2, ఏప్రిల్ 2017, ఆదివారం

సమస్య - 2326 (పార్థుఁ డర్జునునకు...)

కవిమిత్రులారా! 
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది.... 
"పార్థుఁ డర్జునునకు బావమమఱఁది"
లేదా... 
"పార్థుఁ డనంగ నర్జునుని బావమఱంది సుమీ తలంపఁగన్"

34 కామెంట్‌లు:

  1. రిప్లయిలు
    1. పృథకు పుట్టి హరికి ప్రియుడైన విజయుడె
      పార్థుఁడ; ర్జునునకు బావమఱఁది
      హరియె భువిని, సంశయము లేదిట సుభద్ర
      భార్య పార్థునకును భగిని హరికి

      తొలగించండి


  2. అయ్యె చెల్లి నివ్వ యమరేంద్ర సుతునకు
    పార్థుఁ డర్జునునకు బావ మఱఁది
    సఖుడు నరుడు విభుని సన్నిధి గాంచెను
    యిహము పరము భువిని యిచ్చ దీర !

    జిలేబి

    రిప్లయితొలగించండి
  3. ఆ: దేవకీసుతుండు, దేవతా శ్రేష్టుoడు,
    చక్ర ధారి, ఘన పరాక్రముండు,
    రుక్మిణీ ప్రియుండు, రోచిష్ణువుండైన
    పార్థుఁ డర్జునునకు బావ గాదె

    పార్ధుడు = కృష్ణుడు


    రిప్లయితొలగించండి
  4. డా.పిట్టా
    తప్ప త్రాగు వాని తనువు గిర్రునదిర్గు
    ఆముదముల బుక్కు(నమలు) నరయకుండ
    పార్థు డర్జునుడన భావమేమని యన
    "పార్థుడర్జునునకు బావ మరిది"
    త్రాగిన(మద్యం సేవించిన)వాడు ఆమదాలను బుక్కె నన్నట్లు .అనే తెలుగు నేల జాతీయం ఆధారంగా

    రిప్లయితొలగించండి
  5. డా.పిట్టా
    పార్థుడనంగ'రాజు'పరిపాటిని సర్వనియంత సృష్టికిన్
    అర్థ వివేచనన్ గదియ నప్పటి ద్వారక నేలుచుండగా
    సార్థక కీర్తి శ్వేతునికి సాధ్వి సుభద్రయె కృష్ణు చెల్లెలౌ
    పార్థుడనంగ నర్జునుని బావమరింది సుమీ తలంపగన్

    రిప్లయితొలగించండి
  6. మద్యపానుడొకడు మాటికి మాటికి
    వదరుచుండె నిట్లు బహుళగతుల
    కుంతి యనగ కృష్ణ, గోవిందు డన్నచో
    పార్థు,డర్జునకు బావమఱది.

    హ.వేం.స.నా.మూర్తి.

    రిప్లయితొలగించండి
  7. మా బావమరది అంత్యక్రియలకు వెళ్తున్నాను. మీ పూరణలను ఈరోజు సమీక్షించలేను.

    రిప్లయితొలగించండి
  8. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గూగులు లొ తెలుగు లిపి డౌన్లోడ్ చేసుకోండి మీరు బాధ పడకుండా తెలుగులోనే పద్యము వ్రాయవచ్చు

      తొలగించండి
  9. పార్ధు డర్జునునకు బావ మరది యట
    పార్థు డర్జు నులన నర్ధ మొకటె
    పృధకు కొమరు డగుట పార్ధుడు గ బిలువ
    బరగె నిలను సామి !వేరు కాదు

    రిప్లయితొలగించండి
  10. పార్ధుడనంగ నర్జునుని బావమరంది సుమీ తలంపగన్
    పార్ధుడు నానెరుంగుమిక బావమరందియు గాదులే
    సుమా
    పార్ధుడు నర్జునున్నొకరె పార్ధుడు పృధ్వి కుమారుడే గదా
    సార్ధక నామధేయుడును సత్పురుషుండును మేటివీరుడున్

    రిప్లయితొలగించండి

  11. పిన్నక నాగేశ్వరరావు.

    పరిణయమున తా సుభద్రను జేపట్ట

    పార్థు ; డర్జునునకు బావమఱది

    హరియె నాటకముల నాడించి కారకుం

    డయ్యె నందరు ముదమంద గాను.

    *********************************

    రిప్లయితొలగించండి
  12. రిప్లయిలు
    1. అతి రథుండు ద్రుపద సుతుఁ డు ధృష్టద్యుమ్ను
      డరి నిషూదనుండు నవని జాగ్ర
      జుండు గాండివ భుజ మండితు జితవైరి
      పార్థుఁ డర్జునునకు బావ మఱఁది


      వ్యర్థము లౌనె యబ్జ భవు వ్రాతలు ధారుణి నెన్నఁ డైన ను
      న్నర్థము వాని జన్మమున కవ్వఁగ ద్రోణ వధార్హుఁ డయ్యె ని
      స్స్వార్థుఁడు ధృష్టకేతునకు జన్యుఁడు సోదరుఁ డౌట కృష్ణకుం
      బార్థుఁ డనంగ నర్జునుని బావమఱంది సుమీ తలంపఁగన్

      [ “పార్థుఁడు అంటే అర్జునుని” యని గ్రహించ వలెను; ధృష్టద్యుమ్నుడు పద ముత్పలమాల వృత్తము లో నిమడకున్నది.]

      తొలగించండి
    2. No" Doubt". సమర్థుల చేతిలో ఏ సమస్యైనా అర్థవంతమే. చాల బాగున్నది. అభినందనపూర్వక నమస్సులు.

      తొలగించండి
  13. డా.పిట్టా
    పార్థుడనంగ'రాజు'పరిపాటిని సర్వనియంత సృష్టికిన్
    అర్థ వివేచనన్ గదియ నప్పటి ద్వారక నేలుచుండగా
    సార్థక కీర్తి శ్వేతునికి సాధ్వి సుభద్రయె కృష్ణు చెల్లెలౌ
    పార్థుడనంగ నర్జునుని బావమరింది సుమీ తలంపగన్

    రిప్లయితొలగించండి
  14. పుత్ర శోక మందు మునిగి వగచుచున్న
    పార్థుఁ డర్జునునకు బావమఱఁది,
    సఖుడు, గురువు, ప్రియుడు, సారధి, దైవమౌ
    హరికి మ్రొక్కి నంత హాయి నొందె

    రిప్లయితొలగించండి
  15. కుంతికిని కనిష్ఠ కొమరుడు గాదె యా
    పార్థు, డర్జునునకు బావమరిది
    యదుకులతిలకుండు హరియె, కృష్ణుని సహో
    దరి సుభద్ర భర్త నరుడనెఱగు


    వ్యర్థపు మాటకాదదియు వాస్తవ మంచును చెప్పెనీ తరిన్
    పార్థుడనంగ నర్జునుని బావమఱంది సుమీ తలంపగ
    న్నర్థము చూడగా తెలిసె నాంధ్రనిఘంటువు నందు గాంచగా
    పార్థుడనంగ గోవులను పాలన జేసెడు వాడటంచునే.

    రిప్లయితొలగించండి
  16. చిన్న మనసుగల్గి సింధు దేశమునేలు
    పార్థు డర్జునకు బావమఱది
    శివునివరములఁ గొని చేసె నపకృతము
    పద్మమొగ్గరమున పాండవులకు

    రిప్లయితొలగించండి
  17. కోపగింపనేల? గోపాలుడనె యొక
    యర్థముండె పార్థుడనగ నిజము
    చెలిమికాడనితన చెల్లెలునిచ్చిన
    పార్థుడర్జునునకు బావ మఱది.

    రిప్లయితొలగించండి
  18. చెల్లెలౌ సుభద్రఁ జేకొనె మౌనియై
    పార్దుఁ, డర్జునునకు బావమఱది
    కరివరదుఁడు,నడిపె కదనమ్ము గెల్వగన్
    బాగుఁ గోరు వాఁడె బావమఱఁది

    రిప్లయితొలగించండి
  19. కలలయందె ప్రశ్న మెలుకువ లేకున్న
    పార్థు డర్జుననకు బావమఱది
    యనుచుపలికె పాపమనసుకు దెలియక
    నిదురయందు మాట నీటిమూట|
    2.సార్థక మైన సత్ కథలు సాకగ నెంచియు నాటకంబునన్
    “పార్థుడు”హావభావనలు పండగ జేసెడి ధర్మరాజుయౌ|
    పార్థుని మామకున్ సుతుడు పాండవ మధ్యము డైన”కృష్ణ”యే
    పార్థుడనంగ నర్జునుని బావ మఱందిసుమీ తలంపగన్ {పార్థుడు,కృష్ణ వేషదారులపేర్లు

    రిప్లయితొలగించండి
  20. కదనరంగమందు ఘనుడైన ద్రోణుని
    కూలద్రోయ జంపి కుంజరమ్ము
    ననృత వాక్కుచేత నభిలాష దీర్చకృ
    పార్ధుడర్జునునకు బావమరది!

    రిప్లయితొలగించండి
  21. భారతాలపు రథ సారథి ద్వారక
    పార్థుఁ డర్జునునకు బావ మఱఁది
    గీత బోధ చేసి కృష్ణతత్వము దెల్పె
    మహిత రక్షకుండు మాధవుండు

    రిప్లయితొలగించండి

  22. పిన్నక నాగేశ్వరరావు.

    2వ పూరణము.

    అనిని చేయననుచు వెనుకకు మరలగ

    పార్థు ; డర్జునునకు బావమఱది

    హరియు గీత​ సారమంత బోధించగా

    శత్రు సేననపుడు సంహరించె.

    ********************************

    రిప్లయితొలగించండి
  23. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  24. క్రొవ్విడి వెంకట రాజారావు:

    భారతమ్మునంత పదురుగ జదువని
    యల్పు డొక్కడచట నార్భటించి
    పవిది లేని రీతి పల్కుచుండె నిటుల
    పార్థుఁ డర్జునునకు బావమఱఁది

    రిప్లయితొలగించండి
  25. అని వలదని గీత నందింప గోరగ
    పార్థు డర్జునునకు బావ మఱది
    సారధిగనె బ్రతుకు సారము నంతయు
    బోధ పఱచి నరుని బాధ దీర్చె!

    రిప్లయితొలగించండి
  26. పాండు సుతుల కెపుడు పరమ పూజ్యుడగుచు
    అడుగడుగున నీడ యగుచు నడచు
    భద్ర సోదరుడు సుభద్రకు ద్వారకా
    "పార్థుఁ డర్జునునకు బావ మఱఁది"

    రిప్లయితొలగించండి