12, ఏప్రిల్ 2017, బుధవారం

సమస్య - 2336 (శ్రీనాథుని కృతిగ...)

కవిమిత్రులారా! 
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
"శ్రీనాథుని కృతిగ మనుచరిత్రయె యొప్పున్"
(లేదా...)
"శ్రీనాథుండు రచించి మించె మనుచారిత్రమ్మునున్ బ్రీతితో"
(కవిమిత్రులకు మనవి... ఈరోజు మా బావమరది దశదిన కర్మకాండకు వెళ్తున్నాను. రోజంతా వ్యాస్తుడనై ఉంటాను. కనుక దయచేసి పరస్పర గుణదోష విచారణ చేసికొన వలసిందిగా మనవి.)

85 కామెంట్‌లు:

 1. రిప్లయిలు
  1. శ్రీ నగరాజ తనయగొన
   నా నాగాభరణ ధరుని యాతన దెలుపన్
   దా నుడువ "హరవిలాసము"
   శ్రీనాథుని కృతిగ మను; చరిత్రయె యొప్పున్!

   తొలగించండి
  2. శిష్ట్లా శర్మ గారూ,
   'మను-చరిత్ర'ను విలక్షణమైన విరుపుతో క్రొత్త అర్థాన్ని సాధించి చక్కని పూరణ చెప్పారు. అభినందనలు.

   తొలగించండి
 2. ఔనా? నైషధ మేనోయ్
  శ్రీనాథుని కృతిగ! మనుచరిత్రయె యొప్పున్
  కానగ పెద్దన రచనే;
  తానే యాంధ్ర కవితా పితామహు డాయెన్!

  రిప్లయితొలగించండి
 3. కానగ కాశీ ఖండము
  "శ్రీనాథుని కృతిగ, మనుచరిత్రయె యొప్పున్"
  తానల్ల సాని కృతియని
  మానిత గ్రంథము లవియె సు మా యాంధ్రమునన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. శర్మ గారూ,
   విరుపుతో చక్కని పూరణ నందించారు. చాలా బాగుంది. అభినందనలు.

   తొలగించండి


 4. మానిని! కాశీ ఖండం
  శ్రీనాథుని కృతిగ, మనుచరిత్రయె యొప్పున్
  తానౌ పెద్దన కృతిగన్
  గానన్నీ రెండు మేలు కావ్యములనఘా !

  జిలేబి

  రిప్లయితొలగించండి
 5. దీనారంబుల దీర్థమాడి కవి ప్రీతిన్ మానసోల్లాసమున్
  "శ్రీనాథుండు రచించి మించె; మనుచారిత్రమ్మునున్ బ్రీతి తో"
  తానందించి తెనుంగునన్ సుకవితా తాదృక్ష మానంబు గా
  తానల్లెన్ కన నల్లసాని కవితా దాక్షిణ్య మొప్పారగన్.

  తాదృక్ష మానము = అటువంటిదనునట్లు
  దాక్షిణ్యము = చాతుర్యము, నేర్పు.

  రిప్లయితొలగించండి
 6. ఆనందాంబుధి తేల్చు భాగవత మాహ్లాదంబుగా వ్రాసె నా
  జ్ఞానీశుండగు పోతరాజు, నిషధున్ చారిత్రమున్ మేటియై
  శ్రీనాథుండు రచించి మించె, మనుచారిత్రంబునున్ఁ బ్రీతితో
  తేనెల్ జిల్కుచు వ్రాసె పెద్దన మహాతేజంబు నింపాఱగన్

  రిప్లయితొలగించండి
 7. నానా కవులకు పాఠ్యం
  కానగ కవులంత మెచ్చు కావ్యముగానూ
  నీ,నా పెద్దన కవితా
  శ్రీనాథుని కృతిగ మనుచరిత్రయె యొప్పున్
  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. రాజ్ కుమార్ గారూ,
   పెద్దనను కవితా శ్రీనాథుడు అనడం వైవిధ్యంగా ఉంది. మంచి పూరణ. అభినందనలు.
   'పాఠ్యము... కావ్యము గానన్/గనుకన్' అనండి.

   తొలగించండి
 8. మానితము హరవిలాసము
  శ్రీనాథుని కృతిగ; మనుచరిత్రయె యొప్పున్
  దా నెల్ల కవుల పెద్దన
  గా నెగడిన పెద్దనార్యు కావ్య మనంగన్.

  రిప్లయితొలగించండి
 9. డా.పిట్టా
  ఈనాడెంతటి దీక్షయొ
  పోనాడిరి గతమునెల్ల పూర్ణ వికాసం
  బేనాడు నౌను యువకా!
  "శ్రీనాథుని కృతిగ మను చరిత్రయె యొప్పెన్?!"

  రిప్లయితొలగించండి
 10. డా.పిట్టా
  శ్రీనాథుండు రచించి మించె;మనుచారిత్రమ్మునున్ బ్రీతితో
  ధ్వానా శాస్త్రియె వ్రాసె నంచనరె, యీ వాసిన్ గనన్ కావ్య సం
  ధానాల్ చారితులేల నేడు గన పంథాలెల్ల మారెన్ గదా!
  "పోనీ!పద్యమటన్న'కంది' వినడే! భోషాణముల్ నింపెడిన్?!

  రిప్లయితొలగించండి
 11. నానీ ! యిటు వ్రాసితివొకొ ?
  "శ్రీనాథుని కృతిగ మనుచరిత్రంబొప్పున్
  గానగ "నని , దోసమ్మిది,
  నేనెట్టుల గుణములిత్తు , నిదె సున్నాయే!!

  రిప్లయితొలగించండి
 12. శ్రీనాధుండన బరగుచు
  శ్రీనాధుని గొల్చుసతము శ్రీకరముగను
  స్త్రీనాధుండుగ నొప్పగ
  శ్రీనాధుని కృతిగ మను; చరిత్రయె యొప్పున్!

  శ్రీనాధుడు = శ్రీమంతుడు
  శ్రీనాధుడు = శ్రీ చేత పూజింప బడినవాడు = ఈశ్వరుడు
  కృతిగ =కార్యముగ

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. రెండవ పాదంలొ శ్రీకరముగనే యని చదవ ప్రార్ధన!

   తొలగించండి
  2. శ్రీదేవిగారూ! పద్యం బాగుంది.
   మీ పేరే శ్రీదేవి. శ్రీదేవి అంటే లక్ష్మి కదా, శ్రీనాథుడు విష్ణువు కదా. మరి శివుడన్నారే? శివుడనడంలో ఏమైనా విశేషార్థముందా?

   తొలగించండి
  3. నేమానిగారూ నమస్కారము!
   ఇక్కడ శ్రీ ని శ్రీకాళహస్తి లోని శ్రీ యనగా సాలెపురుగు యనే అర్ధంలో వాడాను! శ్రీ చేత పూజింపబడ్డాడు కాబట్టి శ్రీనాధుడని భావన!

   క్రింద పాదసూచీ యిచ్చాను గమనించ గలరు!
   పద్యం నచ్చినందుకు ధన్యవాదాలు!

   నా పేరు సీతాదేవి!

   తొలగించండి
  4. సోమయాజులు గారికి నమస్సులు.

   కవయిత్రి పేరు "సీతా దేవి". గమనించ ప్రార్ధన. ఐనా పేరులో ఏముంది పెన్నిధి?   G P Sastry (gps1943@yahoo.com)ఫిబ్రవరి 19, 2017 1:13 AM

   "శాస్త్రి" పేరున్న వారెల్ల శాస్త్రులవరు
   "సోమయాజులు" జేయరు హోమములను
   "వెంకటావధాని" వణికి వీవ లోన
   పృచ్ఛకులఁ గాంచి "యవధాని" బెదరి పాఱె


   వీవ = Viva Voce

   ప్రత్యుత్తరంతొలగించు

   ప్రత్యుత్తరాలు   కంది శంకరయ్యఫిబ్రవరి 19, 2017 10:58 PM

   ప్రభాకర శాస్త్రి గారూ, 
   పేరులో నేమున్నది పెన్నిధి అన్నట్టు చెప్పిన మీ పూరణ మనోరంజకంగా ఉంది. అభినందనలు.

   తొలగించండి
  5. సీతాదేవిగారూ! వివరణకి ధన్యవాదములు

   తొలగించండి
  6. శాస్త్రిగారూ! మీరు చెప్పినది నిజం.
   శంకరయ్యగారు నాగురించు బాగా కనుగొన్నారు, నేనెప్పుడూ హోమం చేయలేదని.

   తొలగించండి
 13. అనాటి యల్లసానియె
  తానే మనుచరిత వ్రాసె ధారుణి, వినుమా
  కానగ కాశీ ఖండము
  శ్రీనాథుని కృతిగ మను, చరిత్రయె యొప్పున్

  రిప్లయితొలగించండి
 14. సానందామృతధారగా హరవిలాసమ్మున్ గడున్ భక్తితో
  శ్రీనాథుండు రచించి మించె ! మనుచారిత్రమ్మునున్ బ్రీతితో
  ధ్యానాంతఃకరణుండు పెద్దన బృహద్గ్రంథమ్ముగా వ్రాసె ! ది
  వ్యానందమ్ము లభించు మార్గమన గావ్యాలపనమ్మొక్కటే !!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మురళీకృష్ణ గారూ! అద్భుత ధారతో సాగిన మీ పూరణకు మీకు నమస్సులు.అభినందనలు." కావ్యాలాపన"
   అన్నచోట ముద్రారాక్షసం దొర్లినది.

   తొలగించండి
  2. శ్రీ బాలసుబ్రమణ్యశర్మ గారూ.. నమోనమః.. ముద్రారాక్షసము గమనింపలేదు.

   సానందామృతధారగా హరవిలాసమ్మున్ గడున్ భక్తితో
   శ్రీనాథుండు రచించి మించె ! మనుచారిత్రమ్మునున్ బ్రీతితో
   ధ్యానాంతఃకరణుండు పెద్దన బృహద్గ్రంథమ్ముగా వ్రాసె ! ది
   వ్యానందమ్ము లభించు మార్గమన గావ్యాలాపనమ్మొక్కటే !!..

   ధన్యవాదాలండీ.. 🙏🙏🙏🙏

   తొలగించండి
 15. కానవలె హరవిలాసము
  శ్రీనాధుని కృతిగ,మనుచరిత్రయె యొప్పున్
  మానన మొందిన పెద్దన
  భానుని బింబం బుగాన భముపై వెలుగన్

  రిప్లయితొలగించండి
 16. కానవలె హరవిలాసము
  శ్రీనాధుని కృతిగ,మనుచరిత్రయె యొప్పున్
  మానన మొందిన పెద్దన
  భానుని బింబంబు గా నభముపై వెలుగన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. తోటి కవి వరులకు నమస్కారములు. ఈ పద్యమును పరిశీలించి తప్పులున్న సూచించిన
   సరి చేసుకుందును

   తొలగించండి
  2. నాగమణి గారు మీ పూరణ చాలా బాగుంది. “మానన ఆ కారాంత స్త్రీ లింగ పదము. “మానన” తత్సమము. “మానన నందిన పెద్దన” అనండి బాగుంటుంది.

   తొలగించండి
  3. ధన్యవాదములు కామేశ్వర రావు గారు. ఇప్పుడే పద్యాలలో ఓనమాలు నేర్చుకుంటున్నాను. తప్పులు సవరించుకుంటాను.

   తొలగించండి
 17. నేనును కవినని యొకడనె
  శ్రీనాథుని కృతిగ మనుచరిత్రయె యొప్పున్;
  నేనున్నేగెద హిమగిరి
  నానాతి వరూధినిఁగొన నా ప్రియ సతిగన్

  ఆ నైషధ మెప్పును గద
  శ్రీనాథుని కృతిగ; మనుచరిత్రయె యొప్పు
  న్నూనుచు జిగిబిగి కవితకు
  తానే యను నల్లసాని ధర యెరుగంగన్

  రిప్లయితొలగించండి
 18. తానున్ వేడ్కతొ కృష్ణరాయల సభా స్థానమ్మున్ రంజిలన్
  వేనోళ్ళన్ నుతియించి రాజు కవిగన్ వేమారు నర్పింపగన్
  కానంగన్ సిరులెల్ల నిండునెడలన్ కాడే నాడు పెద్దన్న తా
  శ్రీనాథుండు రచించి మించె మను చారిత్రమ్మునున్ బ్రీతితో  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. శ్యామలగారూ, పద్యం బాగుంది. కొన్ని సవరణలు.
   తొ, చె అని హ్రస్వం వాడకూడదు.
   మొదటి పాదం చివరలో గణదోషం వచ్చింది. కాబట్టి మొదటి పాదం ఇలా మారిస్తే బాగుంటుందేమో
   తానున్ వేడ్కగ కృష్ణరాయల సభాస్థానమ్ము రంజింపగా
   మూడవ పాదంలొ కూడా గణదోషముంది.
   కానంగన్ సిరులెల్ల నిండునెడలన్ కాలేడు పెద్దన్న తా

   తొలగించండి
 19. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 20. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 21. భూనాథుడు కృతి నందుచు
  తానే పల్లకిని మోసె తత్స్థితు డగు నా
  ధీనిధి పెద్దన సుయశ
  శ్శ్రీనాథుని కృతిగ మనుచరిత్రయె యొప్పున్.

  భూనాథుం డగు కృష్ణరాయవిభు డా పుణ్యాత్ముడౌ పెద్దనన్
  జ్ఞానాఢ్యున్ సభలోన పెద్ద యనుచున్ నానాప్రకారంబు స
  న్మానించన్ ఘను డల్లసాని కవి తా మన్నించుచున్ సద్యశ
  శ్శ్రీనాథుండు రచించి మించె మనుచారిత్రమ్మునున్ బ్రీతితో.

  హ.వేం.స.నా.మూర్తి.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. శ్రీ హరి మూర్తి గారూ! పెద్దన గొప్పతనాన్ని పొందిన మర్యాదలను కూడా ప్రస్తావవించిన మీ పురాణం అద్భుతంగ ఉన్నది. అభినందనలు.

   తొలగించండి
  2. ఆర్యా!
   ధన్యవాదములు.
   నమస్కారం.

   తొలగించండి
  3. మూర్తి గారు యశశ్శ్రీ నాథునిగా పెద్దనార్యునకు తగిన విశేషణము వాడినారు. చాలా బాగుంది.

   తొలగించండి
  4. హరిగారూ! మీ పూరణ చక్కగా ఉంది.

   తొలగించండి
  5. ఆర్యులందరికీ ధన్యవాదములు, నమస్కారములు.

   తొలగించండి
 22. దానగుణుండు పవిత్రం
  బైన ద్విజ కులోద్భవుఁడు మహా కవులకుఁ బ్రా
  చీనుఁడు పెద్దన, భక్తుఁడు
  శ్రీనాథుని, కృతిగ మనుచరిత్రయె యొప్పున్


  వేనోళ్లం బొగడంగ భూజనులు సంప్రీతిన్ ధరాధీశుఁడుం
  దా నత్యంత ముదంబునం దొడిగె నంతన్ గండపెండేరమున్
  నానాసూక్తుల నల్లసానికుల రత్నంబాంధ్ర సద్వాఙ్మయ
  శ్రీ నాథుండు రచించి మించె మనుచారిత్రమ్మునుం బ్రీతితో

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అద్భుతమండీ పోచిరాజు వారు


   జిలేబి

   తొలగించండి
  2. "వేనోళ్లం బొగడంగ" ఇంతకన్నా ఏమి చెప్పగలను మీ పూరణలకు. శతనమస్కార పూర్వకాభినదనలు పోచిరాజ వరేణ్య.

   తొలగించండి
  3. జిలేబి గారికి, శర్మ గారికి మనఃపూర్వక ధన్యవాదములు.

   తొలగించండి
  4. శ్రీ పోచిరాజు కామేశ్వరరావు గారూ...మనోహరమైన పూరణ.. అభివందనచందనములు

   తొలగించండి
  5. మురళీకృష్ణ గారు నమఃపూర్వక ధన్యవాదములు. మీ పూరణము గూడ మనోజ్ఞముగా నున్నది.

   తొలగించండి
  6. అత్యంత మనోహరమైన పూరణలండి. నమస్సులు.

   తొలగించండి
  7. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

   తొలగించండి
  8. అయ్యా పోచిరాజువారూ! మీ పూరణలు చాలా బాగున్నాయి. నా ఈమైల్ nsomaya@gmail.com ; అభ్యంతరం లేకపోతే మే ఈమైల్ పంపగలరు.

   తొలగించండి
  9. సోమ్ నేమాని గారు ధన్యవాదములు. E-mail: kamesh_pochiraju@yahoo.co.in.
   నా పేరు మీద నొక్కితే నా బ్లాగు లో నా రచన లన్ని చూడ వచ్చును.

   తొలగించండి

 23. ఓనామాలను నేర్వ లేదు, యువిదన్నో శంకరార్యా! వశా,
  శ్రీనాథుండు రచించి మించె మనుచారిత్రమ్మునున్ బ్రీతితో
  ఓనా తల్లి యనన్ జిలేబి సరియేమో శంకరుల్ పల్కు లే
  మానాదంబని నేర్చునయ్య వినుచున్ మారెప్పుడున్జెప్పదౌ !

  జిలేబి

  రిప్లయితొలగించండి
 24. ఏమిటి జిలేబి లేమా?
  కొమ్మరొ సందేహము తను కొంటె పురుషుడే!
  భామా రుక్మిణి గబ్లా
  గుమాట వినలేదొ కంది గురువులు నెట్లో!

  With due apologies to Jilebi garu!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు

  1. సీతాదేవి గారు

   నమో నమః మీ కందంతో మరో శార్దూలం తయార్ :)

   యేతావున్ గలవే జిలేబి రమణీ ! యేవూరు మీదమ్మ యీ
   రాతల్లెక్కడ నేర్చినావు కవితా రావంబు పేర్పుల్ వెతల్
   కోతల్ గాన బిలేజి లేమ నిజమే ? కొంగీడ్చ వచ్చెన్ గదా !
   సీతాదేవికి సందియంబు యువిదే? శీఘ్రంబు గా జెప్పవే :)

   జిలేబి

   తొలగించండి
 25. వినబడు కాశీఖండము
  శ్రీనాధునికృతిగ. మనుచరిత్రయె యొప్పున్
  వినసొంపగుకధలుగలిగి
  మనుగడ నేనేర్పెనార్య! మనుసంతతికిన్

  రిప్లయితొలగించండి
 26. శ్రీనాథునివలె మునుపున్
  వీనుల విందుగ పలికెడు పెద్దన పాత్రల్
  ఓనటుఁడు నటించ, నెటుల్
  శ్రీనాథుని కృతిగ మనుచరిత్రయె యొప్పున్?

  రిప్లయితొలగించండి
 27. మానితము హరవిలాసము
  శ్రీనాథుని కృతిగ, మనుచరిత్రయె యొప్పున్
  తేనియలొలుకు ప్రబంధము
  గానది పెద్దన రచించె కావ్యమ్మనగన్.


  మీనాక్షీ! విను నన్నయార్యుడట భూమీశుండు కోరంగనే
  తానాద్యుండయి యాంధ్రభారతము సత్కావ్యమ్ము నేవ్రాసెనే
  కానంగన్ రమణీయమౌ సరస శృంగారంపు గ్రంథంబులే
  శ్రీనాథుండు రచించి మించె, మనుచరిత్రమ్మున్ బ్రీతితో
  నేనాడో గద యల్లసాని కవి ప్రత్యేకమ్ముగా వ్రాసెనే

  మనుచరిత్ర తెలుగులోని మొదటి ప్రబంధము కనుక ప్రత్యేకముగా వ్రాసాడనే భావంతో చెప్పాను.

  రిప్లయితొలగించండి
 28. ఆనైషధ మొప్పెనుగద
  శ్రీనాథునికృతిగ, మనుచరిత్రయె యొప్పున్
  మానిత పెద్దన కృతిగన్
  భూనాథుదు కృష్ణ రాట్టు భూషించంగన్

  రిప్లయితొలగించండి
 29. "ఆనాటి సాక్షు లేరీ?
  కానగ పేటెంట్లు లేవు కాపీ రైటుల్!"
  ఈనాటి లాయరు నుడివె:
  "శ్రీనాథుని కృతిగ మనుచరిత్రయె యొప్పున్!"

  రిప్లయితొలగించండి

 30. తానున్ సత్కవి సార్వభౌముడయి పూ
  తంబందగా వేడ్కతో
  వేనోళ్ళన్ గొనియాడు పద్యముల తావింబంచు శ్రీ నైషధిన్
  శ్రీనాథుండు రచించి మించె; మను చా
  రిత్రమ్మునున్ బ్రీతితో
  నానాడే విరచించి పెద్దనయె తా
  నందెన్ గదా దీధితుల్!

  రిప్లయితొలగించండి
 31. వేనోళ్ళనె "హరివంశము"
  శ్రీనాథుని కృతిగ, మనుచరిత్రయె యొప్పు
  న్నీనాటికి పెద్దన కృతి
  మానవ మానసములందు మసలుచునుండెన్.

  రిప్లయితొలగించండి
 32. అయ్యా లక్ష్మీనారాయణగారూ! హరివంశమును ఎఱ్ఱన వ్రాసేడనుకున్నా నిన్నాళ్లూ.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీరనుకున్నదే నిజం శాకుంతల వ్రాసిండా లేదా

   తొలగించండి
  2. మీరనుకున్నదే నిజం శాకుంతల వ్రాసిండా లేదా

   తొలగించండి
  3. పెద్దలు లక్ష్మీనారాయణ గారికి నమస్సులు. తెనుగున శృంగార శాకుంతలం పేరున పిల్లలమఱ్ఱి పిన వీరభద్రుడు కావ్యము వ్రాసినారు. శ్రీనాథుడు శృంగార నైషధం వ్రాసెను. శ్రీనాథుని రచనలుః
   మరుత్తరాట్చరిత్ర::శాలివాహన సప్తశతి::శృంగార నైషధము ::భీమేశ్వర పురాణము::ధనుంజయ విజయము::కాశీ ఖండము::హర విలాసము::శివరాత్రి మాహాత్యము:: పండితారాధ్య చరిత్రము::నందనందన చరిత్రము::మానసోల్లాసము::పల్నాటి వీరచరిత్రము:: క్రీడాభిరామము( ఈ విషయంలో తర్కవితర్కాలున్నవి)::రామాయణము పాటలు

   తొలగించండి
 33. .శ్రీనాథుని శృంగారము
  శ్రీనాథుని కృతిగ?”మనుచరిత్రయె యొప్పున్
  మానిని వరూధుని,ప్రవర
  దీనతలో దివ్య తత్వ దీక్షయు గాంచన్|

  రిప్లయితొలగించండి
 34. శ్రీమతి జి సంందిత బెంంగుళూరు

  కానన్ యజ్ఞాగ్నికగుస
  మానముసాహిత్యయజ్ఞమంందున కావ్యంం
  బానాటికాంంధ్రభాషా
  శ్రీనాధుని కృృతిగ మనుచరిత్రయె యొప్పున్  శ్రీమతి జి సంందిత బెంంగుళూరు

  ఆనాటి ఆంంధ్రసాహిత్య యజ్ఞము జరుగునప్పుడు భాషా సంంపత్తిలో హోమాగ్ని ధుని కృృతిగ మనుచరిత్ర సరిపోయింంది ప్రవరుని ప్రాయోప్రవేశాగ్నిని సూచన ప్రాయంంగా స్వీకరిస్తూ

  భాషాశ్రీన్ +ఆ ధుని కృృతిగ అని గ్రహింంచ ప్రార్థన

  రిప్లయితొలగించండి
 35. ఆనందమ్మున వ్రాసె నాడుచునుతా నాముక్త మాల్యద్నహా
  పానీయమ్ముకు దుడ్డు లేమియునునా పాండ్రంగ మాహాత్మ్యమున్
  దీనావస్థయె దాపురించ నయయో! దీనార్లు క్షీణించగా
  శ్రీనాథుండు రచించి మించె మనుచారిత్రమ్మునున్ బ్రీతితో!

  రిప్లయితొలగించండి