23, ఏప్రిల్ 2017, ఆదివారం

సమస్య - 2345 (మగనికి బిడ్డ కలిగెనని...)

కవిమిత్రులారా! 
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
"మగనికి బిడ్డ కలిగెనని మానిని మురిసెన్"
లేదా...
"మగనికి బిడ్డపుట్టెనని మానిని పల్కె జనాళి మెచ్చగా"
ఈ సమస్యను పంపిన బొగ్గరం ప్రసాద రావు గారికి ధన్యవాదాలు.

39 కామెంట్‌లు:

 1. ఖగ వాహనుని గిరీశుడు
  మగువే అని తలచి కూడ మాన్యుడు కలుగన్
  జగపతి సతి తలచెనపుడు
  మగనికి బిడ్డ కలిగెనని మానినిమురియన్

  హరిహర సుతుడు అయ్యప్ప కలుగ లక్ష్మి దేవి ఊహించిన దేమో అనుకొని

  రిప్లయితొలగించండి
 2. అగదము పాడై పోవగ
  మగనికి జేయన్ మనసిడి మారుమ నువున
  స్తగమన సమయం బున దన
  మగనికి బిడ్డ కలిగెనని మానిని మురిసెన్.
  (అగదము= ఆరోగ్యము)(అస్తగమన=మరణ)

  రిప్లయితొలగించండి


 3. వగచెను సంతానము లే
  క, గగనసఖి జీవితమున, కలుగన యాశీ
  స్సు గురువు లొకరివి, చట్టని
  మగనికి బిడ్డ కలిగెనని మానిని మురిసెన్ !

  జిలేబి

  రిప్లయితొలగించండి
 4. "బాలరసాల సాల నవపల్లవ కోమల కావ్యకన్యకన్"


  గగన కుసుమమై స్కాలరు
  దిగులు భయము జెంద గైడు తీరగ తనివిన్
  జిగిజిగి థీసిసు నొప్పగ
  మగనికి బిడ్డ కలిగెనని మానిని మురిసెన్

  రిప్లయితొలగించండి
 5. జగపతి,మోహన వదనుడు,
  ఖగవాహనుడు,మధురిపుడు,కమలనయనుడున్,
  నగపుత్రి కనుజుడును,నా
  మగనికి బిడ్డ కలిగెనని మానినిమురిసెన్

  హరిహర సుతుడు అయ్యప్ప కలుగగా లక్ష్మీ దేవి ఊహించిన సందర్భము

  రిప్లయితొలగించండి
 6. సొగసరి యైన భామ యొక సుందరు ప్రేమవివాహ మాడె మో
  జుగ, నిక యైదు యేండ్లయిన చూలు కలుంగక పోయె, బాధతో
  జగమున నున్న కోవెలలు సర్వము నేగి భజింప, నాకు నా
  మగనికి బిడ్డ పుట్టెనని మానిని పల్కె జనాళి మెచ్చగా

  రిప్లయితొలగించండి
 7. కవిమిత్రులకు మనవి... ఈరోజు మా బావమరది అస్థికలు త్రివేణీ సంగమంలో కలపడానికి కాళేశ్వరం వెళ్తున్నాము. ఏరాత్రికి తిరిగి వస్తానో... దయచేసి ఈరోజు పరస్పర గుణదోష విచారణ చేసికొన వలసిందిగా మనవి. ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి
 8. తగురీతి వంశ నామము
  జగమున నిలబెట్టు కొరకు సతతము మ్రొక్కన్
  ఖగవాహను కరుణను నా
  మగనికి బిడ్డ కలిగెనని మానిని మురిసెన్.

  అగణిత శౌర్యాన్వితుడై
  జగ మేలుచు ప్రజల హితము సంతత మెదలో
  తగ నెంచుచు పాలించెడి
  మగనికి బిడ్డ కలిగెనని మానిని మురిసెన్.
  మగడు-రాజు.

  అగణిత శౌర్యయుక్తు డయి హర్షము తోడ ప్రజాళి నెల్లరన్
  తగువిధి జూచుచుండు, సతతంబును సౌఖ్యము గూర్చుచుండు నీ
  యుగమున సాటిలేని ఘను డుత్తమ పాలకుడౌచు వెల్గు మా
  మగనికి బిడ్డ పుట్టెనని మానిని పల్కె జనాళి మెచ్చగా.
  మగడు-రాజు.
  హ.వేం.స.నా.మూర్తి.

  రిప్లయితొలగించండి
 9. సుగతులకై మగబిడ్డని
  భగవంతుని కోరె పతియె ప్రాప్తించెనదే
  తగు కాన్కనీయ వరమౌ
  మగనికి, బిడ్డ కలిగెనని మానిని మురిసెన్

  రిప్లయితొలగించండి
 10. జగముల నేలెడి హరికిన్
  నిగమములకధిపతియైన నీరజ భవుడే
  నగుచున్ బుట్టగ సిరి గని
  మగనికి బిడ్డకలిగెనని!మానిని! మురిసెన్
  శ్రీహర్ష

  రిప్లయితొలగించండి

 11. సొగసు జిలేబులెల్లరట శోభను గాన నివేదనన్నిడన్
  దుగినుడు దీర్చ కోరికను, దుందుడుకౌ మగరాయులచ్చటన్
  భగినుల తీరు సత్త్వమును భార్య లకై తనువొగ్గ శంకరా,
  మగనికి బిడ్డపుట్టెనని మానిని పల్కె జనాళి మెచ్చగా!

  జిలేబి

  రిప్లయితొలగించండి
 12. నగుచును పంపినాము తన నాథుని యింటికి చీరసారెతో
  నగణితరీతి కూతురును హాయిగసాగెను వత్సరాలు నా
  లుగు నొకబిడ్డకై యిరువురున్ దపియించిరి నేడు నాదు ప్రే
  మగనికి బిడ్డపుట్టెనని మానిని పల్కె జనాళి మెచ్చగా.

  రిప్లయితొలగించండి
 13. అగుపడదయ్యె భార్య, ప్రసవార్థము వైద్యుల జేత జిక్కె , మూ..
  లుగు వినిపించదయ్యె గదిలో నెటులున్నదొ ! యంచు నొక్కడున్
  దిగులుగ నుండగా తలుపు తీసియు "కాంచనయంట! యామె కున్
  మగనికి బిడ్డపుట్టెనని "మానిని పల్కె జనాళి మెచ్చగా"*

  రిప్లయితొలగించండి
 14. తగవులు పెట్టిన అత్తకు,
  మగనికి, గొడ్రాలుయనెడి మామకు, సరిగా
  తగిన జవాబుగ తనతో
  మగనికి బిడ్డకలిగెనని మానిని మురిసెన్

  రిప్లయితొలగించండి
 15. తగవులు పెట్టిన అత్తకు,
  మగనికి, గొడ్రాలుయనెడి మామకు, సరిగా
  తగిన జవాబుగ తనతో
  మగనికి బిడ్డకలిగెనని మానిని మురిసెన్

  రిప్లయితొలగించండి
 16. విగతవ్యధాతిశయమున
  మృగలోచన మందహాస ధృత వదనమున
  న్నగుపడ నచ్చోట నుడివి
  మగనికి బిడ్డ కలిగెనని మానిని మురిసెన్


  మగువల కెంచ జన్మమది మన్ననఁ బొందును దల్లి యైనచో
  నగరము నందు నున్న కడు నాణ్య మనందగు వైద్యశాల లో
  నగణిత రూప సంపదల నందపు టా పసికందుఁ జూపుచున్
  మగనికి, బిడ్డపుట్టెనని మానిని పల్కె జనాళి మెచ్చగా

  రిప్లయితొలగించండి
 17. మగువకు బుట్టిన నైనను
  మగవానికి బుట్టెనండ్రు మహిలో జనము
  'ల్దగునుంగద యీ పాదము
  మగనికి బిడ్డ కలిగెనని మానిని మురిసెన్


  రిప్లయితొలగించండి
 18. భగవంతుని కరుణ వలన
  చిగురు తొడిగె నాశలనుచు చిత్తము పొంగన్
  నగుమోమున చెప్పె నెపుడొ
  మగనికి, బిడ్డ కలిగెనని మానిని మురిసెన్

  రిప్లయితొలగించండి
 19. మగతోడే లేక మిగుల
  వగచుచు కడకుముదుసలిని భర్తగ పొందెన్
  మగువకు నెలదప్పగ నా
  మగనికి బిడ్డకలిగెనని మానిని మురిసెన్


  జగతిన లోకులెల్లరును షండుడు షండుడనంచు గేలిసే
  యగ నిజమమంచు నమ్మిన సుహాసినిభర్తను వీడగా మరో
  మగువను చేరదీయ సుకుమారియె
  గర్భము దాల్చ నత్త నీ
  మగనికి బిడ్డపుట్టెనని మానిని పల్కె జనాళి మెచ్చగా.

  రిప్లయితొలగించండి
 20. మగనాలి కడుపు పండక
  తగుపడతుక పెండ్లియాడ తనసతి పంపున్
  సొగసగు సుతుడు జనించగ
  మగనికి బిడ్డ కలిగెనని మానినిమురిసెన్

  రిప్లయితొలగించండి
 21. దిగులేల వైద్యులుండగ
  యగచాట్లనుమాన్ప?వంధ్యనారోగ్యమునన్
  ప్రగతిగ ప్రతిఫలమున “లత”
  మగనికి బిడ్డ కలిగెనని మానిని మురిసెన్|
  2.తగవులు,చింత సంతుయన?ధైర్యము నింపగవైద్య బృందమే
  తగువిధమైన సూచనలె తప్పక జేయగ దంపతుల్ సదా
  నగవులు బండె|వారస ననామికు డొక్కడు చెల్లి “రాధికా
  మగనికిబిడ్డపుట్టెనని మానినిపల్కె జనాళి మెచ్చగా”|

  రిప్లయితొలగించండి
 22. బిగువగు వాలెటు తమ్ముడు
  దిగులుగ చిడిచిడి ముఖమున తిట్టుల తోడన్
  వగచుచు తంతిని పంపగ
  మగనికి, "బిడ్డ కలిగెనని", మానిని మురిసెన్

  రిప్లయితొలగించండి
 23. జగమున వంశమున్ నిలుప సంతతి ముఖ్యమటంచునెంచియు
  న్నగణిత తీర్థ యాత్రలును యాగములెన్నియొ జేయ దంపతుల్
  భగవ దనుగ్రహంబునను బాలుడు బుట్టెను, రాజ్యమంతటన్
  మగనికి బిడ్డ పుట్టెనని మానిని పల్కె జనాళి మెచ్చగా"

  రిప్లయితొలగించండి
 24. డా.పిట్టా
  మగసిరి లేదని భర్తను
  తెగత్రెంపులు జేసికొన్న తీరిది సుమ్మా
  ఎగద్రోసియు మార్మనువున
  మగనికి బిడ్డగలిగెనని మానిని మురిసెన్!

  రిప్లయితొలగించండి
 25. డా.పిట్టా
  వగలకు(ప్రేమలకు)త్యాగమే బలము వంధ్యకు సంతును;స్త్రీ స్వతంత్రపున్
  సిగముడి లేని భార్యయయి "సేవల నన్నియు తానె జేసె నో
  లగమున 'జన్మ'నిచ్చితిని లైంగిక పద్ధతి మీర;పోషణన్
  మగనికి బిడ్డ పుట్టె"నని మానిని వల్కె జనాళి మెచ్చగన్!

  రిప్లయితొలగించండి
 26. జగములకు మేలు గూర్చగ
  సగరుని వోలెను చెరువుల సరసుల ద్రవ్వన్
  నగవుల నోలల నాడుచు
  మగనికి బిడ్డకలిగెనని మాలిని మురిసెన్!

  మగనికి= రాజుకు
  సప్త సంతానాలలో బావులను, చెరువును తవ్వించడం ఒకటి!

  రిప్లయితొలగించండి
 27. డా.పిట్టా
  వగలకు(ప్రేమలకు) త్యాగమే బలము వంధ్యకు సంతును; స్త్రీ స్వతంత్రపున్
  సిగముడిలేని భార్య యయి"సేవల నన్నియు తానె జేసె నో
  లగమున 'జన్మ' నిచ్చితిని లైంగిక పద్ధతి మీర పోషణన్
  మగనికి బిడ్డ పుట్టెన"ని మానిని వల్కె, జనాళి మెచ్చగా!

  రిప్లయితొలగించండి
 28. నగరపు పత్రిక ప్రకటన:
  "మగనికి బిడ్డ కలిగెనని"; మానిని మురిసెన్
  మిగిలిన వారికి చూపుచు...
  "మగువకు" ప్రింటింగు దోష మమ్మా సుమ్మా!

  రిప్లయితొలగించండి
 29. 9493846984 డా.బల్లూరి ఉమాదేవిగ

  జగమున సంతునుకోరుచు
  వగవక పూజలు వ్రతములు వాసిగ చేయన్
  భగవత్కృపచేత తనదు
  మగనికి బిడ్డ కలిగెనని మానిని మురిసెన్.

  రిప్లయితొలగించండి
 30. 23.04.2017.శంకరాభరణము
  సమస్య:మగనికి,బిడ్డ కలిగెనని మానిని మురిసెన్
  పూరణ:
  జగములు ప్రలయాబ్ధిని,మును
  గగ,శ్రీహరినాభి.కమలగర్భుడు వొడమన్
  తగు పురిటినొప్పి లేకను
  మగనికి బిడ్డ కలిగెనని మానినిమురిసెన్


  రిప్లయితొలగించండి
 31. నగరములో తన చెల్లెలు
  సుగముగ ప్రసవించె ననుచు సుదతికి తెలియన్
  మగువయె విషయము జెప్పుచు
  మగనికి, బిడ్డకలిగెనని మానిని మురిసెన్

  రిప్లయితొలగించండి

 32. జగముల నేలెడి హరికిన్
  జగములమోహింపచేయు శంకువు పుట్టన్
  సొగసుగ శ్రీసిరి తనలో
  మగనికి బిడ్డ కలిగెనని మానిని మురిసెన్.

  శంకువు =మన్మథుడు

  రిప్లయితొలగించండి
 33. మగనాలు గతించిన యా
  మగవానికి భార్య యగుచు మనసును దోచన్
  జగము ముఱియ తన కడుపున
  మగనికి బిడ్డ కలిగెనని మానిని మురిసెన్!

  రిప్లయితొలగించండి
 34. మగడామెకాయె రాముడె
  జగమున నా సుతయె సీత సరి గర్భముతో
  తగునెలలెనిండి తన ప్రే
  మ గనికి బిడ్డ కలిగెనని మానిని మురిసెన్.

  రిప్లయితొలగించండి
 35. సొగసరి టైపు నేర్చుచును సోయగ మొల్కుచు వ్రాసెనిట్టులన్:
  "మగనికి బిడ్డపుట్టెనని మానిని పల్కె జనాళి మెచ్చగా"
  పగులడి నవ్వె టీచరట ఫక్కున గ్రక్కున చూపి తప్పునున్:👇
  "మగువకు బిడ్డపుట్టెనని మానిని పల్కె జనాళి మెచ్చగా"

  రిప్లయితొలగించండి