19, ఏప్రిల్ 2017, బుధవారం

చమత్కార పద్యం - 250

సీతా రావణ సంవాద ఝరి
 2 (-వ)
భూజాతే! నవభూషణో భవవరోపేత స్సదా వర్జితా
కీర్త్యౌఘోఽహ మివాస్తి కః కృతపరావజ్ఞశ్చ లోకే నరః
ప్రాణానాం దయితం వనైక నిలయం సీతే, కుతో మన్యసే
వ్యాహారస్తవ నీచవారహిత ఇత్యేవావగచ్ఛామి రే!

గమనిక : ఈశ్లోకంలో 'వ'కారము చ్యావిత మగును
రావణోక్తి:
ఆత్మస్తుతి:
నవ భూషణః = నూతనాలంకారములు గలవాడను
భవవరోపేతః = ఈశ్వర వరములు కలిగిన వాడను
సదా వర్జితా కీర్త్యౌఘ = ఎప్పుడు అపకీర్తిచేరనీయని వాడను
కృత పరావజ్ఞః = శత్రువులకు అవమానము ఘటించు వాడను
అని రావణుని ఆత్మస్తుతి
3వపాదంలో
వనైక నిలయం = వనములోనే వుండు వాడు అని రామనింద!
సీతా ప్రత్యుక్తి:
రే నీచ = ఓ నీచుడా!
తవ వ్యాహారః = నీ పలుకు
నీచవార హితః = నీచులకు మాత్రమే హితమైనది .  . అని సామాన్యార్థం కలిగి
వా రహితః = 'వ'కారము లేనిది అని సంకేతం
వ కారం తీసేస్తే రావణుడి సంగతి చూడండి
న భూషణః = ఆభరణములు లేని వాడను
భరోపేతః = భూమికి భారమైన వాడను
సదార్జితా కీర్త్యౌఘః = ఎప్పుడూ చెడు కీర్తి సంపాదించుకొను వాడను . అని రావణుని ఆత్మనిందగా మారుతుంది
కృత పరాజ్ఞః = శత్రువుల ఆజ్ఞలను నెరవేర్చు వాడను
అనికూడా!
3వపాదంలో వ తీస్తే
నైక నిలయం = ఒక చోట కాక సర్వవ్యాపకుడు అని రామ స్తుతిగా పరిణమించింది!

(‘బంధకవిత్వం’ వాట్సప్ సమూహం నుండి శ్రీ వైద్యం వేంకటేశ్వరాచార్యులకు, శ్రీ కె. శేషఫణి శర్మ గారలకు ధన్యవాదాలతో...)

4 కామెంట్‌లు:

  1. అధ్భుతమైన పద్యాలను అందిస్తున్న గురువర్యులకు పాదాభివందనములు!🙏🙏🙏🙏🙏

    రిప్లయితొలగించండి
  2. రాయనిభాస్కరుండు కవిరాయనిశంబునతండు చెప్పులో
    రాయని రాయనిమ్మనుచు రా యనిబిల్చిన నేగవద్దులే
    రాయని బల్కుచున్ కవులు రాయనిభాస్కరుగాంచి పారగన్
    రా యనికంచుబల్కె కదరా యనివార్యముకాదె యుద్ధముల్
    వీటూరి భాస్కరమ్మ

    రిప్లయితొలగించండి
  3. కవుల మథ్య వివాదం
    చమత్కార పద్యం

    రిప్లయితొలగించండి