ విడనట్టి సాధువుల్

      తొలగించండి
  9. డా.పిట్టా
    (శ్రావస్తీ నగరంబబునన్ కరువొగిన్ సంధిల్ల దీన ప్రజా
    రావంబుల్ విని బుద్ధ దేవుడలయార్త ప్రాణి లోకంబులన్
    బ్రోవన్ శిష్యుల నెల్లవారిగని సంబోధించె నీ రీతి "మీ
    రేవారీయెడ నన్నదాన మిడగా నేతెంతురో, చెప్పుడా?")
    మన్నగ శ్రావస్తిన కరు
    వన్నను బుద్ధుని సుశిష్య పరివారంబే
    పన్నుగ భిక్షల గూర్చగ
    అన్నమె లేని నరుడు పరమాన్నము బంచెన్!

    రిప్లయితొలగించండి
  10. డా.పిట్టా
    కన్నియ మీది ప్రేమమున కానని యప్పుల జేసి గొప్ప యా
    పన్నత గాంచె నిష్క్రియుడు, బండగ మారిన వేంకటేశుడే
    అన్నియు నిచ్చువాడనగ నందరు గూడ విచిత్ర మెన్నగా
    అన్నము లేని పేద పరమాన్నము బంచెను గ్రామ మంతటన్!!

    రిప్లయితొలగించండి
  11. డా.పిట్టా
    ()లోని "బ"యెక్కుడుగా పడడం టైపాటు గా భావించండి,ఆర్యా,

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. పిట్టా వారూ,
      మీ రెండు పూరణలు చాలా బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
  12. సున్నుండ, గారె ,జాంగ్రీ,
    జున్ను, పులుపు లేని కూర, సోన్పట్టీలున్,
    వెన్నయు, చేర్చుచు పులిహో
    రాన్నమెలేని నరుడు పరమాన్నము పంచెన్

    రిప్లయితొలగించండి
  13. సన్నుత పుణ్య భాగుడు నిశాకర తేజ సమాన తేజుడున్
    మన్నన నొందు ధర్మముల మాన్యుడు పూజ్యుడు లచ్చినెప్పుడున్
    సన్నుతి జేయు నిర్ధనుడు చాల ధనంబులు లక్ష్మి నీయగా
    నన్నమె లేని పేద పరమాన్నము బంచెను గ్రామమంతటన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మూర్తి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'నిశాకర తేజ సమాన రూపుడున్' అనండి. (తేజ శబ్దం పునరుక్తయింది.. అందుకే). అలాగే 'లక్ష్మి యీయగా' ఆనండి.

      తొలగించండి
  14. కన్నుల నీరుబుకినడగ
    అన్నమెలేని నరుడు, పరమాన్నము బంచెన్
    ఉన్నట్టివాడు ధరనా
    పన్నుల నాదుకొనుచు సరి ఫలితము బొందన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శ్రీరామ్ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'నీరుబికి యడుగ' ఆనండి.

      తొలగించండి
  15. అన్నెము పున్నెము నెరుగక
    వెన్నుని సద్భక్తితోడ వేడుకొనంగా
    మిన్నగ కోర్కెలు దీరగ
    అన్నము లేనినరుడు పరమాన్నము బంచెన్!!!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శైలజ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'వేడుకొనంగన్' అనండి.

      తొలగించండి
  16. కొన్ని నదులఁ గలుపుచు సం
    పన్నత రైతునకొసంగ వ్యవసాయమనన్
    దున్నిన బీడది పండఁగ
    నన్నమె లేని నరుఁడు పరమాన్నముఁ బంచెన్

    రిప్లయితొలగించండి
  17. వెన్నుబలమ్ము నాకు తిరువేంకటనాథుడటంచునెంచి సం..
    పన్నుడుగానివాడొకడు భక్తుడునై తరిగొండవెంగమాం...
    బాన్నమహాప్రసాదనిలయమ్మున వడ్డన జేసె ధన్యుడై
    యన్నములేని పేద పరమాన్నము పంచెను గ్రామమంతటన్!!

    రిప్లయితొలగించండి
  18. ఎన్నిక లందునన్ గెలిచి యింకుడు గుంతలఁ ద్రవ్వు మంచు సం
    పన్నత నందగన్ నదుల పారక మేకము జేయ పాలకుల్
    దున్నగ బీడు భూములను తోషము నింపుచు పంట పండినన్
    యన్నమె లేని పేద పరమాన్నముఁ బంచెను గ్రామమంతటన్

    రిప్లయితొలగించండి
  19. వెన్నుని కీర్తన జేయుచు
    చెన్నుగ భిక్షాటనమ్ము జేయుచు మదిరా
    మన్నను గొలుచు త్యాగయ
    యన్నమెలేని నరుడు పరమాన్నము బంచెన్!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సీతాదేవి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మూడవ పాదంలో గణదోషం. '...మన్నను గొలిచెడు త్యాగయ' అనండి.

      తొలగించండి
    2. గురువుగారికి నమస్కారము! త్యాగయలో త్యా సంయుక్తాక్షరం కనుక గొలుచు లో చు గురువవుతుందని భావించి వ్రాశాను! తప్పా?

      తొలగించండి
    3. కేవలం రెండు సంస్కృత పదాలు సమసించినప్పుడు మాత్రమే ఉత్తర పదాద్యక్షరం సంయుక్తమైతే పూర్వ పదాంతాక్షరం గురువవుతుంది. 'రామభక్త త్యాగయ్య' అన్నపుడు సంస్కృత సమాసం కనుక క్త గురువౌతుంది. రామభక్తుడు త్యాగయ్య అన్నచోట భక్తుడు తెలుగు పదం కనుక 'డు' లఘువే.

      తొలగించండి
    4. సందేహ నివృత్తి చేసినందులకు గురుదేవులకు నమస్సులు, ధన్యవాదములు!🙏🙏🙏🙏

      తొలగించండి
  20. అన్నము కావలె నన్న
    న్నన్నమె లేని నరుఁడు పరమాన్నముఁ బంచెం
    గ్రన్ననఁ గన్నులునిండం
    గన్నీళ్ళవి నిండ మెండుగ ద్విజోత్తముఁడే


    ఎన్నడు నూరు దాటి చన డీ మనుజుండు ప్రపంచ చిత్రముల్
    తిన్నగఁ దానెరుంగునను ధీరత నించుక శంక లేకయే
    సున్నయె చూడ జ్ఞానమున సుద్దులు చెప్పును హద్దు మీరుచు
    న్నన్నమె లేని పేద పరమాన్నముఁ బంచెను గ్రామమంతటన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కామేశ్వర రావు గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
  21. సన్నన్నము శ్రీనాథుడు
    పన్నుగ గైకొని విరివిగ పల్నాడరుగన్
    జొన్నలె తినుచున్న నచట...
    అన్నమె లేని నరుఁడు పరమాన్నముఁ బంచెన్

    రిప్లయితొలగించండి
  22. మన్నును నమ్ముచు, శ్రమతో
    కన్నుల నిండని ఫలముల గాంచుచు, మనకై
    వెన్నెల జూపుచు, తనకు, సి
    ద్ధాన్నమె లేని నరుడు పరమాన్నము బంచెన్!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శర్మ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మూడవ పాదంలో గణదోషం. 'వెన్నెలను జూపుచును సి।ద్ధాన్నము...' అనండి.

      తొలగించండి
  23. కన్నయపత్యమునకు తా
    నన్నమునిడలేక నిత్య మలమట పడుచున్
    చిన్నతనపు స్నేహితు దయ
    నన్నమె లేని నరుడు పరమాన్నము బంచెన్

    రిప్లయితొలగించండి
  24. క్రన్నన వర్షముల్ గురిసి గ్రామము లోని సరమ్ము నిండగా
    వెన్నుని పూజనమ్ములను, పెల్లుగ పంటలు పండె నచ్చటన్
    పున్నెపు కార్యముల్ సలిపి పూడి జనమ్ములు సంతసిల్లగా
    నన్నము లేని పేద పరమాన్నముఁ బంచెను గ్రామమంతటన్

    రిప్లయితొలగించండి
  25. చిన్న తనంబని యెంచక
    చెన్నుగ భోజనము లంద జేసెడి సంస్థ
    న్నెన్నుకొనె భృతికి నాతడు!
    యన్నము లేని నరుడు పరమాన్నము బంచెన్!

    గురువు గారికి వందనములు. నిన్నటి నా పూరణను పరిశీలించ గోరుతాను. ధన్యవాదములు.
    దుష్టుని దునుమాడిన యంత శిష్ట ప్రజను
    కాయుటకె నరసింహుడై కంబ మందు
    కోరి దాగెను విష్ణువు !కోటరమున
    నక్కినను హరి యసురుల నడచి వేయు!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శ్రీధర రావు గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      మొదటి పూరణలో 'ఆతడు+అన్నము' అన్నపుడు యడాగమం రాదు. "భృతికి నాతం। డన్నము..." అనండి.

      తొలగించండి
  26. అన్నము సున్నమాయె కడుపారగ తిండికి నోచుకోని నా
    పన్నులనాదుకోదలచి,పల్లెననొక్కడు యుండకుండగన్
    నన్నములేని పేద,పరమాన్నము బంచెను గ్రామమంతటన్
    కన్నులు నిండ జాలి,ధనికాగ్రణి యొక్కడు సాదరంబుగన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శ్రీరామ్ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'ఆదుకొన దలచి' అనడం సాధువు. 'పల్లెను' అనండి. 'ఒక్కడు+ఉండ' అన్నపుడు సంధి నిత్యం. యడాగమం రాదు.

      తొలగించండి
  27. మన్నున నుండడు సామీ !
    య న్నమె లేనినరుడు, పరమాన్నము బంచె
    న్ను న్నవ శేషాచలపతి
    సన్నుతి దా బొందువలన సత్కవు లె దుటన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సుబ్బారావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'కవుల+ఎదుట' అన్నపుడు సంధి లేదు. యడాగమం వస్తుంది.

      తొలగించండి

  28. కన్నఱపడెనింతి మెతుకు
    లన్నవి లేకింట,భక్తి హద్దులు దాటన్
    వెన్నుని భక్తుల మెప్పిం
    చన్నమె లేని నరుడు పరమాన్నము పంచెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. హనుమంత రావు గారూ,
      శంకరాభరణం బ్లాగు మీకు స్వాగతం పలుకుతున్నది.
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  29. ఉన్నతచదువులుజదివెను
    అన్నమెలేని నరుడు |పరమాన్నముబంచెన్
    ఎన్నగ ప్రభుతయు ఖర్చిడ?
    మన్ననగా బ్రతుకుసాగ?మనిషికి విద్యే|
    2.వన్నెలు లేనిదైన నమవాస్యయు మారద?దైవలీలతో
    విన్నదిసత్యమేగ పరమేశ్వరి భక్తికి శక్తినివ్వగా?
    పున్నమి వెన్నెలన్ జిలుక?భోగము,యోగముపొందునట్లుగా
    అన్నములేనిపేద పరమాన్నము బంచెను గ్రామ మంతటన్|

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఈశ్వరప్ప గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      'అమవాస్య' సాధువు కాదు.

      తొలగించండి

  30. కంది వారికి యిచ్చట వున్న అందరికి నమస్సులతో



    మాయుత్సాహము గాంచిరయ్య పదముల్మాన్యంబుగాదేల్చిరౌ
    మాయా యీ కవి శంకరుండు యనఘా మారన్ జిలేబమ్మ మా
    మీ యుద్యానవ నంబునందు, సుమమై మించారు గావించి ర
    య్యా యీ యున్నతిగాన పద్య యిభమై యామున్ కవీశా భళా !

    ---


    మాయుత్సాహము గాంచిర
    యా యీ కవి శంకరుండు యనఘా మారన్ 
    మీ యుద్యానవనంబున
    యీ యున్నతిగాన పద్య యిభమై యామున్

    ధన్యవాదములు

    జిలేబి

    రిప్లయితొలగించండి
  31. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  32. చెన్నుగ కట్టెలుకొట్టెడి
    అన్నకు వనలక్ష్మి యొసగ నక్షయ పాత్రన్
    అన్నాతురు లందరకున్
    అన్నమె లేని నరుడు పరమాన్నము పంచెన్

    రిప్లయితొలగించండి
  33. మన్నున నెంతగా వెదుక మాన్యుడ కానడు గాక కానడు
    న్న న్నమ లేని పేద, పరమాన్నము బంచెను గ్రామ మంతటన్
    మిన్నగు సంతసంబొలుక ,మేయరు పో స్ట ది దా వరించుట
    నున్నవ రామశంకరుడు దోసిలి పట్టిన వెండి నాణెముల్

    రిప్లయితొలగించండి
  34. అన్నము యన సంగీతము
    యన్నమెమన సాహితి యని హారతు లొసఁగన్,
    చెన్నుగ సాహితి బలికెడి
    యన్నమె లేని వాడు పరమాన్నము బంచెన్
    కొరుప్రోలు రాధాకృష్ణ రావు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కొరుప్రోలు వారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'అన్నము+అన' అన్నపుడు సంధి నిత్యం. యడాగమం రాదు. "అన్న మనగ సంగీతము" అనండి.

      తొలగించండి
  35. మిత్రులందఱకు నమస్సులు!

    తిన్ననివాఁడటంచు గుఱుతెక్కియు, నింటనుఁ బొయ్యి లోపలన్
    జెన్నుగఁ బిల్లి పండఁగను, శీఘ్రమె యందఱ క్షుత్తు తీరఁ దాన్
    బన్నుగ నెప్డుఁ దల్చుచును, స్వప్నమునం గనెనయ్య యిట్టు లా

    యన్నము లేని పేద, పరమాన్నముఁ బంచెను గ్రామమంతటన్!

    రిప్లయితొలగించండి
  36. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  37. అన్న మనగ సంగీతము
    యన్నమెమన సాహితి యని హారతు లొసఁగన్,
    చెన్నుగ సాహితి బలికెడి
    యన్నమె లేని నరుడు పరమాన్నము బంచెన్
    కొరుప్రోలు రాధాకృష్ణ రావు

    రిప్లయితొలగించండి
  38. అన్నములేదు కొన్నిమధురాంబువులున్నవి త్రావుమంచు తానున్నవిదానమిచ్చి తన యున్నతిజాటెను రంతిదేవుడు న్నెన్నపరార్థమై బ్రతుకుటేపరమార్థమటంచు చాటగా
    నన్నమె లేని పేద పరమాన్నముఁ బంచెను గ్రామమంతటన్.

    రిప్లయితొలగించండి
  39. అన్నా! వినుమిది భోగము
    లన్నియు వీడుచు విరాగియై మనుచును వే
    మన్నయె చెప్పె నుడులగన
    నన్నమెలేనినరుడు పరమాన్నముఁ బంచెన్.


    నిన్నటినుండి పిల్లలకు నీరును సైతము లేదనంచు తా
    కన్నులనిండ నీరుబుక కార్చెను చెక్కిలిమీదుగా నటన్
    యన్నమె లేని పేద, పరమాన్నము బంచెను గ్రామమంతటన్
    యెన్నికలందు గెల్చిన మహీపతి, పేదలు మోదమొందగన్.

    రిప్లయితొలగించండి
  40. అన్నమె జీవులందరికి ప్రాణము కావున అన్నదాన మే
    అన్నిట మిన్న గావుననె మానవులందరికీ తనే ఎలా
    గన్ననుఅన్న దానమును గైకొననోమును నోచెనాతడే
    అన్నమె లేని పేద పరమాన్నముఁ బంచెను గ్రామమంతటన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రామకృష్ణ గారూ,
      మీ పూరణ బాగున్నది.
      మొదటి పాదంలో యతి తప్పింది. 'అందరికీ, తనే, ఎలాగు' అని వ్యావహారికాలను ప్రయోగించారు.

      తొలగించండి
  41. కన్నయ్యను దలచి గొలిచి
    పున్నమి నాడుపవసించె భూసురుడటుపై
    నన్నార్తులకిడె భోజ్యము
    నన్నమె లేని నరుఁడు పరమాన్నముఁ బంచెన్

    రిప్లయితొలగించండి

  42. కం:కన్నని కరుణను పొందుచు
    మిన్నగ సంపదలనంది మేదిని లోనన్
    యున్నత పదవుల నందుచు
    నన్నమె లేనినరుడు పరమాన్నము పంచెన్.

    రిప్లయితొలగించండి
  43. గురువువుగారికి నమస్కారాలు
    అందరిని దృష్టిలో పెట్టుకుని సమస్యలు ఇవ్వండి
    క్షంతవ్యోహం

    రిప్లయితొలగించండి
  44. గురువువుగారికి నమస్కారాలు
    అందరిని దృష్టిలో పెట్టుకుని సమస్యలు ఇవ్వండి
    క్షంతవ్యోహం

    రిప్లయితొలగించండి
  45. అవధానం చేసే వారికి కూడా ఉపయోగ పడేలా ఇవ్వండి

    రిప్లయితొలగించండి
  46. అవధానం చేసే వారికి కూడా ఉపయోగ పడేలా ఇవ్వండి

    రిప్లయితొలగించండి
  47. తిన్నగ నాల్గు వాక్యములు తెన్గున వ్రాయుట చేతగాకనే
    పన్నుగ కంది శంకరుని పాఠము లందగ చిత్రరీతినిన్
    వందల వృత్త పద్యములు పండితు లొల్లగ పంచిపెట్టెనే...
    అన్నమె లేని పేద పరమాన్నముఁ బంచెను గ్రామమంతటన్ :)

    రిప్లయితొలగించండి