6, ఏప్రిల్ 2017, గురువారం

సమస్య - 2330 (జనకుండని పెండ్లియాడె...)

కవిమిత్రులారా! 
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
"జనకుండని పెండ్లియాడె జానకి రామున్"
(లేదా)
"జనకు డటంచు మోదమున జానకి పెండిలి యాడె రామువిన్"
ఈ సమస్యను పంపిన వీటూరి భాస్కరమ్మ గారికి ధన్యవాదాలు.

57 కామెంట్‌లు:

 1. మునిజన వందితుండు వరమోహనరూపుడు నీలకంధరున్
  ధనువును త్రుంచినట్టి గుణధాముడు రాముడు కైటభారియే
  మనసుల దోచు పుంగవుడు మానవమాత్రుడె? లోకమంతకున్
  జనకు డటంచు మోదమున జానకి పెండిలి యాడె రామునిన్

  రిప్లయితొలగించండి
 2. రిప్లయిలు
  1. అనవరత సత్య సంధుడు
   తనువున మనమున గుణమున ధన్యుడు నియతిన్
   జనగణ బహువిధ వైభవ
   జనకుండని పెండ్లియాడె జానకి రామున్

   తొలగించండి
 3. జనకుడు మునిజన రక్షక,
  జనకుడు సకలజన యోగ్య శాసన ములకున్,
  జనకుడు గుణముల, మోహన
  జనకుండని పెండ్లియాడె జానకి రామున్.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. శర్మ గారు నమస్కారము ఈ రెండు పూరణములు పరిశీలించి తప్పొప్పులు సూచించిన
   సరి దిద్దుకుంటాను.

   ఇనకుల తిలకుని అందము
   కనులారగ కాంచి మనము గాయము నొందన్
   ఘనరక్తి నొసగు మారుని
   జనకుండని పెండ్లియాడె జానకి రామున్
   మనసిజుడు,నిసారపుకే
   తనుడు, అసన్యజుడు, లచ్చితనయుడు,పూవిం
   టి,నవవిలుకాడు,రతిపతి
   జనకుండని పెండ్లియాడె జానకి రామున్


   తొలగించండి
  2. నాగలక్ష్మి గారు మీ ప్రయత్నానికి అభినందనలు. మొదటి పద్యంలో "గాయము" అన్న పదం బాగులేదు. గారవమొందన్ అనండి. గారవము= ప్రేమ, అభిమానం. ఆఫీసు నుండి ఇప్పుడే వచ్చి చూసాను. 2వ పద్యం మార్చాలి. మీ ఇమెయిల్ ఇస్తే దానికి పంపుతాను. నా ఇమెయిల్ tbsarma9@gmail.com, whatapp No. 9346676049.

   తొలగించండి


 4. గనవమ్మ జిలేబీ, సుతి
  జనకుండని, పెండ్లియాడె జానకి రాము
  న్నని,కాననమున కేగెను
  తనపతి వెనువెంట నమ్రతగ ధరణిజగన్ !

  జిలేబి

  రిప్లయితొలగించండి


 5. వినుతము రామ నామము సువీర్యము, మైథిలి గాథ భవ్యమౌ!
  వినుడిట లక్ష్మి భూమిజగ వీను గడింప గ తండ్రి యయ్యెనౌ
  జనకు డటంచు; మోదమున జానకి పెండిలి యాడె రామువిన్
  ఘనమగు విల్లు నాతడటు కంకవలెన్గని యెక్కు పెట్టగన్!

  జిలేబి

  రిప్లయితొలగించండి
 6. డా.పిట్టా
  ఘనుడగు విశ్వామిత్రుని
  అనయము బూజించి విద్యలన్నియు నేర్చెన్
  కనగా మది మరుని వ్యథా
  జనకుండని పెండ్లియాడె జానకి రామున్

  రిప్లయితొలగించండి
 7. డా.పిట్టా
  తనదౌ నాగలి కర్రునానగ ననున్ దా ప్రేమగా బెంచి స
  ద్వినయ విధేయతల్ గరపి విద్దెల దేల్చి:సుకన్య నీయగా
  ఘనమగు విల్లునెత్తు వరు గాంచ స్వయంవరమున్ రచించె నా
  జనకుడటంచు మోదమున జానకి బెండిలి యాడె రామునిన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మొదటి పాదం మత్తేభం వ్రాసారే?

   తొలగించండి
  2. డా.పిట్టానుండి
   ఆర్యా,పొరపాటు జరిగింది.మీసూచన కైనాకృతజ్ఞతలు
   తన హల నాలుకన్ గనిన దానను నన్ గడు ప్రేమ బెంచి స.......
   గా మార్చినాను,మన్నించగలరు

   తొలగించండి
  3. ఛడా.పిట్టానుండి
   దుష్ట సమాస పీడా నివారణకై శాంతిగా
   తన హల జిహ్వనున్ గనిన దానను నన్ గడు బ్రేమబెంచి స...గా చదవగలరు.,ఆర్యా

   తొలగించండి
 8. మునివెంట తండ్రి పంపగ
  ఘనమని నగరంబు వీడె కడుహర్షముతో
  వినయంబున కీతండే
  జనకుం డని పెండ్లియాడె జానకి రామున్.

  అనుపమమైన సత్వమున నద్భుతరీతి యతిప్రసిద్ధమౌ
  ధనువును ద్రుంచి నాడితడు తథ్యము నాదు మనంబు గెల్చె నీ
  ఘను డతిసుందరాంగు డిక గాంచిన భావి బ్రజాళి కీతడే
  జనకు డటంచు మోదమున జానకి పెండిలి యాడె రామునిన్.

  హ.వేం.స.నా.మూర్తి.

  రిప్లయితొలగించండి
 9. తను చే కదిపిన ధనువున్
  మనసే పులకించ నెత్త మహితాత్ముండౌ
  యినకుల తిలకుఁడు తగుననె
  జనకుండని, పెండ్లియాడె జానకి రామున్

  రిప్లయితొలగించండి


 10. ఘనమగు విల్లు నాతడటు కంకవలెన్గని కైగొనంగనౌ
  క్షణమున కూలగన్, రమణి కన్నులనవ్వుల గాన నయ్యరో,
  యినకుల తేజుడా విభుని యీగడ లారగ జూచి నౌర! స
  జ్జనకుడటంచు మోదమున జానకి పెండిలి యాడె రామునిన్

  జిలేబి

  రిప్లయితొలగించండి
 11. రిప్లయిలు
  1. అనయం బెడబాయని యా
   యనపాయని యాదిలక్ష్మి యాతుర మతియై
   మనమున నితడే మదనుని
   జనకుండని బెండ్లియాడె జానకి రామున్

   తొలగించండి
 12. ఇనకుల తిలకుని అందము
  కనులారగ కాంచి మనము గాయము నొందన్
  ఘనరక్తి నొసగు మారుని
  జనకుండని పెండ్లియాడె జానకి రామున్

  రిప్లయితొలగించండి
 13. ఇనకులతిలకునిగా భువి
  జనియించెను విష్ణువంచు సంతోషముతో
  కనుగొని యాతడు విశ్వపు
  జనకుండని పెండ్లియాడె జానకి రామున్

  రిప్లయితొలగించండి
 14. మనసిజుడు,నిసారపుకే
  తనుడు, అసన్యజుడు, లచ్చితనయుడు,పూవిం
  టి,నవవిలుకాడు,రతిపతి
  జనకుండని పెండ్లియాడె జానకి రామున్

  రిప్లయితొలగించండి
 15. కవి మిత్రులకు నమస్కృతులు.
  మా బావమరిది ఐదవ రోజు కార్యక్రమంలో వ్యస్తుణ్ణై ఉన్నాను. ఈరోజు పూరణలను సమీక్షించలేను. మన్నించండి.

  రిప్లయితొలగించండి
 16. వినుమా జగమున కంతకు
  జనకుండని పెండ్లి యాడె జానకి రామున్
  గ న గ ను సత్యమె గద యది
  ధనువును నతడె క్కువెట్టి దా నయె బతిగా

  రిప్లయితొలగించండి
 17. అనితర సాధ్య ధనుర్భం
  గ నినాద భరిత చలిత దిగంతక్వణనున్
  మనువాడు మనుచుఁ జెప్పెను
  జనకుండని, పెండ్లియాడె జానకి రామున్


  జననము దైవసంభవము సాగును మృత్యువు దైవికంబుగన్
  మనువది సేయ నేర రసమాన నరాధికులున్ యథేచ్ఛగన్
  ఘన విపినాంతరమ్మునను గష్టము లోర్చి వినోద మోద సం
  జనకుఁ డటంచు మోదమున జానకి పెండిలి యాడె రామువిన్

  రిప్లయితొలగించండి
 18. డా.పిట్టా
  తనదౌ నాగలి కర్రునానగ ననున్ దా ప్రేమగా బెంచి స
  ద్వినయ విధేయతల్ గరపి విద్దెల దేల్చి:సుకన్య నీయగా
  ఘనమగు విల్లునెత్తు వరు గాంచ స్వయంవరమున్ రచించె నా
  జనకుడటంచు మోదమున జానకి బెండిలి యాడె రామునిన్

  రిప్లయితొలగించండి
 19. అనువున రామ చంద్రుడు మహా మహు డౌచు భయంకరా స్త్రమున్
  దునుకలు జేసి సీతకు నితోధిక సంతసమొప్ప జేయగా
  వినుము సహోదరా యిది వివేకము తోడన భూ ప్రజాళికిన్
  జనకు డటంచు మోదమున జానకి పెండిలి యాడె రామునిన్

  రిప్లయితొలగించండి
 20. 1.కనగా శివుని ధనుస్సును
  ఘనుడై పుల్లగ విరుచుట కలగా తోచెన్!
  కనుగొన ముల్లోకమ్ముల
  జనకుండని పెండ్లియాడె జానకి రామున్!

  2.కన నసమాన్యుడౌను, ముఖకాంతియు(జూడ మహాత్ముడీతడౌ!
  తనయొక చేతనెత్తెను కదా! శివు కార్ముఖమున్, సుధీరుడై
  ఘనతను చాటగా విరిచె, కాడు నరుండని, ప్రాణికోటికిన్
  జనకు డటంచు మోదమున జానకి పెండిలి యాడె రామునిన్

  రిప్లయితొలగించండి
 21. యినకులమందు సంభవము నింపుగనొందె మురారి మర్త్యుడై
  ధనుజులఁ దున్మి శీఘ్రముగ తాపము మానిచి కాయ కుంభినిన్
  తునుమగ శూలిచాపమును తోయదళాక్షుడు, కమ్మవిల్తునిన్
  జనకు డటంచు మోదమున జానకి పెండిలి యాడె రామునిన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. రెడ్డిగారూ మీ పూరణ బాగుంది కానీ " కమ్మవిల్తునిన్ జనకు డటంచు " అంటే భావం దెబ్బ తింటోందేమో అనిపిస్తోంది.

   తొలగించండి
 22. రిప్లయిలు


  1. మనసును దోచిన దశరథ
   తనయుడు, రఘుకుల తిలకుడె తన వాడనుచున్
   తన కాగల సంతున కిల
   జనకుండని బెండ్లి యాడె జానకి రామున్!

   తొలగించండి

 23. పిన్నక నాగేశ్వరరావు.

  తననే కోరుకొనమనెను

  జనకుండని; పెండ్లి యాడె జానకి రామున్

  ఘనమగు యా నిండు సభను

  ధనువును ఛేదించినంత దశరధ సుతుడున్

  ********************************  పిన్నక నాగేశ్వరరావు.

  తననే కోరుకొనమనెను

  జనకుండని; పెండ్లి యాడె జానకి రామున్

  ఘనమగు యా నిండు సభను

  ధనువును ఛేదించినంత దశరధ సుతుడున్

  ********************************
  రిప్లయితొలగించండి
 24. ఇనకులవంశవార్నిధిని నీతడు శీతకరంపువేలుపై
  ఘనయశ మంది శంకరుని కార్ముకము న్నొగిలించె కాన కుం
  భినిసుత కీతడే తగును ప్రీతిని నిచ్చెద నంచు మెచ్చె నా
  జనకు డటంచు మోదమున జానకి పెండిలి యాడె రామునిన్.

  రిప్లయితొలగించండి
 25. అనయము సత్యము బల్కుచు
  ఘనముగ లోకాలనేలు గాళకుడనుచున్
  గనియగ నా ననవిలుతుని
  జనకుండని బెండ్లియాడె జానకి రామున్!!!

  రిప్లయితొలగించండి
 26. ఇనకులతిలకుడు మదిదో..
  చినవాడును సొగసును మగసిరి గలవాడున్
  తను నోచిన నోముల ఫల
  జనకుండని పెండ్లియాడె జానకి రామున్ !!

  మైలవరపు మురళీకృష్ణ.. వెంకటగిరి

  రిప్లయితొలగించండి
 27. మనసును దోచినట్టి కుసుమాయుధుడాతడు శైవకార్ముక
  మ్మునునవలీల చేతగొని ముక్కలు జేసె నటంచు జెప్పుచున్
  తన చెలికత్తెలన్ బిలిచి "దాశరథిన్ పరిహాసమాడగా
  జనకుడ" టంచు, మోదమున జానకి పెండిలి యాడె రామునిన్ !!

  చనకుడు... అంటే..వెళ్లవలదు


  మైలవరపు మురళీకృష్ణ.. వెంకటగిరి

  రిప్లయితొలగించండి
 28. దినకర శోభావంతుడు
  కనులను కలవర పరిచెడి కంతుడు; మనసా!
  విను! వీడే నాశిశువుల
  జనకుండని పెండ్లియాడె జానకి రామున్

  రిప్లయితొలగించండి
 29. ఇనకుల తిలకుండు సకల
  జనవంద్యుండాతడు మునిజన సేవకుడౌ
  దనుజాంతకుండు జగతికి
  జనకుండని పెండ్లియాడె జానకి రామున్ .


  ఘనమగు సూర్యవంశజుడు, కారణ జన్ముడు కానలందున
  న్ననుజుని గూడి తాపసుల యజ్ఞము గాచిన ధీరశాంతుడీ
  మునిజన వంద్యుడే భువన మోహను డీతడు సృష్టికేగదా
  జనకుడటంచు మోదమున జానకి పెండిలి యాడెరామునిన్ .

  రిప్లయితొలగించండి
 30. మనసును దోచెడిరూపము
  గనబడి శివధనువు నెత్త?ఘనుడనిచాటన్
  వినె “విలువిద్యల యందున
  జనకుండని” పెండ్లియాడె జానకిరామున్|
  2.ఘనుడగు రామచంద్రుడట గర్వము మాని ధనుస్సు నెత్తగా?
  మనసున సంతసంబొసగ మంగళ వాద్యపు పెళ్లి పందిటన్
  “యనువగు విద్యలున్ గల దయాగుణ సంపదలున్న శౌర్యమున్
  జనకుడటంచు”|మోదమున జానకి పెండిలియాడె రామునిన్ {రాముడుతండ్రివలేఅన్నభావన}

  రిప్లయితొలగించండి
 31. ధనువును వంచి దాశరథి ధాత్రిజ సీతను గాంచె నవ్వుచున్
  మనమున సిగ్గు హెచ్చగను మానిని రాముని వంక గాంచె నా
  జనపతులెల్ల జూడగను సమ్మతి దెల్పె వివాహమాడ నా
  జనకుడటంచ మోదమున జానకి పెండిలి యాడెరామునిన్ .

  రిప్లయితొలగించండి
 32. నాగలక్ష్మి గారు మీ ప్రయత్నానికి అభినందనలు. మొదటి పద్యంలో "గాయము" అన్న పదం బాగులేదు. గారవమొందన్ అనండి. గారవము= ప్రేమ, అభిమానం. ఆఫీసు నుండి ఇప్పుడే వచ్చి చూసాను. 2వ పద్యం మార్చాలి. మీ ఇమెయిల్ ఇస్తే దానికి పంపుతాను. నా ఇమెయిల్ tbsarma9@gmail.com, whatapp No. 934666049.

  రిప్లయితొలగించండి
 33. ధనువును విరిచిన వాడట
  యనాధి నిధనుడను పేరు నవనిలోనెపుడో
  ఘనముగ పొందిన బ్రహ్మకు
  జనకుండని పెండ్లి యాడె జానకి రామున్

  రిప్లయితొలగించండి
 34. పతిని జేరగ సతి రతిపతిని వేడ
  వనిని తపమొనరించు కపర్ది దీక్ష
  భగ్నమొనరింప మారుడు పంత మూన
  వీచె మందమారుతము క్ష్మాభృత్తు వీఁగె

  నిన్నటి సమస్యకు నా పూరణ

  వనమున రక్కసుల నడచు ,
  కనుగొని రావణుని గుల్చు నని ,యా రాముం
  డనితర రాజ్య ప్రగతికి
  జనకుండని పెండ్లియాడె జానకి రామున్

  రిప్లయితొలగించండి

 35. ఇనకులతిలకుండీతడు
  గనుమని పలుకుచు వసుధిజ కాంతుని మదిలో
  వినుతించుచు నా కంతుని
  జనకుండని పెండ్లియాడె జానకిరామున్

  రిప్లయితొలగించండి
 36. కనులకు కాటుకోయనగ కమ్మని రూపుని నీలవర్ణునిన్
  ఘనముగ విల్లు ద్రుంచుచును కన్నెల హృత్తును దొంగిలించెడిన్
  వినయ విధేయ మొప్పెడిని విజ్ఞుని వాసిగ తెచ్చినాడు నా
  జనకు డటంచు మోదమున జానకి పెండిలి యాడె రామునిన్

  రిప్లయితొలగించండి


 37. పశ్మీనా యను షాలు చుట్టుకొని కాపాడన్ భళా విట్టుబా
  బాశ్మాన్లో తిరుగాడుచున్ జనులనే, పద్యంబులన్ పాడగా,
  వేశ్మంబందున వేడిపుట్టగ భళా వేగమ్ము వేగమ్ముగా
  కాశ్మీరమ్మున నుగ్ర,"వాద" మొసఁగున్ గళ్యాణ మిద్ధాత్రికిన్!

  జిలేబి

  రిప్లయితొలగించండి