28, ఏప్రిల్ 2017, శుక్రవారం

సమస్య - 2349 (వడగాలుల చల్లదనము...)

కవిమిత్రులారా! 
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
"వడగాలుల చల్లదనము వర్ణింతు నెటుల్"
(లేదా...)
"వడగాలుల్ వడి వీఁచుచుండఁగ నెటుల్ వర్ణింతుఁ దచ్చీతమున్"

112 కామెంట్‌లు: 1. పడిగాపుల పడి యుంటిని
  గిడిగిలి ! యెండన బడ తిరిగెను తలయున్,
  తడిసెను జిలేబి చేపా
  వడ, గాలుల చల్లదనము వర్ణింతు నెటుల్ !

  జిలేబి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. జిలేబీ గారూ,
   మీ పూరణ బాగున్నది.
   రెండవ పాదం చివర గణదోషం. "తలయంతన్" అందామా? ఇంతకీ మీ గిడిగిలి ఎవరికి?

   తొలగించండి
 2. పడమట గాలులు వీచగ
  కడుపులు గాండ్రించుచుండ కర్నూలందున్
  నడి వీధినినున్న పెరుగు
  వడ గాలుల చల్లదనము వర్ణింతు నెటుల్!

  రిప్లయితొలగించండి

 3. ఘడియకొకమారు వట్టేర్
  తడికల పైనీరుచల్ల తాపము తొలగున్,
  నడివేసవిలో వచ్చెడి
  వడగాలుల చల్లదనము వర్ణింతునెటుల్


  ఎండాకాలములో కిటికీలకు వట్టేరు చాపలు కట్టి నీరు పడునట్లు చేసుకొన్నచో ఆ వడగాలులు చల్లటి గాలులై ఎంతయో ఆహ్లాదము నిచ్చును

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. నాగమణి గారూ,
   వట్టివేళ్ళ ప్రస్తావనతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'వట్టేర్' అనడం బహుశా గ్రామ్యం కావచ్చు. "ఘడియకును వట్టివేరుల" అంటే ఎలా ఉంటుంది?

   తొలగించండి
  2. నమస్కారములు మీరు అన్నది సబబే తెల్లవారుఘమున నిద్ర మత్తులో పదము తట్టలేదు
   సుమీ ధన్యవాదములు

   తొలగించండి
 4. గడువగ వర్షా కాలము
  తడియింకి పుడమినిశీత తరుణంబాయెన్
  వడికొని వీచగ యోడా
  వడ గాలుల చల్లదనము వర్ణింతు నెటుల్
  యొడావడ = ఒకరకం చెట్టు. (ఆం.భా.)

  రిప్లయితొలగించండి


 5. పడిగాపుల్ పడి వేచి యుంటినటనౌ పారంగ స్వేదమ్ములున్
  తడవంగన్నొడి, గింగిరాలు తిరుగన్, తానమ్ము లాడంగనే
  బడబాగ్నిన్ పడి, వాత మొచ్చె గననౌ పాదమ్ములన్, శంకరా!
  వడగాలుల్ వడి వీఁచుచుండఁగ ,నెటుల్ వర్ణింతుఁ దచ్చీతమున్

  జిలేబి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. జిలేబీ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'వాత మయ్యె' అనండి. 'ఒచ్చె' అనడం సాధువు కాదు.

   తొలగించండి
 6. పడక గదిలోన కౌగిలి
  వడగాలులు ,చల్లదనము వర్ణింతునెటుల్
  విడువని ఏసీ గాలుల
  నడుమ నలుగుచుండు నేటి నాధులబాధల్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. నాగమణి గారూ,
   విరహతాపాఅన్ని వడగాలులతో పోల్చిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 7. పెడమోమున్బడె,జోరుతగ్గె నొడలున్ విశ్రాంతినిన్గోరె,నా
  వడగాలుల్ వడి వీచుచుండగ;నెటుల్ వర్ణింతు దచ్చీతమున్
  తడవే లేకను'ఏ.సి.'చోటు కరుగన్ తాపంబు శాంతింపగన్-
  పుడమిన్ వేసవి మండుటెండలకు నిప్పుల్ రాలెడిన్ మిత్రమా!

  బొగ్గరం ప్రసాద రావు

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ప్రసాద రావు గారూ,
   విరుపుతో మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.

   తొలగించండి

 8. పడమటి గాలుల వేడిమి
  పెడపెడమని వీచు మండు వేసవి లోనన్
  వడగళ్ళ వాన చినుకులు
  వడ, గాలుల చల్లదనము వర్ణింతునెటుల్!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. శిష్ట్లా శర్మ గారూ,
   గసడదవాదేశాన్ని ఆశ్రయించి చేసిన మీ పూరణ చక్కగా ఉంది. అభినందనలు.

   తొలగించండి
 9. డా.పిట్టా
  (బడుగు వారిపై ప్రకృతి కేళి)
  గుడిసెల కప్పులు యెగిరెను
  పడిపోయెను చెట్లు కొన్ని బండ బ్రతుకులే
  దడిచాటున తలదాచన్
  వడగాలుల చల్లదనము వర్ణింతు నెటుల్?!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. డా. పిట్టా వారూ,
   పద్యం బాగున్నది. కాని వడగాలుల చల్లదనానికి అన్వయం?
   'కప్పులు+ఎగిరెను' అన్నపుడు సంధి నిత్యం. అక్కడ "కప్పులె యెగిరెను" అనవచ్చు కదా!

   తొలగించండి
  2. డా.పిట్టా
   ఆర్యా
   మనకు వచ్చే చల్లదనం మాట వర్ణించలేని ‌స్థితి కవిది.సుఖంగా ఉన్న వారే"ఆహా యెం తచల్లని గాలి అంటారు.పేదలయెడ సాను భూతియే సరిపోయె.సమస్యాపాదం లో ఎలా వర్ణించను?అనియే కదా ఉన్నది?భావ పరంగా చల్లదనపు లింకు ఉన్నట్లే భావించాలి ఆంధ్రాలో సముద్ర తీరంలో తుఫాను వస్తే తెలంగాణ లో చల్లబడగా అయ్యో,ఎన్ని గుడిసెలు కొట్టుక పోయాయోనని నేను బాధ పడుతాను.

   తొలగించండి
 10. తడియారుచుండ గొంతుక,
  గడు తాపము కలుగుచుండ, క్రమముగ సత్వం
  బడుగంటుచుండ తనువున
  వడగాలుల, చల్లదనము వర్ణింతు నెటుల్?

  తడి యారెంగద గొంతుకన్, స్వరములో దైన్యంబు చేరెం గదా,
  కడుతాపం బది కల్గుచున్నది గదా కాఠిన్య మేపారగా
  దడ పుట్టించెడి గ్రీష్మకారణమునన్, ధైర్యంబు గోల్పోవ నా
  వడగాలుల్ వడి వీచుచుండగ, నెటుల్ వర్ణింతు దచ్ఛీతమున్?
  హ.వేం.స.నా.మూర్తి.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మూర్తి గారూ,
   విరుపుతో మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

   తొలగించండి
 11. డా.పిట్టా
  నడియెండన్నొక గొంగళిన్ ముడువగా నౌనంచు నాతాపమున్
  ఘడియైనా భరియించ నోపు తనదౌ గ్రామంబునన్ బే(పే)ద తా
  నడుగుల్ వేయుచు త్రోవ నేగ తనువే యట్టిట్టు మిట్టాడె నీ
  వడగాలుల్ వడి వీచు చుండగ నెటుల్ వర్ణింతు దచ్చీతమున్!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. డా. పిట్టా వారూ,
   మీ యీ రెండవ పూరణ చాలా బాగున్నది. అభినందనలు.
   'ముడువగా' అనడం వ్యావహారికం. 'ముడువగన్' అనండి.

   తొలగించండి
 12. దడఁ బెట్టె సూర్య తాపము
  వడిగన్ ఏసీ గదిఁ జని వాలిన నాకున్
  కుడివైపుఁ దొలుత వడకె ద
  వడ, గాలుల చల్లదనము వర్ణించ నెటుల్?

  రిప్లయితొలగించండి
 13. కడుపున యెలుకల పరుగులు
  వడివడి వంటింట నరయ వాసన తగిలెన్
  వడలుండెను తయిరున ఆ
  వడ, గాలుల చల్లదనము వర్ణింతు నెటుల్!!!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. శైలజ గారూ,
   ఆవడలతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   "కడుపున నెలుకల..." అనండి.

   తొలగించండి
 14. పువుబోడి మనసు దోచె, న
  గవుతో నను కట్టివేసి కన్నుల నిండెన్
  కవిగా నోడితి తన పా
  వడ గాలుల చల్లదనము వర్ణింతు నెటుల్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. రాజ్ కుమార్ గారూ,
   మీ ప్రయత్నం ప్రశంసనీయం. ప్రాసదోషాన్ని సవరించి మరో పూరణ పంపండి. నా సవరణ యిది...
   పడతి మనసు దోచిన ద
   క్కడ నను తన నవ్వుతోడ కట్టెను నే ని
   ప్పుడె యోడితినిదె తన పా
   వడ గాలుల చల్లదనము వర్ణింతు నెటుల్?

   తొలగించండి
 15. రాజ్ కుమార్ గారు ప్రాస తప్పినట్లున్నది పువుబోడి, గవుతో కవిగా వడగా కందమునకు సరిపోదు గదా

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ధన్యవాదాలు శంకరయ్యగారు, నాగమణిగారు.
   క్షంతవ్యుడిని.
   నిజంగానే కనులనిండి కనికట్టు చేసిందేమో..ప్రాస కనిపించకుండాపోయింది.

   తొలగించండి
 16. దడ పుట్టించెడు వేడికి
  వడిగానందించమామ వర్ణపు యేసీ
  దుడిదుడి మామను మది నుడు
  వడ?గాలుల చల్లదనము వర్ణింతునెటుల్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. శ్రీరామ్ గారూ,
   'నుడువడ?' అన్న ప్రశ్నార్థంగా మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
   "వర్ణపు టేసీ' అనండి.

   తొలగించండి
 17. దడపుట్టించెడు వేడికి
  తడబడి చెమటల్మొదలవ తాళక,ఫ్రిజ్లో
  తడిగాతిన్నట్టి పెరుగు
  వడగాలుల చల్లదనము వర్ణింతునెటుల్

  రిప్లయితొలగించండి
 18. గుడిలో నర్చన జేయఁగ
  వడమాలను నా కొసంగి వైదికుడంతన్
  మెడపై గప్పెను తిరుపా
  వడ, గాలుల చల్లదనము వర్ణింతు నెటుల్!

  తిరుపా వడ = శేషవస్త్రము

  రిప్లయితొలగించండి
 19. నడిరాతిరి కలమాదిరి
  తడిముద్దుల నన్నుముంచి తను నవ్వులతో
  వడివడి పరుగిడె తన పా
  వడ గాలుల చల్లదనము వర్ణింతు నెటుల్

  రిప్లయితొలగించండి
 20. విడిపోయె బాధ నేటికి
  వడగాలుల, చల్లదనము వర్ణింతు నెటుల్
  ఒడలుకు హాయిని గుర్చెను
  వడదెబ్బల బారినుండి పరిరక్షించెన్.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. లక్ష్మినారాయణ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   కాని ఆ చల్లదనం దేనివల్ల వచ్చిందో స్పష్టంగా చెప్పలేదు.

   తొలగించండి
 21. అడిగిన సమస్య కందరు
  వడిగా పూరణలు నొసఁగ భయమున బిగియన్
  కడగా మదిలో ముడి విడి
  వడ, గాలుల చల్లదనము వర్ణింతు నెటుల్

  రిప్లయితొలగించండి
 22. దడఁ బెట్ట నెండ వేడిమి
  సడిజేయుచు మెయిలు గ్రమ్మి చక్కగ కురియన్
  తడి చేరుచు వేడి విరుగ
  వడగాలుల చల్లదనము వర్ణింతు నెటుల్!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సహదేవుడు గారూ,
   నాకు మీ పూరణల వడదెబ్బ తగిలేట్టు ఉంది సుమా! వడగాలి మీచేత వడివడిగా పూరణలు చేయిస్తున్నది. సంతోషం. అభినందనలు.

   తొలగించండి
  2. గురుదేవులకు ధన్యవాదములు.అంత మాట అనకండి గురువు గారూ! సమయాభావము వల్ల వృత్త పూరణలు అసలే వ్రాయటం లేదు.

   తొలగించండి
 23. …………………………………………………
  గు రు మూ ర్తి ఆ చా రి
  ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

  వడక దొక వృక్షదళమును |

  వడక దొడగె పుడమి తల్లి | వడలుచు కడు కీ

  డ్వడ సాగె ప్రాణు లౌరా !

  వడగాలుల " చల్ల దనము " వర్ణి౦తు నెటుల్

  ----------------------------------------
  వడకు = కదలాడు , భయాదుల చే క౦పి౦చు ;

  వడలు = వాడు , శరీర మ౦దు నీరు కోల్పడి

  వాడు ; కీడ్వడు = క్రు౦గి పోవు ;
  _______________________________________

  రిప్లయితొలగించండి
 24. వడి వడిగా జను రైలున
  వడకించెడి నేసి లోన వవ్వవ్వనుచున్
  పడిగాపులు గాయ బయట
  వడగాలుల చల్లదనము వర్ణింతు నెటుల్

  ...ముసిలోడికి ఏసీ పడదు...

  రిప్లయితొలగించండి
 25. మిడిమిడి యెండల మేనెల
  కడలిని సుడిగుండమొప్ప కమ్మిన మబ్బుల్
  వడివడి పవనము ననుముడి
  వడ గాలుల చల్లదనము వర్ణింతు నెటుల్!

  రిప్లయితొలగించండి
 26. జడివానలోన జవ్వని
  తడిసెను తనతడి వలువల దండెము పైనన్
  తడియారబెట్టు తరి పా
  వడ గాలుల చల్లదనము వర్ణింతు నెటులన్

  రిప్లయితొలగించండి
 27. దడదడ వణికెను గుండెలు
  కడివెడు నీరమ్ము గొనిన గల్గదె హాయిన్
  నడువగ మేనున గలిగెను
  వడ, గాలుల చల్లదనము వర్ణింతు నెటుల్!!!

  వడ = బడలిక

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. శైలజ గారూ,
   పూరణలో కొంత అస్పష్టత ఉంది. 'హాయిన్' అని ద్వితీయావిభక్తికి అన్వయం?

   తొలగించండి
 28. వడివడి తడబడక యడరి
  సడిసేయక జనులు సల్లఁ జల్లని నీటం
  దడియగఁ గనుమరు గయ్యిన
  వడ, గాలుల చల్లదనము వర్ణింతు నెటుల్

  [వడ = సెగ, వేఁడిమి]


  నడయాడంగ నరక్షితంబుగను నానా కీట కాగారమే
  వడిఁ జేకూర్చును రోగ సంతతిని ప్రాప్తంబైన శీతం బిలన్
  మడఁగంగావలె శీతలమ్మునకు హేమంతంపు, భద్రమ్ము పా
  వడ, గాలుల్ వడి వీఁచుచుండఁగ నెటుల్ వర్ణింతుఁ దచ్ఛీతమున్

  [పావడ = వస్త్రము]

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కామేశ్వర రావు గారూ,
   మీ రెండు పూరణలు ఉత్తమంగా ఉన్నవి. అభినందనలు.

   తొలగించండి
 29. దడఁబుట్టించెడి యెండల
  వడగాలులఁజల్లదనము వర్ణింతునెటుల్ ?
  వడి వేడి మిర్చి తినుచుం
  డెడి నోరిది తీపి యని వచించునె సుకవీ ?

  నడిరేయిన్ వినువీథి భాస్కరుని యెండన్ , మట్టమధ్యాహ్నమం..
  దుడురాట్కౌముది , వైరివర్గముల నన్యోన్యప్రశంసావళుల్
  కడలిన్ శాంతతరంగ పంక్తి ఘనమేఘంబందు శ్వేతాభమున్
  వడగాలుల్ వడివీచుచుండనెటులన్
  వర్ణింతు తచ్ఛీతమున్ ?

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మురళీకృష్ణ గారూ,
   మీ రెండు పూరణలు ఉత్తమంగా ఉన్నవి. అభినందనలు.

   తొలగించండి
 30. కడుమోదమొప్ప మా యా
  విడ పొద్దునె పప్పురుబ్బి వేడుకతోడన్
  సడిలేక చేయ, గన్ ఆ
  వడగాలుల చల్లదనము వర్ణింతునెటుల్
  వీటూరి భాస్కరమ్మ

  రిప్లయితొలగించండి
 31. దడ పుట్టించెడు యెండలీ విధిన మధ్యాహ్నంపు దావాగ్నులై
  హడలన్ గొట్టుచు మాడ్చివేయగను హాహాయంచు రక్షింపగాఁ
  గడకో శీతలయంత్ర రాజమును తేగా,దాని నేమందుపో
  వడగాలుల్ వడి వీచు చుండగ నెటుల్ వర్ణింతు దచ్చీతమున్!

  రిప్లయితొలగించండి
 32. గుడికిన్ వచ్చిన కన్నెపిల్ల బళిరా క్రొంగొత్త అందాలతో
  ఎడదన్ దోచుచు మానసమ్మును సతాయించంగ నాగుండెలో
  సడిచేసెన్ తొలిప్రేమ,రాగఝురికిన్ సంకేతమై నిల్చు పా
  వడగాలుల్ వడి వీచుచుండగ నెటుల్ వర్ణింతు దచ్చీతమున్
  వీటూరి భాస్కరమ్మ

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. భాస్కరమ్మ గారూ,
   మీ పూరణ చక్కగా ఉంది. అభినందనలు.
   'సతాయించు' అన్న అన్యదేశ్యాన్ని ప్రయోగించారు (పరవాలేదు లెండి!)

   తొలగించండి
 33. నడలా నాట్యము పాదముల్ ననలు లేనవ్వుల్ శరచ్చంద్రికల్
  నడుముల్ శూన్యము లందె నిక్వణములా నాట్యాను సంధానముల్
  పడుచుల్ పంచెడువేళ శీతల సుధా పానీయముల్ పట్టు పా
  వడగాలుల్ వడి వీఁచుచుండఁగ నెటుల్ వర్ణింతుఁ దచ్చీతమున్.

  రిప్లయితొలగించండి
 34. విడిపోయె బాధ నేటికి
  వడగాలుల, చల్లదనము వర్ణింతు నెటుల్
  వడగల్ల వానగురిసెను
  వడదెబ్బల బారినుండి పరిరక్షించెన్.

  రిప్లయితొలగించండి
 35. కం।।
  సడిజేయకయడవులనిల
  బడవేయుచునెదురుజూడవర్షముకొరకై
  నడివేసవిదినములలో
  వడగాలుల చల్లదనము వర్ణింతు నెటుల్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మాకెన నారాయణ పాత్రుడు గారూ,
   శంకరాభరణం బ్లాగు మీకు స్వాగతం పలుకుతున్నది. సంతోషం!
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 36. వడివడి వడగాలుల వలె
  తడబాటున గడిబిడిగ నడచి చండికగా
  గడిపెడి పడక సుఖంబన?
  వడగాలుల చల్లదనము వర్ణింతు నెటుల్|
  2.జడలోదాగినమల్లెవాసనల విశ్వాసంబు నన్నంటగా?
  తడబాటందున కళ్ళ కంటబడ నాధర్మంబులాభించగా
  వడగాలుల్ వడివీచుచుండగ నెటుల్ వర్ణింతు”దచ్చీతమున్
  విడువన్ జాలక పెళ్లి,శోభనము మావెంటంట సౌఖ్యంబెగా”|


  రిప్లయితొలగించండి
 37. క్రొవ్విడి వెంకట రాజారావు:

  ఒడికము తోడను తెలుపుగ
  కడలొత్తుచు నుత్తరమున కమనీయంబై
  నడయాడెడి యా హిమగిరి
  వడగాలుల చల్లదనము వర్ణింతు నెటుల్?
  (వడ=మంచు)

  రిప్లయితొలగించండి
 38. .బుడిబుడి నడకన బుడతడు
  తడబడుచును గడుపు ఘడియ దడదడ లాడెన్|
  “అడుగుల దుడుకున హర్షమె|
  వడగాలుల చల్లదనము”|వర్ణింతు నెటుల్?

  రిప్లయితొలగించండి
 39. గురువు గారు నమస్కారములు
  నిన్నటి నిషిద్దాక్షరి పూరణము ఒకసారి పరిశీలించి తప్పులున్న సరిదిద్దవలసినదిగా ప్రార్ధన (మొదటి మూడుపాదములు తొలగించవచ్చును )


  యాదవాంగన ఘన పృధ యవ్వనమున
  మౌని దుర్వాసుని వరము మహిమ చూడ
  దలచి, తపనుని మనమున తలచి నంత
  ద్వాదశాత్ముని వరముచే తలిరు బోడి
  గర్భ మున పుట్టి తల్లిచే గంగ లోన
  త్యజనమున్జేయ బడినట్టి త్యాగి యతడు ,
  సూత రమణిఔ రాధమ్మ సుతుడు అతడు,
  పరశు రాముని చేత శాపంబునొంది
  అస్త్ర శాస్త్రమ్ము మరచిన అల్పుడతడు
  విజయుడినెదిరించి నమేటి వీరు డతడు,
  రాజ రాజు అడుగ అంగ రాజ్య మేలి
  చెలిమి హస్తము నిడినట్టి స్నేహ శీలి,
  అల్పరధుడని భీష్ముడు అడ్డు బెట్ట
  గంగ సుతుడు రణమునందు భంగ పడగ
  యుద్ధభూమినిచేరిన యోధుడతడు
  ధరణి నుంచి తైలము తీసి ధాత్రి చేత
  శాప గ్రస్తుడై ఓడిన శౌర్య ధనుడు

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. నాగామణి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'రాధమ్మ సుతు డతండు' అనండి. 'రాజు+అదుగ, భీష్ముడు+అడ్డు' అన్నపుడు సంధి నిత్యం. "రాజరాజు కోరగ నంగరాజ్య..., భీష్ముడే అడ్డుబెట్ట" అనండి.

   తొలగించండి
 40. జడివానలోన జవ్వని
  తడిసెను తనతడి వలువల దండెము పైనన్
  తడియారబెట్టు తరి పా
  వడ గాలుల చల్లదనము వర్ణింతు నెటులన్

  జడిపించెడు గ్రీష్మమ్మున
  వడగండ్లనురాల్చిభూరి వానయె కురిసెన్
  నిడుజడి ధాటికి బాఱెను
  వడ, గాలులచల్లదనము వర్ణింతు నెటులన్.


  బిడియమ్మేలనె కొమ్మ చేరుమిక సంప్రీతిన్నిటన్నాదరిన్
  నడిరేయిన్ శశికాంతులే విరిసినన్ నాకయ్యదేయగ్నియై
  వడగాలుల్ వడి వీచుచుండగ, నెటుల్ వర్ణింతు దచ్చీతమున్
  పడతీరమ్మిక వేచితిన్ విరహ తాపమ్మందు నే కాగుచున్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. విరించి గారూ,
   మీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.
   సమూహంలో చేసిన సూచనలను గమనించండి.

   తొలగించండి


 41. కం:వుడుకు గాలులు వీవగ
  దడయు పుట్టెను మనమున తాపము హెచ్చెన్
  తడయక వర్షము కురియగ
  వడగాలుల చల్లదనము వర్ణింతు నెటుల్.

  కం:వడగండ్ల వాన పడగా
  వడగాలుల చల్లదనము వర్ణింతునెటుల్
  నుడుకెత్తించెడి నెండయు
  వడిగా చల్లబడనింక వసుమతి మురిసెన్.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ఉమాదేవి గారూ,
   మీ రెండు పూరణలు బాగున్నవి.
   సమూహంలో సూచించిన సవరణలను గమనించండి.

   తొలగించండి
 42. 4వడిగా సూర్యుని తాపమున్ గనియె సర్వాభీష్ట మోహంబునన్
  వెడలన్?నీరట నీరజాక్షి వలె సేవించంగనే మేఘమై
  వడిగాలుల్ వడి వీచుచుండగ నెటుల్ వర్ణింతు?దచ్చీతమున్
  తడిగా వానగ మార్చిభూమికిడె|సంతాపంబు మాన్పించగాన్|

  రిప్లయితొలగించండి
 43. *శ్రీమతీ జి సునీత బెంగుళూరు*

  *నడినెత్తిన్ బడెమండుటెండలటులోనాల్కెండదాహంబుతోన్*
  *మడమల్ మండెనువేడిదుమ్ముపడక్రమ్మన్ మబ్బునాకళ్ళకున్*
  *వడగండ్లున్ బడెరాళ్ళదాడులనగావాయంగకాయంబులే*
  *వడగాలుల్ వడివీచుచుండగనెటుల్ వర్ణింతు దచ్చీతమున్*

  *శ్రీమతీ జి సునీత బెంగుళూరు*

  రిప్లయితొలగించండి
 44. అడపా తడపా వానలు
  పడుటన నీపుడమి యంత పచ్చగ మార
  న్నెడదకు హాయిని గొలుపగ
  వడగాలుల జల్లదనము వర్ణింతు నెటుల్

  రిప్లయితొలగించండి
 45. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. సమస్యా పాదములో “దచ్ఛీతమున్” నకు ముద్రణ లోపమును బరికించ ప్రార్థన.

  రిప్లయితొలగించండి
 46. నడి వేసవి తాపముతో
  వడివడి సాగంగ జేరె ఫ ల హారముకై,
  తడిగలకమ్మని బెరుగా
  వడ గాలుల చల్ల దనము వర్ణింతు నెటుల్
  కొరుప్రోలు రాధాకృష్ణారావు

  రిప్లయితొలగించండి
 47. బుడతడు వేడిమి తాళక
  నుడుపుల మొత్తము విడచెను, దొరలెగ ముదమున
  పుడమిని,హాయిగ తోచిన
  వడగాలుల చల్లదనము వర్ణింతునెటుల్.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. హనుమంత రావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   రెండవ పాదం చివర తప్పక గురువుండాలి."దొరలె ముదమునన్" అనండి.

   తొలగించండి
 48. దుష్యంతుని సంభాషణము
  మదన శరములు తాకెను మనము పైన,
  నేను ఘనముగా కుంభిని నేలు చుంటి,
  ధాత కైనను పొగడంగ తరము కాదు
  నీదు సుందర రూపము, నీకలయిక
  దైవ నిర్ణయంబు మనకు, దేవ లోక
  అప్సరస శాపగ్రస్తఐ అడుగు బెట్టె
  నీ అడవిలోన,సీమంతినీ జనకుని
  ఆజ్ఞ కోరుట న్యాయమే, అలరు బోడి
  నన్ను నమ్ముము, దుష్యoతుడన్నమాట
  తప్ప బోడు, నీ తనయునే ధరణి పైన
  రాజు గా చేతు,ఇంతిరో, రమ్ము కరము
  పట్టి నాడెద ఇప్పుడే పరిణయమ్ము
  రిప్లయితొలగించండి
 49. మడిబట్టతోడ శ్రీమతి
  వడివడిగా జేసి వడలు వడ్డించగన్
  కడు ధృతి, పావడ పెరుగా
  వడగాలుల, చల్లదనము వర్ణింతు నెటుల్

  రిప్లయితొలగించండి
 50. నడవన్ వీధుల హైద్రబాదుననునే నాజూను మధ్యాహ్నమున్
  వడిగా వేగుచు వోటు వేయుటకునే బంజార హిల్సందునన్
  వడగాలుల్ వడి వీఁచుచుండఁగ నెటుల్ వర్ణింతుఁ దచ్చీతమున్
  పడిగాపుల్ పడి బారు నందుననునే బ్రాండీని కొట్టంగ హా!

  రిప్లయితొలగించండి