1, ఏప్రిల్ 2017, శనివారం

సమస్య - 2325 (నారద మునిసత్తమునకు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
"నారద మునిసత్తమునకు నలువురు భార్యల్"
లేదా...
"నారద మౌనిముఖ్యునకు నల్వురు భార్య లతిప్రసన్నులున్"
ఈ సమస్యను పంపిన మిట్టపెల్లి సాంబయ్య గారికి ధన్యవాదాలు.

45 కామెంట్‌లు:

  1. నారాయణ యనుచు సతము
    పారాయణమందు గాన భక్తి జ్ఞాన
    మ్మౌరాయన కలహమ్ములు
    నారద మునిసత్తమునకు నలువురు భార్యల్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ప్రభాకర శాస్త్రి గారూ,
      గాన, భక్తి, జ్ఞాన, కలహాలు అనే నలుగురు భార్యలు నారదునకు అని చక్కని పూరణ అందించారు. విరుపును ఆశ్రయించకుండా మంచి భావంతో పూరించారు. అభినందనలు.

      తొలగించండి

    2. జీపీయెస్సు వారు

      అదురహో !

      ఔరాయను కలహమ్ములు,
      నారాయణుని నామజపము నారద తీరుల్ :)

      జిలేబి

      తొలగించండి
    3. పూజ్యులు శ్రీ శంకరయ్య గారికి వందనములు. విరుపు, క్రమాలంకారము ఇత్యాది క్రియలలో అన్వయం నాకు కష్టంగా ఉంటుంది. అందువలన సమస్యాపాదం యథాతథంగా ఉంచి పూరించే ప్రయత్నం లో క్రిందా మీదా పడుతుంటాను. నమస్సులు.

      తొలగించండి
    4. సీతాదేవి గారికి, జిలేబి గారికి శతసహస్ర ధన్యవాదములు...ఇచ్చట క్రమాలంకారము లేదు ;)

      తొలగించండి
  2. చేరగ నయోధ్యకత్తరి
    నారద మునిసత్తమునకు, నలువురు భార్యల్
    చేర దశరథాత్మజులట
    హారతు లిచ్చుచు ముదమున నభిమంత్రించెన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. తోపెల్ల బాలసుబ్రహ్మణ్య శర్మ గారూ,
      విరుపుతో మంచి పూరణ అందించారు. అభినందనలు.
      కర్తృపదం 'ఆత్మజులు' బహువచనం. క్రియాపదం 'అభిమంత్రించెన్' ఏకవచనం. "హారతు లిచ్చిరి ముదమున నతి భక్తి మెయిన్" అంటే ఎలా ఉంటుంది?

      తొలగించండి
    2. గురువుగారికి ధన్యవాదములు. మీ సూచన ప్రకారము సరిచేయుచూ
      చేరగ నయోధ్యకత్తరి
      నారద మునిసత్తమునకు, నలువురు భార్యల్
      చేర దశరథాత్మజులట
      "హారతు లిచ్చిరి ముదమున నతి భక్తి మెయిన్".

      తొలగించండి
  3. కోరగ పుత్రులన్ సతుల కోరివరింపగ నందరొప్పగా
    నారదు డొప్పజాలకయె నాకిక శ్రీహరి ముఖ్యమౌననన్
    ధారణుడీయ శాపమట తాజని యింపగ వేల్పుగాణకున్
    నారద మౌని ము ఖ్యునకు నల్వురు భార్యలతి ప్రసన్నులున్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. తోపెల్ల వారూ,
      మీ రెండవ పూరణ పద్యం చక్కగా ఉంది. కాని చెప్పిన కథాంశం బోధ పడలేదు. వివరించండి.

      తొలగించండి
    2. శంకరార్యులకు నమస్సులు.
      ధారణుడు= బ్రహ్మ. వేల్పుగాణకుడు = గంధర్వుడు.

      బ్రహ్మ వైవర్త పురాణ గాథ ప్రకారం ఒకరోజు బ్రహ్మ కుమారులను పిలిచి పెళ్ళి చేసుకొని ప్రజా సంతతి పెంచమని కొరగా అందరూ అంగీకరించినా నారదుడు సంసార బంథాలను తిరస్కరిస్తూ నాకు శ్రీహరి మీద తప్ప మరొకరి మీద మనసులేదని చెప్పగా బ్రహ్మకు కోపం వచ్చి నీవు కాముకుడవై పుట్టుమని శపింపగా “నీకు పూజా కవచములు లేకుండుగాక” యని బ్రహ్మకు ప్రతి శాపమిస్తాడు నారదుడు. తండ్రి శాప ప్రభావంచే ఓ గంధర్వుని ఇంట ఉప బర్హనుడై పుట్టి లాలావతిని ఆమె చెల్లెళ్ళను పెళ్ళాడతాడు. ఈ గాథ ప్రకారం పూరణ చెయ్యడం జరిగినది.

      తొలగించండి


  4. శారద పలికెను ముదమున
    నారద ! మునిసత్తమునకు నలువురు భార్యల్
    యీరము, శ్రద్ధ, వివేకము
    ధారణ, వినుమా సమాధి తరమై గానన్ !

    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీ గారూ,
      నారద శబ్దాన్ని సంబోధనగా చేసిన మీ పూరణ బాగున్నది.
      'ఈరము'ను ఏ అర్థంలో ప్రయోగించారు. దానికి పొదరిల్లు, సాంద్రత (thickness) అన్న అర్థాలున్నవి.

      తొలగించండి

    2. హృదయంలో తడి అన్న అర్థం లో ఆర్ద్రత అన్న అర్థం లో వాడానండి


      జిలేబి

      తొలగించండి
  5. కోరిక పరదేశములం
    దీరంగా చదివి వాడు దెలిపెను తానా
    గౌరీపతి కేశవుడే
    నారదముని సత్తమునకు నలుగురు భార్యల్.

    కోరిక దీర విద్య లతి కూర్మిగ నేర్చి విదేశమందు నా
    కారము మార్చి వాడిచట గాంచిన గాకర గీకరా యనెన్
    గౌరికి భర్త కేశవుడు కాంచు డటంచును బల్కె నీగతిన్
    నారద మౌనిముఖ్యునకు నల్వురు భార్య లతిప్రసన్నులున్.

    హ.వేం.స.నా.మూర్తి.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
      మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
  6. డా.పిట్టా
    వారమదేమో పోని యు
    దారుడు నేప్రియలు ఫూలు దానాడెనదో
    కారణ కార్యములను గన
    "నారద ముని సత్తమునకు నలువురు భార్యల్"

    రిప్లయితొలగించండి
  7. డా.పిట్టా
    కోరి సకాలముం గలహ కారణుడౌటయె మోజు వానికిన్
    సారములేని భోజనము సత్కృతి జేయుట కాలయాపనా
    భారము దీర్చ నల్గురిని భార్యలుగా నిల బెంచె నా గతిన్
    నారద మౌని ముఖ్యునకం నల్వురు భార్యలతి ప్రసన్నులున్

    రిప్లయితొలగించండి
  8. డా.పిట్టా
    ముఖ్యుయునకు ఆసున్నా టైపాటు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పిట్టా సత్యనారాయణ గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
  9. తీరైన 'వాక్పటిమ'తో
    'వైరమ్ము'ను 'స్పర్ధఁ'గదిపి వ్యాజ్యమ్మందున్
    గోరిన 'శ్రేయమ్ము' బడయ
    నారద మునిసత్తమునకు నలువురు భార్యల్

    రిప్లయితొలగించండి
  10. నారాయణార్చనప్రియ
    శారదగానప్రియ నుతసంచారనయా
    చారప్రియ కలహప్రియ
    నారద మునిసత్తమునకు నలువురు భార్యల్

    ఆరయ నగ్నిసాక్షిగ మను వాడిన సాక్ష్యము లెవ్వి లేకనే
    జేరిరి ప్రేయసీమణులు చెంతకు నోలి హితార్థలోకసం
    చారిణి భక్తిరూపిణి విశారదరాగిణి భేదనాంగనల్
    నారద మౌనివర్యునకు నల్వురు భార్య లతిప్రసన్నులున్

    రిప్లయితొలగించండి
  11. నీరము భార్య పోయగ మునీంద్రుని పాద ద్వయంబు రాముడున్
    కూరిమి యొప్పగా కడిగె, గొంతుకు గంధము పూసె సోదరుల్,
    హారతి నిచ్చి మువ్వురును, హర్షము కూర్చెను కోసలీ మణుల్
    నారద మౌనిముఖ్యునకు, నల్వురు భార్యలతి ప్రసన్నులై


    రిప్లయితొలగించండి
  12. ఆ ఋషులు నల్వు రప్పుడు
    నారద మునిసత్తమునకు, నలువురు భార్యల్
    నీరీయఁ గడిగి పదముల
    పార ముదమ్మునఁ గొలిచిరి పరమాసక్తిన్


    నారద! మౌని ముఖ్యునకు నల్వురు భార్య లతిప్రసన్నులు
    న్నేరనఁ బల్కె భాగవతుఁ డింపగు మాటల నిశ్చయంబుగన్
    ఘోర మదమ్ము లోభమును గోపము మోహము దా భరింపగన్
    ధీర తపమ్ము చేత నిలఁ దీరును దార లనంగ వాటినిన్

    రిప్లయితొలగించండి
  13. ఆరయ భక్తియు కలహము
    నారాయణు గాన మదియ జ్ఞానము లవియే
    యూరా యనునటు గలుగుత
    నారద ముని సత్తమునకు నలువురు భార్యల్

    రిప్లయితొలగించండి
  14. వారిజజుని శాపమునను
    నారాయణ ప్రేరణమున నారీమణులన్
    వీరునివలె బెండ్లాడగ
    నారద మునిసత్తమునికి నలువురు భార్యల్!

    బ్రహ్మశాపమున లీలావతి, చెల్లెండ్లను, విష్ణు వ్యూహమున సుకుమారిని నారదుడు పెండ్లియాడెనని పురాణగాధ

    రిప్లయితొలగించండి
  15. నారద మౌని ముఖ్యునకు నల్వురు భార్య లతి ప్రసన్నులు
    న్నూరక మాటలా విధము నోటిని బల్కగ నాయమేన? యో
    వీరయ శాస్త్రి !నీ విపుడు వేమఱు బల్కుట , దెల్సుకో సుమీ
    నారద మౌని సత్తముడు నాకము నందున వాసముండుగా

    రిప్లయితొలగించండి
  16. Repati samsya 2/4/2017
    Nathalu maatada viniyenakkayu.vedkan

    Or
    Nathalu maatalaada vinanakkayu mikkili modamanduchun
    Ichinavaru veeturi bhaskaramma

    రిప్లయితొలగించండి
  17. భారము పెండ్లి జీవితము బాధల కుప్పది, బ్రహ్మచర్యమే

    శౌరిని సంస్తుతించుటకు జక్కని మార్గము నిర్మలాత్యతో

    నారద మౌని ముఖ్యునకు, నల్వురు భార్య లతిప్రసన్నులున్

    గోరి వరించి రాము పిత గూరిమితోడను గూడియుండరే

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. భారము పెండ్లి జీవితము బాధల కుప్పది, బ్రహ్మచర్యమే

      శౌరిని సంస్తుతించుటకు జక్కని మార్గమ టంచు దేచె నా

      నారద మౌని ముఖ్యునకు, నల్వురు భార్య లతిప్రసన్నులున్

      గోరి వరించి రాము పిత గూరిమితోడను గూడియుండరే


      తొలగించండి
  18. నారాయణ మంత్రమ్మే
    పారాయణ జేయునట్టి పాత్రకుమేటై
    చేరినకంపెని వాడే
    నారద మునిసత్తమునకు నలువురు భార్యల్|
    2.ప్రేరణనింపి రొక్కరును-వేషపు పోషణ నేర్పిరొక్కరున్
    మారని రాగతాళములు-మౌనికి భక్తిగ పాటలొక్కరున్
    ధారణయందునన్ నటనదర్పము బెంచిరి పాత్రదారికిన్|
    నారద మౌని ముఖ్యునకు నల్వురుభార్యలతి ప్రసన్నలున్|

    రిప్లయితొలగించండి
  19. నారాయణ మంత్రము, కడు
    పార గలహ భోజనమును, పాయని పద సం
    చారము, గానములె సుమీ
    నారద ముని సత్తమునకు నలువురు భార్యల్!

    చిన్న మార్పుతో మరలా వ్రాశాను, తప్పొప్పుల సూచింప ప్రార్థన.
    నారాయణ మంత్రము, కడు
    పారగ కలహముల తిండి, పాయని పద సం
    చారము, గానములె సుమీ
    నారద ముని సత్తమునకు నలువురు భార్యల్!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చక్కని పూరణ చేసిన కవిమిత్రులు శ్రీధర రావు గారికి నమస్సులు. ధన్యవాదములు.

      తొలగించండి
    2. కవి మిత్రులు సత్యనారాయణ రెడ్డి గారికి వందనములు. ధన్యవాదములు.

      తొలగించండి
  20. శౌరిసతులు ద్వయ గములై,
    నారదముని సత్తమునకు, నలుగురు భార్యల్
    కోరికను తెలియజేసిరి
    చేరుచు పీతాంబరుఁ దమ చెంతకటంచున్

    రిప్లయితొలగించండి
  21. నారాయణ నామజపము
    వైరాగ్యము యుక్తి మరియు వాగ్వాదములే
    కారణజన్ముండౌ యా
    నారదమునిసత్తమునకు నలుగురు భార్యల్!!!

    రిప్లయితొలగించండి
  22. నీరజదళాక్షు భజనయు
    ధారుణిఁ గలహాశనమ్ము తంబుర మ్రోతల్
    తీరగు సంచారమ్ములు / (తీరుగ జగముల తిరుగుట)
    నారదముని సత్తమునకు, నలుగురు భార్యల్

    రిప్లయితొలగించండి
  23. ఔరా! ఎవడికట కలహ
    కారుండనిపేరు? కుంతి కనెనెందరినో?
    దారలనగానెవరిలను
    నారద ముని సత్తమునకు, నల్వురు, భార్యల్.


    భారతి దల్లిగా కొలుచు భాగ్యము దక్కెనెవండకో గదా?
    మారిషపుత్రి కుంతికి కుమారులుగా నిల బుట్టిరెందరో
    దారలనంగ నెవ్వరు? సుధార్థులు దేవత లెట్టివారలో
    నారద మౌని మూఖ్యునకు, నల్వురు, భార్యలతి ప్రసన్నులున్.

    రిప్లయితొలగించండి
  24. కారణజన్ముడున్ఁ దపసి గానకళా పరిపూర్ణ వేదియున్
    శారద వద్ద విద్యలను చక్కగ నేర్వగ, గొల్వ నిత్యమున్
    వారిజనేత్రు, సారమతి భైరవి మోహన్ తోడి రాగముల్
    నారద మౌనిముఖ్యునకు నల్వురు భార్య లతిప్రసన్నులున్

    రిప్లయితొలగించండి
  25. నీరజ నేత్రుకొల్చుటయు నిత్యము నిశ్చల మానసమ్ముతో
    తీరుగ సంచరించుటయు ధీషణతోడప్రపంచమంతయున్
    తేరగ చిక్కుకయ్యముల తిండియు, తీగల వాద్యఘోషయున్
    నారద మౌనిముఖ్యునకు నల్వురు భార్య లతిప్రసన్నులున్

    రిప్లయితొలగించండి
  26. కవిమిత్రులారా,
    నిన్న ఉదయం సంగారెడ్డికి వెళ్ళి సాయంత్రం అక్కడి కవిసమ్మేళనంలో పాల్గొని హైదరాబాదు ద్వారా ప్రయాణం చేసి ఇప్పుడే ఇల్లు చేరాను. అందువల్ల మీ పూరణలను సమీక్షించలేకపోయాను. మన్నించండి.

    రిప్లయితొలగించండి
  27. వారము వారమున్ వడిగ భారిగ సాగుచు సర్వలోకముల్
    కారణ జన్ముడై భళిగ కైటభవైరిని ప్రస్తుతించెడిన్
    నారద మౌనిముఖ్యునకు నల్వురు భార్య లతిప్రసన్నులున్
    గారవ రీతినిన్ వెలయు గానము భక్తియు జ్ఞానకల్హముల్

    రిప్లయితొలగించండి