15, ఏప్రిల్ 2017, శనివారం

సమస్య - 2338 (భీతిల్లిన వారలు...)

కవిమిత్రులారా! 
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
"భీతిల్లిన వారలు రణవీరులు ధీరుల్"
(లేదా...)
"భీతినిగొన్న వార లరివీర భయంకరు లాజివిక్రముల్"
(ఆకాశవాణి వారి సమస్య... బొగ్గరం ఉమాకాన్త ప్రసాద్ గారికి ధన్యవాదాలతో...)

54 కామెంట్‌లు:

 1. "క్షుద్రం హృదయ దౌర్బల్యం త్వక్యోత్తిష్ట పరంతప"


  తాతల, మామల, మిత్రుల,
  ప్రీతిగ పార్థుండు జూసి భీతిన్ జెందెన్
  నీతి నియమమ్ము లొప్పక
  భీతిల్లిన వారలు రణవీరులు ధీరుల్

  రిప్లయితొలగించండి

 2. చేతన లోపించు నచట
  భీతిల్లిన; వారలు రణ వీరులు ధీరుల్,
  ఖ్యాతిం బడయుదు రచ్చట,
  జోతలు చేకొందు రనిని శూరులవంగన్!

  రిప్లయితొలగించండి


 3. కోతలు కోసెడి వారలు
  భీతిల్లిన వారలు, రణవీరులు ధీరుల్
  చేతురు కార్యము లెల్లన్
  హాతువు గానుచు జిలేబి హాకము వలెనన్ !

  జిలేబి

  రిప్లయితొలగించండి


 4. కోతల రాయులెల్లరు వృకోదరు సాటి జిలేబి జేతురే ?
  మూతుల మీసమెల్లనటు ముఖ్యముగాదు సమన్వయంబునన్
  హాతువు గాంచి నేర్పుగొని హాకపు తీరు రణమ్ము జేసిని
  ర్భీతినిగొన్న వార లరివీర భయంకరు లాజివిక్రముల్ !

  జిలేబి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. జిలేబీ గారూ,
   మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
   మొదటి పూరణ చివరిపాదాన్ని "హాతువును గనుచు జిలేబి హాకము వోలెన్" అనండి.

   తొలగించండి
  2. జిలేబిగారికి వందనాలు! మీవల్ల ఈరోజు రెండు కొత్త పదాలు తెలుసుకున్నాను! ధన్యవాదాలు!🙏🙏🙏

   తొలగించండి


  3. సీతాదేవి గారికి

   నెనర్లు కాపీ పేష్టు :)

   జిలేబి

   తొలగించండి
 5. నీతిని విడువక సతమవి
  నీతినెదుర్కొనెడువాడు నిరుపేదలపై
  ప్రీతిగలిగి పాపమనిన
  భీతిల్లిన వారలు రణవీరులు ధీరుల్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. విరించి గారూ,
   పాపభీతిని గురించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 6. నీతులు యుద్ధవిద్యలను నేరిచి సాధన చేసి నిత్యమున్
  భూతలమందునున్న మునిముఖ్యుల దీవెన గొన్న ధీరులున్
  చేత ధనుస్సు పూనగనె, చిత్తము కంపన మంది శత్రువుల్
  భీతినిగొన్న, వార లరివీర భయంకరు లాజివిక్రముల్ ||

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సోమయాజులు గారూ,
   విరుపుతో మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.

   తొలగించండి
 7. భూతలమున ధర్మంబున
  కై తమ సిరి గోలుపోరె గన బాండవులా
  జేతల నృతమన మిక్కిలి
  భీతిల్లిన వారు రణవీరులు ధీరుల్.

  చేతము సంతసిల్లునటు చేకొని రా వనవాసమప్పు డా
  జేతలు పాండవుల్ కనగ శ్రేష్ఠగుణాఢ్యులు సర్వసంపదల్
  భూతలి గోలుపోయి తమ పోడిమి నెంచ రధర్మమన్నచో
  భీతిని గొన్నవార లరివీర భయంకరు లాజివిక్రముల్.

  హ.వేం.స.నా.మూర్తి.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మూర్తి గారూ,
   మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

   తొలగించండి
 8. డా.పిట్టా
  ఖ్యాతిని గాంచ విరక్తిని
  చేతలలో జూపలేని చిరు యోగులునై
  నీతికి నామాల్ బెట్టగ
  భీతిల్లిన వారలు రణ వీరుల్ ధీరుల్(సన్యాసం బుచ్చుకొన్న కుహనా యోగి కంటే సగటు సంసారియే సాహసికుడు)

  రిప్లయితొలగించండి
 9. డా.పిట్టా
  ఖ్యాతికి సాహసంబనుచు గద్దరి చేష్టలు జేయ లాభమే?
  మూతికి మీసమున్ మెలిక మోజుగ ద్రిప్ప బ్రయోజనంబె? నీ
  చేతల జెప్పునీ జగతి శీఘ్రగతిన్ గ్రహియించు; నీతికిన్
  భీతిని గొన్న వారలరివీర భయంకరు లాజివిక్రముల్!

  రిప్లయితొలగించండి
 10. చేతిన కత్తి మెరుపు యమ
  దూతలనిల స్వాగతించి దోవను జూపన్
  జ్ఞాతులుఁబోరాడ నిలువ
  భీతిల్లిన, వారలు రణవీరులు ధీరుల్

  రిప్లయితొలగించండి
 11. "ఖ్యాతి గడింతురె వైరికి
  భీతిల్లిన వారలు!?,రణవీరులు ధీరుల్
  ప్రీతిగ పోరాడెదరని "
  గీతను కృష్ణుండు తెలిపె క్రీడికి నాజిన్ !!


  🙏🌺🕉రత్నగర్భాయై నమః🙏🌺


  పూతధరిత్రి!నా జనని!పున్నెపు ప్రోవిట పుట్టిరెందరో!
  ఖ్యాతిని గొన్న దాతలు,మహర్షులు,త్యాగులు,
  సత్యసంధులౌ
  నేతలు, దేశికోత్తములు,నిశ్చలభక్తులు,పాపమన్నచో
  భీతినిగొన్న వారలరివీర భయంకరులాజివిక్రముల్ !!

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

  రిప్లయితొలగించండి
 12. కోతలతో మురిపింతురు
  భీతిల్లిన వారలు , రణవీరులు ధీరుల్
  చేతలతో పోరి విజయ
  జ్యోతిని తెత్తురు సతతము చూడుము రాజా

  ధర్మరాజు విరాటునికి ఉత్తర కుమారునికి విజయము వరించలేదని విజయుడే విజయము గైకొని వచ్చునని చెప్పు సందర్భము

  రిప్లయితొలగించండి
 13. తాతఁగని తెల్ల దొరలటు
  భీతిల్లిన వారలు,రణవీరులు ధీరుల్
  సైతమెరుఁగని యహింసను
  చేత ధరించి చెలరేగ‌ చిచ్చర పిడుగై

  రిప్లయితొలగించండి
 14. రీతిగ రాక్షస సైన్యము
  సేతువును చెకచెక దాటి చేరిన లంకన్
  కోతుల దండుల కనుగొని
  భీతిల్లిన వారలు రణవీరులు ధీరుల్

  రిప్లయితొలగించండి
 15. జాతి పతాక నెత్తుకొని
  సాగిరి ముందుకు స్వేచ్ఛ కోసమై
  ప్రీతిని చేతనన్ బడసి
  వేదిక లెక్కి మహాత్ము తోడుతన్
  నీతి నహింస మార్గమున
  నిల్చుక బోరిరి, ధ్వంసమన్నచో
  భీతిని గొన్నవార లరి
  వీరభయంకరు లాజి విక్రముల్!

  రిప్లయితొలగించండి
 16. తాతఁగని తెల్ల దొరలటు
  భీతిల్లిన వారలు,రణవీరులు ధీరుల్
  సైతమెరుఁగని యహింసను
  చేత ధరించి చెలరేగ‌ చిచ్చర పిడుగై

  రిప్లయితొలగించండి
 17. చేతలుడిగి నశియింతురు
  భీతిల్లిన వారలు రణవీరులు ధీరుల్
  ఖ్యాతిని పొందుదురు సదా
  నీతికి నిలిచి యనిలోన నిశ్చలమతితో

  రిప్లయితొలగించండి
 18. రిప్లయిలు
  1. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

   తొలగించండి
  2. రీతి రివాజును గానక
   నాతుర మతులైన పౌరు లాగ్రహ వశులై
   ఘాతుకముల బాల్పడగను
   భీతిల్లినవారు రణవీరులు ధీరుల్!

   ఈ మధ్య కాశ్మీరులో ప్రజాగ్రహానికి సైన్యం భయపడవలసి వచ్టింది!

   తొలగించండి
 19. చేతును భీకర రణమని
  తాతలు తండ్రులు గురువులు తనవారనుచున్
  తా తలచి వెనుదిరుగగా
  భీతిల్లిన వారలు రణవీరులు ధీరుల్

  నాతికి తాళిని కట్టిన
  నూతన వరుడయ్యు నొక్కడురికెన్నాజి
  న్నీ తఱినని వెనుకాడగ
  భీతిల్లిన వారలు రణవీరులు ధీరుల్

  రిప్లయితొలగించండి
 20. భూతదయా పవిత్రులును పుణ్య చరిత్రులు చంద్రవంశసం
  జాతులు పంచపాండవులు సద్గుణ పూర్ణులు ధర్మయుధ్ధని
  ష్ణాతులు శత్రుభీకరులు సారెకు నిందకు, దుర్ణయమ్ముకున్
  భీతినిగొన్నవారలరివీరభయంకరు లాజివిక్రముల్
  రిప్లయితొలగించండి
 21. దూతగ కృష్ణుండరుగగ
  నీతినివిడనాడి చక్రినేబంధింపన్
  పాతక కౌరవచేష్టకు
  భీతిల్లిన వారలె అరివీరుల్ ధీరుల్
  వీటూరి భాస్కరమ్మ ఈ రెండు వ్రాసారు

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. భాస్కరమ్మగారూ! మీ రెండు పద్యాలూ హృద్యంగా ఉన్నాయి!🙏🙏🙏🙏

   తొలగించండి
 22. రిప్లయిలు
  1. చూతుము నేడిట నెవ్వరు
   నైతల నిభ సింహగర్జనము సేసినచో
   నాతరి నీ పర రాజులు
   భీతిల్లిన, వారలు రణవీరులు ధీరుల్


   భాతృ జనాంత కోగ్రతర భండన దుర్జయ సైన్య దర్శనా
   భీతిని గొన్న వార లరివీర భయంకరు లాజివిక్రముల్
   ఖ్యాతినిఁ గోరి శత్రునృప ఖండన విక్రమ మంచు నెంచుచున్
   భూతల మందుఁ బ్రాణులకు ముప్పులు తెచ్చుట వీర్య మందురే!

   [దర్శన+అభీతి = దర్శనాభీతి]

   తొలగించండి
 23. చేతలు సేయరు జగతిని
  భీతిల్లిన వారలు ,రణవీరులు ధీరు
  ల్గాతరము లేకయుండగ
  మాతగు భూమాత కొరకు మరణము నొందున్

  రిప్లయితొలగించండి
 24. ఖ్యాతిని బొందగ లేరిల
  భీతిల్లిన వారలు , రణవీరులు ధీరుల్
  చాతుర్యముతో జయమున్
  ప్రీతిగ సాధించు వరకు వెఱవని వారే!!!

  రిప్లయితొలగించండి
 25. భూతలమందు నిర్బలుల పోరున గెల్చుట గాదు చూడగా
  నీతిని వీడకుండ నవినీతిని నిర్భయుడై యెదుర్కొనే
  ఖ్యాతిగడించినన్ సరియె నాతని పేరును విన్న శత్రువుల్
  భీతిని గొన్న, వారలరి వీరభయంకరు లాజి విక్రముల్

  రిప్లయితొలగించండి
 26. *శ్రీమతి జి సందిత బెంగుళూరు*

  ఈరోజు పూరించవలసిన సమస్య

  *"భీతిల్లిన వారలు రణవీరులు ధీరుల్"*

  (లేదా...)

  *"భీతినిగొన్న వార లరివీర భయంకరు లాజివిక్రముల్"*

  *భూతలమట్లుబీటలిడభూంకృతిభీకరమైధ్వనింపగా*
  *ఘాతవిఘాతపాతములక్రమ్మనచేష్టతదేహధారులన్*
  *సీతనుజేకొనన్ ధరణి చీలెనురాముడుచూచుచుండగన్*
  *"భీతినిగొన్న వార లరివీర భయంకరు లాజివిక్రముల్"*


  *శ్రీమతి జి సందిత బెంగుళూరు*

  ఆహవభూమిలో తారసపడి శ్రీరామునితోతలపడిన లవకుశులను శ్రీరామునికి అప్పగించి
  భూమాత ఒడిలోకి సీతమ్మ చేరిన సందర్భంలో
  రామాయణార్థం లో

  రిప్లయితొలగించండి
 27. దూతగ శాంతికి ప్రేమకు
  నేతగ బౌద్ధులకు నేడు నీరజ నేత్రున్
  శీతల హృదయుని దలచిన
  భీతిల్లిన వారలు రణవీరులు ధీరుల్!

  రిప్లయితొలగించండి
 28. జాతి యనగ మదిని భరత
  జాతి యడర రిపు నెదిరిన సైనికులె సుమా
  జాతీయతను విడనాడగ
  భీతిల్లిన వారలు రణ వీరులు ధీరుల్!

  రిప్లయితొలగించండి
 29. పాతక మెన్నడున్భువిని వారుగ వారును జేయరె న్నడున్
  భీతిని గొన్నవారల,రివీర భయంకరు లాజి విక్రముల్
  సీతమతల్లి నందనులు,చిన్నగ నున్నను వీర్యవంతులు
  న్నాతత బాహు విక్రములు శాత్రవ మూకను సంహరించిరే

  రిప్లయితొలగించండి
 30. రోతగ గనుగొని కోర్కెల
  వీత క్రోధభయరాగ విదితులు వారల్
  యాతనము జన్మమనుచును
  భీతిల్లినవారు రణవీరులు ధీరుల్!

  రిప్లయితొలగించండి
 31. కూతలు గావని కేజ్రీ
  చేతల సాధించి జూపెఁ జిక్కినగెలుపు
  న్నాతడు గెలువఁగ నోడుచు
  భీతిల్లిన వారలు రణవీరులు ధీరుల్

  రిప్లయితొలగించండి
 32. .దూతగ కృష్ణుడు బలికెను
  భీతిల్లిన వారలు రణవీరులు ధీరుల్
  మీతర మౌనాగెలువగ?
  నీతులు మీకెరుక బడవు నేర్పున దెలిపెన్| {కౌరవసభలోరాయభారమునకృష్ణపలుకులు}
  2.జాతిపురోభి వృద్ధి మనజాలగ మార్గములన్నిగూర్చె|తా
  నేతగ జీవహింస మన నీయకజేసె నశోక భూపతై
  బ్రాతలు,చుట్టముల్ గనిన పల్గుణు డూహలు మారిపోయినా?
  “భీతినిగొన్న వారలరి వీర భయంకరులాజి విక్రముల్.”|

  రిప్లయితొలగించండి
 33. ఉత్తర గోగ్రహణము సమయమున అర్జునుని చేతిలో చావుదెబ్బఉ తిన్నప్పటికి కార్ణాదులు రణవీరులు ధీరులు అన్న భావముతో
  వాతూల వేగమున కపి
  కేతను డూను శరధాటికిన్ కర్ణాదుల్
  తా తేజవిహీనులగుచు
  "భీతిల్లిన వారలు రణవీరులు ధీరుల్"

  రిప్లయితొలగించండి
 34. కవిమిత్రులకు నమస్కృతులు.
  ఈరోజు ఉదయమే మా అక్కయ్య వాళ్ళ ఊరు వెళ్ళి ఇంతకుముందే తిరిగి వచ్చాను. ఆ ఊళ్ళో నెట్‍వర్క్ సిగ్నల్స్ లేక మీ పూరణలపై స్పందించలేకపోయాను.
  కొందరు మిత్రులు పూరణలను పరిశీలించి తగిన సూచన లిస్తున్నందుకు సంతోషం. ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి
 35. రాయబార సమయాన ధృతరాష్ట్రునితో శ్రీకృష్ణుడు పలికనట్లుగా

  ఖ్యాతిని గొన్నవా రుపలు యాతన లందిరి ధర్మమా ర్గమున్,
  భూతద యాపరుల్ పరమ పూజ్యులు పాండవు లెందుజూచి నన్
  నీతికి మారుపే రనవి నీతులు పెద్దల నంగ యుద్ధ ని
  "ర్భీతిని గొన్నవా రలరి వీరభ యంకరు లాజివిక్రముల్"

  రిప్లయితొలగించండి
 36. డా.పిట్టా
  ఖ్యాతికి సాహసంబనుచు గద్దరి చేష్టలు జేయ లాభమే?
  మూతికి మీసమున్ మెలిక మోజుగ ద్రిప్ప బ్రయోజనంబె? నీ
  చేతల జెప్పునీ జగతి శీఘ్రగతిన్ గ్రహియించు; నీతికిన్
  భీతిని గొన్న వారలరివీర భయంకరు లాజివిక్రముల్!

  రిప్లయితొలగించండి
 37. తాతల గోత్రమున్ తెలిపి తల్లిది క్రైస్తవ మొల్లకుండుచున్
  మూతులు నాకుచున్ వెరచి ముల్లల బూబుల వోట్లకోసమై
  తూతుపు మంత్రముల్ పలికి త్రుళ్ళుచు గంతుచు భాజపాయనన్
  భీతినిగొన్న వార లరివీర భయంకరు లాజివిక్రముల్ :)

  రిప్లయితొలగించండి