24, ఏప్రిల్ 2017, సోమవారం

సమస్య - 2346 (నల్లని మల్లియలతో...)

కవిమిత్రులారా! 
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
"నల్లని మల్లియలతో ఘనంబుగఁ గొల్తున్"
(లేదా...)
"నల్లని మల్లెలన్ గొని ఘనంబుగఁ బూజ నొనర్తు భక్తితోన్"
ఈ సమస్యను పంపిన కవిమిత్రునకు ధన్యవాదాలు.

77 కామెంట్‌లు:

 1. చల్లని చూపుల జూచుచు
  చల్లగ కాపాడుమయ్య శకటారి ననున్
  చెల్లగ నినునే దండగ
  నల్లని మల్లియలతో ఘనంబుగఁ గొల్తున్

  రిప్లయితొలగించండి


 2. అల్లన మెల్లన చల్లన
  నల్లని మల్లియలతో ఘనంబుగఁ గొల్తున్
  కల్లా కపటంబెరుగ
  న్నెల్లెడ గలవాడ! నల్ల నిగ్గుల వాడా !

  జిలేబి

  రిప్లయితొలగించండి


 3. చల్లగ గావు మయ్య మము చక్కగ బేర్చితినౌ జిలేబి నై
  మెల్లన నెమ్మి గానుము సుమేధయు నిచ్చుచు మమ్ము సర్వదా !
  యల్లన గాంచి నాను నిను యందరి రాజువి దండ లేకనౌ
  నల్లని మల్లెలన్ గొని ఘనంబుగఁ బూజ నొనర్తు భక్తితోన్!

  జిలేబి

  రిప్లయితొలగించండి
 4. తెల్లని రాధకు ప్రక్కన
  గొల్లల చెంతన పెరిగిన గోకుల ప్రియుడా
  చల్లని కృష్ణుని, రూపున
  నల్లని, మల్లియలతో ఘనంబుగఁ గొల్తున్

  రిప్లయితొలగించండి
 5. చెల్లెలు తోడురాగ నతిశీఘ్రముగాగుడికేగి దైవమున్
  కొల్లలు గాగకీర్తనలు కూరిమిషోడశచర్యలన్ని శో
  భిల్ల సహస్ర నామముల ప్రీతిమెయిన్.విడిపూలు దెచ్చి నే
  నల్లని మల్లెలన్గొని ఘనంబుగపూజలొనర్తు భక్తితోన్
  నేను÷అల్లని=నేనల్లని

  బొగ్గరం ప్రసాద రావు

  రిప్లయితొలగించండి
 6. డా.పిట్టా
  చల్లని తల్లి సరస్వతి
  నుల్లంబలరంగ గొలువ నోపక కవితన్
  చిల్లర దేవుళ్ళను నే
  నల్లని మల్లియలతో ఘనంబుగ గొల్తున్!

  రిప్లయితొలగించండి
 7. డా.పిట్టా
  ఉల్లము తల్లడిల్లగ నవోదిత పుష్పపు గుండె లోతులన్
  బల్లెములెన్ని గ్రుచ్చితినొ బావురనంగ, సుగంధ వాయువుల్
  చెల్లగనీక నా ప్రభుని చెంతనె జేర్చితి బ్రోవుమంచు నీ
  కల్లజగత్తులోనొకని కాలిన ద్రొక్కక భూషలేవి? నే
  నల్లని మల్లెలన్ గొని ఘనంబుగ బూజ నొనర్తు భక్తితోన్!!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. డా. పిట్టా వారూ,
   మీ రెండు పూరణలు (ముఖ్యంగా రెండవది) చాల బాగున్నవి. అభినందనలు.

   తొలగించండి
 8. అల్లరి నందకిశోరుడ
  చల్లగ మము జూడుమనుచు సన్నుతులిడుచున్
  మొల్లలు, జాజులు, మాలగ
  నల్లని మల్లియలతో ఘనంబుగ గొల్తున్!!!

  రిప్లయితొలగించండి
 9. మల్లెలు జల్లిన పాన్పున
  నుల్లమలర సగము పాల నొసఁగన్ మదనున్
  విల్లంది నిన్ సతీ! మే
  నల్లని మల్లియలతో ఘనమ్ముగ గొల్తున్

  రిప్లయితొలగించండి
 10. యుల్లము ఝల్లని, చూపులు
  చల్లని, రాధ పులకింత జల్లని మది రే
  పల్లెకు రేడని, కాయము
  నల్లని, మల్లియలతోఘనంబుగ గొల్తున్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. శ్రీరామ్ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   పద్యాన్ని యడాగమంతో ప్రారంభించారు. 'ఉల్లము' అనండి.

   తొలగించండి
 11. నల్లని సిరాకుసుమములు
  తెల్లని కాగితముపైన తేజము నిడగా
  తల్లిసరస్వతి నెపుడున్
  నల్లని మల్లియలతో ఘనంబుగ గొల్తున్

  రిప్లయితొలగించండి
 12. నల్లని మేఘశ్యాముని
  యల్లన వేయైనపేర్ల నాస్తోత్రముతో
  తెల్లని విరులగు, మాలగ
  నల్లని మల్లియలతో ఘనంబుగఁ గొల్తున్

  రిప్లయితొలగించండి
 13. జగపతి,మోహన వదనుడు,
  ఖగవాహనుడు,మధురిపుడు,కమలనయనుడున్,
  నగపుత్రి కనుజుడును,నా
  మగనికి బిడ్డ కలిగెనని మానినిమురిసెన్

  హరిహర సుతుడు అయ్యప్ప కలుగగా లక్ష్మీ దేవి ఊహించిన సందర్భము శంకరయ్య గారికి నమస్కారములు ఆర్యా నిన్నటి పూరణము కూడా సమీక్షించి సలహా చెప్పవలెను

  రిప్లయితొలగించండి
 14. తెల్లని మల్లెపూవులివి!తీక్ష్ణమయూఖమహోష్మవాతముల్
  తల్లడిలంగజేయగ నిదాఘమునందున రంగు మారె, నా
  యుల్లము లోపలే మిగిలియుండుటచే రవి సోకలేదురా !
  నల్లని మల్లెలన్ గొని ఘనమ్ముగ బూజనొనర్తు భక్తితో !!

  రిప్లయితొలగించండి
 15. నా నిన్నటి పూరణ

  మగడామెకాయె రాముడె
  జగమున నా సుతయె సీత సరి గర్భముతో
  తగునెలలెనిండి తన ప్రే
  మ గనికి బిడ్డ కలిగెనని మానిని మురిసెన్.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. గోలి వారూ,
   మీ (నిన్నటి) పూరణ ప్రేమ గనితో బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 16. అల్లదె యేమని యంటివి
  నల్లని మల్లియలతో ఘనంబుగ గొల్తున్
  నల్లని మల్లియ లుండునె ?
  కల్లల నిట బలుకనేల కాంతా ! చెపుమా

  రిప్లయితొలగించండి


 17. నల్లని వాడవ నుచు రే
  పల్లియలోనిజనులెల్ల వాసిగ కొల్వ
  న్నల్లెద మాలను కూర్చుచు
  నల్లని మల్లియలతోఘనంబుగ గొల్తున్.  నల్లని వాడవయ్య నిను నమ్ముచు కొల్వగ వచ్చితిన్ ననున్
  చల్లగ కావుమయ్యహరిజాగును సేయక బ్రోవుమయ్య నీ
  యుల్లమునందునన్ సతమునొప్పగురీతిని నీకునే నిటన్
  నల్లని మల్లెలన్ గొని ఘనమ్ముగ బూజనొనర్తు భక్తితో.

  రిప్లయితొలగించండి
 18. ఎల్లరు భక్తిన గొలచెడు
  చల్లని వాడిని నుతింతు సతతము, నేనా
  నల్లని వాడిచరణముల
  నల్లని మల్లియలతో ఘనంబుగ గొల్తున్

  2.
  ఉల్లము నందున నిలిచిన
  తల్లికి నేనల్లిన విరిదండల తోడన్
  చల్లని తనచరణమ్ముల
  నల్లని మల్లియల తో ఘనంబుగ గొల్తున్

  3.
  నల్లని వాడిగళమ్మున
  నల్లిన చేమంతిపూల హారము వేతున్
  చల్లని యాచరణమ్ముల
  నల్లని మల్లియలతో ఘనంబుగ గొల్తున్

  *ఉత్పలమాల*

  ఉల్లమునందు నిల్పితి మహోజ్వల శక్తిని కల్గినట్టియా
  చల్లని తల్లినే, తనదు సత్కృప గోరిసదా తలంతు నే
  నల్లిన పారిజాతసుమ హారములే గళమందు వేయుచు
  న్నల్లని మల్లెలన్ గొని ఘనంబుగ బూజనొనర్తు భక్తితోన్.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. విరించి గారూ,
   మీ నాలుగు పూరణలు చక్కగా ఉన్నవి. అభినందనలు.
   (నా సవరణలు ఏమైనా ఉంటే సమూహంలో గమనించండి)

   తొలగించండి


 19. నల్లని స్వామికి సతతము
  మెల్లగ నారన్ విరులనుమృదువుగ కూర్చ
  న్నల్లని దారము చేత
  న్నల్లనిమల్లియలతోఘనంబునఁగొల్తున్
  (నల్లని దారముతో అల్లని అనే అర్థంలో వాడాను)

  రిప్లయితొలగించండి
 20. నల్లని వాడ! భక్తుల మనంబుల దూరితి వేమి? చిక్కవో
  యల్లరి వాడ! నీదు విరహాగ్నిన నల్లగ రూపు మారెగా
  తెల్లని మల్లెలివ్వి; హృది దెల్లము సేసెడు వాడియున్న యీ
  నల్లని మల్లెలన్ గొని ఘనంబుగ బూజ నొనర్తు భక్తితో

  రిప్లయితొలగించండి
 21. నల్లని మల్లెలంగొని ఘనంబుగ బూజ నొనర్తు భక్తి తోన్
  జల్లగ జెప్పితీవ సుమ ! జాజులు దెల్లని మల్లె పూలతో
  నల్లన జేతురే గదిల హర్షము నొందగ శంభు డెప్పుడున్
  నల్లని మల్లె పూల కట నవ్విరి పోదురు విన్న వారలున్

  రిప్లయితొలగించండి
 22. చల్లని చూపుల వానిని
  పిల్లన గ్రోవి రవము వినిపించెడి వానిన్
  సల్లలితుఁ దనువు వానిని
  నల్లని, మల్లియలతో ఘనంబుగఁ గొల్తున్


  ఉల్లము నందు నిల్పి పురుషోత్తము నచ్యుతుఁ బద్మనాభునిన్
  నల్లని వానిఁ గృష్ణుఁ గరుణా రస వీక్షణు భక్తరక్షకున్
  మల్లెల దండ నా కొసగ మన్నన తోడసఖుండు, చెప్పగ
  న్నల్లని మల్లెలం గొని, ఘనంబుగఁ బూజ నొనర్తు భక్తితోన్

  [చెప్పగన్+అల్లు+అని= చెప్పగన్నల్లని]

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కామేశ్వర రావు గారూ,
   మీ రెండు పూరణలు ఉత్తమంగా ఉన్నవి. ముఖ్యంగా రెండవ పూరణలో పదచ్ఛేదం వినూత్నంగా ఉంది. అభినందనలు.

   తొలగించండి
  2. పూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు.

   తొలగించండి
 23. చల్లని గాలియున్ మొగము చాటొనరించెను భానుమూర్తి తా
  నుల్లము పొంగ మింటిపయి నుగ్రకరమ్ముల చాచుచుండె మే
  నెల్లను తాపమై జనము లేడ్చుచు నుండిరి మాకు నిమ్ము వా
  నల్లని మల్లెలన్ గొని ఘనంబుగఁ బూజ నొనర్తు భక్తితోన్.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మిస్సన్న గారూ,
   మీ భావం వైవిధ్యంగా ప్రశంసనీయంగా ఉంది. కాని 'వానల్+అని = వానలని' అవుతుందే తప్ప వానల్లని అన్న రూపం రాదు. అది కేవలం ద్రుతానికే పరిమితం. 'ఇవ్వగన్+అల్లన = ఇవ్వగ । న్నల్లని...' ఇలా..

   తొలగించండి
  2. వానల్లు కురవాలి వాన దేవుడా అనే పాట ఉంది. వానను వానల్లు అనవచ్చేమో?

   తొలగించండి
  3. గురువుగారూ మీ సూచనను గమనించాను. అయితే విజయకుమార్ గారు చెప్పిన భావనతో వానల్లు అని వ్రాసాను. సరి కాదేమో మరి. లేకపోతె వ్యావహారికం అవుతుందేమో.

   విజయకుమార్ గారూ ధన్యవాదాలు.

   తొలగించండి
 24. ఉల్లమున భక్తి విరియగ
  చల్లని దైవమన రామచంద్రుడె యనుచున్
  ఎల్లలెఱుగని ముదంబున
  న్నల్లని మల్లియలతో ఘనంబుగ గొల్తున్!

  గురువు గారికి వందనములు. నిన్నటి నా పూరణను పరిశీలించ గోరుతాను. ధన్యవాదములు.
  మగనాలు గతించిన యా
  మగవానికి భార్య యగుచు మనసును దోచన్
  జగము పొగడ తన కడుపున
  మగనికి బిడ్డ కలిగెనని మానిని మురిసెన్!

  రిప్లయితొలగించండి
 25. నల్లటి దేహఛాయ మరి నాకపు సౌఖ్యము నిచ్చు చూపు తో
  చల్లగ చూచు నమ్మకును సర్వము నర్పణ చేయ గోరుచున్
  మెల్లగ చెంత చేరి భవమే రహితంబవ నేను మాలగా
  నల్లని మల్లెలన్ గొని ఘనంబుగ బూజ నొనర్తు భక్తితోన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మూర్తి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'దేహ+ఛాయ = దేహచ్ఛాయ' అవుతుంది. అక్కడ 'నల్లని దేహదీప్తి మరి (లేదా) నల్లని దేహమున్ మరియు' అనండి. 'భవమే తరియింపగ' అంటే ఇంకా బాగుంటుందేమో?

   తొలగించండి
 26. నల్లని పాండురంగనికి నా మదిలో నెలకొన్న వేల్పుకున్
  జల్లని చూపు సామికిని సన్మతి తోడను నేను నిత్యము
  న్నుల్లము సంతసిల్లుగ గడున్నత భావముతోడ నే
  నల్లని మల్లెలన్ గొని ఘనంబుగ బూజ నొనర్తు భక్తితో.

  రిప్లయితొలగించండి
 27. నల్లని పాండురంగనికి నా మదిలో నెలకొన్న వేల్పుకున్
  జల్లని చూపు సామికిని సన్మతి తోడను నేను నిత్యము
  న్నుల్లము సంతసిల్లుగ గడున్నత భావముతోడ నే
  నల్లని మల్లెలన్ గొని ఘనంబుగ బూజ నొనర్తు భక్తితో.

  రిప్లయితొలగించండి
 28. నల్లని పాండురంగనికి నా మదిలో నెలకొన్న వేల్పుకున్
  జల్లని చూపు సామికిని సన్మతి తోడను నేను నిత్యము
  న్నుల్లము సంతసిల్లుగ గడున్నత భావముతోడ నే
  నల్లని మల్లెలన్ గొని ఘనంబుగ బూజ నొనర్తు భక్తితో.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. లక్ష్మినారాయణ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'సంతసిల్లగ'... టైపాటు.

   తొలగించండి
 29. గొల్తున్

  చల్లని మాకన్నయ్యను
  కల్లలెరుంగని మనమున కన్నులవేడ్క
  న్నుల్లమలరంగ మెల్లన
  నల్లని మల్లియలతో ఘనంబుగ గొల్తున్

  రిప్లయితొలగించండి
 30. గురువుగారికి నమస్సులు! నిన్నటి నా పూరణ జగముల మేలును గూర్చగ
  సగరుని వోలెను చెరువుల సరసుల ద్రవ్వన్
  నగవుల నోలల నాడుచు
  మగనికి బిడ్డకలిగెనని మాలిని మురిసెన్!

  మగనికి= రాజుకు
  సప్త సంతానాలలో బావులను, చెరువును తవ్వించడం ఒకటి!

  రిప్లయితొలగించండి
 31. చల్లని మమతల బంచుచు
  నుల్లము నలరించు తల్లి చరణయుగంబు
  న్నొల్లన జాజులు, దండగ
  నల్లని, మల్లెలలతో ఘనంబుగ గొల్తున్!

  రిప్లయితొలగించండి
 32. నల్లని నామాలయ్యను
  జల్లగ దీవింపుమనుచు చామంతులతో
  నల్లిన దండల , దోసిట
  నల్లని మల్లియలతో ఘనమ్ముగ గొల్తున్!!


  నల్లగ వాడిపోయినవి నాకవి నచ్చవు! పారవైచుచున్
  నల్లని మల్లెలన్ ., గొని ఘనమ్ముగ బూజనొనర్తు భక్తితో
  ఫుల్ల మరంద గంధ పరిపూర్ణ మనోహర పుష్పజాతులౌ
  మల్లెల పొన్నలన్ నళినమంజరులన్ నిను వేంకటేశ్వరా

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మైలవరపు వారూ,
   మీ రెండు పూరణలు మనోహరంగా ఉన్నవి. అభినందనలు.

   తొలగించండి
 33. మల్లికి మల్లెలచీరే
  నల్లని|”మల్లియలతో ఘనంబుగ గొల్తున్
  తెల్లని పానుపుపై తా
  నల్లని పూలెన్నొ జల్ల?హాయిని జల్లెన్|
  2.అల్లిన పూల దండలనుకంద? భవానికివేసి రెందరో|
  తెల్లని పూలటన్నను జితేంద్రియు డైనను మెచ్చుగాన చిం
  తిల్లక పుష్ప యాగమున తీరిక చేతనుపూలు గోసి తా
  నల్లని మల్లెలన్ గొని ఘనంబుగ బూజ నొనర్తు భక్తితోన్. {తానల్లని=తానుఅల్లనట్టి}

  రిప్లయితొలగించండి
 34. అత్తవారింట్లో వున్న ఆవుతెల్లనిది దూడనల్లనిది. వీటిని చూసి అల్లుడు పలికిన మాటగా నూహించి

  తల్లిని నీవుంచుకొనుచు
  పిల్లను నాకొసగు మామ పెంచెద భక్తిన్
  నల్లని గోమాతను నే
  నల్లని మల్లియలతో ఘనంబుగ గొల్తున్.

  రిప్లయితొలగించండి
 35. మల్లెల తీగ లడవిలో
  కొల్లలుగా పెరుగ జూచి , గొని హరి కిడుచున్
  చల్లగ జూడ మనుచునే
  నల్లని మల్లియలతో ఘనంబుగఁ గొల్తున్

  నిన్నటి సమస్య కు నా పూరణ

  మగువకు సంతానం బీ
  యుగమున కలుగ దనగ భువి నుత్తమ వైద్యుల్,
  మగడేలెడి మరొక సతికి
  మగనికి బిడ్డ కలిగెనని మానిని మురిసెన్

  రిప్లయితొలగించండి
 36. గుల్లలు జేసి బ్యాంకులను కొల్లలు గొట్టుచు పారిపోవుచున్
  చల్లగ లండనున్ వెలసి చారెడు బంగరు తీగలందున
  న్నల్లిన మల్లియల్ విరివి హాయిని చేతిని:...త్రోసివేయుచున్
  నల్లని మల్లెలన్;,...గొని ఘనంబుగఁ బూజ నొనర్తు భక్తితోన్!

  రిప్లయితొలగించండి